కర్నూలు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం బాంబు పేలి ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు.
ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం బాంబు పేలి ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చెత్తకుండీలో ఈ పేలుడు జరిగింది. బాధితుడు చెత్త సేకరిస్తుండగా తనకు దొరికిన ప్లాస్టిక్ సీసా మూత తెరవడంతో బాంబు పేలినట్టు చెబుతున్నారు.
ఈ ఘటనలో ఖలీల్ అనే మూడో తరగతి విద్యార్థి గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెత్తకుండీలోకి బాంబు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు పెట్టారా, చెత్తబుట్టలో పడేశారా అనే దానిపై దృష్టి సారించారు.