
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా రాజీనామాలతో అటు కేంద్రంపైనా, ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంపైనా ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐదు కోట్ల ప్రజల ఆశయ సాధన కోసం, ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆమరణ నిరాహారదీక్ష చేసి మొదటిసారి కడపకు విచ్చేసిన పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నగర శివారు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఆయనకు పలువురు ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. నగర శివారుల్లో ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు అంజద్ బాషా, రవీంద్రానాధ్ రెడ్డి, రఘురామిరెడ్డి, మేయర్ సురేశ్ బాబు ఉన్నారు.