ఈ చిన్నారికి 15 వేళ్లే | Nellore Boy Has Only 15 Fingers | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 2:22 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Nellore Boy Has Only 15 Fingers - Sakshi

పుట్టుకతోనే అతని కుడి చేతికి రెండు వేళ్లు, ఒక్కో కాలికి నాలుగేసి వేళ్లు మాత్రమే ఉన్నాయి.

సాక్షి, నెల్లూరు(పొగతోట): ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారికి కాళ్లు, చేతులకు కలిపి 15 వేళ్లు మాత్రమే ఉన్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జీర్రావారిపాలెంకు చెందిన పి.సురేష్, సునీత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఐదు సంవత్సరాల క్రితం ప్రభుకుమార్‌ జన్మించాడు. పుట్టుకతోనే అతని కుడి చేతికి రెండు వేళ్లు, ఒక్కో కాలికి నాలుగేసి వేళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు.

ప్రభుకు దివ్యాంగుల పింఛన్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే రేషన్‌కార్డు లేకపోవడంతో ముందుగా దాని కోసం దరఖాస్తు చేశారు. అయితే అధికారుల నుంచి స్పందనలేదు. దీంతో సునీత మంగళవారం ప్రభుకుమార్‌తో కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను వేడుకుంది. రేషన్‌కార్డు ఉంటేనే పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలువుతుందని త్వరగా స్పందించాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement