‘డబుల్’ కష్టాలు | double bedroom application in mee seva kendram | Sakshi

‘డబుల్’ కష్టాలు

Published Thu, Feb 25 2016 1:45 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM

‘డబుల్’ కష్టాలు - Sakshi

‘డబుల్’ కష్టాలు

మీ సేవా కేంద్రాల వద్ద డబుల్ బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తులు చేసుకునేందుకు మహిళలు ఎగబడ్డారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు మీ సేవా కేంద్రాల ఎదుట బారులుతీరుతున్నారు.

డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తుల వెల్లువ
మండుటెండల్లో మహిళల ఇబ్బందులు


తాండూరు రూరల్ : మీ సేవా కేంద్రాల వద్ద డబుల్ బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తులు చేసుకునేందుకు మహిళలు ఎగబడ్డారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు మీ సేవా కేంద్రాల ఎదుట బారులుతీరుతున్నారు. మండుటెండలను లెక్కచేయకుండా చిన్న పిల్లలతో సహా మహిళలు మీ సేవా కేంద్రాలకు చేరుకొని దరఖాస్తులు చేసుకుంటున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పలేదని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చెబుతున్నా ఇవేమీ ప్రజలు పట్టించుకోవడం లేదు. మీ సేవా కేంద్రాల వద్ద మాత్రం మహిళలు దరఖాస్తులు చేసుకునేందుకు తాండూరులోని వివిధ వార్డుల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. ఇదే అదునుగా మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు ఫారం రూ.25 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వినాయక్‌చౌక్ వద్ద ఉన్న మీ సేవా కేంద్రం వద్ద మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. మండుటెండల్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్‌లో తోపులాట కూడా చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement