
ఆంధ్రాపాలన నాటి దుస్థితి ఇంకానా..?
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండగగా జరుపుకోలేని ఆంధ్రా పాలన నాటి దుస్థితి స్వరాష్ట్రంలోనూ కొనసాగాల్సిందేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.
విమోచన దినోత్సవాన్ని అధికారి కంగా జరపకుంటే సమై క్య రాష్ట్రంలోని మంత్రు లను రాజీనామా చేయా లని తెలంగాణ మంత్రు లను డిమాండ్ చేసినవా రు ఇప్పుడు పదవుల్లో ఎందుకు ఉన్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాపాలను కడుగు తున్నామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ నేతలు.. విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ నాయకులు, రజాకారుల వారసుల కోసం సెప్టెంబర్ 17ను పరిచిపోయేలా చేస్తా రా అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న విమో చన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిం చాలనే డిమాండ్‌తో ప్రతీ గ్రామం నుంచి ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు.