‘ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారు’ | Indian Techie Couple Died In US Autopsy Report Says They Intoxicated | Sakshi
Sakshi News home page

వారి మరణానికి కారణం అదేనా?!

Published Wed, Jan 23 2019 7:26 PM | Last Updated on Wed, Jan 23 2019 7:28 PM

Indian Techie Couple Died In US Autopsy Report Says They Intoxicated - Sakshi

కేరళకు చెందిన ఈ జంట 2014లో పెళ్లి చేసుకున్నారు.

కాలిఫోర్నియా : మద్యం సేవించిన కారణంగానే లోయలో పడి భారత టెకీ దంపతులు దుర్మరణం పాలై ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. మృతుల అటాప్సీ రిపోర్టులో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. గతేడాది అక్టోబరులో కాలిఫోర్నియాలోని యోస్‌మిటే నేషనల్‌ పార్కులోని లోయలో పడి కేరళకు చెందిన విష్ణు విశ్వనాథ్‌(29), మీనాక్షి మూర్తి(30) మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో వారిరువురు ఆల్కహాల్‌ సేవించారని మారిపోసా కంట్రీ అధికారి ఆండ్రియా స్టెవర్ట్‌ తెలిపారు. (ఇండియన్‌ టెకీ దంపతుల దుర్మరణం)

ఇథైల్‌ ఆల్కహాల్‌ సేవించారు
‘ఆ సమయంలో విష్ణు విశ్వనాథ్‌, మీనాక్షి ఇథైల్‌ ఆల్కహాల్‌ సేవించారు. అయితే డ్రగ్స్‌ తీసుకున్న ఆనవాళ్లు ఏమీలేవు. వారు లోయలో పడి పోవడానికి ఇది కూడా కారణం అయి ఉంటుందని’ ఆండ్రియా వ్యాఖ్యానించింది. కాగా కేరళకు చెందిన ఈ జంట 2014లో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే విష్ణు, మీనాక్షిలకు సాహస యాత్రలు చేయడమంటే సరదా. ఈ క్రమంలో వారికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ని.. ‘హాలీడేస్‌ అండ్‌ హ్యాపిలీఎవర్‌ఆఫ్టర్స్‌’ పేరిట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ స్నేహితులతో ఙ్ఞాపకాలు పంచుకునేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement