మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. శివసేన తీరును నిరసిస్తూ బీజేపీ...
ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. శివసేన తీరును నిరసిస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన ముంబయి పర్యటనను రద్దు చేసుకున్నారు. బీజేపీ-శివసేన...చిన్నపార్టీలకు ఏడు సీట్లను కేటాయించగా, అందుకు ఆ పార్టీలు ఒప్పకోకపోవటంతో మరో మూడు సీట్లు కేటాయించాలని బీజేపీ సూచించింది. అయితే అందుకు శివసేన అంగీకరించకపోవటంతో ప్రతిష్టంభన తలెత్తింది. దీంతో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఒకవైపు బీజేపీ, శివసేనల మధ్య సీట్ల సర్ధుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా, మరోవైపు చిన్నపార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమకు కేవలం ఏడు సీట్లు కేటాయిస్తూ శివసేన చేసిన తాజా ప్రతిపాదనపై నాలుగు పార్టీలు మండిపడుతున్నాయి. తమకు గౌరవప్రదమైన స్థానాలు కేటాయించనట్లయితే ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు శివసేన, బీజేపీలను హెచ్చరిస్తున్నాయి.