15 వేల కోట్లతో మద్దతు ధరకు యోచన | Govt mulls Rs 15K cr scheme to ensure MSP for farmers | Sakshi
Sakshi News home page

15 వేల కోట్లతో మద్దతు ధరకు యోచన

Published Sat, Feb 17 2018 3:53 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM

Govt mulls Rs 15K cr scheme to ensure MSP for farmers  - Sakshi

న్యూఢిల్లీ: పంటకు కనీస మద్దతు ధర లభించేలా చేసేందుకు ప్రభుత్వం త్వరలో ఓ కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 12 నుంచి 15 వేల కోట్ల రూపాయల వరకు వ్యయమవ్వొచ్చని అంచనా వేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన పంటలకు పెట్టుబడి కంటే 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకోసం నీతి ఆయోగ్‌ త్వరలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఓ సమావేశం నిర్వహించనుంది. కనీస మద్దతు ధర విషయంలో రైతులకు లబ్ధి చేకూర్చేలా తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను ఆ సమావేశంలో చర్చించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement