
సాక్షి, న్యూఢిల్లీ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సమీకృత నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుకు చేసిన కృషికి గుర్తింపుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు ఈ అవార్డు దక్కింది. కోవింద్ చేతుల మీదుగా సంస్థ చైర్మన్, ఎండీ కందికుప్ప శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు.