ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. రైతు భరోసా యాత్రలో రాహుల్ పాల్గొననున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
బుధవారం సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాహుల్తో భేటీఅయ్యారు. తెలంగాణలో రాహుల్ పర్యటన గురించి ఆయన చర్చించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లా నర్సాపూర్ లేదా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో రాహుల్ పర్యటించవచ్చని తెలిపారు. కాగా షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.