
వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల రద్దుకు ఈసీ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం జరగనున్న ఎన్నికలను రద్దు చేయాలన్న ఈసీ ప్రతిపాదనను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అంగీకరించారు. రెండో విడత పోలింగ్‌లో ఈనెల 18న వెల్లూరులో పోలింగ్ జరగాల్సి ఉండగా, ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నగదు లభ్యం కావడంతో ఈసీ ఎన్నికల రద్దుకు నిర్ణయం తీసుకుంది.
వెల్లూరులో కొద్ది వారాల కిందట డీఎంకే అభ్యర్ధి కదిర్ ఆనంద్ కార్యాలయంలో పెద్దమొత్తంలో నగదును అధికారులు సీజ్ చేశారు. డీఎంకే అభ్యర్థి వద్ద దాదాపు 11 కోట్ల రూపాయల నగదు పట్టుబడినట్టు సమాచారం. ఈనెల 10న ఐటీ శాఖ నివేదిక ఆధారంగా డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ సహా మరో ఇద్దరు ఆ పార్టీ నేతలపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.