పెదదండ్లూరు ఘటనపై స్పందించిన మంత్రి ఆది | Minister Adinarayana Reddy Responds On The Issue Of Pedadandluru Incident | Sakshi
Sakshi News home page

పెదదండ్లూరు ఘటనపై స్పందించిన మంత్రి ఆది

Published Tue, Jun 5 2018 9:47 PM | Last Updated on Mon, Aug 20 2018 6:10 PM

Minister Adinarayana Reddy Responds On The Issue Of Pedadandluru Incident  - Sakshi

మంత్రి ఆదినారాయణ రెడ్డి(పాత చిత్రం)

వైఎస్సార్‌ జిల్లా: పెద దండ్లూరు సంఘటనపై మంత్రి ఆదినారాయణ రెడ్డి మంగళవారం స్పందించారు. విలేకరులతో మాట్లాడుతూ.. అక్కడ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మా టీమ్‌ హెచ్చరించడానికి వెళ్లిందన్నారు. వాళ్లు వ్యతిరేకించడంతో అక్కడ ఘర్షణ జరిగిందని చెప్పారు. గొడవ జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. మా పది గ్రామాల్లో మీరు(వైఎస్సార్‌ కాంగ్రెస్‌) ఏజెంట్స్‌ను కూడా పెట్టుకోలేరని హెచ్చరించారు. సంఘటనలో మా కుటుంబ సభ్యులు ఎవరూ లేరని చెప్పారు. 

ఇటీవల వివాహం అయిన వధూవరులు తమను ఆశీర్వదించాలని కోరుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని రిసెప్షన్‌ కార్యక్రమానికి ఆహ్వానించిన సంగతి తెల్సిందే. దీనిని సహించలేక,  వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరుగుతుందనే భయంతో మంత్రి అనుచరులు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలైన సంపత్, అజరయ్య, అయ్యవారు, సుబ్బిరామిరెడ్డి ఇళ్లపై దాడులు చేసి, వారిని తీవ్రంగా గాయపరిచిన సంగతి తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement