మల్కాజ్‌గిరిలో రేవంత్‌ విజయం | Revanth Reddy Won In Malkajgiri Lok Sabha Constituency | Sakshi
Sakshi News home page

మల్కాజ్‌గిరిలో రేవంత్‌ విజయం

Published Thu, May 23 2019 3:21 PM | Last Updated on Thu, May 23 2019 3:23 PM

Revanth Reddy Won In Malkajgiri Lok Sabha Constituency - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోరులో సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజశేఖర్‌పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాయం పాలైన రేవంత్‌కు ఈ ఫలితం ఊరట నిచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగు చోట్ల విజయం సాధించింది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే వచ్చాయి. కానీ ఈ రోజు వెలువడిన ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. రేవంత్‌ రెడ్డితో పాటు నల్గొండలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవేళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement