సాక్షి, హైదరాబాద్: పీఎన్‌బీ మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 12 నుంచి జరుగనుంది. హైటెక్ సిటీలోని గేమ్ పాయింట్ ఇండోర్ స్టేడియంలో 15వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్–9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో సిం గిల్స్ కేటగిరీలో పోటీలు జరుగుతాయి.
ఆసక్తి గల వారు ఈనెల 30వ తేదీలోగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 90828 42009, 90828 42029 నంబర్లలో సంప్రదించాలి.