యువ వైద్యులతో సచిన్‌ సంభాషణ  | Sachin Tendulkar Speaks With Young Doctors About Sports Injuries | Sakshi
Sakshi News home page

యువ వైద్యులతో సచిన్‌ సంభాషణ 

Published Mon, Apr 13 2020 3:53 AM | Last Updated on Mon, Apr 13 2020 3:53 AM

Sachin Tendulkar Speaks With Young Doctors About Sports Injuries - Sakshi

ముంబై: రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన తన కెరీర్‌లో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఎన్నోసార్లు గాయపడ్డాడు. వాటిని అధిగమించి క్రికెట్‌ ఐకాన్‌గా నిలిచాడు. టెన్నిస్‌ ఎల్బో గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడిన మాస్టర్‌ ఆ అనుభవాన్ని యువ వైద్యులతో పంచుకున్నాడు. ‘స్పోర్ట్స్‌ ఇంజ్యూరీస్‌’ పేరిట ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు సుధీర్‌ వారియర్‌ నిర్వహించిన ‘లైవ్‌ వెబినార్‌’ కార్యక్రమంలో సచిన్‌ స్వచ్ఛందంగా పాల్గొన్నాడు. 12,000 మంది యువ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సచిన్‌ క్రీడా గాయాలపై తన అనుభవాన్ని వారితో పంచుకున్నాడు. సచిన్‌తో సంభాషించిన యువ వైద్యులు సాధారణ వ్యక్తులకు, క్రీడాకారులకు వైద్య చికిత్సలో అందించాల్సిన సేవలపై అవగాహన ఏర్పరచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement