వరంగల్ జిల్లాలో మంగళవారం అనుమతి లేకుండా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
వరంగల్ : వరంగల్ జిల్లాలో మంగళవారం అనుమతి లేకుండా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కోదాడలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ఈ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపారు. లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నరన్న సమాచారంతో వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కరీమాబాద్ మండలంలోని ఘట్టుపల్లిలో లారీని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(కరీమాబాద్)