ఎండతీవ్రతకు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లక్ష్మారావుగూడలోని ఓ ఫారంలో వేయి కోళ్లు చనిపోయాయి.
ఎండతీవ్రతకు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లక్ష్మారావుగూడలోని ఓ ఫారంలో వేయి కోళ్లు చనిపోయాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య అనే తనకున్న చేనులో రెండు షెడ్లను అప్పుచేసి వేశాడు. ఒక్కో షెడ్డులో మూడు వేల కోళ్లను పెంచే వీలుంది. రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరగటంతో రెండు షెడ్లలోని కోళ్లకు చల్లదనం కోసం ఏర్పాట్లు కూడా చేశాడు. అయినప్పటికీ గురువారం వెయ్యి కోళ్లు చనిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల ఆరంభం నుంచి ఎండ వేడిమికి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెప్పాడు.