fine rice
-
స్వతంత్ర భారత చరిత్రలో సన్నబియ్యం ఇచ్చింది మేమే
సాక్షి, హైదరాబాద్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి పేదలకు సన్నబియ్యం ఇస్తోంది కూడా తామేనని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ అవుతాయన్నది అవాస్తవమని, కేంద్రం నుంచి కేవలం దొడ్డు బియ్యం మాత్రమే వస్తాయని, అది కూడా కొందరికే పరిమితమని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో జలసౌధ నుంచి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేంద్రం సరఫరా చేస్తున్న దొడ్డుబియ్యం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పేదలకు సన్నబియ్యం ఇస్తోందని, ఇందుకు 20 శాతం నిధులను అదనంగా వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా కూడా ఉందనే దుష్ప్రచారాన్ని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్‌కార్డులు త్వరలోనే పంపిణీ చేస్తామని ఉత్తమ్ ప్రజాప్రతినిధులకు భరోసా ఇచ్చారు. రేషన్‌కార్డులు కొత్తగా ఇస్తే సన్నబియ్యం లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్ల నుంచి 3.10 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని, ఆ మేరకు పంపిణీకి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తిబీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయి.. మేడిగడ్డ పనిచేయకపోయినా ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 123.27 లక్షల ఎకరాల్లో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఖరీఫ్‌లో 66.78 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే, రబీలో 56.49 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలుకు 8,209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నబియ్యానికి రూ.500 బోనస్ కింద 24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 1,199 కోట్లు రైతులకు చెల్లించామని చెప్పారు. -
ఆ రెండింటిపై ఫుల్ ‘ఫోకస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసం పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పేదలకు మేలు చేసే ఈ రెండు పథకాలు కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో చర్చలో లేకుండా పోయాయని అభిప్రాయపడుతోంది. ఆ రెండు పథకాలపై ఫోకస్ పెంచి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల్లో అమలు చేసిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రచారం కల్పించేందుకు వీలుగా ఓ కరపత్రాన్ని టీపీసీసీ సిద్ధం చేసింది. ఈ కరపత్రాలను క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించనున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం, రాజీవ్ యువ వికాసం కార్యక్రమాల గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించే విధంగా పార్టీ కార్యాచరణ రూపొందుతోందని, దీనిని ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ విడుదల చేయనుందని సమాచారం. భూముల వివాదంతో మరుగున.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ చేయలేని పేదలకు ఉపయోగపడే రెండు కార్యక్రమాలను కాంగ్రె స్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ, కంచ గచ్చిబౌలి భూము ల వ్యవహారంతో అవి మరుగున పడ్డాయనే అభిప్రా యం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 80 శాతం ప్రజలకు అమలయ్యే విధంగా రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినా పెద్దగా ప్రచారం లేకుండా పోయిందనే చర్చజరుగుతోంది. రాజీవ్ యువ వికాసం పరిస్థితి కూడా ఇ దే విధంగా ఉందని అంటున్నారు. పదేళ్లపాటు నిరు ద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు కాలేదని, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యమయ్యాయనే ఉద్దేశంతో మళ్లీ గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పించేలా దీనికి రూపకల్పన చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.లబ్దిదారులతో భోజనాలు.. నిరుద్యోగులకు సాయం టీపీసీసీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ ‘కంచ గచ్చిబౌలిభూముల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వాన్ని ఓ వైపు బద్నాం చేస్తూనే మరోవైపు పార్టీకి ప్రయోజనం చేకూర్చే పథకాలు మరుగున పడేలా చేస్తోంది. రాజకీయ రాద్ధాంతం కింద పేదల సంక్షేమం నలిగిపోతోంది..’అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ నేతల్లో ఉన్న అభిప్రాయానికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో సన్న బియ్యంతో కూడిన భోజనాన్ని లబ్ధిదారులతో కలిసి చేసేలా పార్టీలోని అన్ని స్థాయిల నేతలకు దిశానిర్దేశం చేయాలని, మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు క్షేత్రస్థాయి కేడర్ సహకరించేలా పిలుపునివ్వాలని టీపీసీసీ యోచిస్తుండడం గమనార్హం. -
లబ్ధిదారులతో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలోని సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కుటుంబాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సారపాకలో రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. లబ్ధిదారుడి కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యరాలు తులసమ్మను ఆరా తీశారు సీఎం.దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని సీఎం రేవంత్ కు చెప్పిన తులసమ్మ.. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. 200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు సీఎం రేవంత్. తమకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సంతోషకరంగా ఉందని తులసమ్మ చెప్పుకొచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగిలో రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. గతంలో దొడ్డు బియ్యం పెట్టినప్పుడు దళారులు, రైస్ మిల్లర్లు మాత్రమే బాగుపడేవారని, ఇప్పుడు సన్నబియ్యంతో ఆ పరిస్థితి లేదన్నారు. ఎవరు ఎన్ని అపోహలు సృష్టించిన రానున్న రోజుల్లో ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. -
సన్నబియ్యం చారిత్రాత్మకం
-
సన్నబియ్యం చరిత్రాత్మకం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పథకం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని, ఆ చరిత్రకు హుజూర్నగర్ వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని చెప్పారు. ఆనాడు ఇందిరాగాంధీ రోటీ, కప్డా, మకాన్ అనే నినాదంతో పేద వారికి కడుపు నిండా అన్నం, గుడ్డ, ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారని గుర్తుచేశారు. దాంతో పేదల్లో చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండించారని, నేడు అదే స్ఫూర్తితో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు పేదలు.. పండుగ నాడే కాకుండా ప్రతిరోజూ తెల్ల బువ్వ తినాలనే ఉద్దేశంతో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూ.1.90కు కిలో బియ్యం పథకం తెచ్చారని, అయితే ఎన్నికల కారణంగా అది అమలు కాలేదని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకాన్ని 1983లో ప్రారంభించారని..ఆనాడు మొదలు పెట్టిన దొడ్డు బియ్యం పంపిణీ పథకమే ఇప్పటివరకు కొనసాగిందని అన్నారు. అయితే దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదని ఆలోచించి, పేదలంతా తినేలా తాము సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఇక నుంచి 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి ప్రతిరోజూ పండుగలా పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. ఉగాది సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహరంగ సభలో మాట్లాడారు. నల్లగొండ గడ్డకు ఎంతో చరిత్ర ‘ఈ పథకాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, పద్మావతిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం హర్షించదగిన విషయం. ఈ ప్రాంతం పోరాటాలకు మారు పేరు. ఎందరో మహనీయులు భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం ఇక్కడి నుంచే పోరాటాలు చేశారు. రావి నారాయణరెడ్డిని నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించిన చరిత్ర కూడా నల్లగొండ గడ్డకే ఉంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నల్లగొండ ఎంపీని గెలిపించింది కూడా నల్లగొండ బిడ్డలే. ఇలాంటి చోట ప్రారంభించిన ఈ సన్న బియ్యం పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మిల్లర్లు, దళారుల చేతుల్లోకి దొడ్డు బియ్యం ‘ప్రభుత్వం 3 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇస్తుంటే, ఆ పథకం మిల్లర్ల మాఫియా, దళారుల చేతిలోకి వెళ్లిపోయి, రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. పేదలు దొడ్డు బియ్యం తినలేక, రూ.10కు కిలో అమ్ముకుంటుంటే మిల్లర్లు కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే కిలో రూ.30కి అమ్ముతున్నారు. పేదలకు దొడ్డు బియ్యం ఉపయోగ పడటం లేదనే సన్న బియ్యం ఇస్తున్నాం..’ అని రేవంత్ తెలిపారు. రైతులను వరి వద్దన్న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పండించారు ‘రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన, 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్.. ఏనాడైనా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశారా? మీరు వరి వేస్తే ఉరేసుకున్నట్లేనని, మేం వడ్లు కొనమని చెప్పిన ఆయన.. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో వడ్లనే పండించారు. ఆ వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున చెల్లించి కావేరీ సీడ్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. రైతులు పండించిన ధాన్యాన్ని రూ.2 వేలకు కొనేవారు దిక్కులేక వాళ్లు ఉరేసుకుంటుంటే, ఆయన పండించిన ధాన్యాన్ని క్వింటాల్‌కు అంత ధర పెట్టి కొన్నారంటే అవి వడ్లా లేదా బంగారమా? చెప్పాలి..’ అని సీఎం అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పక్కనబెట్టారు ‘నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు నాగార్జునసాగర్ సహా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ తెచ్చింది. జిల్లా కాంగ్రెస్ నేతలు పోరాటం చేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి పథకాలు సాధించుకున్నారు. కానీ కేసీఆర్ వాటిని పక్కన పెట్టారు. 44 కిలోమీటర్ల సొరంగం అప్పట్లోనే 34 కిలోమీటర్లు పూర్తయింది. ఏటా ఒక్క కిలోమీటర్ తవ్వినా బీఆర్ఎస్ కాలంలోనే సొరంగం పూర్తయ్యేది. 3.5 లక్షల ఎకరాలకు నీరు పారేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి టన్నెల్ పనులు ప్రారంభించాం. రూ.లక్ష కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయింది. ఈ విషయంలో కేసీఆర్‌కు ఉరేసినా తప్పులేదు..’ అంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు నాకు పోలికేంటి..? ‘2006లో జెడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన నేను ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయ్యా. 2018లో కేసీఆర్ నాపై కక్షగట్టి ఎమ్మెల్యేగా ఓడించినా ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. ఢిల్లీకి వెళితే సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అదే నన్ను సీఎంను చేసింది. కేసీఆర్‌కు నాకు పోలికేంటి? మా ఇద్దరికి నందికి, పందికి ఉన్నంత తేడా ఉంది. నేను రుణమాఫీ చేశా. రైతుబంధును పెంచా. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు రూ.7,625 కోట్లు..మా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రైతుల ఖాతాల్లో వేశాం. 15 నెలల కాలంలో రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు, రైతు భరోసా కింద రూ.12 వేల కోట్లు వేశాం. సన్న వడ్లకు రూ.1,200 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతులకు పంగనామం పెట్టిన కేసీఆర్ నన్ను పోల్చుకోవడమేంటి? మేం రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా కార్యక్రమాలు చేశాం. ఒకరోజు వెనుకా ముందూ అయినా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
Telangana: పేదలందరికీ.. సన్నబియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభం కానుంది. ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దొడ్డు బియ్యం దురి్వనియోగంతో.. వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న బియ్యంలో 85 శాతానికి పైగా దుర్వినియోగం అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని పేద, మధ్య తరగతి వర్గాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల నుంచి తీసుకున్న బియ్యాన్ని ఆ సమీపంలోనే దళారులకు కిలో రూ.10 నుంచి 13 రూపాయలకు విక్రయించడం, లేదంటే డీలర్ల నుంచి అసలు బియ్యం తీసుకోకుండా అతను ఇచ్చిన మొత్తం తీసుకుని వెళ్లడం జరిగేది. ఈ నేపథ్యంలోనే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనిపై రేషన్‌కార్డులు, సన్న బియ్యం పంపిణీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజలు తినని దొడ్డు బియ్యాన్ని రూ.10,665 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం కంటే అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని తేల్చింది. ఈ మేరకు సన్న బియ్యం పంపిణీకి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్ నెల కోటాను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. నెలకు 2 ఎల్ఎంటీలు అవసరం నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 4.41 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని గత డిసెంబర్ నుంచే మిల్లింగ్ చేయించడం ప్రారంభించడం ద్వారా ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదీనంలోని గోడౌన్లలో నిల్వ చేసిన బియ్యాన్ని ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు వీలుగా మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించింది. రాష్ట్రంలో 2.85 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రూ.10,665 కోట్లు సబ్సిడీ రూపంలో భరిస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ కారణంగా ఇకపై రూ.13,522 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,800 కోట్ల భారం పడడంతో భరించాల్సిన రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది. త్వరలోనే మరో 30 లక్షల మంది పీడీఎస్ నెట్‌వర్క్‌లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులకు తోడు కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 30 లక్షల మందిని అర్హులుగా ప్రాథమిక పరిశీలనలో తేల్చారు. ఇందులో 18 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడం (అడిషన్స్) గురించి కాగా.. వీరందరినీ అర్హులుగా గుర్తించి ఇప్పటికే ఆన్లైన్లో చేర్పుల జాబితాలో పొందుపరిచినట్లు తెలిసింది. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మరో 12 లక్షల మందిని (సుమారు 4 లక్షల కుటుంబాలు) కూడా రేషన్‌కార్డులకు అర్హులుగా జాబితాల్లో చేర్చాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వీరందరికీ కొత్తగా 4 నుంచి 5 లక్షల కార్డుల వరకు అవసరమని అంచనా వేశారు. కొత్త లబ్ధిదారుల చేరికతో సన్నబియ్యం వినియోగించుకునే వారి సంఖ్య 3.10 కోట్లకు పెరగనుంది. అలాగే కార్డుల సంఖ్య 94 లక్షలకు చేరే అవకాశం ఉంది. 84 % మందికి నెలకు 6 కిలోల చొప్పున ⇒ రాష్ట్రంలో ప్రస్తుతం 89.73 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటిలో 2.85 కోట్ల లబ్ధిదారులు నమోదై ఉన్నారు. ఇకనుంచి వీరందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కింద సుమారు 35 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ గత మూడేళ్లుగా సన్న బియ్యంతోనే భోజనాన్ని వడ్డిస్తున్నారు. వీరు కాకుండా ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ అవుతాయని, దొడ్డు బియ్యం వినియోగం దాదాపు జీరో అవుతుందని చెబుతున్నారు. -
ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం!
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ నెల కోటా కింద అదే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఉగాది సందర్భంగా ఈ నెల 30న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలుత సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ప్రారంభించాలని భావించినప్పటికీ, తర్వాత హుజూర్‌నగర్‌ను ఖరారు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ గోడౌన్ (స్టేజ్–1 స్టాక్ పాయింట్)ల నుంచి మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు సన్న బియ్యం తరలించే ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని రేషన్ దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి ఒక్కో యూనిట్‌కు (ఒక్కరికి) 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. ఏటా 24 ఎల్ఎంటీల బియ్యం అవసరం రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని రేషన్ దుకాణాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఇప్పటివరకు దొడ్డు బియ్యమే అందుతు న్నాయి. రాష్ట్రంలో 90 లక్షల వరకు ఆహార భద్రతా కార్డులు ఉండగా, ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఇచ్చిన కార్డులు (ఐఎఫ్ఎస్సీ) 54.48 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీ అయిన కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్న యోజన కింద 5.62 లక్షల కార్డులు ఉండగా, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 90.14 లక్షల కార్డుల్లోని 2.83 కోట్ల యూనిట్లకు (మందికి) ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి 90.14 లక్షల కార్డులకు సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. వీటికి తోడు ఇప్పటికే అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, విద్యా సంస్థలకు కేటాయిస్తున్న బియ్యం కూడా కలిపి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) చొప్పున సన్నబియ్యం అవసరం ఉంది. అంటే సంవత్సరానికి 24 ఎల్ఎంటీలు అవసరమన్నమాట. వానాకాలం సీఎంఆర్ సిద్ధం వానాకాలంలో సేకరించిన సుమారు 55 ఎల్ఎంటీల ధాన్యంలో 24 ఎల్ఎంటీల మేర సన్న ధాన్యం ఉంది. ఈ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు పంపిన ప్రభుత్వం గత నవంబర్ నెలాఖరు నుంచే సన్న బియ్యాన్ని సేకరించే పనిలో ఉంది. తొలుత జనవరి (సంక్రాంతి) నుంచే సన్న బియ్యం ఇవ్వాలని భావించినప్పటికీ, కొత్తగా వచ్చిన బియ్యాన్ని పంపిణీ చేస్తే అన్నం ముద్దగా అవడం, అడుగంటడం వంటి పరిణామాలు ఉంటాయనే భావనతో రెండు మూడు నెలలు మాగపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లలో భద్రపరుస్తూ కొత్త బియ్యం పాతబడేలా చూశారు. ఈ నేపథ్యంలో జనవరి వరకు మిల్లింగ్ చేసి సేకరించిన సుమారు 5 ఎల్ఎంటీల బియ్యాన్ని ఉగాది నుంచి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ కోటా కింద సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని పేర్కొంటూ మంత్రి ఉత్తమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బియ్యం అక్రమ దందాకు కళ్లెం! రేషన్ షాపుల ద్వారా ఇప్పటివరకు అందుకుంటున్న దొడ్డు బియ్యంలో 60 నుంచి 70 శాతం వరకు దురి్వనియోగం అవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం గుర్తించింది. దొడ్డు బియ్యాన్ని ఉచితంగా తీసుకుంటూ రూ.10కి కిలో చొప్పున రేషన్‌షాపుల్లోనే విక్రయించే పద్ధతి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉంది. ఇక ఇంటికి తీసుకెళ్లినా వంటకు వినియోగించకుండా దళారులకు కిలో రూ.10 నుంచి రూ.13 చొప్పున విక్రయించడం, దాన్ని దళారులు రాష్ట్రాలు దాటించడమో లేక రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు విక్రయించడమో చేయడం పరిపాటిగా మారింది. అయితే పేదలకు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. -
సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్‌లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్‌లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు! ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్: వాహనదారులకు షాక్.. దొరికారో 200 శాతం పెనాల్టీ తప్పదు!
సాక్షి,హైదరాబాద్: త్రైమాసిక పన్ను చెల్లించకుండా పట్టుబడే వాహనాలపై భారీ ఎత్తున పెనాల్టీలు విధించేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణంగా వాహనదారులు పెండింగ్‌ల ఉన్న పన్ను బకాయీలపైన స్వచ్చందంగా ముందుకు వస్తే 50 శాతం వరకు అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం ఉంది. కానీ రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం ఏకంగా 200 శాతం వరకు పెనాలిటీల రూపంలో చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఆర్టీఏ కొనసాగిస్తున్న ప్రత్యేక తనిఖీలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2.17 లక్షల వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 75 వేలకు పైగా పన్ను చెల్లించని వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ వాహనాల్లో కొన్ని 3 నెలల కాలపరిమితికే పన్ను చెల్లించాల్సి ఉండగా 80 శాతం వాహనాలు కోవిడ్ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. చాలా వరకు 9 నెలల నుంచి 18 నెలల వరకు త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్నాయి. దీంతో వాహనాల నుంచి బకాయిలను రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఫిబ్రవరి నెలాఖరులోనే తనిఖీలకు శ్రీకారం చుట్టినప్పటికీ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలను ఉధృతం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు పన్ను చెల్లింపులకు గడువు విధించడంతో తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 మంది మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తేలికపాటి వాహనాలే అధికం.. గ్రేటర్లో సుమారు 5 లక్షల వరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల లారీలు ఉన్నాయి. సరుకు రవాణా రంగంలో కీలకమైన లారీల్లో చాలా వరకు ఎప్పటికప్పుడు పన్ను చెల్లించి రవాణాశాఖ నుంచి అనుమతి పొందాయి. అలాగే మరో 10 వేలకు పైగా స్కూల్ బస్సులు, ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు,తదితర వాహనాలు సైతం సకాలంలో పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చాలా వరకు తేలికపాటి రవాణా వాహనాల కేటగిరీ కిందకు వచ్చే టాటాఏస్‌లు, డీసీఎంలు, మినీ బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో ఎలాంటి ఆదాయమార్గాలు లేకపోవడంతో వాహనదారులు త్రైమాసిక పన్ను చెల్లించలేకపోయారు. మరోవైపు రెండేళ్ల కాలపరిమితికి ప్రభుత్వం నుంచి మినహాయింపు లభించవచ్చుననే ఉద్దేశంతో చాలా మంది పన్ను చెల్లించకుండా ఉండిపోయారు. దీంతో ఇప్పుడు భారం పెరిగినట్లు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గతంలోనే రెండు త్రైమాసిక పన్ను వాయిదాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో సుమారు రూ.13 కోట్ల వరకు బకాయీలను వసూలు చేశారు. ప్రతి రోజు సగటున రూ.60 లక్షలకు పైగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఎంవీఐకి రూ.7 లక్షల వరకు టార్గెట్ విధించారు. తనిఖీలు ఉధృతం త్రైమాసిక పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. పూర్తిస్థాయిలో రాబట్టేందుకు కార్యాచరణ చేపట్టాం. పన్ను చెల్లించని వాహనాలపైన తనిఖీలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాం. వాహనదారులు స్వచ్చందంగా ఆన్లైన్లో లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. తనిఖీ బృందాలు వాహనాలను జప్తు చేసి వెహికిల్ చెకింగ్ రిపోర్ట్ (వీసీఆర్) రాస్తే మాత్రం 200 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. –జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
ట్రంప్ రోజూ రూ. 7లక్షల జరిమానా కట్టాలటా! ఎందుకో తెలుసా?
Trumpobeys a subpoena and surrenders documents relating to his business: అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద నాయకుడుగా తరచు వార్తలో నిలిచే డోనాల్డ్ ట్రంప్‌కి యూఎస్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించే వరకు ప్రతి రోజు సుమారు రూ. 7లక్షల వరకు జరిమాన కట్టాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎంగోరోన్ మాట్లాడుతూ...2019 విచారణలో ట్రంప్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ఆస్తుల విలువను తప్పుగా చూపించడమే కాకుండా అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమవ్వడంతోనే జరిమాన విధించినట్లు స్పష్టం చేశారు. అందువల్ల ట్రంప్ మంగళవారం నుంచే రోజువారి జరిమాన చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లు తెలిపారు. గోల్ఫ్ క్లబ్‌లు, పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌తో సహా ఆస్తుల విలువలను దర్యాప్తులో తప్పుగా పేర్కొన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆస్తులుపై మంచి రుణాలు పొందడం కోసం వాటి విలువను అధికంగా చూపించారని, మరికొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలను పొందడం కోసం వాటి విలువనే తక్కువగా కూడా చూపించారని పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ గతంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. కానీ ఆయన తరుపున న్యాయవాదులు అభ్యర్థన మేరకు కోర్టు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే ట్రంప్ తరుపు న్యాయవాది అలీనా హబ్బా విచారణ అనంతరం ఈ విషయమై అప్పీలు చేస్తానని చెప్పాడం గమనార్హం. (చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!) -
‘సన్న’గిల్లిన ఆశలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్‌పై రైతులు పెట్టుకున్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఆరంభమై ఇరవై రోజులైనా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడంతో రైతులు ఆశలు వదులుకుంటున్నారు. బోనస్ లేక ప్రోత్సాహకాలకు కేంద్రం విధించిన నిబంధనలు అడ్డుగా మారడం, అదనంగా ఒక్క రూపాయి చెల్లించినా ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తామన్న హెచ్చరికలతో ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లే ధైర్యం చేయట్లేదు. భారీగా వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడంలో కేంద్ర ఆహారసంస్థ చేతులెత్తేస్తే, రాష్ట్రంపై పెనుభారం పడే అవకాశాలుండటంతో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువేనని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. పుంజుకోని కొనుగోళ్లు రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి 85.69 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాలని లక్ష్యం. 6,491 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటివరకు 3,600 కేంద్రాలు ప్రారంభించారు. వీటి ద్వారా 1.52 లక్షల మంది రైతుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించారు. రోజూ 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులకు మించి సేకరణ జరగట్లేదు. ఇప్పటికే చాలా జిల్లాలో వరికోతలు పుంజుకున్నా సన్నాలకు ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధంతో రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తేవట్లేదు. దీంతో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు మాత్రమే కేంద్రాలకు వచ్చాయి. ప్రస్తుతం చాలా రకాల సన్నాలకు క్వింటాలుకు రూ.1,888 చెల్లిస్తున్నారు. భువనగిరి, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 17 శాతానికి మించి తేమ ఉందని, తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు రూ.1,700కే కొంటున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో రూ.1,868 ధర చెబుతున్నా తేమ 17 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా, ధాన్యం రంగుమారినా, తాలు, చెత్త ఎక్కువగా ఉన్నా క్వింటాల్‌కు 3–4 కిలోల చొప్పున తీసేస్తున్నారు. ఈ లెక్కన ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 60 కిలోల మేర తరుగుపోతోంది. గతంలో ఎకరాకు 22–25 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, ఈ ఏడాది దోమకాటుతో 15 క్వింటాళ్లకు మించి దిగుబడి లేదు. దీంతో సన్నాలకు రూ.2,500 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రంగు మారిన సన్నరకం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడం మాత్రం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ‘బోనస్’ ఆశ నిరాశేనా? ఇటీవల రైతు వేదికల ప్రారంభం సందర్భంగా సన్నాలకు రూ.100 లేక రూ.150 బోనస్ ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్నాలు 40 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరించాలని లక్ష్యం. క్వింటాలుకు రూ.100 బోనస్ ప్రకటించినా ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. అయితే, కేంద్రం నిబంధనల వల్ల బోనస్ ప్రకటన సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక, దీపావళికి ముందు రోజు జరిగిన భేటీలోనూ సన్నాలకు బోనస్‌పై చర్చ జరిగినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్రం సేకరించే వరి ధాన్యానికి తాము నిర్ణయించిన ధరకు అదనంగా బోనస్ లేదా ప్రోత్సాహకాలు ఇవ్వదలిస్తే ఆ భారాన్ని రాష్ట్రమే మోయాల్సి ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. ధాన్యానికి మద్దతు ధరకంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బోనస్ లేదా ప్రోత్సాహకాలను చెల్లిస్తే రాష్ట్రం మొత్తంగా సేకరించాల్సిన ధాన్యంలో సెంట్రల్‌పూల్ కింద సేకరించాల్సిన ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరకు తాము సేకరిస్తామని, మిగతా ధాన్యాన్ని సేకరించబోమని తేల్చిచెప్పింది. ఈ షరతులే రాష్ట్రానికి గుదిబండగా మారాయని నాటి భేటీలో కేబినెట్ అభిప్రాయపడినట్టు తెలిసింది. సెంట్రల్‌పూల్ కింద సేకరించే ధాన్యానికి మాత్రమే ఆర్బీఐ రుణం పరిమితం కావాలని ఒప్పందపత్రంలో కేంద్రం షరతు విధించింది. దీని ప్రకారం రాష్ట్రం సేకరించే అదనపు ధాన్యానికి రుణాలు తీసుకొనే వెసులుబాటు ఉండదని పౌర సరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుతం సెంట్రల్‌పూల్ కింద నిర్ణయించిన మేరకు ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తోంది. మిగతా ధాన్యాన్ని రాష్ట్రం కొని బియ్యంగా మార్చి ఇస్తే దాన్ని ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ దానికి సంబంధించిన డబ్బును రాష్ట్రానికి ఇస్తోంది. అయితే ప్రస్తుతం మద్దతు ధరకన్నా ఒక్క రూపాయి అదనంగా ఇచ్చినా కేవలం తాము సెంట్రల్‌పూల్ కింద కొనాల్సిన దాన్నే కొంటామని, మిగతా ధాన్యంతో తమకు సంబంధం ఉండదని కేంద్రం చెబుతోంది. ఇక్కడే సన్నాలకు బోనస్ ఇద్దామన్నా, ప్రోత్సాహకం ఇద్దామన్నా సమస్య ఎదురవుతోంది’అని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
‘అందుకే ప్యాక్ చేసిన సన్నబియ్యం’
సాక్షి, అమరావతి : గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన బియ్యంలో నాణ్యత లేదని, 40శాతం బియ్యం తినడానికే వీలులేకుండా చేశారని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తమ ప్రభుత్వం సెప్టెంబర్ 1నుంచి ప్రతి పేదవాడికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. సన్నబియ్యం పథకాన్ని తొలివిడతగా శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రం మొత్తం సన్నబియ్యం పంపణీ చేస్తామన్నారు. అవినీతికి, రిసైక్లింగ్‌కి తావు లేకుండా చేసేందుకే ప్యాక్ చేసిన బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ప్యాకింగ్‌కు రూ.250 కోట్లు ఖర్చు పెడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.. రూ.12వేల కోట్ల బియ్యం పంపిణీ చేసినప్పుడు రూ.250 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. బియ్యం పంపిణీలో అవినీతి లేకుండా పేదలకు సరఫరా చేస్తామన్నారు. అక్టోబర్ 2నుంచి కొత్త రేషన్‌కార్టుల జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. గతంలో టీడీపీ 15 లక్షల రేషన్ కార్డులను అనర్హులకు ఇచ్చిందని, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం
చెన్నూర్ : వసతిగృహా విద్యార్థులకు మంచిరోజులు రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు దొడ్డు బియ్యానికి బదులు ఫైన్‌రైస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రాతిపాదనలు తయారు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 245 బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 41,381 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 50, ఎస్సీ 72, ఎస్టీ 123 చొప్పున బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు వచ్చే ఏడాది 2015 నుంచి సన్న రకం బియ్యంతో భోజనం పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలోని వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. మండలాల్లో ఉన్న వసతి గృహాలకు ఎన్ని క్వింటాళ్ల బియ్యం అవసరమో నివేదిక సమర్పించాలని తహశీల్దార్లకు మంచిర్యాల ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్ల వారీగా ఎంతకోటా బియ్యం అవసరమో నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అప్పగించారు. తిండికి తిప్పలు ఉండదు ప్రభుత్వం ప్రస్తుతం వసతి గృహాలకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ బియ్యంతో విద్యార్థులు తిండికి తిప్పలు పడుతున్నారు. ఉడికి ఉడకని అన్నం తినలేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులు కొందరు ఈ భోజనం చేయలేక చదువులను మానేసిన ఘటనలు సైతం ఉన్నాయని పలువురు సంక్షేమాధికారులు చెప్పడం విశేషం. ప్రభుత్వం వసతి గృహాలకు ఫైన్ రైస్‌ను సరఫరా చేస్తే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు సన్న రకం బియ్యంతో భోజనం చేయనున్నారు.