Five States Assembly Elections
-
Five States Election: అసెంబ్లీలలో కొత్త నీరు
దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి కొత్త నీరు శరవేగంగా చేరుతోంది. ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టగల ఈ ధోరణి తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచి్చనట్టు కని్పంచింది. వాటన్నింటిలో కలిపి ఏకంగా 38 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరారు! మెజారిటీ సాధనలో వెటరన్ ఎమ్మెల్యేలదే పై చేయిగా నిలిచినా, రాజకీయ రంగంలో మాత్రం మొత్తమ్మీద కొత్త గాలులు వీస్తున్నాయనేందుకు ఈ ఎన్నికలు స్పష్టమైన సూచికగా నిలిచాయి. మూడింట్లో కొత్తవారి జోరు మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజేతల జాబితాను పరిశీలిస్తే ఇప్పటికే కనీసం రెండు నుంచి మూడుసార్లు నెగ్గిన అనుభవజు్ఞలైన ఎమ్మెల్యేలు అందులో 38 శాతం మంది ఉన్నారు. అయితే సరిగ్గా అంతే శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం. ఇప్పటికే మూడుసార్లకు మించి ఎమ్మెల్యేలుగా చేసిన వెటరన్లలో ఈసారి 24 శాతం మంది గెలుపొందారు. రాష్ట్రాలవారీగా చూస్తే తొలిసారి ఎమ్మెల్యేల జాబితాలో గిరిజన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ టాప్‌లో నిలవడం విశేషం. అక్కడ ఈసారి మొత్తం 90 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 52 శాతం మంది కొత్త ముఖాలే! వెటరన్లు కేవలం 18 శాతం కాగా అనుభవజు్ఞలు 30 శాతమున్నారు. తెలంగాణలో కూడా 119 మంది ఎమ్మెల్యేల్లో 45 శాతం మంది తొలిసారి ఎన్నికైనవారే! ఈ దక్షిణాది రాష్ట్రంలో 21 శాతం మంది వెటరన్లు, 34 శాతం మంది అనుభవజు్ఞలు తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కూడా 40 మంది ఎమ్మెల్యేల్లో 47 శాతం మంది కొత్తవారున్నారు. వెటరన్లు 18 శాతం, అనుభవజు్ఞలు 35 శాతంగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో మాత్రం కొత్తవారి హవా కాస్త పరిమితంగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం వెటరన్లు 31 శాతం మంది ఉండగా అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేల శాతం 36గా ఉంది. రాష్ట్రంలో 33 శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజస్తాన్ ఎమ్మెల్యేల్లో మాత్రం 46 శాతం మంది అనుభవజ్ఞులే. వెటరన్లు 24 శాతం కాగా తొలిసారి నెగ్గినవారు 30 శాతమున్నారు. మెజారిటీలో వెటరన్లదే పైచేయి ఓవరాల్ గెలుపు శాతంలో వెనకబడ్డా, మెజారిటీ సాధనలో మాత్రం వెటరన్లు సత్తా చాటారు. మూడు రాష్ట్రాల్లో కొత్తవారు, అనుభవజు్ఞల కంటే ఎక్కువ మెజారిటీని వెటరన్లు సాధించారు. మొత్తమ్మీద ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి చూస్తే వెటరన్లు సగటున 22,227 ఓట్ల మెజారిటీ సాధించగా కొత్తవారు 20,868 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక అనుభవజు్ఞల సగటు మెజారిటీ 20,495 ఓట్లు. జనాకర్షణలో వెటరన్లు ఇప్పటికీ సత్తా చాటుతున్నారనేందుకు వారు సాధించిన మెజారిటీలు నిదర్శనంగా నిలిచాయి. పార్టీలవారీగా చూస్తే... ఇక ఐదు రాష్ట్రాల ఫలితాలను పార్టీలవారీగా చూస్తే బీజేపీ ఎమ్మెల్యేల్లో కొత్తవారు 38 శాతం మంది ఉన్నారు. 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 27 శాతం మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనుభవజ్ఞులు బీజేపీ కంటే ఎక్కువగా 43 శాతం మంది ఉన్నారు. తొలిసారి నెగ్గిన వారు 34 శాతం కాగా వెటరన్లు 23 శాతంగా తేలారు. ఇతర పార్టీలన్నీ కలిపి చూస్తే కొత్త ఎమ్మెల్యేలు ఏకంగా 47 శాతముండటం విశేషం! 35 శాతం మంది అనుభవజు్ఞలు కాగా వెటరన్లు 19 శాతానికి పరిమితమయ్యారు. చిన్న, ప్రాంతీయ పార్టీల్లో కొత్త వారి జోరు ఎక్కువగా ఉందనేందుకు ఇది స్పష్టమైన సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Five States Assembly Elections 2023: బీజేపీ తీన్మార్
ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ పోరులో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కీలక రాష్ట్రాలను సొంతం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో భారీ విజయంతో అధికారాన్ని నిలుపుకోగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకుంది. తద్వారా ఉత్తరాది హిందీ బెల్టులో తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో లభించిన ఈ సానుకూల ఫలితాలతో బీజేపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ఘోరమైన ఓటమి మూటగట్టుకుని కాంగ్రెస్ చతికిలపడింది. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెర దించుతూ విజయం సాధించడం ఒక్కటే ఈ ఎన్నికల్లో దానికి ఊరట. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ 65 స్థానాలతో సరిపెట్టుకుంది. రాజస్తాన్‌లో పోలింగ్ జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 115 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌కు 69 సీట్లు దక్కాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 54 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు 35 దక్కాయి. ఇక తెలంగాణలో 119 సీట్లకు కాంగ్రెస్ 64 చోట్ల నెగ్గి మెజారిటీ సాధించగా అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా స్థానిక పార్టీలైన ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం మధ్యే పోరు సాగిందన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు అక్కడ పెద్దగా ఆశలేమీ లేవు. ఆద్యంతమూ ఆధిక్యమే... ఫలితాల వెల్లడిలో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ హవాయే సాగింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే మధ్యప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో తొలుత కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్టు కని్పంచినా కాసేపటికే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చాలామంది భావించిన ఛత్తీస్‌గఢ్‌లో కూడా స్పష్టమైన ఆధిక్యం కని్పస్తుండటం పార్టీలో జోష్ నింపింది. దాంతో ఒకవైపు లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. జై శ్రీరాం, మోదీ నాయకత్వం వరి్ధల్లాలి అంటూ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత ప్రభావం నుంచి తప్పించుకోవడంతో పాటు రాజస్తాన్‌లో నేతల మధ్య కుమ్ములాటలకు కూడా పార్టీ చెక్ పెట్టిందని చెబుతున్నారు. మోదీ కేంద్రంగా సాగించిన ప్రచారం ఫలించింది. అంతిమంగా బీజేపీ మీద ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనగా, కాంగ్రెస్ మత, విభజన రాజకీయాలను వారు తిరస్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. నిరుత్సాహంలో కాంగ్రెస్ గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఊపులో ఉన్న కాంగ్రెస్‌లో తాజా ఫలితాలు నిరుత్సాహం నింపాయి. ఇది తాత్కాలిక వెనుకంజేనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కలిపి 84 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా విజయాలతో ఉత్తర, పశి్చమ భారతంలో అత్యధిక రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వెళ్లాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి ఆ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఆశించినన్ని సీట్లు నెగ్గకపోవడం బీజేపీకి నిరాశ కలిగించగా అక్కడ తొలిసారిగా అధికారం చేపట్టనుండటం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. రాజస్తాన్ బీజేపీదే 115 అసెంబ్లీ స్థానాల్లో విజయం 69 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఏకంగా 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీని కాంగ్రెస్ బద్దలు కొట్టలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో 69 సీట్లకు పరిమితమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీని గెలిపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు దూకుడుగా సాగించిన ప్రచారం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గెహ్లోత్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పరాజయాన్ని ఊహించలేదని పేర్కొన్నారు. తమ ప్రణాళికలు, పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని అంగీకరించారు. సీఎం గెహ్లోత్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు సమరి్పంచారు. రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా చిన్నాచితక పారీ్టలు సైతం ప్రభావం చాటాయి. భారత ఆదివాసీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రా్రïÙ్టయ లోక్తాంత్రిక్ పార్టీ, రా్రïÙ్టయ లోక్‌దళ్ కొన్ని సీట్లు గెలుచుకున్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. పలువురు కాంగ్రెస్ మంత్రులు ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సి.పి.జోïÙకి సైతం పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ జోద్పూర్ జిల్లాలోని సర్దార్‌పురా నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించడం విశేషం. గత ఎన్నికల్లో ఆయనకు 45,597 ఓట్ల ఆధిక్యం లభించగా, ఈసారి 26,396కు తగ్గింది. మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాషాయమే 163 స్థానాలు బీజేపీ కైవసం 66 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 230 స్థానాలకు గాను ఏకంగా 163 స్థానాలను సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. ఈసారి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న అధికార కాంగ్రెస్ వ్యూహాలు ఫలించలేదు. ఆ పార్టీ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజధాని భోపాల్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంబరాలు హోరెత్తాయి. కాంగ్రెస్ కార్యాలయం బోసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే విజయం సాధ్యమైందని బీజేపీ నాయకులు చెప్పగా పరాజయానికి కారణాలను సమీక్షించుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బుద్నీ అసెంబ్లీ స్థానంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏకంగా లక్షకు పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈసారి బీజేపీ మధ్యప్రదేశ్‌తో పాటు ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యరి్థని ముందుగా ప్రకటించకపోవడం తెలిసిందే. అయినా పార్టీ ఘనవిజయం నేపథ్యంలో శివరాజ్ ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు. అయితే బీజేపీ ఇంతటి ఘనవిజయం సాధించినా ఏకంగా 12 మంది మంత్రులు ఓటమి పాలవడం విశేషం! అయితే అసెంబ్లీ బరిలో దిగిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ మాత్రం విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 165 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 44.88 శాతం, కాంగ్రెస్‌కు 36.38 శాతం ఓట్లు లభించాయి. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లతో 114 స్థానాలు సాధించింది. బీజేపీ 41.02 శాతం ఓట్లు సాధించినా 109 సీట్లే నెగ్గింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. 15 నెలలకే కాంగ్రెస్ అగ్ర నేత జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఛత్తీస్‌గఢ్‌లో విరబూసిన కమలం 54 సీట్లతో బీజేపీ విజయహాసం 35 స్థానాలతో కాంగ్రెస్ ఓటమి రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను బీజేపీ 54 స్థానాలు దక్కించుకుంది. అధికార కాంగ్రెస్‌కు 35 స్థానాలే లభించాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కమలం పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠం సొంతం చేసుకుంది. ‘మోదీ కీ గ్యారంటీ–2023’ పేరిట బీజేపీ ఇచి్చన హామీలను ప్రజలు విశ్వసించినట్లు కనిపిస్తోంది. క్వింటాల్ రూ.3,100 చొప్పున ధరకు ఎకరాకు 21 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కొనుగోలు, మహతారీ వందన్ యోజన కింద వివాహమైన మహిళలకు ఏటా రూ.12,000 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రజలను ఆకర్శించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా బీజేపీ గెలుపునకు తోడ్పడింది. కాగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆ పారీ్టకి ప్రతికూలంగా మారాయి. స్వయానా సీఎం బఘెల్, డిప్యూటీ సీఎం సింగ్‌దేవ్ మధ్య స్పర్థలుండటం కూడా బాగా చేటు చేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి చతికిలపడింది. సీఎం బఘెల్ తన సొంత నియోజకవర్గం పటన్‌లో నెగ్గినా రాష్ట్రంలో మాత్రం పార్టీని గెలిపించుకోలేకపోయారు. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్ కూడా ఓటమి చవిచూశారు! అంబికాపూర్ అసెంబ్లీ స్థానంలో సమీప బీజేపీ ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి సీఎం బఘెల్ ముడుపులు స్వీకరించారంటూ పోలింగ్ సమీపించిన వేళ వచి్చన ఆరోపణలు కూడా కాంగ్రెస్‌కు బాగా నష్టం చేసినట్టు కనబడుతోంది. మరోవైపు బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీకి దిగింది. అయినా ప్రధాని మోదీకి ఉన్న జనాదరణ, ఆయన పేరుతో ఇచి్చన హామీల ఆసరాతో పార్టీ విజయ తీరాలకు చేరింది. -
Five States Assembly Elections 2023: 12 రాష్ట్రాల్లో అధికార పీఠంపై కమలం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రశంసనీయమైన ఫలితాలు సాధించింది. మూడు కీలక రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సులువుగా నెగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టినట్లయ్యింది. ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరడం లాంఛనమే. అలాగే మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాడ్, సిక్కిం ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోంది. దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కోల్పోయింది. తెలంగాణలో విజయం సాధించింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటికే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణ సైతం ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. అంటే మొత్తం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి ఉన్నట్లు లెక్క. బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. మరో జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఢిల్లీ, పంజాబ్‌లో పూర్తి మెజారీ్టతో అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోవడంతో ఇక ఉత్తర భారతదేశంలో ‘ఆప్’ అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించిందని ఆ పార్టీ నేత జాస్మిన్ షా తెలిపారు. 2024లో లోక్‌సభ సాధారణ ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. -
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్‌ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్
కావేవీ మీమ్స్‌కు అనర్హం అన్నట్లుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పైనా సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం పూర్తయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ, ఒక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్‌కు చేరవలో ఉన్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఆయా పార్టీలు పోటీ పడే క్రమంలో రిసార్టు రాజకీయాలు మొదలవుతాయని భావిస్తున్నారు. దీంతో రిసార్ట్‌లకు డిమాండ్ వస్తుందని, సొమ్ము చేసుకునేందుకు రిసార్ట్ ఓనర్లకు మంచి అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందన్నది ఆరోజే తేలనుంది. #ExitPoll Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/NDKixJkBaL — वेल्ला इंसान (@vella_insan1) November 30, 2023 Hotels and resort owners after watching the Exit polls pic.twitter.com/KcEHtjVb5S — Pakchikpak Raja Babu (@HaramiParindey) November 30, 2023 Resort owners right now after Exit poll predicts hung assembly #ExitPolls pic.twitter.com/7dx0ysXQ9a — 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) November 30, 2023 -
తెలంగాణ అంచనాలు కాంగ్రెస్‌వైపే!
లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ కాంగ్రెస్ వైపే మొగ్గడం విశేషం. రాష్ట్రంలో హస్తం పార్టీ తొలిసారి అధికారంలోకి రానుందని అవి పేర్కొన్నాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం ఒకవైపు ఇంకా పోలింగ్ కొనసాగుతుండగానే వెలువడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్టు ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్‌లో చాలావరకు పేర్కొన్నాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియాతో పాటు టైమ్స్ నౌ–ఈటీజీ, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరిదైనా పై చేయి కావచ్చని ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ పేర్కొన్నాయి. ఇక రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించనుందని టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, జన్ కీ బాత్, టుడేస్ చాణక్యతో సహా అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు 80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ అధికారం నిలబెట్టుకోనుందని పలు సర్వేలు తెలిపాయి. 230 సీట్లకు గాను దానికి బీజేపీకి 162 సీట్ల దాకా వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనగా టుడేస్ చాణక్య 151, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ 159 దాకా రిపబ్లిక్ టీవీ 130 దాకా ఇచ్చాయి. ఏబీపీ–సీవోటర్ మాత్రం కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం హోరాహోరీగా తలపడ్డట్టు సర్వేలు స్పష్టం చేశాయి. అక్కడ హంగ్ రావచ్చని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకందని తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా తెలంగాణలో పోలింగ్ సరళి ఎవరికీ కచ్చితంగా అంతుబట్టడం లేదు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలంగాణలో పోలింగ్ తీరుతెన్నులను అంచనా వేయలేకపోయింది. రాష్ట్రంలో అధిక ధన ప్రభావం, పైగా గురువారం సాయంత్రం గడువు దాటాక కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు. దాంతో కచ్చితమైన ఎగ్జిట్ పోల్ అంచనాలకు రాలేకపోతున్నామన్నారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌పై శుక్రవారం స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా 36.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదింటికల్లా 63.94 శాతానికి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లున్నారు. -
రాజస్తాన్‌లో 75% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందాక తుది పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ప్రవీణ్ గుప్తా అన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ దఫా కనీసం ప్రతి నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిపారు. ఓటర్ల సంఖ్య 5.25 కోట్లు. మొత్తం 51వేల పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అప్పటికే క్యూల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశమిచి్చనట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయానికి 68.2శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జైసల్మీర్, ఆ తర్వాత హనుమాన్‌గఢ్, ధోల్పూర్ జిల్లాల్లో భారీ పోలింగ్ నమోదైనట్లు సీఈవో గుప్తా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకస్మిక మృతితో శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. భద్రత కోసం 1.70 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. శనివారం ఉదయం ఓటు హక్కు మొదటగా వినియోగించుకున్న ప్రముఖుల్లో సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాశ్ చౌదరి, మాజీ సీఎం వసుంధరా రాజె, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తదితరులున్నారు. గెహ్లోత్, షెకావత్ జోథ్‌పూర్‌లో, చౌదరి బలోత్రాలో, రాజె ఝలావర్‌లో, పైలట్ జైపూర్‌లోనూ ఓటేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. స్వల్ప ఘటనలు.. దీగ్ జిల్లా కమన్ గ్రామంలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీస్ అధికారి సహా ఇద్దరు గాయపడ్డారు. ‘గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది’అని దీగ్ జిల్లా ఎస్పీ చెప్పారు. సికార్ జిల్లా ఫతేపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వడంతో ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ధోల్పూర్ బారి నియోజకవర్గంలోని ఓ బూత్ వద్ద పోలింగ్ ఏజెంట్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయినట్లు కలెక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. టోంక్ జిల్లా ఉనియారాలో 40 మంది వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు యతి్నంచగా అడ్డుకున్నట్లు ఎస్పీ రాజశ్రీ రాజ్ చెప్పారు. సుమేర్పూర్ స్థానం బీజేపీ అభ్యర్థి తరఫు ఏజెంట్ శాంతి లాల్, ఉదయ్‌పూర్‌లో సత్యేంద్ర అరోరా(62) అనే ఓటరు పోలింగ్ బూత్‌ల వద్దే గుండెపోటుతో చనిపోయారు. కొద్ది చోట్ల రీపోలింగ్ చేపట్టే విషయంలో పరిశీలకుల నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో గుప్తా వివరించారు. పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొన్ని బూత్‌లలో ఈవీఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు వచి్చనా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి యువ ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌ల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
Rajasthan elections 2023: రాజస్తాన్ ఎన్నికలకు సర్వం సిద్ధం
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీ్మత్సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ భరత్పూర్ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్రీ్టయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఎం, ఆర్ఎలీ్ప, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పారీ్టలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. బరిలో ఉద్ధండులు.. పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేతలు వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్, సతీష్ పూర్ణియా, ఎంపీలు దివ్యా కుమారి, రాజ్యవర్దన్ రాథోడ్, బాబా బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీనా తదితరులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గహ్లోత్, సచిన్ పైలట్ సయోధ్య! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల సంగతి తెలిసందే. తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ఎన్నికల వేళ గహ్లోత్ ప్రయత్నించారు. సచిన్ పైలట్ ప్రజలను ఓట్లు అభ్యరి్థస్తున్న వీడియోను గహ్లోత్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తద్వారా ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చేందుకు ప్రయతి్నంచారు. -
Election Commission: రూ.1,760 కోట్లు.. ఐదు రాష్ట్రాల్లో పట్టుబడిన మొత్తం
న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ. 1,760 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాల్లో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల రూపంలో ఈ మొత్తం పట్టుపడినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో 2018 ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం కంటే ఈసారి పట్టుబడినది దాదాపు ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో రూ. 239.15 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను ఈసీ జప్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో ఎలక్షన్లు ముగియగా రాజస్థాన్‌లో నవంబర్ 25, తెలంగాణలో నవంబర్ 30 తేదీన పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.. ప్రలోభ రహితంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని అభ్యర్థులకు, పార్టీలకు స్పష్టం చేసినట్లు ఈసీ పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ (ESMS) ద్వారా పర్యవేక్షణ ప్రక్రియలో సాంకేతికతను కూడా పొందుపరిచినట్లు తెలిపింది. ఈసీ ప్రకటన ప్రకారం.. ఆసక్తికరంగా మిజోరాంలో నగదు, విలువైన వస్తువులేవీ పట్టుబడలేదు కానీ రూ. 29.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 228 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 194 అసెంబ్లీ నియోజకవర్గాలను అత్యధిక వ్యయం జరిగే స్థానాలుగా గుర్తించిన ఈసీ.. వీటిపై నిశిత పర్యవేక్షణ పెట్టింది. -
Madhya Pradesh election 2023: రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం
భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభకు ఈసారి జరిగిన ఎన్నికల్లో రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. శుక్రవారం మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా 76.22 శాతం ఓటింగ్ నమోదైంది. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి చూస్తే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారికావడం విశేషం. ఇంతకాలం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 75.63 శాతమే అధికంగా ఉండేది. శుక్రవారం నాటి పోలింగ్ ఆనాటి రికార్డును తుడిచేసింది. మిగతా జిల్లాలతో పోలిస్తే సివానీ జిల్లాలో అత్యధికంగా 85.68 శాతం పోలింగ్ నమోదైంది. గిరిజనులు ఎక్కువగా ఉండే అలీరాజ్‌పూర్ జిల్లాలో అత్యల్పంగా 60.10 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో సరిహద్దు పంచుకుంటున్న నక్సల్స్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలో 85.23 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 76.31 శాతం ఈ నెల ఏడున, 17న రెండు విడతల్లో జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో 76.31 శాతం పోలింగ్ నమోదైందని శనివారం ఎన్నికల ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 76.88 శాతం కంటే ఈసారి కాస్తంత తక్కువ పోలింగ్ నమోదైంది. కురుద్ నియోజకవర్గంలో ఏకంగా 90.17 శాతం పోలింగ్ నమోదైంది. బీజాపూర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 48.37 శాతం పోలింగ్ నమోదైంది. -
Rajasthan elections 2023: ఏం ‘మాయ’ చేయనుందో...!
రాజస్తాన్‌లో హోరాహోరీ తలపడుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ గెలుపోటములను మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మరోసారి ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దాంతో పోలింగ్ మరో పది రోజుల్లోకి వచ్చిన వేళ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను బీఎస్పీ ప్రభావితం చేసింది. ఏకంగా 6 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 60 స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సాక్షి, న్యూఢిల్లీ కుల సమీకరణలతో... ► రాజస్తాన్ ఓటర్లలో 18 శాతం మంది ఎస్సీలు, 9 శాతం మంది ముస్లింలున్నారు. దాంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా దళిత–ముస్లిం ఫార్ములానే బీఎస్పీ నమ్ముకుంది. ► గత ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో బీఎస్పీ 6 అసెంబ్లీ స్థానాలు నెగ్గడమే గాక 4 శాతం ఓట్లు రాబట్టింది. ► బీఎస్పీ ప్రభావం చూపిన మరో 30 స్థానాల్లో బీజేపీ ఏకంగా 17 స్థానాలను అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్‌కు కోల్పోయింది. ► మరో మూడింట స్వతంత్రులు గెలిచారు. ఈ దెబ్బకు బీజేపీ అధికారాన్నే కోల్పోవాల్సి వచి్చంది. ► ఆ 17 స్థానాల్లో బీజేపీ గెలుచుంటే ఆ పార్టీ బలం 73 నుంచి 90 స్థానాలకు పెరిగేది. ► 100 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ 83కు పరిమిత ► మయ్యేది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఈసారి కూడా... ► ఈసారి కూడా రాష్ట్రంలో 200 సీట్లకు గాను ఏకంగా 183 చోట్ల బీఎస్పీ బరిలో దిగింది. మిషన్–60 లక్ష్యంతో దూసుకెళ్తోంది. ► ఆ 60 స్థానాల్లో బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఈ విషయంలో పార్టీ నిపుణుడైన రామ్‌జీ గౌతమ్ వ్యూహాలను అమలు చేస్తోంది. ► ధోల్పూర్, భరత్పూర్, కరౌలీ, సవాయి మధోపూర్, దౌసా, ఆళ్వార్, సికర్, ఝుంఝును, ఛురు, హనుమాన్‌గఢ్, గంగానగర్, బార్మేర్, జాలోర్, నగౌర్, జైపూర్ రూరల్ జిల్లాల్లోని 60 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేస్తోంది. ► ఈ నెల 17 నుంచి 20 వరకు మాయావతి భరత్పూర్, అల్వార్, ఖేత్రి జిల్లాల్లో ఏకంగా 8 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ► దాంతో గాలి తమకు మరింత అనుకూలంగా మారుతుందని బీఎస్పీ అభ్యర్థులు అంటున్నారు. -
Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్’
రాజస్తాన్‌లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి క్షణంలో పార్టీ మొండి చేయి చూపడంతో ఆగ్రహించి డజను మంది నేతలు స్వతంత్రులుగా బరిలో దిగారు. తాము ఓడటమే గాక బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. అదే సమయంలో 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన 13 మందిలో ఏకంగా 12 మంది విజయం సాధించడం విశేషం. పైగా ఫలితాలు వెలువడగానే వారంతా కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అలా నికరంగా ఆ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈసారి కూడా రెండు పార్టీల నుంచీ రెబెల్స్ రంగంలో ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి చేటు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది...! రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 830 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్, 12 మంది బీజేపీ నేతలున్నారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగరేశారు. కాంగ్రెస్ రెబెల్స్‌లో ఏకంగా 12 మంది గెలవడమే గాక ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి వారిలో 10 మందికి సీఎం అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ టికెట్లు కూడా ఇప్పించారు. మరోవైపు 12 మంది బీజేపీ రెబల్స్‌లో ఒక్కరు కూడా నెగ్గలేదు. కుల్దీప్ ధన్‌ఖడ్, దేవీసింగ్ షెకావత్, ధన్సింగ్ రావత్, హేమ్‌సింగ్ భడానా వంటి పెద్ద నాయకులు కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఈ 12 మందీ తమ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించారు. అలా రెబెల్స్ దెబ్బకు బీజేపీ బాగా నష్టపోయింది. బీజేపీకి 73 సీట్లు రాగా కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడం తెలిసిందే. 2013లో కూడా కాంగ్రెస్ రెబెల్స్‌లో చాలామంది నెగ్గగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో అత్యధికులు ఓటమి చవిచూశారు. ఈసారి కూడా రాష్ట్రంలో ఏకంగా 737 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తమ్మీద 18 మంది బీజేపీ రెబెల్స్, 14 మంది కాంగ్రెస్ రెబెల్స్ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం ఆ పారీ్టలపై ఎలా ఉంటుందన్నది ఫలితాల అనంతరమే తేలనుంది. రాష్ట్రంలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు
జైపూర్: రాజస్తాన్‌లో బీజేపీ చెల్లాచెదురయిందని, అందుకే ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేకుండాపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. దుంగార్పూర్ జిల్లా సగ్వారాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి సీఎం అభ్యర్థి దొరక్క ప్రధాని మోదీ చేసేది లేక తన పేరుతోనే ఓట్లభ్యర్థిస్తున్నారన్నారు. మతం, మనోభావాలను వాడుకుంటూ ఓట్లడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా రైతులతోపాటు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ‘దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమే కాగా, ప్రధాని మోదీ ప్రత్యేక మిత్రుడు అదానీ మాత్రం రోజుకు రూ.16 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వద్ద రైతు రుణాలు రద్దు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవు’అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుచూపుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ద్రవ్యోల్బణ సహాయక శిబిరాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తుందని ప్రియాంకా గాంధీ ప్రజలను హెచ్చరించారు. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో నేడే పోలింగ్
భోపాల్/రాయ్‌పూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. కీలకమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లకు గాను రెండో, తుది దశలో భాగంగా 70 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ రాష్ట్రంలో నవంబర్ 7న తొలి దశలో 20 నక్సల్స్ ప్రాబల్య స్థానాల్లో పోలింగ్ ముగియడం తెలిసిందే. అదే తేదీన ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మొత్తం 40 స్థానాకలు ఒకే దశలో పోలింగ్ జరిగింది. మరో కీలక రాష్ట్రమైన రాజస్థాన్‌లో నవంబర్ 25న, చివరగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ డిసెంబర్ 3న వెల్లడవుతాయి. మధ్యప్రదేశ్‌లో.. మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలతో అతి పెద్ద పారీ్టగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కుప్పకూలింది. శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఆ రెండింటితో పాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా మరోసారి గట్టిగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది... ఛత్తీస్‌గఢ్ రెండో దశలో... రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 68 సీట్లతో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఈ ఐదేళ్లలో సీఎం భూపేశ్ బఘెల్ పలు ప్రజాకర్షక పథకాలతో రైతులతో పాటు అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వచ్చారు. అనంరం ఉప ఎన్నికల విజయాలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉన్నాయి... -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా
ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడిని తెరమీదకు తేవడంలో కేంద్ర బీజేపీ విఫలమవడంతోపాటు రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి పట్టు సడలడం వంటి కారణాలతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఆశలు అడియాశలవుతున్నాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ రెండిరతలు స్థానాలు అధికంగా సాధించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ`పోల్ సర్వేలో కాంగ్రెస్ 55 నుంచి 60, బీజేపీ 29 నుంచి`34, బీఎస్పీ, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని తేలింది. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 46. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్నా కాంగ్రెస్ సొంతంగా మెజార్టీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలే కాకుండా గోండ్వాన్ గణతంత్ర పరిషత్, సర్వ్ ఆదివాసీ సమాజ్ మద్దతిస్తున్న హమారా రాజ్ పార్టీ, ఛత్తీస్‌గఢ్ క్రాంతి సేనా పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే వాటి ప్రభావం తక్కువగానే ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జోగీ) పార్టీ బీఎస్పీతో కలిసి 2018 ఎన్నికల్లో పోటీ చేయగా, ఆ కూటమి 7 స్థానాలు (జేసీసీ 5, బీఎస్పీ 2) పొందింది. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ 0 ` 2 సీట్లు పొందవచ్చు. జేసీసీ, ఆప్ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు లేవు. 2018లో 43% ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 47%, 33% ఓట్లు పొందిన బీజేపీ ఈసారి 42% పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. బీజేపీ 2018 కంటే 9% ఓట్లు అధికంగా పొందనుంది. ఏ సర్వేలో అయినా మూడు శాతం మార్జిన్ వ్యత్యాసం ఉండే అవకాశాలుంటాయనేది ఇక్కడ గమనార్హం.పీపుల్స్ పల్స్ బృందం జూన్ 2023లో రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో వెలువడిన ప్రభుత్వ అనుకూలత ఫలితాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సమీకరణాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం, పార్టీ పనితీరు మొదలైన అంశాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందంజలో ఉండడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సరైన పాత్ర పోషించడంలో విఫలం చెందిందని సర్వేలో స్పష్టమైంది. భౌగోళికంగా ఛత్తీస్‌గఢ్ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు. బార్లాపూర్, సూరజ్‌పూర్, మానేంద్రఘర్`చిర్మిరి`భరత్పూర్, కోరియా, కోర్బా, రాయగఢ్, సర్గుజ్ జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డివిజన్లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అధికం. ఎస్టీలలో కాన్వర్, ఖైర్వార్, కోర్బా, గోండ్, ఓరాన్, ఓబీసీలలో సాహు, రౌత్, రాజ్వాడే, ఎస్సీలలో హరిజనులు ఈ ప్రాంతంలో కీలకం. ఇక్కడ 23 స్థానాలుండగా 2018లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో, రాష్ట్ర మంత్రి జైసింగ్ అగర్వాల్, బీజేపీ ఎంపీలు రామ్‌విచార్ నేతం, గోమతి సాయి, రేణుకా సింగ్ ఇక్కడ ప్రముఖ నేతలు. 2018లో సింగ్‌డియో కాబోయే సీఎం అనే ప్రచారంతో కాంగ్రెస్ ఇక్కడ మెరుగైన ఫలితాలు పొందింది.ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే సింగ్‌డియో ప్రభావం తగ్గింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ తిరస్కరించడం కాంగ్రెస్‌కు ఇబ్బందులు కలిగిస్తోంది. మరోవైపు బీజేపీ రేణుకా సింగ్, గోమతి సాయి, రామ్‌విచార్ నేతం ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపడం వల్ల రాబోయే ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. సుర్గుజ్లోని 14 స్థానాల్లో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందని బీజేపీ ఈ ఎన్నికల్లో 4 నుండి 7 సీట్లు పొందే అవకాశాలున్నాయి. మధ్య ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో రాయ్‌పూర్, బిలాస్పూర్, దుర్గ్ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్లో అధిక జనాభాతో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎస్టీలలో గోండ్లు, కాన్వర్, ఓబీసీలో కుర్మి, మారర్, కాలర్, సాహు, దేవాంగన్, యాదవ్, ఎస్సీలలో సాత్నామి, హరిజనులు ప్రధానంగా ఉన్నారు. సింధి, రాజ్‌పుత్, పంజాబీ, బ్రాహ్మిణ్, ముస్లిం ఓటర్ల ప్రభావం కూడా ఉంది. ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. ఇక్కడ 2018లో విఫలమైన బీజేపీ ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. జేసీసీ బలహీనపడడంతో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రభుత్వ వ్యవసాయ అనుకూల నిర్ణయాలు కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చవచ్చు. పనితీరు సరిగ్గాలేని ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. ఈ ప్రాంతంలోని ముంగేలి, బాలోడా బజార్, జాంగీర్ చాంపా జిల్లాల్లో బీజేపీకి, మిగతా జిల్లాలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. బీఎస్పీకి ఇక్కడ ఒక స్థానం రావచ్చని సర్వేలో వెల్లడయ్యింది. ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాన్ని బస్తర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇక్కడ ఒక్క జగదల్పూర్ మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉంది. బస్తర్, దంతేవాడ, సుక్మ, కాన్కేర్, కోండాగావ్ జిల్లాలున్నాయి. ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. గతంలో ఇది బీజేపీకి పట్టున్న ప్రాంతం. అయితే 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఎస్టీలలో గోండ్, మారియా`మురియా, భాత్ర హల్బీట్ సామాజిక వర్గాల ప్రభావం ఉంది. ఇక్కడ ఓబీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. కాంగ్రెస్ నుండి ఎక్సైజ్ మంత్రి కవాసీ లాక్మా, డిప్యూటీ స్పీకర్ సంత్రామ్ నేతం, పీసీసీ అధ్యక్షులు మోహన్ మార్కమ్, లాకేశ్వర్ భాగేల్, ఎంపీ దిపాక్ బాయిక్, బీజేపీ నుండి కేదర్ కష్యప్, మాజీ మంత్రి లతా ఉసేంది, మా జీ ఎంపీ దినేష్ కష్యప్ ఈ ప్రాంత ప్రముఖ నేతలు. సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. సర్వ్ ఆదివాసీ సమాజ్ ప్రభావం కూడా ఈ ప్రాంతంలో కనపడుతోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే కాంగ్రెస్ గతంలో కంటే కొన్ని స్థానాలు కోల్పోయినా అధిక స్థానాలు మాత్రం పొందవచ్చు. పంటలకు మద్దతు ధర, పేదలకు పట్టా భూముల పంపిణీ కాంగ్రెస్‌కు లబ్ది చేకూరుస్తున్నాయి.2018లో ఒక్క సీటు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 3 నుండి 4 స్థానాలు పొందే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం రాయ్‌పూర్, బిలాస్పూర్, జగదల్పూర్, అంబిక్‌పూర్, కోబ్రా, రాయిగఢ్ మొదలగు నగరాల్లో రాజపూత్, బ్రాహ్మిణ్, సింధీ, పంజాబీ, మార్వాడీ, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్ బ్యాంక్ అధికం. ఓబీసీలలో అధికంగా ఉండే సాహు సామాజిక వర్గం బీజేపీ పట్ల కొంత మొగ్గు చూపిస్తోంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ కుర్మీ కావడంతో వీరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్ వర్గం కాంగ్రెస్ వైపు ఉంది. చిన్న తరహా సాగు చేసుకునే అఘరియా వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగానికి చెందిన మారర్ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్ సామాజిక వర్గం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయింది. దేవాంగన్ సామాజిక వర్గంతోపాటు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాబల్యం ఉన్న యాదవ్ సామాజిక వర్గం కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎస్సీలు ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండులు కాంగ్రెస్, బీజేపీ, సర్వ్ ఆదివాసీ పార్టీల మధ్య చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్ బీజేపీకి, ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్, ఓరాన్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీకి, హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రికి ప్రజాదరణ ముఖ్యమంత్రి భూపేష్ సంతృప్తికరమైన పనితీరుతోపాటు ఛత్తీస్‌గఢ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో జనాకర్షణ నేతగా ఎదిగారు. కోవిడ్ సమయంలో మినహాయించి మిగతా కాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. మరోవైపు పార్టీలో ఆయన ప్రత్యర్థి సింగ్‌డియో సొంత ప్రాంతంలోనే బలహీనపడడం కూడా భూపేష్‌కు కలిసివస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు సరితూగే మరో నాయకులు ఎవరూ లేరని పీపుల్స్ పల్స్ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి భూపేశ్‌కు పోటీగా బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నారా అని పీపుల్స్‌పల్స్ ప్రజలను ప్రశ్నించగా స్పందనే రాలేదు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ను భూపేష్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ప్రభావిత అంశాలు 2018లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేష్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వరికి మద్దతు ధరను క్వింటాల్‌కు 3200 రూపాయలుగా ప్రకటించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనపై వస్తున్న విమర్శలకు దీటుగా 7 లక్షల ఉచిత గృహ నిర్మాణాలు చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ, శ్రామికుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం ఇచ్చే 7000 రూపాయలను 10000కు పెంచుతామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆత్మానంద్ స్కూల్స్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఈ స్థాయికి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ పథకాలు, వరాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనున్నాయని సర్వేలో వెల్లడైంది. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయనే ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయి. దీనిపై బీజేపీ ‘మోర్ ఆవాజ్ మోర్ అధికార్’ పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టి 2023 మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిరచింది. బీజేపీ పరివర్తన యాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. మైనింగ్ రంగంలో, పీఎస్సీ నియామకాల్లో, మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిరదని ఆరోపిస్తూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, జేసీసీ పార్టీలు వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించింది. దీంతో ఈ పార్టీలకు రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. బస్తర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనులు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. బీమేతెరా, కావార్థా జిల్లాల్లో కూడా హిందూ ముస్లిం మతకలహాలు జరిగాయి. కావార్దాలో బజరంగ్ దళ్ నేత విజయ్ శర్మకు, సాజాలో ఈశ్వర్‌సాహు (మతకలహాలలో మృతి చెందిన సాహు తండ్రి)కు బీజేపీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. ఈ ప్రభావం అరడజను స్థానాలకు మించి ఉండక పోవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పీపుల్స్‌పల్ సంస్థ ఛత్తీస్‌గఢ్‌లో 2023 అక్టోబర్ 15 నుండి 31వ తేదీ వరకు మొత్తం 90 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసుకొని, ఓటర్లను కలుసుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ నుండి 15`20 శాంపిల్స్‌ను శాస్త్రీయ పద్ధతిలో సేకరించింది. కులం, ప్రాంతం, స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారికి సమప్రాధాన్యతిస్తూ మొత్తం 6120 శాంపిల్స్ సేకరించి సర్వే నిర్వహించింది. పీపుల్స్ పల్స్ సర్వేలో డేటా విశ్లేషణకు ‘పొలిటికోస్’ బృందం సహాయసహకారాలు అందించింది. ఈ సర్వే నిర్వహించిన సమయానికి ప్రధాన పార్టీలు 90 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా రెండో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడంతోపాటు బీజేపీ నుండి సరైన ప్రత్యామ్నాయ నేతలు కూడా లేకపోవడంతో రాబోయే ఎన్నికల్లో మరోమారు విజయఢంకా మోగించి కాంగ్రెస్ అధికారం నిలుపుకునే అవకశాలు ఉన్నాయని పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. -
ఎన్నికల్లో గెలుపు కోసం తాంత్రిక పూజలా?
భోపాల్: కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ తన గెలుపుకోసం మంత్ర పూజలు చేయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఓ తాంత్రికుడు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్ ‘ఇండియా టుడే’టీవీ ప్రతినిధికి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అదికాదని, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’అని పేర్కొన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం శ్మశానవాటికలో ‘తాంత్రిక క్రియ’లు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’అని చౌహాన్ ప్రశ్నించారు. -
Chhattisgarh Assembly Election 2023: కాంగ్రెస్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోంది
జగదల్పూర్: కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్లపాలనలో వామపక్ష తీవ్రవాద ఘటనలు 52 శాతం మేర తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భగేల్ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన స్కాముల ప్రభుత్వంగా తయారైందని పేర్కొన్నారు. జగదల్పూర్, కొండగావ్‌లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడారు. ‘రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అర్ధించటానికే మీ ముందుకు వచ్చా. స్కాములకు పాల్పడటం ద్వారా గిరిజనుల డబ్బును దోచుకున్నవారిని తలకిందులుగా వేలాడదీస్తాం’అని ఆయన అన్నారు. బీజేపీకే ఓటు వేయాలని ప్రజలను కోరిన అమిత్ షా, ‘మీ ముందు రెండు అవకాశాలున్నాయి..ఒకటి నక్సలిజాన్ని ప్రోత్సహించే కాంగ్రెస్, మరోవైపు, ఈ బెడదను నిర్మూలించే బీజేపీ. కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును ఢిల్లీ దర్బార్‌కు పంపే కాంగ్రెస్.. కోట్లాది మంది పేదలకు గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రేషన్, ఇళ్లు అందజేస్తున్న బీజేపీ. ఈ రెండింట్లో మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటారు?’అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు దీపావళి పండుగను ఈసారి మూడుసార్లు జరుపుకుంటారంటూ... మొదటిది దీపావళి రోజున, రెండోది డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, మూడోది జనవరిలో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయ్యాక (శ్రీరాముడి మాతామహుల నివాసం ఛత్తీస్‌గఢ్ అని ప్రజల విశ్వాసం)అని అమిత్ షా చెప్పారు. ‘రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే, ఈ బెడద నుంచి పూర్తిగా విముక్తి కలి్పస్తాం. మోదీ ప్రభుత్వ పాలనలో 9 ఏళ్ల కాలంలో నక్సల్ సంబంధ హింస 52% తగ్గగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 62% మేర క్షీణించింది’అని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో జరిగే తీవ్రవాద సంబంధ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే పోలీసులైనా, పౌరులైనా, నక్సలైట్లయినా అందరూ గిరిజనులేనని ఆయన చెప్పారు. -
Madhya Pradesh Election 2023: బరిలో డిగ్గీ సొంత సైన్యం!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్ సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది... న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్‌సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది. అజయ్‌సింగ్ రాహుల్ 68 ఏళ్లు. దిగ్విజయ్‌కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. ‘మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో పార్టీ సీనియర్ నేత. లక్ష్మణ్‌సింగ్ 68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్‌గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రియవ్రత్‌సింగ్ 45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్‌నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు. జైవర్ధన్‌సింగ్ 37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోట లను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్ నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించు కున్నారు. -
కర్ణాటక గాయం బీజేపీకి గుర్తుందా?
ఎంత ప్రయత్నించినా.. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కాంగ్రెస్‌కు చేజార్చుకోవడం బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. మరికొద్ది నెలల్లో కీలకమైన లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం భయం. మరో పెద్ద రాష్ట్రమైన రాజస్తాన్‌లో వసుంధర రాజె తదితర ముఖ్య నేతల మధ్య కీచులాటలు. ఇటు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇంటి పోరు. వీటన్నింటినీ ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ను సమర్థంగా ఢీకొట్టేందుకు అన్ని మార్గాలనూ కమలదళం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ముందస్తుగా ప్రకటించకుండా జాగ్రత్త పడుతోంది. తద్వారా ముఖ్య నేతల పరస్పర కుమ్ములాటలను అదుపు చేయడంతో పాటు కీలక సమయంలో వారెవరూ సహాయ నిరాకరణ చేయకుండా చూడవచ్చని భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎన్ని క్యాంప్‌లో ! మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ... ఇలా సీనియర్లంతా తలో వర్గంగా విడిపోయి కుమ్ములాటల్లో యమా బిజీగా ఉన్నారు. దాంతో కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మానే ప్రధానంగా నమ్ముకుని సాగాల్సిన పరిస్థితి! ఈ పరిస్థితుల్లో చౌహాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం నేతల విభేదాలను చేజేతులా పెంచడమే అవుతుందని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా చూసుకున్నా అది చేటు చేసేదేనని అభిప్రాయపడుతోంది. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి మాటెత్తకుండానే ప్రచార పర్వాన్ని ముగించే పనిలో పడింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికీ బీజేపీకి అతి పెద్ద నేతగా మాజీ సీఎం రమణ్‌సింగ్ ఉన్నా ఆయనపైనా పార్టీలో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్, ఎమ్మెల్యే అజయ్ చందార్కర్, సీనియర్ నేత నంద్‌కుమార్ సాయ్ లాంటివాళ్లు ఆయన నాయకత్వం పట్ల అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. అసలే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయన్న అంచనాల మధ్య ఈ తలనొప్పులు బీజేపీ అధిష్టానాన్ని మరింత చికాకు పెడుతున్నాయి. అందుకే ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరినీ ముందస్తుగా ప్రకటించబోమని బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జి దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. రాజస్థాన్‌లోనూ రచ్చే రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధరా రాజె సింధియాకు, సీనియర్ నేతలు అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితరులకు ఉప్పూ నిప్పుగా ఉంటోంది. సింధియా వర్గపు నేత కైలాశ్ మేఘ్వాల్ తాజాగా అర్జున్‌రామ్‌పై విమర్శనా్రస్తాలు సంధిస్తున్నారు. దాంతో అధిష్టానం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై వ్యతిరేకత పరాకాష్టకు చేరిందన్నది బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. అవినీతి, అమసర్థత తదితర కారణాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తమ నేతల మధ్య పోరు ఇందుకు అడ్డంకిగా మారకూడదని పట్టుదలగా ఉంది. అందుకే ఢిల్లీ పెద్దలు నిత్యం రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరుపుతూ వారు కట్టుదాటకుండా చూసే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే ఇలా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల వర్గ పోరును అదుపు చేయడం వంటి ప్రయోజనాలు దక్కే మాటెలా ఉన్నా నష్టాలు జరిగే ఆస్కారమూ ఉందన్న భావన వ్యక్తమవుతోంది. బాధ్యతనంతా భుజాలపై వేసుకుని రాష్ట్ర పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ ఒక్కతాటిపై నడిపే నాయకుడంటూ లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందన్న అభిప్రాయం బీజేపీలోనే కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. కర్ణాటకలో యడ్యూరప్పను పక్కన పెట్టి అంతా అధిష్టానమే అన్నట్టుగా వ్యవహరించి భంగపడ్డ వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
Five States Assembly elections 2023: కులగణన చుట్టూ...
కులగణన.. మూడు హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. బీజేపీ హిందూత్వ ఎజెండాని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కులగణన అనే బ్రహా్మ్రస్తాన్ని బయటకు తీసింది. వచ్చే నెలలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కులగణన చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపడతామని ప్రకటించిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన కోసం పట్టుబడుతోంది. బీజేపీ కులగణన చేపడతామని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లపై గురి పెట్టింది. మన దేశంలో 2011లో కులగణన చేపట్టినప్పటికీ అందులో వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బిహార్‌లో కులగణన నిర్వహించి రాష్ట్ర జనాభాలో 63% మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారని తేల్చి చెప్పడంతో అదే తరహాలో దేశవ్యాప్తంగా కులాల జనాభా వివరాలను సేకరించాలన్న డిమాండ్ ఊపందుకుంది. కాంగ్రెస్ కులగణన డిమాండ్‌ను తిప్పికొడుతున్న బీజేపీ సమాజాన్ని విభజించడానికే కాంగ్రెస్ ఇదంతా చేస్తోందని ఎదురు దాడికి దిగుతోంది. రాజస్తాన్ రాజస్తాన్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని కుల సంఘాలు మహా సమ్మేళనాలు నిర్వహించి తమ బలాన్ని ప్రదర్శించాయి. కులగణన చేపట్టాలని, తమకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. సీఎం అశోక్ గెహ్లోత్ అన్ని కులాలకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డుల్ని ఏర్పాటు చేయడమే కాకుండా కులగణన కూడా చేపడతామని ప్రకటించారు. కులాల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు కలి్పస్తామని హామీ ఇచ్చారు. దీనికి వివిధ కులాల దగ్గర్నుంచి మంచి స్పందన వచి్చంది. రాజస్తాన్‌లో అత్యంత కీలకమైన రాజ్‌పుత్‌లు ఓబీసీలకు ఉన్నారు. ఓబీసీల సంఖ్య ఎంతో ఎవరికీ తెలీకపోవడంతో రిజర్వేషన్లలో వారికి అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. రాజస్తాన్ జనాభాలో 50శాతానికి పైగా ఓబీసీలు ఉన్నారని అంచనాలుంటే ప్రస్తుతం వారికున్న రిజర్వేషన్లు 21% ఉన్నాయి. రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా వ్యవస్థలో 64% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 12%, ఓబీసీలకు 21%, మోస్ట్ బాక్వార్డ్ క్లాసెస్ (ఎంబీసీ)లకు 5%, ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. జాట్లు, గుజ్జర్లు, రాజ్‌పుత్‌లు సహా 92 కులాలు ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. దీంతో తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో తీవ్రంగా ఉంది. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లో ఓబీసీ జనాభా 50% వరకు ఉంటుంది. కానీ ఆ జనాభాకు తగ్గట్టుగా పథకాలేవీ వారికి అందడం లేదు. రాష్ట్రంలో పార్టీల గెలుపోటములను శాసించే సత్తా వారికి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓబీసీ లో కిరార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయినప్పటికీ ఈ సారి బీజేపీ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. బీజేపీ ఎంపీలు, ప్రముఖ నేతలు ఎన్నికల బరిలో ఉండడంతో ఎన్నికల్లో పార్టీ గెలిచినా చౌహాన్‌ను మరోసారి సీఎంను చేస్తారన్న నమ్మకం కూడా కేడర్‌లో లేదు. బీజేపీ ఆయనను సీఎం ఫేస్‌గా ప్రకటించకపోవడం వల్ల పార్టీకే ఎదురు దెబ్బ తగులుతుందన్న ఆందోళన రాష్ట్ర బీజేపీలో ఉంది. కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతో కనీసం ఓబీసీ నాయకుడ్ని సీఎం అభ్యర్థిగా ముందుంచి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో ఆదివాసీలు 21%, ఎస్సీలు 15.6% ఉన్నారు. మరోవైపు కులగణన వల్ల కాంగ్రెస్‌కు ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేమని రాజకీయ విశ్లేషకుడు దినేష్ గుప్తా వ్యాఖ్యానించారు. బీజేపీ కులగణన హామీకి బదులుగా ఎక్కువ మంది ఓబీసీలకు టికెట్లు ఇస్తూ దానిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు సీఎం చౌహాన్ ఓబీసీలకు తొమ్మిది సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ గిరిజన రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఓబీసీ జనాభా అధికం. అధికారిక గణాంకాల ప్రకారం 43.5% మంది ఓబీసీలే ఉన్నారు. 2018లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేష్ బఘేల్ రాష్ట్ర మొట్టమొదటి ఓబీసీ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. ఓబీసీలకుండే రిజర్వేషన్లను 14 నుంచి 27శాతానికి పెంచుతూ బిల్లు తీసుకువచ్చారు. కానీ గవర్నర్ దానిని ఇంకా ఆమోదించలేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు వ్యతిరేకమన్న ప్రచారాన్ని కాంగ్రెస్ విస్తృతంగా చేస్తోంది. మళ్లీ అధికారంలోకొస్తే కులగణన చేపడతామన్న హామీ ఇచ్చి ఓబీసీల్లో పట్టు పెంచుకున్నారు. కాంగ్రెస్ ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓబీసీ నేత అరుణ్ సావోను నియమించింది. ఇప్పటివరకు 90 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే అందులో 29 మంది ఓబీసీ నాయకులే. కాంగ్రెస్ కులగణన అస్త్రం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు పని చేస్తుందో వేచి చూడాలి. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో కులం కార్డు అత్యంత కీలకంగా మారింది. కుల సంఘాలు నానాటికీ శక్తిమంతంగా మారుతున్నాయి. ఎన్నికల్ని శాసిస్తున్నాయి. టిక్కెట్ల కేటాయింపు దగ్గర్నుంచి ఎన్నికల తర్వాత పదవుల పందేరం వరకు కులాల లెక్కలపైనే జరుగుతున్నాయి. గెలిచిన వారికి సన్మానాలు, సత్కారాలు చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికలు కులగణన చుట్టూనే తిరుగుతాయి – నారాయణ్ బరేథ్, రాజకీయ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ -
Five states Assembly elections 2023: ఫైనల్‌కు ముందు..అగ్ని పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామానికి ముందు సెమీస్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు అధికార కాషాయ దళానికి, విపక్ష కాంగ్రెస్ పార్టీకి అగి్నపరీక్షగా మారాయి. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో తన అధికార పీఠాన్ని సుస్థిర పరుచుకోవాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీ రాష్ట్రాలను దక్కించుకునేలా బీజేపీ ఇప్పటికే కదనరంగంలోకి దిగింది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకుంటూనే మరో రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కాలుదువ్వుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ నమ్మకంగా ఉంటే.. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌ను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో రెండు పార్టీల పట్టు నిలుపుకునేందుకు, మిజోరంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పోరాడుతుండటంతో ఈ ఎన్నికలకు రసవత్తరంగా ఉండనున్నాయి. పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో... త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పెద్దదైన మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గానూ 2018 ఎన్నికల్లో 114 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జ్యోతిరాదిత్య సింధియా 2020లో సొంతపార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలతో కాషాయ కండువా కప్పుకోవడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది దీనిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న కాంగ్రెస్ అక్కడ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు చెమటోడ్చుతోంది. వరుసగా తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన కమల్‌నాథ్ ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను బలంగా వాడుతున్నారు. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు, లోక్‌సభ ఎంపీలను అసెంబ్లీ బరిలో నిలిపింది. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న డిసెంబర్ 2018 నుంచి మార్చి 2020 మినహా దాదాపు రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్తాన్ కీలకం రాజస్తాన్‌లో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి ఎన్నికకాని చరిత్ర ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ప్రత్యర్థి పార్టీకి అవకాశం కలి్పస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతుల ఓట్లే కీలకంగా ఉండటంతో వాటిపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. అదే సమయంలో, కాంగ్రెస్‌కు చెందిన సీఎం గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య విరోధం నివురు గప్పిన నిప్పులా ఉంది. రాజస్తాన్‌లో కాషాయ జెండా రెపరెపలాడాలని చూస్తున్న బీజేపీ అక్కడ ‘ఆప్నో రాజస్తాన్’పేరిట ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ నాలుగుసార్లు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరుమార్లు పర్యటించారు. ఛత్తీస్‌గఢ్ ఎవరిదో? పదిహేనేళ్ల పాలన తర్వాత 2018లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ఎలాగైనా ఛత్తీస్‌గఢ్‌ను తిరిగి నిలబెట్టుకునే కృతనిశ్చయంతో ఉండగా ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 90 స్థానాలున్న రాష్ట్రంలో 68 సీట్లతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఉన్న ఇమేజ్‌కు తోడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమను తిరిగి అధికారంలోకి తేవొ చ్చని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తోంది. రాష్ట్రంలోని కీలక రంగాల్లో జరిగిన అవినీతి తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మూడుసార్లు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఇటీవలి ఇండియా టుడే–సీవోటర్ ఒపీనియన్ పోల్‌లో 90 సీట్లలో 46 శాతం ఓట్లతో 51 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న అంచనాలు బీజేపీకి మింగుడుపడటం లేదు. తెలంగాణలో త్రిముఖం.. తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్, తెలంగాణ తెచి్చన బీఆర్ఎస్ల మధ్య ప్రధాని పోటీ ఉందనుకుంటున్న 119 సీట్లున్న తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీ సైతం పోటీలోకి వచి్చంది. త్రిముఖ పోటీ ఉండే అవకాశాలతో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్ముతుంటే, అతిపెద్ద పార్టీగా తామే అవతరిస్తామన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు, పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌లతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎన్నికల బరిలో నిలపనుంది. గడిచిన 15 రోజుల్లోనే రెండుసార్లు తెలంగాణలో మోదీ పర్యటించారు. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందిన మాదిరే ఇక్కడా 6 గ్యారెంటీ కార్డు హామీలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. మిజోరంలో స్థానిక పార్టీలదే హవా క్రైస్తవులు మెజారిటీగా ఉన్న మిజోరంలో స్థానిక పార్టీలైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) పార్టీలదే హవా నడుస్తోంది. 40 స్థానాలున్న మిజోరంలో ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం 28 సీట్లతో అధికారంలో ఉండగా, జెడ్పీఎం 9 సీట్లు, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక్క సీటు సాధించుకున్నాయి. రెండు పర్యాయాలకు ఒకమారు అధికారం మారే మిజోరంలో ఈ ఏడాది ఎంఎన్ఎఫ్దే విజయమని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ శరణార్థులే ప్రధాన అంశంగా ప్రస్తుత ఎన్నికలు జరుగనున్నాయి. Follow the Sakshi Telugu News channel on WhatsApp -
9న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఈ నెల 9న ఢిల్లీలో భేటీ కానుంది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు కులగణన, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో చిక్కులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణ సహా మధ్యప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అధికారం కాపాడుకోవడం లక్ష్యంగా సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. -
ఓ వైపు గాంధీ.. మరోవైపు గాడ్సే: రాహుల్ గాంధీ
భోపాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే యుద్ధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఒక వైపు మహాత్మాగాంధీ, మరోవైపు ఆయనని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే మధ్య ఎన్నికల పోరు జరగనుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఓబీసీల సంఖ్య తెలుసుకోవడానికి కులగణన చేపడతామని చెప్పారు. ఈ డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌లో జన ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ గాంధీ శనివారం పాల్గొన్నారు. ‘‘ఈ సారి ఎన్నికల పోరు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్, ఒక వైపు మహాత్మాగాంధీ మరోవైపు గాడ్సేలు నిలిచి పోరాడతారు. ప్రేమ, సోదరభావం ద్వేషానికి మధ్య ఈ పోరాటం ఉంటుంది’’ అని రాహుల్ చెప్పారు. బీజేపీ ప్రజలకి ఏం ఇస్తే వారు అదే తిరిగి ఇస్తారని, ఇన్నాళ్లూ బీజేపీ వారిలో విద్వేషం నింపిందని, ఇప్పుడు ప్రజలే బీజేపీని ద్వేషిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ దేశంలో ఆరెస్సెస్‌కు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులే చట్టాలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, బీజేపీ ప్రజాప్రతినిధులకి ఎలాంటి పాత్ర లేదని అన్నారు. ఆరెస్సెస్ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆడుతోందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కేంద్రంగా ఎంపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనాభా గణన చేపడతామని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) సంఖ్యను తెలుసుకోవడానికే కుల గణన చేపడతామన్నారు. అవినీతికి మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ హయాంలో గత 18 ఏళ్లలో 18 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ చెప్పారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 10 సూత్రాల అమలు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగంగా పూర్తిచేస్తోంది. షెడ్యూల్ వెలువరించకముందే.. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోనూ త్వరలోనే పోల్ ప్రిపేరేషన్‌పై రివ్యూ మీటింగ్ పెట్టనుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. సమర్ధ ఎన్నికల నిర్వహణకు పది సూత్రాలను అమలు చేయనుంది. ఈసీ టెన్–కమాండ్‌మెంట్స్‌తో ఉల్లంఘనలకు చెక్‌పెట్టి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు వీలుకలగనుంది. (నాగిళ్ల వెంకటేష్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్–సాక్షిటీవీ, న్యూఢిల్లీ అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్) 1.ఓటర్ల తొలగింపు అంశం ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫోకస్పెట్టింది. కేవలం ఫాం–7 రిసీవ్ అయిన తర్వాతే ఓటు తొలగింపు ఉండాలని స్పష్టం చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్ తనిఖీ లేకుండా సుమొటాగా ఓటు తొలగించవద్దని పేర్కొంది. ఓటరు చనిపోతే, డెత్ సర్టిఫికెట్ అందిన తర్వాతే ఆ ఓటును డిలీట్ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది. అలాగే మొత్తం తొలగించిన ఓట్లలో పదిశాతం ఓట్లను ర్యాండమ్‌గా సిస్టం ద్వారా ఎంపిక చేసి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో తొలగించిన ఓట్లు రెండుశాతానికి మించితే వాటిని ఈఆర్ఓ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. ఓటరు చనిపోయిన సందర్భాల్లో మినహా ఇతర కారణాలుంటే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేసిన తర్వాతే ఓటు తొలగింపు ఆదేశాలు ఇవ్వాలి. 2. ఎన్నికల ఖర్చుపై 20శాఖల నిఘా ఎన్నికల సమయంలో పెరిగిపోతున్న ఖర్చుపై నిఘా పెట్టేందుకు ఎన్నడూ లేనంతగా ఈసారి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో స్పెషల్ కోఆర్డినేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కో–ఆర్డినేషన్‌లో ఈడీ, ఐటి, రెవెన్యూ ఇంటలిజెన్స్, జిఎస్టీ, పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్, సిఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్, పోస్టల్, ఆర్బిఐ, ఎస్ఎల్బిసి, ఎన్‌సిబి, రైల్వే, ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ పనిచేయనున్నాయి. ఈ శాఖలన్నీ ఎవరికి వారు ఒంటరిగా పనిచేయకుండా, సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల, పార్టీల ఖర్చుపై నిఘా పెడతారు. సరిహద్దుల గుండా వెళ్లే మద్యం, నగదు, ఉచితాలు, డ్రగ్స్ తదితర అంశాలపై మరింత ఫోకస్ ఉంటుంది. వీటితో పాటు రాష్ట్రంలోని ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లపై కన్నేసి ఉంచుతారు. లిక్కర్ కింగ్‌పిన్స్, లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లపై తీవ్రమైన చర్యలు ఉండనున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు లోనుచేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారు. 3. సీ విజిల్‌తో 50 నిమిషాల్లోనే యాక్షన్.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం సీ–విజిల్ యాప్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది. ఎవరైనా పౌరుడు ఎన్నికల కోడ్‌ఉల్లంఘనపై సీ–విజిల్ యాప్‌లో ఫోటో, వీడియో, ఇతర సమాచారం అప్లోడ్ చేయాలి. ఆ వెంటనే ఆ సమాచారం డిస్ట్రిక్ కంట్రోలర్‌కు చేరుతుంది. చేరిన అయిదు నిమిషాల్లోనే ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం ఫ్లయింగ్ స్కాడ్‌కు అప్పగిస్తారు. 15 నిమిషాల వ్యవధిలో ఎలక్షన్కోడ్ ఉల్లంఘన జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేస్తారు. మరొక 30 నిమిషాల్లోనే ఫిర్యాదుదారుకు తాము తీసుకున్న చర్యల సమాచారాన్ని పంపిస్తారు. అంటే ఫిర్యాదు చేసిన 50 నుంచి 100 నిమిషాల్లోనే వాటిపై యాక్షన్ తీసుకునేలా సి–విజిల్ తయారు చేశారు. 4. ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటరు సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేయవచ్చు. ఓటరు లిస్ట్‌లో పేరు తనిఖీ చేసుకోవచ్చు. పోలింగ్ బూత్ వివరాలు, బిఎల్ఓ, ఈఆర్ఓ డిటెయిల్స్, ఎన్నికల ఫలితాలు, ఈవిఎంల సమాచారం, ఓటరు కార్డు డౌన్లోడింగ్ తదితర సేవలన్నీ ఈ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. 5. సువిధ పోర్టల్.. నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు కోసం అభ్యర్థులు సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతుల కోసం ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. 6. సక్షం యాప్.. వికలాంగులు, వలస ఓటర్లు, తప్పుల సవరణల కోసం వికలాంగులు, వలస ఓటర్ల కోసం ఈసీ సక్షం యాప్‌ను తయారుచేసింది. ఓటరు జాబితాలో కరెక్షన్ల కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఓటింగ్ సమయంలో వీల్‌చైర్ అవసరమైతే రిక్వెస్ట్ ను ఈ యాప్ ద్వారా పంపాలి. 7. కెవైసీ యాప్ పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోవడానికి కెవైసి యాప్ ను రూపొందించారు. ఇందులో అభ్యర్థుల నేర చరిత్ర సహా ఇతర వివరాలను ఉంచుతారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్సైట్లో, సోషల్ మీడియాలో పెట్టాలి. 8. యూత్ ఓటింగ్ పెరిగేలా.. యువత ఓటింగ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులకు ఓటింగ్‌కు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చివరి మైలులో ఉన్న గ్రామాలలో సైతం సజావుగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా చర్యలుండాలి. 9.సరిహద్దులో చెక్పాయింట్లు ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. పొలీస్, ఎకైజ్, ట్రాన్స్పోర్ట్, స్టేట్ ఫారెస్ట్ డిపార్టు మెంట్ల ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్టులలో నిఘా ఉంటుంది. 10. ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో నమోదు, తొలగింపులను జిల్లా ఎన్నికల అధికారులు తప్పనిసరిగా చెక్చేయాలి. రాజకీయ పార్టీల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి. పోలింగ్ పనులకు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించొద్దు. పార్టీ క్యాంపెయిన్ మెటీరియల్ వాహనాల సంఖ్య ఒకటి నుంచి నాలుగుకు పెంపు. ఫేక్ న్యూస్ నియంత్రణకు ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు. -
Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక
ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. మధ్యప్రదేశ్‌లో 39 మందితో, ఛత్తీస్‌గఢ్‌లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్ భగేల్‌ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్ భగేల్‌ను ఓడించిన ఘనత విజయ్‌కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు. ఆదివాసీ ప్రాంతాలే గురి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్టీ రిజర్వ్ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది. అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 40% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్‌లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది. ముందస్తు జాబితాతో మేలే బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాంచజన్యం పూరించనున్న ఖర్గే
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్స్ లాంటివి. ఈ తరుణంలో అధికార-విపక్షాలు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో.. ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా’ కాంగ్రెస్ ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అవి ముగిసిన వెంటనే ఆయన రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్నికల రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షించడమే కాకుండా.. ర్యాలీల్లో ఆయన ప్రసంగించనున్నట్లు ఏఐసీసీ శ్రేణులు చెబుతున్నాయి. ఆగష్టు 13వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌తో ఆయన ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 18వ తేదీన తెలంగాణలో, ఆగష్టు 22వ తేదీన మధ్యప్రదేశ్ భోపాల్, ఆగష్టు 23వ తేదీన జైపూర్‌లో ఆయన పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఖర్గే వరుసగా భేటీ అవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశాలకు రాహుల్ గాంధీతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం హాజరవుతున్నారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల్ని వదలొద్దూ! -
Parliament Monsoon Session: నేటి నుంచే సభా సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చలు, సంవాదాలకు రంగం సిద్ధమయ్యింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ఆరంభం కానున్నాయి. ఇరుపక్షాలు అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మణిపూర్‌లో జాతుల మధ్య రగులుతున్న హింస, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై సభలో గట్టిగా నిలదీసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కూటమి సిద్ధమవుతోంది. తిప్పికొట్టేందుకు అధికార పక్షం ప్రతివ్యూహాలు పన్నుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజుల పాటు పార్లమెంట్ భేటీ కానుంది. పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం.. వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో నూతన భవనానికి మారుతాయి. ఈసారి మొత్తం 21 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానమైంది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లు. యూసీసీ, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై రగడ తప్పదా? మణిపూర్‌లో హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. యూసీసీ బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ సహా ఇతర విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే అన్ని స్థాయిల్లో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఢిల్లీ విషయంలో కేంద్ర ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన బీఆర్ఎస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల మద్దతు కూడగట్టారు. జోషి ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. జోషి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కీలకపార్టీల నేతలు పాల్గొన్నారు. 32 అంశాలు పార్లమెంట్లో ప్రస్తావనకు రానున్నట్లు జోషి చెప్పారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని కేంద్ర ప్రభుత్వం నిజంగా కోరుకుంటే, సభలో ప్రతిపక్షాలు లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరి అన్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని వ్యాఖ్యానించారు. మా డిమాండ్‌కు వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ మద్దతు: బీజేడీ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ శశి్మత్ పాత్రా కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ డిమాండ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. -
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు..
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు చేసే వ్యయం ఏడాదికేడాది తడిసిమోపెడవుతోంది. ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) బీజేపీ రూ.344.27 కోట్లు ఖర్చు చేసింది.2017లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చేసిన ఖర్చు కంటే ఇది 58% ఎక్కువ. అప్పట్లో బీజేపీ చేసిన ఖర్చు రూ.218.26 కోట్లుగా ఉంది. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన నివేదికల ప్రకారం కాంగ్రెస్ చేసిన వ్యయం ఏకంగా 80 శాతం పెరిగింది. 2017లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి 108.14 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది రూ.194.80 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక బీజేపీ యూపీలో అత్యధికంగా రూ.221.32 కోట్లు ఖర్చు పెట్టగా, పంజాబ్, గోవాలలో ఖర్చు భారీగా పెరిగింది. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల వారీగా ఎంత ఖర్చు చేసిందో వెల్లడించలేదు. -
జాతీయ కాంగ్రెస్ ఏం కానుంది?
నూట ముప్ఫయి ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ త్వరలో కనుమరుగు కాను న్నదా? సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో హస్తంలోని అదృష్ట రేఖలు క్రమక్రమంగా చెరిగిపోతు న్నాయా? అసమ్మతివాదులు నాయకత్వంపై తిరుగుబాటు చేయనున్నారా? అసలు జాతీయ కాంగ్రెస్‌కు భవిష్యత్తు అనేది ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానులనూ, రాజకీయ పరిశీలకులనూ ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నలు ఇవే! ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పారిశ్రా మికంగా, వ్యవసాయకంగా దేశాన్ని పంచవర్ష ప్రణాళికల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. ఇందిరా గాంధీ చేపట్టిన అనేక విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమ పథకాలతో పేదవారు తమ జీవన ప్రమాణా లను పెంచుకున్నారు. కోట్లాదిమంది పేదల హృద యాల్లో ఇందిరమ్మ తిష్ట వేశారు. ఆ తరువాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ టెలికాం రంగంలో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి ప్రధానులైన పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్సింగ్ తమదైన సంస్కరణలతో ప్రగతి పథంలో పరుగులెత్తించారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యానికి గురైనా, భారత్ మాత్రం సగర్వంగా తలెత్తుకుని నిలబడేట్లు చేశారు. 2004 నుండి పదేళ్ళపాటు తిరుగులేని అధికారం చలాయించిన యూపీఏ 2014 లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పో యింది. ఉత్తరప్రదేశ్‌లో 403 సీట్లకుగాను కేవలం రెండు మాత్రమే గెల్చుకుంది. ఉత్తరాఖండ్, మణి పూర్, గోవాలలో ఉనికి కోల్పోయింది. ఈ ఘోర పరాజయానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘జీవిత మంతా కాంగ్రెస్ పార్టీకి ధారపోశాను. చివరకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది’ అంటూ గులాం నబీ ఆజాద్ వాపోయారు. మరి ఇంతటి పరాజయానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? యువకుడైన రాహుల్ గాంధీ పదిహేనేళ్లుగా ఎంపీగా ఉంటున్నా, వారసత్వ బలం ఉన్నా, రాజకీయంగా రాణించలేక పోతున్నారు. సోనియా వృద్ధాప్య బాధల్లో ఉన్నారు. ప్రియాంకా గాంధీకి ఆకర్షణ శక్తి లేదని తేలిపోయింది. మోదీతో దీటుగా వ్యూహాలు రచించగల శక్తి వీరిలో ఎవ్వరికీ లేదని తేలిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో దేశం అల్లకల్లోలం అయింది. జీఎస్టీతో వ్యాపార రంగం మొత్తం కుదేలైంది. సాగునీటి చట్టాలు... రైతుల సమస్యలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కార్ తెగనమ్మేస్తున్నది. ఇలాంటి ఎన్నో సమస్యలు, దురంతాలు చూస్తుంటే సామాన్యులకు కడుపు రగిలిపోతుంది కానీ రాహుల్ మాత్రం ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. బీజేపీ దుర్మార్గ నిర్ణయాలను కడిగేద్దామనే ఆవేశం లేదు. ఆలోచన లేదు. సీనియర్ నాయకుల సలహా లను తీసుకుంటున్నారో లేదో తెలియదు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాగానే తనకంటూ ఐదారుగురు మేధావులతో ఒక మంచి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాని కాగానే వారికీ మంత్రి పదవులు, సలహాదారుల పదవులు ఇచ్చి వారి సలహాలను, అనుభవాన్ని వాడుకున్నారు. అలాంటివారు ఒక్కరైనా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉన్నారా? పదమూడు దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి కలగడం బాధాకరం. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే బలమైన నాయకత్వం అవసరం. గాంధీ నెహ్రూల చెర విడి పించుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనిపి స్తోంది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నాయ కత్వ మార్పు లేదనే అనిపిస్తోంది -ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
నవ సంక్షేమంపై ఆశలు రేపిన విజయం
దేశం యావత్తూ మౌలిక పరివర్తన వైపు నడవాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. భారతదేశం చారిత్రకంగానే నిరక్షరాస్యత, కుల వివక్షతో కూడినది కాబట్టి గ్రామీణ విద్యలో సంస్కరణలు కీలకమైనవి. ఢిల్లీ తర్వాత పంజాబ్ వంటి రాష్ట్రంలో పూర్తిగా కొత్త ముఖాలతో ‘ఆప్’ సాధించిన విజయం భారతీయ సంక్షేమ ప్రజాస్వామ్యానికి సరికొత్త దిశను తీసుకొచ్చింది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ సంపూర్ణ ఇంగ్లిష్ మీడియం అమలును ప్రారంభించారు. ఏపీలో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ఢిల్లీలో లాగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడం ‘ఆప్’ ప్రభుత్వం పంజాబ్‌లో కూడా చేస్తే ఆ రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. అయిదు రాష్ట్రాల్లో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడం, 2. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం. పంజాబ్ వంటి రాష్ట్రంలో పూర్తిగా కొత్త ముఖాలతో ఆప్ సాధించిన విజయం భారతీయ సంక్షేమ ప్రజాస్వామ్యానికి సరికొత్త దిశను తీసుకొచ్చింది. స్వాతంత్య్రానంతర పంజాబ్‌లో అటు కాంగ్రెస్, ఇటు శిరోమణి అకాలీదళ్ మాత్రమే పాలిస్తూ వచ్చిన పంజాబ్‌లో ఇది సరికొత్త పరిణామమే మరి! ఇందిరాగాంధీ హత్య, తదనంతరం సిక్కులపై దాడుల తర్వాత కూడా పంజాబ్ ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పెద్దగా నష్టపోకుండా తన పట్టును నిలబెట్టుకుంటూ వచ్చింది. మరోవైపున మత ప్రాతిపదికను ఉపయోగిస్తున్నప్పటికీ, మతతత్వాన్ని ప్రేరేపించకుండా మనుగడ సాధిస్తూ వచ్చిన సిక్కు మితవాద పార్టీ అకాలీ దళ్ పంజాబ్‌లో అధికారం కైవసం చేసుకుంటూ వస్తోంది. అయితే పంజాబ్‌లో ప్రపంచీకరణ అనంతర సంక్షేమ చర్యలను ఈ రెండు పార్టీలూ ప్రారంభించలేకపోయాయి. సాంప్రదాయికమైన భూస్వామ్య ప్రభువుల నియంత్రణలోనే ఈ రెండు పార్టీలూ కొనసాగుతూ వచ్చాయి. సంస్కరణలు కీలకం... పూర్తిగా కొత్త ముఖాలతో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి, పేదల అనుకూల సంక్షేమ పథకాలను అది చేపట్టింది. ఆప్ చేపట్టిన సంస్కరణల్లో నాలుగు అతి కీలకమైనవి. పాఠశాల విద్యా సంస్కరణ; ఆసుపత్రుల సంస్కరణ, ఆరోగ్య సేవల విస్తరణ; ఢిల్లీ మురికివాడలకు చక్కగా విద్యుత్ సరఫరా (ముంబై, కోల్‌కతా తర్వాత మురికివాడలు ఎక్కువగా ఉన్న నగరం ఢిల్లీ); ఢిల్లీ నగరవాసులందరికీ సమృద్ధిగా నీటి సౌకర్యం కల్పించడం. ఆప్ ఇతర సంస్కరణలను కూడా మొదలెట్టినప్పటికీ ఈ నాలుగు సంస్కరణలూ కీలకమైనవని నా అభిప్రాయం. గత అయిదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్, బీజేపీ రాజకీయ, భావజాలపరమైన ప్రయోగాల నడుమనే జీవిస్తూ వచ్చిన మనకు, ఈ రెండు పార్టీలూ విద్యా, ఆరోగ్య సంస్కరణలను నత్తనడకతో మొదలెట్టాయని తెలుసు. ఈ రెండు పార్టీలూ ప్రజల డిమాండ్ మేరకు కొన్ని సంస్కరణలను తీసుకురాగా, మరికొన్నింటిని ఎన్నికల పోటీలో భాగంగా తీసుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రధానంగా అమలవుతూ వచ్చిన ఈ సంస్కరణ పథకాలు దేశంలో ప్రాంతీయ పార్టీల హవా మొదలైన తర్వాత మాత్రమే వేగం పుంజుకున్నాయి. ఉత్తర భారతదేశంలో 1960లలోనే చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో ప్రాంతీయ పార్టీలు ఉనికిలోకి వచ్చినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో సోషలిజం సిద్ధాంత భూమికగా కలిగివున్న సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ వెలుగులోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. అయితే ఈ రెండు పార్టీలూ సంక్షేమ హామీల కంటే దిగువ కులాల ఆత్మగౌరవ సాధనే ప్రధానంగా పనిచేసేవి. పీడిత కులాల ఆత్మగౌరవ నినాదం సైతం ఈ రెండు పార్టీలకు ఎలెక్టోరల్ భూమికను సృష్టించాయి. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన విద్యా, ఆరోగ్య సంస్కరణలను ఇవి కూడా ప్రారంభించలేకపోయాయి. తర్వాత వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సైతం ఎలాంటి ప్రాథమిక సంస్కరణలనూ మొదలెట్టలేకపోయింది. ఈ పార్టీ కూడా దళితుల ఆత్మగౌరవ నినాదాన్నీ, చారిత్రక ప్రతీకలనూ ప్రోత్సహిస్తూ రావడం ద్వారానే మనగలుగుతూ వచ్చింది. నాణ్యమైన విద్య మౌలిక అవసరం భారతీయ గ్రామీణ ప్రజారాశులకు కావలసింది– పల్లెల్లో, పట్టణాల్లో ఉంటున్న పాఠశాలల్లో బాల్యం నుంచే చక్కటి విద్య అందుబాటులోకి రావడమే! తమ గ్రామ పరిధిలోనే 1 నుంచి 12వ తరగతి వరకు బాలబాలికలందరూ నాణ్యమైన విద్యను పొందగల గాలి. దేశం యావత్తూ మౌలిక పరివర్తన వైపు నడవాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి అవసరం. భారతదేశం చారిత్రకంగానే నిరక్షరాస్యత, కులపరమైన వివక్షతో కూడిన దేశం కాబట్టి ప్రధానంగా విద్యలో, గ్రామీణ విద్యలో సంస్కరణలు కీలకమైనవి. భారతీయ ప్రజాస్వామ్యం ఎదుగుతున్నందున... భాషా సమానత్వం, మౌలిక వసతుల కల్పన నిత్యం జరగడం వంటివి పాలకవర్గాల ప్రాథమ్యంగా ఉండాలి. కానీ దీర్ఘకాలంగా ఉనికిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ గానీ మొదటి నుంచీ ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియం, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా విద్యను ఆయా రాష్ట్రాల్లో అమలు పరుస్తూ వచ్చాయి. ప్రైవేట్ రంగం వ్యూహాత్మకంగా కులీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అనుమతిస్తుండగా, గ్రామీణ పిల్లలు అత్యంత పేలవమైన వాతావరణంలో ప్రాంతీయ భాషా విద్యకు పరిమితం అయిపోతూ వచ్చారు. కమ్యూనిస్టు విద్యావిధానంలో గానీ, ఉదారవాద విద్యా విధానంలో గానీ పేదలకు తమ ప్రాంతీయ భాషా పరిధిలోనే నాణ్యమైన విద్యను అందించడం గురించి గొప్పగా చెబుతూవచ్చాయి. అయితే నాణ్యమైన విద్యను ఉమ్మడి మీడియంతో కలిపి మనదేశంలో ఎన్నడూ చూడలేదు. దేశంలోని పిల్లలందరికీ నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య గురించి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితిని ఏ పార్టీ కానీ మేధావి వర్గం కానీ అధిగమించలేకపోయాయి. 1956లో భాషా ప్రాతిపదికన తెలుగు భాషా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా ప్రాంతాలకు సంబంధించిన మనోభావాలు పెరుగుతూ వచ్చాయి. 1960లు, 70లలో దేశంలో పలు భాషా ప్రాతిపదిక ఉద్యమాలు చెలరేగాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్ విద్యలో రాష్ట్ర భాషపై దృష్టి పెట్టాయి. కానీ ఇంగ్లిష్, ప్రాంతీయ భాషను సమతౌల్యం చేయడంపై ఇవి ఎలాంటి దృష్టీ పెట్టలేదు. ఇక పాఠశాల మౌలిక వ్యవస్థకు ఇవి ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వలేదు. నమూనా అధ్యయనం చేయాలి 2019లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ మిగతా సబ్జెక్టుల్లో సంపూర్ణ ఇంగ్లిష్ మీడియం అమలును ప్రారంభించారు. అలాగే పాఠశాల మౌలిక అవసరాల కల్పనకు ఆయన కీలక ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టారు. పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లి ఖాతాకు 15 వేల రూపాయలను ‘అమ్మ ఒడి’ పేరుతో ఇస్తూ వచ్చారు. తెలం గాణలో కూడా ఇదే విద్యా నమూనాను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. పంజాబ్ ప్రభుత్వం కూడా ఏపీ నమూనాను అధ్యయనం చేసి అమలు చేస్తుందని ఆశిద్దాం. కోవిడ్–19 సంక్షోభ సమయంలో ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఆసుపత్రుల మెరుగుదల, క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకుని ఆరోగ్య సమస్యను పరిష్కరించింది. అలాగే ఢిల్లీలో నీరు, విద్యుత్ సరఫరా గణనీయంగా మెరుగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయనప్పటికీ ఆప్ ప్రభుత్వం ఇన్ని మార్పులు తీసుకురాగలిగింది. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం విద్యా, ఆరోగ్య సంస్కరణల ఎజెండాను తీసుకున్నట్లయితే, దేశవ్యాప్తంగా అది గొప్ప ప్రభావం కలిగిస్తుంది. పంజాబ్ లాంటి రాష్ట్రంలో చాలామంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వలస వెళ్లడం తెలిసిందే. ఏపీలో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ఢిల్లీలో లాగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ఆప్ ప్రభుత్వం పంజాబ్‌లో కూడా తీసుకొస్తే ఆ రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కాంగ్రెస్‌ను చీల్చొద్దు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమి ఫలితాలపై కాంగ్రెస్‌లో ముఖ్యంగా గాంధీ కుటుంబ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక గాంధీ కుటంబ నాయకత్వం పక్కకు తప్పుకోవాల్సిందేనని జీ23 గ్రూపు నేతలు పెద్ద ఎత్తును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటమికి.. గాంధీ కుటుంబ నాయకత్వం మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదని అన్నారు. పరాజయం బాధ్యత నుంచి ఎవరు పారిపోవడం లేదని.. ఓటమికి తాము బాధ్యత వహిస్తున్నామని గాంధీ కుటుంబం ప్రకటించిందని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓటమికి తానూ బాధ్యత వహిస్తున్నానని చిదంబరం తెలిపారు. అదే విధంగా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కూడా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు బాధ్యత వహిస్తున్నారని చెప్పారు. జీ 23 గ్రూప్ నేతలు తమ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేయవద్దని చిదంబరం విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉందని, అప్పటివరకు సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై గాంధీ కుటుంటాన్ని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ఎవరూ బాధ్యత నుంచి పారిపోరు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర AICC(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) స్థాయిలో నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ బాధ్యత ఉంది. ఎన్నికల ఓటమికి కేవలం ఏఐసీసీ నాయకత్వానిదే బాధ్యత అనడం సరికాదు’ అని చిదంబరం అన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని జీ23 గ్రూపు నేతల్లో ఒకరైన సీనియర్ నేత కపిల్ డిమాండ్ చేస్తున్నారు. -
రాజకీయాల్లో వారికి నా వల్లే టికెట్ రాలేదు.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అభిప్రాయపడ్డారు. వాటిపై పోరాడాల్సిందేనని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. అందుకే ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీల వారసులెవరికీ టికెట్లివ్వలేదని వెల్లడించారు. ‘‘అది నా వ్యక్తిగత నిర్ణయం. నా వల్లే వారి వారసులకు టికెట్లు రాలేదని ఎంపీలకు నేరుగా నేనే చెప్పాను. వారసత్వ రాజకీయాలపై పోరాడాలంటే దాన్ని ముందుగా మన పార్టీ నుంచే మొదలు పెట్టాలి. దీన్ని అర్థం చేసుకుని ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసినందుకు ఎంపీలకు నా కృతజ్ఞతలు’’ అని మోదీ చెప్పినట్టు సమాచారం. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చిన కనీసం 100 పోలింగ్ బూత్‌లను గుర్తించి అందుకు కారణాలు వెలికి తీయాలని ఎంపీలను ఆయన ఆదేశించినట్టు చెబుతున్నారు. తాజా చిత్రం ద కశ్మీర్ ఫైల్స్‌ను మోదీ అభినందించారని, ఇలాంటి సినిమాలు తరచూ రావాలని సూచించారని తెలిసింది. ఎన్నికల విజయంపై మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను నేతలు ఘనంగా సన్మానించారు. ఆపరేషన్ గంగపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. -
సోనియా గాంధీ కీలక నిర్ణయం.. పీసీసీ చీఫ్‌లకు షాక్!
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరిన్ని కఠిన నిర్ణయాలకు సమాయత్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆప్ అధికారంలోకి వచ్చింది. కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు.. అక్కడ ప్రతికూల ఫలితాలు రావడం హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పార్టీకి తీవ్ర నష్టం కల్గడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆ ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను ముంచేసి..రాజీనామానా? -
ఈ విజయం ప్రతిపక్షాలకు గుణపాఠం
మారుతున్న మనోభావాలకు ప్రతిస్పందించడం ద్వారా బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యామ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందించడం ద్వారా మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ప్రజా విశ్వాసాన్ని పొందలేవు. ఎన్నికలు సమీపిస్తుండగా కొద్ది నెలల పాటు ర్యాలీలను నిర్వహించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులూ పోటీపడేలా రాజకీయాలను మార్చేశాయి. సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే ప్రతిపక్షాలకు ప్రయోజనకరం. భారతదేశ రాజకీయ పరిదృశ్యాన్ని బీజేపీ ఎంతగా మార్చివేసిందనే అంశాన్ని ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు మరోసారి చర్చకు పెట్టాయి. ఎన్నికల ఫలితాలను ఇస్లామోఫోబియా అనే యధాలాప నిర్ధారణతో తేల్చి పడేయడం కంటే ఆ ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే అందరికీ ప్రయోజన కరం. ఇస్లామోఫోబియా అనే భావన అనేక వర్ణనలు, వ్యూహాలతో కలిసి ఉంటుందని మనం అర్థం చేసు కోవాలి. ఇలాంటివన్నీ ఏకకాలంలో ప్రభావం కలిగిస్తుంటాయి. బీజేపీ దీర్ఘకాలంగా మనగలుగుతుండటానికి కారణం– సామాజిక, సాంస్కృతిక అంశాలు, రాజకీయాలను కలగలపడమే. మెజారిటీ వాదాన్ని ఎత్తిపట్టడం, నిర్మొహమాటంగా ముస్లింల పట్ల మినహా యింపులు కలిగి ఉండటం కొనసాగిస్తున్నప్పటికీ, దేశంలో సాంస్కృ తిక అంశాల గురించి ఆలోచించే సమర్థత కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే అని ఒప్పుకోవాలి. సామాజిక రంగాన్ని చర్చించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏదన్నది ప్రతిపక్షాల ముందు ప్రశ్నగా నిలుస్తోంది. సంస్కృతి గురించిన చర్చను పక్కన పెట్టడం లేదా దానితో ఆటాడటం పైనే లౌకిక పార్టీలు సతమతమవుతున్నాయి. బీజేపీ మతతత్వ పార్టీనే కావచ్చు, కానీ సంస్కృతిపరమైన, మతపరమైన వ్యత్యాసాల విష యంలో ఏం చేయాలని తాను కోరుకుంటోందో దాన్ని చేయగల స్థానంలో ఆ పార్టీ ఉంది. తన సాంస్కృతిక ప్రతీకాత్మత ద్వారా ఒక లోతైన అర్థాన్ని ఆ పార్టీ ప్రతిపాదిస్తోంది. మతపరమైన ద్వేష భావా నికి బీజేపీ ప్రజల నుంచి ఆమోదం పొందగలగడంలో వారి ఉనికికి సంబంధించిన భావన పనిచేస్తోంది. ఇలాంటి సానుకూలత ప్రతిపక్షా నికి అసలు లేదు. ముజఫర్ నగర్ దాడుల విషయంలో సమాజ్ వాదీ పార్టీ మౌనం పాటించింది. కాంగ్రెస్ కూడా దీనికి భిన్నంగా లేదు. ప్రతిపక్షం ఇక్కడినుంచే ప్రారంభం కావలసి ఉంది. రాజకీయ ప్రయోజనాలను పొందడానికి సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రతిపక్షం చర్చకు పెట్టాలి. వివిధ సామాజిక బృందాలను అవి ఏకం చేయాలి. క్రాస్ కల్చరల్ చర్చలను నిర్వహించి, ఉద్రిక్తతలను తగ్గించాల్సి ఉంది. రెడీ మేడ్‌గా అందుబాటులో ఉండదు కాబట్టి ఒక కొత్త దార్శనికతను ప్రతిపక్షాలు నిర్మించాల్సి ఉంది. భారత్‌లో రాజ్యాంగపరమైన నీతి అనేది ఉనికిలో లేదు కాబట్టి, దాన్ని నిర్మించాల్సి ఉందని అంబేడ్కర్ ఏనాడో సూచించారు. సౌభ్రాతృత్వం అనేది రాజ్యాంగపరమైన సూత్రంగా ఉండదని ఆయన చెప్పారు. నిర్దిష్ట వాస్తవికత నుంచి చేయ వలసిన అలాంటి నిఖార్సయిన పరిశీలనలు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించడానికి ప్రారంభ బిందువుగా ఉంటాయి. హిందూ–ముస్లిం సంబంధాలు ఎలా ఉండాలి? రాబోయే దశా బ్దాల్లో కులాంతర సంబంధాలు ఎలా ఉండాలి? సామాజిక అంత రాలు, దురభిప్రాయాలను పట్టించుకోకుండా రాజకీయ పొత్తులతో అతుకులేసే రోజులు పోయాయి. ఇది బీజేపీ విజయంలోనే కాకుండా, మజ్లిస్, బీఎస్పీ పార్టీల పరాజయంలో కూడా స్పష్టంగా కనిపిస్తున్న ఆహ్వానించదగిన మార్పు. మతపరమైన వాక్చాతుర్యం రెడీమేడ్‌గా ఎవరికీ అందుబాటులో ఉండదు. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు దాన్ని నిర్మించాయి. కోవిడ్–19 మహమ్మారిని అదుపు చేయడంలో బీజేపీ ప్రదర్శిం చిన నిర్లక్ష్యాన్ని మనం తప్పుపట్టవచ్చు. కానీ అఖిలేశ్ యాదవ్ కూడా దీనికి భిన్నంగా లేరు మరి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పుడు అఖిలేశ్ కనిపించకపోవడం కూడా వ్యతిరేక భావనలను కలిగించింది. తాము విజయం సాధించడానికి ఇతరుల వైఫల్యాలను ఏకరువు పెట్టడం ఒక్కటే మార్గం కాదు. ఏం చేసినా తాము పడి ఉంటామనే భావనను ప్రజలు సవాలు చేస్తున్నారు. మారుతున్న మనోభావాలకు ప్రతిస్పం దించడం ద్వారా బీజేపీ ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యా మ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందిం చడం ద్వారా మాత్రమే ప్రజా విశ్వాసాన్ని పొందలేరు. పశ్చాత్తాపానికి చెందిన నిజమైన చర్యగా, నీళ్లు నిండిన కళ్లతో ప్రతిపక్షాలు జనం ముందుకు రావాలి. తాము పశ్చాత్తాపపడుతున్న ఉద్దేశాన్ని ప్రదర్శి స్తూనే వారు నేరుగా ప్రజలముందు స్పందించాలి. ప్రతిపక్షాలు ఇక్కడ పొందిన వైఫల్యమే పాలకపక్షం విజయంగా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తుండగా కొద్దినెలల పాటు ర్యాలీలను నిర్వ హించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులు పోటీపడేలా రాజకీయాల యాంటె న్నాను మార్చిపడేశాయి. ఫలితాలకు అతీతంగా నిజాయితీగా పని చేయడానికి ఇప్పుడు ఇదే కొలమానమైపోయింది. ప్రజల దృష్టిలో కష్టించి పనిచేసేవారికే విలువ ఉంటుంది. అనియత రంగంలో పని చేసేవారే మనదేశంలో ఎక్కువమంది కాబట్టి రాజకీయాల్లో విరామం లేకుండా పనిచేసేవారిని సులభంగా గుర్తిస్తారు. ఒక్క మమతా బెనర్జీ తప్ప ఉత్తరాదిన ప్రతిపక్షాల్లో ఏ ఒక్క నాయకుడూ ప్రజల దృష్టిలో ఇలాంటి ఇమేజ్‌కి దగ్గర కాలేకపోయారు. సామాన్య ప్రజలతో మమేకం కావడం గొప్ప సెంటిమెంటును కలిగిస్తుంది. ప్రజల రోజువారీ జీవితాలను స్పృశించకుండా, సంవత్సరంపాటు ప్రజలతో మమేకం కాకుండా ఉండివుంటే బీజేపీకి ఇంత చక్కటి విజయాలు లభ్య మయ్యేవి కాదు. కులమత ప్రాతిపదికనే బీజేపీ రాజకీయం చేస్తోందన్నది వాస్తవమే కావచ్చు గానీ కుల మతాలకు అతీతంగా బీజేపీ ఈ దఫా ఎన్నికల్లో స్వరం పెంచడం దానిపట్ల సానుకూలతను పెంచింది. అయితే కులనిర్మూలన వంటి గంభీర పదాల జోలికి వెళ్ళకుండా ఆధిపత్య రాజకీయాల నుంచి బయటపడాలని చెబుతూ వచ్చింది. ఒక పార్టీకి, వ్యక్తికి మేలు చేసే తరహా కుల రాజకీయాలు తాను చేయ లేనని బీజేపీ గట్టిగా చెప్పింది. చరణ్‌జీత్ సింగ్ చన్నీ, మాయావతి, అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు ఈ ఎన్నికల్లో ఎందుకు వెనుక బడ్డారంటే తమది ఫలానా కులమనీ, మతమనీ ముద్ర వేయించు కుంటే నడిచే రాజకీయాలకు ఇప్పుడు కాలం కాదు. సామాజిక న్యాయం కుల ప్రాతినిధ్యంతో ఇక సిద్ధించదు. అలా ఎవరైనా చెబితే జనం నమ్మే పరిస్థితి పోయింది. మన సమాజం అంతరాలతో కూడిన అసమానతల సమాజం అని డాక్టర్ అంబేడ్కర్ మనకు మళ్లీ గుర్తు చేస్తున్నారు. వీళ్ల కోసం పనిచేయడమే, వీరికి మేలు చేకూర్చడమే నిజమైన మార్పునకు దారితీస్తుంది. తాజా అసెంబ్లీ ఎన్నికలను ఆర్థిక కష్టాలపై సంస్కృతి విజ యంగా భావించలేం. దానికి బదులుగా ఆర్థిక అవసరాలు సాంస్కృ తిక సులోచనాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సాంస్కృతిక విలువల పునాదిపైనే తన ఆర్థిక కార్యక్రమాలను తీసుకొచ్చింది. బీజేపీ ఉజ్వల పేరుతో పథకం ప్రకటించిందిగానీ సిలిండర్‌ని రీఫిల్ చేసుకోవాల్సిన బాధ్యతను లబ్ధిదారులపైనే పెట్టింది. విమర్శనాత్మక చింతనాపరుడు రేమాండ్స్ విలియమ్స్ ఒక విష యాన్ని స్పష్టంగా చెప్పారు. సమాజంలో నిజమైన మార్పును తీసు కొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇన్నాళ్లుగా మన ప్రతిపక్షాలు చేస్తూ వచ్చింది– నిరాశాజీవులకు నచ్చచెబుతూ రావడమే! ఊరకే బాధల గురించి ట్వీట్ చేయడం, నరేంద్ర మోదీ తప్పుల గురించి ఊదరగొట్టడం అనేవి ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించిపెట్టవు. మెజారిటీ ప్రజల్లోని నిరాశకు మార్గాన్ని చూపిస్తూనే, జాతీయ భంగిమను ప్రదర్శించడం ద్వారా మోదీ ఏకకాలంలో అటు పాలకుడిగానూ, ఇటు ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. అదే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి అసలు కారణం! అజయ్ గుడవర్తి వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, జేఎన్‌యూ, ఢిల్లీ (‘ద వైర్’ సౌజన్యంతో) -
లోక్ సభలో ‘మోదీ.. మోదీ..’
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలోకి అడుగుపెట్టగానే బీజేపీ ఎంపీలంతా పెద్దఎత్తున మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన బడ్జెట్ సమావేశాలు కావడంతో ప్రధాని లోక్‌సభలోకి అడుగుపెట్టగానే సభ్యులంతా ఒక్కసారిగా నిలబడి ‘మోదీ’ నినాదాలతో సభను మారుమోగించారు. సభ్యులకు నమస్కరించిన మోదీ తన స్థానంలో కూర్చున్నారు. సోమవారం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను వీక్షించడానికి వచ్చిన ఆస్ట్రియా పార్లమెంటరీ ప్రతినిధి బృందం గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు చెబుతున్న సమయంలో ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రవేశించారు. అనంతరం ఆస్ట్రియా పార్లమెంట్ ప్రతినిధి బృందానిక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. పార్లమెంటరీ పార్టీ విక్లీ సమావేశం మంగళవారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉభయ సభలకు చెందిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. తిరిగి అధికారం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. Prime Minister Narendra Modi welcomed by the BJP MPs in Lok Sabha, amid chants of "Modi, Modi", following the party's victory in assembly elections in Goa, Manipur, Uttarakhand, and Uttar Pradesh. pic.twitter.com/IZuF36mDNB — ANI (@ANI) March 14, 2022 -
ప్రస్తుతానికి సోనియానే!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యేవరకు సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నాలుగున్నర గంటల పాటు వాడీవేడీగా జరిగింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఫలితాలపై సమీక్ష జరిపారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని సమావేశంలో సోనియా చెప్పారు. సోనియా నాయకత్వంపై కమిటీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేలా, పార్టీని బలోపేతం చేసేలా తక్షణ మార్పులకు శ్రీకారం చుట్టాలని ఆమెను కోరింది. రాహుల్ పార్టీ నాయకత్వం వహించాలన్నది ప్రతిఒక్క కార్యకర్త కోరికని, అయితే సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నందున వీటిలోనే కొత్త అధ్యక్షుడిని నిర్ణయిస్తామని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామని, పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షురాలు తక్షణ చర్యలు చేపడతారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ శిబిరాన్ని రాజస్థాన్‌లో నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సూచించారు. పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సీడబ్ల్యూసీ ముందు ప్రస్తావించగా, వారి ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫలితాలు తీవ్ర ఆందోళనకరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలపై సీడబ్ల్యూసీ చర్చించిందని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు సూచనలు చేశారని సూర్జేవాలా పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి ‘తీవ్ర ఆందోళన కలిగించేవి’లా ఉన్నాయన్న అంశాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. కాంగ్రెస్ తన వ్యూహంలో లోపాల కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోయినట్లు అంగీకరించారు. వీటితో పాటు పంజాబ్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించలేకపోయిందని, పార్టీ అంతర్గత కలహాలు కొంప ముంచాయని సీడబ్ల్యూసీ అంగీకరించింది. అదే సమయంలో శక్తివంతమైన ప్రతిపక్షంగా కొనసాగుతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ ఏడాదితో పాటు, 2023, 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధమవుతుందని సీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, అజయ్ మాకెన్, సల్మాన్ ఖుర్షీద్, హరీష్ రావత్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, చిదంబరం, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కరోనా కారణంగా ఏకే ఆంటోని హాజరుకాలేదు. మీరే దిక్కు పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసే మార్గాలపై రాహుల్ సూచనలిచ్చారన్నారు. పార్టీ ఓటమికి కారణాలను సభ్యులు విశ్లేషించినట్లు తెలిపారు. సమావేశానికి జీ 23 కూటమికి చెందిన ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ మాత్రమే హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి తాము కూడా కృషి చేస్తామని, తమకు ప్రత్యేక కూటమి ఏదీ లేదని, జీ23 అనేది మీడియా సృష్టని వీరు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశానికి ముందు రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ పలువురు కార్యకర్తలు, నాయకులు నినాదాలిచ్చారు. పార్టీ ఐక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే బాధ్యతలు స్వీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ అన్నారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని, కేంద్ర మంత్రికాలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఐక్యతకు గాంధీ కుటుంబం కీలకమని నాయకులు అర్థం చేసుకోవాలని గహ్లోత్ పేర్కొన్నారు. యాక్టివ్‌గా అసమ్మతి గ్రూప్ ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి కంటే ముందే, కాంగ్రెస్‌లోని అసంతప్తి వర్గానికి చెందిన సీనియర్ నేతలు శుక్రవారం గులాం నబీ ఆజాద్ నివాసంలో భేటీ అయి భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ వంటి ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ పార్టీ అన్ని నిర్ణయాలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాలు తీసుకుంటున్నారని జీ23 లోని నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి వీడినప్పటికీ, తెర వెనుక నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తామంతా పార్టీ శ్రేయోభిలాషులమే కానీ శత్రువులం కాదు అని ఈ నేతలు పలుమార్లు స్పష్టం చేశారు. -
సోనియా, రాహుల్‌ల నాయకత్వానికే జై
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎవరూ నిరుత్సాహపడొద్దని, ఎదురుదెబ్బలు ఎదుర్కొని నిలబడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని టీపీసీసీ కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా, రాహుల్‌ల నాయకత్వానికి టీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ నెల 14న భూదాన్ పోచంపల్లిలో ప్రారంభం కానున్న సర్వోదయ పాదయాత్ర, కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల ఖాళీల ప్రకటన, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, నేడు కొల్లాపూర్‌లో జరగనున్న ‘మన ఊరు–మన పోరు’ సభ, డిజిటల్ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశం తర్వాత పార్టీ నేతలు అంజన్‌కుమార్, గీతారెడ్డి, అజ్మతుల్లాతో కలసి మధుయాష్కీ విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయంగా కష్టాలను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదన్నారు. సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు హాజరయ్యారు. -
రాజు మరణించినాడు..!
బ్రిటన్‌లో ఒక సంప్రదాయమున్నది. ఆ దేశపు రాజుగారు చనిపోయినప్పుడు ఒక అధికారిక ప్రకటన చేస్తారు. 'The King is dead, long live the King'. రాజుగారు చనిపోయారు. రాజుగారు చిరకాలం జీవించాలి. రాజ్యం – పరిపాలన అనేవి నిరంతర ప్రక్రియలనీ, రాజు చనిపోయినా మరో రాజు సిద్ధంగా ఉన్నారనేది ఈ ప్రకటన సారాంశం. 1952లో బ్రిటన్ రాజు ఎనిమిదవ ఎడ్వర్డ్ మరణించారు. అప్పుడు 'The King is dead, long live the Queen' అనే ప్రకటన వెలువడింది. ఆయన వారసురాలుగా ప్రస్తుత మహారాణి రెండో ఎలిజబెత్ అప్పుడు సింహాసనమెక్కారు. ఆమెకు సంక్రమించిన దీర్ఘాయుష్షు వలన అటువంటి అధికార ప్రకటన వినే అవసరం ఇప్పుడున్న రెండు మూడు తరాల వారికి రాలేదు. ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయ కాంగ్రెస్ అనేవి రెండూ విడదీయలేని అంశాలు. భిన్న సంస్కృతులు, భాషలు, పాలనా విభాగాలుగా విడివడి ఉన్న భారతీయుల్లో జాతీయతను పాదు చేసిన ప్రధాన శక్తి కాంగ్రెస్ పార్టీయే! బ్రిటీష్‌వాడు ఎత్తుకెళ్లింది నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం మాత్రమే కాదు, దేశపు నవనాడుల నుంచి రక్తాన్ని పిండుకుంటున్నాడని సశాస్త్రీయంగా నిరూపించిన దాదాబాయ్ నౌరోజీ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సిరిసంపదలతో తులతూగిన దేశంలో దరిద్రం తాండవమాడటానికి కారణం బ్రిటీష్ సామ్రాజ్య దోపిడీయేనని చెబుతూ ‘వెల్త్ డ్రెయిన్’ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. అప్పట్లో చదువుకున్న భారతీయులను ఈ వాదన కదిలించి, జాతీయ భావాలను రేకెత్తించింది. భిన్నప్రాంతాల్లోని భారతీయుల్లో సాంస్కృతిక ఏకీభావం కలిగించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలగంగాధర తిలక్ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ పునాదుల మీదనే దేశ ప్రజలందరినీ ఒక జాతిగా సమీకరించి, గాంధీజీ స్వరాజ్య సమరం సాగించి గెలిచారు. స్వాతంత్య్రం సిద్ధించేవరకూ కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ గాంధీజీయే! స్వాతంత్య్రం తర్వాత కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్ది ఆర్థిక వృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు బాటలుపరిచాయి. ఇంతటి మహత్తర చరిత్ర, ఘనత కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘బ్రెయిన్ డెడ్’ స్థితికి చేరుకున్నదని ఇందుమూలముగా ప్రకటించడమైనది. కాలూ, చేయి కదిపే పరిస్థితి లేదు. అవయవ దానమొక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా తోస్తున్నది. ‘పరోపకారార్థ మిదం శరీరం’ అనే ఆర్యోక్తిని పాటించడం విఖ్యాత కాంగ్రెస్ పార్టీకి విశిష్టమైన ముగింపు అవుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్లినిక్ టెస్టులన్నీ కాంగ్రెస్ పార్టీ నిస్తేజాన్ని నిర్ధారించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు ప్రధానమంత్రుల్ని పార్లమెంట్‌కు గెలిపించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెహ్రూ, ఇందిర, శాస్త్రి, రాజీవ్‌లు యూపీ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. అధికారికంగా ప్రధాని పదవిని చేపట్టకపోయినా, అనధికారికంగానే పదేళ్లు ప్రభుత్వ చక్రం తిప్పిన సోనియా గాంధీ కూడా యూపీ నుంచే లోక్‌సభ సభ్యులయ్యారు. వీళ్లంతా కలిసి సుమారు యాభయ్యేళ్లపాటు ఈ దేశాన్ని పరిపాలించారు. అటువంటి రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితం రెండున్నర శాతం ఓట్లు. రెండు సీట్లు. నెహ్రూ – గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ సర్వశక్తులూ ఒడ్డి, చెమటను ధారపోసి తిరిగితే గిట్టుబాటైన ఓట్లివి. పోటీ చేసిన 97 శాతం సీట్లలో డిపాజిట్ గల్లంతయింది. ఆ గెలిచిన రెండు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలేదు. రాంపూర్ఖాస్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆరాధనా మిశ్రా తండ్రి ప్రమోద్ తివారీ.. ములాయం సింగ్‌కు మంచి మిత్రుడు. తన స్నేహితుని కుమార్తెను గెలిపించడం కోసం ములాయం సలహాపై అక్కడ ఎస్పీ పోటీ పెట్టలేదు. వీరేంద్ర చౌధరి అనే మరో కాంగ్రెస్‌వాది గెలిచిన ఫరెందా నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే ఎస్పీ ఒక బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలి, సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ పదింటిలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. అమేఠీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన అమేఠీ రాజావారు సంజయ్‌సింగ్ ఒక రేప్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన ఎస్పీ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నెలకొని ఉన్నది. ఒకే సంవత్సరంలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిన అప్రతిష్ఠను కూడా ఆ పార్టీ బోనస్‌గా మూటగట్టుకున్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. ప్రతిపక్ష పార్టీ అవలీలగా గెలవాల్సిన సన్నివేశం ఇది. కానీ అధికార పార్టీయే అవలీలగా గెలిచింది. కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది. అధికారంలో ఉన్న పంజాబ్‌లో 33 శాతం జనాభా ఉన్న దళిత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి కూడా కాంగ్రెస్ చేతులెత్తేసింది. అక్కడ బీజేపీ వంటి బలమైన పార్టీ ప్రధాన పోటీదారు కాకపోయినా, శిరోమణి అకాలీదళ్ బలహీనపడినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందలేకపోయింది. అర్థబలం, అంగబలం లేని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ చీపురు కట్టతో కాంగ్రెస్ అతిరథ మహారథులందర్నీ ఊడ్చిపారేసింది. గెలవడానికి అనుకూల పరిస్థితులున్న గోవాలోనూ అది చతికిలపడింది. మణిపూర్‌లో ప్రధాన పార్టీ స్థాయి నుంచి తోక పార్టీ స్థాయికి దాని పలుకుబడి క్షీణించింది. ఇప్పుడు కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 36 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో జూనియర్ పార్ట్నర్గా ఆ పార్టీ ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇంత దీన పరిస్థితుల్లో ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించడం అనివార్యమవుతుందనే భావన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొని ఉన్నది. అదే జరిగితే పండిత్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ కొట్టిన మొనగాడుగా నరేంద్ర మోదీ పేరు చరిత్రలో రికార్డవుతుంది. కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ మూడుసార్లు అధికారంలోకి తెచ్చినప్పటికీ మధ్యలో ఒక ఓటమి వలన ఆమె హ్యాట్రిక్ మిస్సయ్యింది. ఆమె చనిపోయి సానుభూతి వెల్లువతో మరోసారి పార్టీని గెలిపించింది. అందువల్ల ఆమె ఖాతాలో నాలుగు విజయాలను వేయవచ్చు. వరుస పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని ఒక నిష్క్రియాపరత్వం, పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని ఒక విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్ డెడ్ స్థితికి చేర్చాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. అన్ని రాష్ట్రాల్లోనూ దాని ఉనికి ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం నాలుగు వేలమంది శాసనసభ్యులుంటే ఆ పార్టీ గుర్తుపై గెలిచినవారు ఇప్పటికీ 700 మంది ఉన్నారు. మొత్తం శాసనసభ్యుల్లో ఇది 17.5 శాతం. బీజేపీ తరఫున 1300 (32.5%) మంది ఉన్నారు. యాభై శాతం మంది ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ నిస్తేజమవుతున్న నేపథ్యంలో అది కనుమరుగవడం వల్ల ఏర్పడుతున్న శూన్యాన్ని ఎవరు భర్తీ చేస్తారు? భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో ఎవరు ప్రత్యామ్నాయమవుతారు? కాంగ్రెస్ మిగిల్చిన శూన్యాన్ని కేజ్రీలు, బెనర్జీలు పూరించగలరా? కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయమవుతుందా? సాధారణ ఎన్నికలు రెండేళ్ల దూరం మాత్రమే ఉన్న ఈ సమయంలో ఈ రకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఒక మధ్యేవాద పార్టీగా పరిణామం చెందింది. నెహ్రూ, ఇందిరల కాలంలో కొంత లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్గానూ, పీవీ నరసింహారావు కాలం నుంచి కొంత రైట్ ఆఫ్ ది సెంటర్గానూ సందర్భానికి తగినట్టు ఒదిగిపోగల సరళతను ఆ పార్టీ అలవరచుకున్నది. భారతీయ జనతా పార్టీ దాని స్వభావరీత్యా కచ్చితమైన రైటిస్టు పార్టీ. మితవాద, మతవాద పార్టీ. ఈ విధానాలతో విస్తృతస్థాయి మద్దతు కష్టం కనుక వాజపేయి ప్రధానిగా ఉన్నకాలం నుంచి కొంత ఉదారవాద ముసుగును ధరిస్తున్నది. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రైట్ ఆఫ్ ది సెంటర్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని కీలక విషయాల్లో అది ఫక్తు రైటిస్టు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నది. ‘బ్యాక్ టూ ది బేసిక్స్’ను ఆశ్రయిస్తున్నది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత రాజ్యాంగం హామీ పడిన సెక్యులర్, ఫెడరల్ స్వభావాల విషయంలో బీజేపీకి భిన్నాభిప్రాయాలున్నాయి. లౌకికత్వం నుంచి హైందవీకరణ వైపు దాని అడుగులు పడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మితిమీరిన కేంద్రీకరణ వైపు దాని ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్గానో, రైట్ ఆఫ్ ది సెంటర్గానో, సెంట్రిస్టుగానో వ్యవహరించే ఒక గట్టి జాతీయ ప్రత్యామ్నాయం లేకపోతే బీజేపీ తన మౌలిక విధానాలవైపు పయనించే అవకాశం ఉన్నది. వేలాది రకాల ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, ఆరాధనా పద్ధతులు, ఆహార విహారాలు సహజీవనం చేసే మన బహుళ జీవన వ్యవస్థలో ఆ పయనం కల్లోలానికి కారణమవుతుంది. కనక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తప్పనిసరి. అందుకోసం కాంగ్రెస్ ఖాళీని పూరించడం ఒక చారిత్రక అనివార్యత. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ లాంటి వేదిక బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతుందా? అసాధ్యం. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రజలు ఒక బలమైన ప్రభుత్వాన్నే కోరుకుంటారు తప్ప కలగూరగంపను ఆదరించే ప్రసక్తే ఉండదు. పోనీ, కాంగ్రెస్ పార్టీని ముందుపెట్టి దాని వెనక ప్రాంతీయ, లౌకిక పార్టీలు నిలబడితే?... కాంగ్రెస్ నాయకత్వంపై రాయ్‌బరేలి, అమేఠీ ప్రజలకే నమ్మకం లేదు, ఇక దేశ ప్రజలెట్లా నమ్ముతారు? నెహ్రూ – గాంధీ కుటుంబాన్ని పక్కనపెట్టి మిగిలిన కాంగ్రెస్‌ను ముందుకు నడిపితే?... మిగిలిన కాంగ్రెస్ రాష్ట్రానికో ప్రాంతీయ పక్షంగా విడిపోయే అవకాశం ఉంటుంది. అందరినీ కలిపి ఉంచే ఉమ్మడి స్ఫూర్తి ఏమీ మిగలదు. మరి కిం కర్తవ్యం? నరేంద్ర మోదీ కత్తికి ఎదురుండదా? చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంటుందా? చరిత్రకు కొన్ని అనివార్య పరిస్థితులను కల్పించే లక్షణమున్నది. అటువంటి పరిస్థితుల్లో అనూహ్యమైన ప్రత్యామ్నాయాలు, పార్టీలు ముందుకు రావచ్చు. మన కళ్ల ముందున్న జనతా పార్టీ అనుభవమే ఇందుకు గొప్ప ఉదాహరణ. దేశంలో ఎమర్జెన్సీ విధించే నాటికి జనతా పార్టీ లేదు. ప్రతిపక్ష నాయకులందర్నీ ఇందిరమ్మ ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. ఎల్కే అద్వానీ, భైరాన్‌సింగ్ షెఖావత్, అశోక్ మెహతా, చంద్రశేఖర్, మధు దండావతే, బిజూ పట్నాయక్, పీలూ మోదీ, రాజ్‌నారాయణ్, చరణ్‌సింగ్ వగైరా వివిధ పక్షాల నేతలంతా రోహటక్ జైల్లో ఉన్నారు. అదే విధంగా అన్ని జైళ్లలోనూ వివిధ పక్షాల నాయకులు ఏడాది పైగా సహజీవనం చేశారు. వీళ్లంతా మాట్లాడుకోకుండా ఉంటారా? కానీ, వేర్వేరు పార్టీల వాళ్లంతా ఒకే పార్టీగా మారుతారని ఊహించని ఇందిర ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ఎన్నికలను ప్రకటించారు. భారతీయ జనసంఘ్, సంస్థా కాంగ్రెస్ (పాత కాంగ్రెస్), భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ కలిసి జనతా పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి జగ్జీవన్‌రామ్, బహుగుణల నాయకత్వంలో చీలిపోయిన సీఎఫ్‌డీ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఒక ప్రభంజనంలా ఎన్నికల ఫలితాలొచ్చాయి. కేంద్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ‘విజయేందిర’గా, ‘అపర దుర్గ’గా ప్రసిద్ధికెక్కిన మహా నాయకురాలు స్వయంగా రాయ్‌బరేలీలో ఓడిపోయారు. అధికారంలో ఉన్నవారు నిరంకుశ పాలన వైపు అడుగులు వేసినప్పుడు, రాజ్యాంగబద్ధ పాలన నుంచి పక్కకు తొలగినప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ రూపం తోసుకొస్తుందని చెప్పడానికి జనతా ప్రయోగం ఒక పాఠం. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ! జనతా ప్రయోగం విఫలం కాలేదా? మూడేళ్లలోనే ఆ పార్టీ విచ్ఛిన్నం కాలేదా? అనే ప్రశ్నలు తలెత్తవచ్చు. నిజమే! కానీ అది తన తక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చింది. నియంతృత్వ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. భవిష్యత్తులో ఒక బలీయమైన శక్తిగా ఎదగనున్న భారతీయ జనతా పార్టీకి పురుడు పోసింది. రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ పార్టీలను నడపడం ఒక ఆర్ట్! యుద్ధకళ! ప్రపంచ చరిత్రలో అనేకమంది విజేతలు ఈ ఐక్యపోరాటాల నుంచే ఉద్భవించారు. బీజేపీయే అందుకు ఒక ఉదాహరణ. జనసంఘ్ పేరుతో ఉన్నప్పుడు భారత రాజకీయాల్లో అదొక అంటరాని పార్టీ. దాని హిందూత్వ ఎజెండా కారణంగా ఇతర పార్టీల వారు జనసంఘ్‌తో వేదికను కూడా పంచుకునేవారు కాదు. 1967లో మొదటిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రామ్మనోహర్ లోహియా చొరవతో చాలా రాష్ట్రాల్లో యునైటెడ్ ఫ్రంట్లు ఏర్పడ్డాయి. వాటిలో జనసంఘ్ కూడా చేరటానికి లోహియా కారకుడయ్యాడు. ఫలితంగా జనసంఘ్ విస్తృతి పెరిగింది. జనతా పార్టీ విచ్ఛిన్నమయ్యే నాటికి అందులో చేరిన మిగిలిన పార్టీలు బలహీనపడ్డాయి. భారతీయ జనతా పార్టీ పేరుతో జనసంఘ్ కొత్త అవతారం ఎత్తింది. ఉమ్మడి పార్టీలోని ఇతర పార్టీల వారు, తటస్థుల చేరికతో బీజేపీ బలపడింది. పార్టీ నాయకత్వం అనుసరించిన సమయానుకూల ఎత్తుగడలు బీజేపీని బలంగా తీర్చిదిద్దాయి. స్వతంత్ర పార్టీ, సంస్థా కాంగ్రెస్, సోషలిస్టు పార్టీ, భారతీయ లోక్దళ్లు గల్లంతయ్యాయి. చైనాలో చాంగ్‌కైషేక్ నాయకత్వంలో కుమింటాంగ్ పార్టీ ప్రభుత్వానికీ, మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులకూ మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆ దేశంపై జపాన్ దురాక్రమణ జరిగింది. జపాన్‌కు వ్యతిరేకంగా కుమింటాంగ్తో ఐక్య సంఘటనకు మావో సిద్ధపడ్డాడు. జపాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధ సమయంలోనే మావో ఎత్తుగడల ఫలితంగా అనతికాలంలోనే చైనా కమ్యూనిస్టుల హస్తగతమైంది. తైవాన్‌కు పారిపోయాడు చాంగ్‌కైషేక్. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఖాళీని భర్తీ చేయడానికి వివిధ పార్టీలు యునైటెడ్ పార్టీగా లేదా ఫోరమ్‌గా ఆవిర్భవించే పరిస్థితులు ఏర్పడవని చెప్పలేము. కొన్ని ప్రాంతీయ, లౌకిక పార్టీలు, వామపక్ష పార్టీలు ఇందులో తాత్కాలికంగా విలీనం కాబోవనీ చెప్పలేము. అజేయుడైన భీష్మాచార్యుని పడగొట్టడానికి కారణభూతుడైన శిఖండి జన్మ ఎత్తడం కోసం తనను తాను దహనం చేసుకున్న అంబ మాదిరిగా, పునర్జన్మ ఎత్తడం కోసం దహనమయ్యే ఫీనిక్స్ పక్షుల్లా రాజకీయ పక్షాలు సిద్ధపడే రోజులు వస్తాయేమో! ఆ ఐక్య వేదిక ద్వారా లబ్ధి పొంది ఒక బలమైన రాజకీయ శక్తి బీజేపీ మాదిరిగా ఆవిర్భవిస్తుందేమో! ఎదురు చూడాలి. ఇప్పటికైతే ‘రాజు మరణించాడు. రాజు చిరకాలం జీవించాలి’ అని ప్రకటిద్దాం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
5 రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ
-
నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో కొత్త జోష్.. తర్వాత టార్గెట్ తెలంగాణ
తెలంగాణలో పట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీకి 4 రాష్ట్రాల్లో గెలుపు కొత్త జోష్ ఇచ్చింది. ఆ ఊపుతోనే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని అనుకూలంగా మల్చుకోవాలని నిర్ణయించింది. నేరుగా పార్టీ జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. పవర్ కోసం ‘పంచ సూత్రాల’ను అనుసరించాలని.. పార్టీల నుంచి చేరికలపైనా దృష్టిపెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయి నుంచి మద్దతు కూడగట్టుకోవాలని, టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనేందుకూ సిద్ధంగా ఉండాలని సూచించింది. సాక్షి, హైదరాబాద్: యూపీ వంటి కీలక రాష్ట్రాన్ని నిలబెట్టుకున్న ఊపులో తర్వాతి లక్ష్యాలపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో అధికారం సాధించేందుకు అవకాశం ఉందన్న అంచనాలతో మరింతగా ఫోకస్ చేసేందుకు సిద్ధమైంది. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ‘పంచ సూత్రాల’ను నిర్దేశించిన జాతీయ నాయకత్వం.. ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. వచ్చే నెల 14న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న రెండోదశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి అమిత్‌షా లేదా పార్టీ అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైనా ఒక జిల్లాలో జేపీ నడ్డా పాల్గొనే విధంగా బహిరంగసభ నిర్వహించాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఈ నెల 21–24 తేదీల మధ్య.. 8 జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి, అధికార పార్టీ బలాన్ని పరిశీలించనున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌జీ దృష్టి పెట్టారు. ఢీ అంటే ఢీ అందాం..: ప్రజల్లో క్షేత్రస్థాయికి వెళ్లే క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమల్లో వెనకడుగుపై గట్టిగా నిలదీయాలని.. రాజీలేని పోరు సాగించాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండాలని అన్నిస్థాయిల్లో నేతలు, కార్యకర్తలను ఆదేశించింది. గత ఏడేళ్లలో, ముఖ్యంగా 2018 ఎన్నికలకు ముందిచ్చిన హామీల అమల్లో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాన్ని గట్టిగా ఎత్తి చూపాలని సూచించింది. అయితే బీజేపీ నేతలపై కేసులు, దాడులు వంటి బెంగాల్ తరహా రాజకీయాలకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టిందని.. అందువల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ సూచించినట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. సానుకూలత ఓట్లుగా మారాలి: తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత రోజురోజుకు పెరుగుతోందని.. దీనిని ఓటింగ్ కింద మల్చుకునేలా అన్ని స్థాయిల్లోని పార్టీ యం త్రాంగం కృషి చేయాలని ఇప్పటికే అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 6 శాతమే ఓట్లురాగా.. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లు, నాలుగు ఎంపీ సీట్లు రావడం దీనికి స్పష్టమైన సంకేతమని గుర్తుచేస్తోంది. చేరికలపై ప్రత్యేకంగా ఫోకస్..: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు భారీగా చేరికలపై బీజేపీ దృష్టి పెడుతోంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇతర చిన్నపార్టీల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలను చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధానంగా టీఆర్ఎస్ అసంతృప్త నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు కాంగ్రెస్ నుంచి కూడా సీనియర్ నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్య నేతల చేరికల పర్వం త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని.. దీనికి సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయిలో మంతనాలు, చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి. ఇద్దరు, ముగ్గురు నేతలతో జాబితాలు! ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండేందుకు 110 నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో నేతల పరిస్థితి ఏమిటి, విజయావకాశాలు ఎలా ఉన్నా యన్న దానిపై క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. గెలిచే అభ్యర్థులను గుర్తించి, బరిలో నిలిపేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ సీట్లపై ప్రత్యేక దృష్టి ‘‘రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ సీట్లపై మా పార్టీ దృష్టి పెట్టింది. అక్కడ ప్రత్యేక కమిటీలు వేసి కార్యాచరణను అమలు చేస్తున్నాం. పరిస్థితులు, వివిధ పార్టీల అభ్యర్థుల బలాబలాలపై పరిశీలన పూర్తయింది. ఎస్సీ, ఎస్టీలే కాకుండా ఇతర వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి మొగ్గు ఎటుందనేది పరిశీలిస్తున్నాం.’’ అని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తెలిపారు. పవర్‌కు ‘పంచ సూత్ర’! తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడానికి ముఖ్యంగా 5 అంశాలను పాటించాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి సూచించింది. ఈ క్రమంలోనే తమపార్టీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జాతీయ నాయకత్వం సూచించిన అంశాలివీ.. ►పోలింగ్ బూత్ స్థాయి నుంచీ పార్టీ బలోపేతం ►ఇతర పార్టీల నుంచి భారీగా నాయకులు, కొత్తవారి చేరికలు ►ఎలాంటి అడ్డంకులు, సవాళ్లు ఎదురైనా అధికార టీఆర్ఎస్పై మడమ తిప్పని పోరు ►పార్టీలో అన్ని స్థాయిల్లో ఐకమత్యం–అన్ని విభాగాలు, నాయకుల మధ్య పూర్తి సమన్వయం ►రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎండగట్టడం, సమస్యలపై పోరాడటం ద్వారా ప్రజల్లో పట్టుపెంచుకోవడం, ఇందుకోసం మీడియా, సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం. ఇక తెగించి పోరాడుతాం.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. దీనికి తగ్గట్టుగా హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు అందుతోంది. టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, హామీల అమల్లో నిర్లక్ష్యంపై పోరాటం చేస్తాం. తెగించి పోరాడేందుకు సిద్ధమయ్యాం. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల వివరాలు సేకరిస్తున్నాం. అంతేకాదు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నిష్క్రియాపరత్వం, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపడతాం. అసెంబ్లీ సీట్ల వారీగా మొత్తం సమాచారం సేకరిస్తున్నాం. త్వరలో క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రారంభిస్తాం. – బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
తృణమూల్‌లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
ఇప్పుడిప్పుడే బలపడతున్న తరుణంలో ఢీలా పడేలా చేసిన రిజల్ట్స్
-
గెలుపు ఏకపక్షమే!
సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘మినీ వార్’గా అందరూ అభివర్ణించిన అయిదు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలలో ‘వార్ వన్ సైడ్’ అయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లోనూ మరోసారి పీఠం దక్కించుకొని, బీజేపీ ‘బుల్డోజర్’లా సాగింది. 5 రాష్ట్రాల్లో మూడింటిని ఒంటి చేతితో గెలుచుకున్న బీజేపీ, హంగ్ వచ్చిన గోవాలో సైతం మెజారిటీకి తగ్గిన ఒక్క సీటుకూ స్వతంత్రుల మద్దతు తీసుకొని, మరోసారి పీఠమెక్కడానికి సిద్ధమవుతోంది. మిగిలిన అయిదో రాష్ట్రం పంజాబ్ ఫలితం సైతం ఊహాతీతంగా ఏమీ లేదు. అక్కడ బలం లేని బీజేపీని పక్కకు నెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన చీపురుతో కాంగ్రెస్‌ను ఊడ్చేసింది. సీఎం సీటు కోసం సొంత పార్టీలోనే అంతర్గత పోరాటాలకు పరిమితమైన పంజాబ్ కాంగ్రెస్ చతికిలపడింది. వెరసి, జాతీయ స్థాయిలో బీజేపీకి విశ్వసనీయమైన లౌకికవాద, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ సృష్టిలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. నిజానికి, యూపీలో 322 సీట్ల స్థాయి నుంచి బీజేపీ కొన్ని పదుల సీట్లను కోల్పోయినా, ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మునుపటి కన్నా 70 సీట్లకు పైగా గెల్చుకున్నా, అధికార పీఠానికి దూరంగానే మిగిలిపోయింది. సంక్లిష్ట కుల, ప్రాంత సమీకరణలతో బహుముఖ పోటీ ఉండే యూపీ లాంటి రాష్ట్రం ఈసారి కేవలం బీజేపీ, ఎస్పీల ద్విముఖ పోరుగడ్డగా మారిపోవడం గమనార్హం. ఈ పోట్లగిత్తల మధ్య బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ నలిగిపోయాయి. ప్రియాంక పగ్గాలు తీసుకొని ప్రచారం చేసినా, యూపీలో 3 శాతం కన్నా తక్కువ ఓట్లకే కాంగ్రెస్ పరిమితమైతే, ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ అవసానావశిష్టంగా మారిపోవడం మరో విషాదం. బడుగు వర్గాలకు ‘రేషన్’ – గూండా గిరీకి దూరంగా శాంతిభద్రతల ‘శాసన్’– యూపీలో బీజేపీకి కలిసొచ్చాయి. ఇంటింటా శౌచాల యాలు, చీకటి పడ్డా బయటకు రాగల ధైర్యమిచ్చే ‘సురక్ష’ లాంటివి మహిళలను భారీగా బీజేపీ వైపు నిలిపాయి. దశాబ్దాలుగా లేని విధంగా యూపీలో అధికార పక్షాన్నే రెండోసారీ పీఠమెక్కించాయి. ఎన్నికలలో గెలుపోటములు ఎక్కువగా భావనాత్మక అంశాల మీదే తప్ప, అసలు వాస్తవాల మీద ఆధారపడవంటారు. కోవిడ్ నిర్వహణలో వైఫల్యం, ధరల పెరుగుదల, ఉపాధి లేమి, రైతు ఉద్యమాలు, మధ్యతరగతి కష్టాలు, అధికారపక్షానికి సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకత లాంటి వేవీ బీజేపీ గెలుపును ఆపలేకపోయాయి. ప్రతి సందర్భంలో ‘వందేమాతరం, భారత్ మాతాకీ జై’ నినాదాలతో జాతీయతావాదానికి పేటెంట్ హక్కు తమదేనన్న భావన కలిగించడం బీజేపీ వ్యూహచతురత. భావోద్వేగాలను ప్రేరేపించే ఈ ప్రయత్నం తాజా ఎన్నికల్లోనూ ఫలించింది. పార్టీ అధికారంలో ఉన్న యూపీలో లఖిమ్‌పూర్ ఖేరీ, హాథ్రస్ లాంటి ఘటనలు, ఉత్తరాఖండ్‌లో సీఎంల మార్పులు, గోవాలో అంతర్గత బలహీనతల లాంటి ప్రతికూలతలున్నా – ఓటర్ల తీర్పు మాత్రం బీజేపీకే అనుకూలించింది. పోటాపోటీ ఉంటుందన్న ఉత్తరాఖండ్‌లో తుది తీర్పూ కాంగ్రెస్‌కు షాక్. బీజేపీ, మోదీ ప్రభంజనాలకు ఇప్పటికైతే తిరుగులేదనే భావనను ఈ ఎన్నికలు కలిగించాయి. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, బూత్ స్థాయి వరకు పాతుకుపోయిన బలమైన యంత్రాంగం, ఏడేళ్ళ పైచిలుకు పాలనానుభవం, తీరని విస్తరణ దాహం బీజేపీకి ఇప్పుడు పెట్టని కోటలు. విభిన్న సమీకరణాల ఎన్నికల రాజకీయాల నిర్వహణలో ప్రస్తుతం దేశంలో మరే పార్టీ దానికి సాటి లేవు, పోటీ కావు. జాతీయ పార్టీ కాంగ్రెస్ దేశంలో ఇప్పుడు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మాత్రమే అధికారానికి పరిమితమైంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో వేసుకుంటామని బీజేపీ తొడగొడుతోంది. పంజాబ్ ఓటమి కాంగ్రెస్ స్వయంకృతాప రాధమే. సీఎం పీఠం కోసం సిద్ధూ లాంటి సొంత పార్టీ నేతల ఆత్రం, అమరీందర్ తొలగింపు సహా అనేక అంశాల్లో అధిష్ఠానం తప్పులు పార్టీకి మరణశాసనం రాశాయి. పంజాబ్‌లో ‘ఆప్’ చరిత్రాత్మక మెజారిటీ సాధించిన వైనం చెప్పుకోదగ్గది. తీవ్రవాది అంటూ నిందించినా, అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి, సంక్షేమాల కార్డుతో కేజ్రీవాల్ పంజాబ్ కోటపై జెండా పాతారు. కాంగ్రెస్, బీజేపీ తర్వాత దేశంలో ఒకటికి రెండుచోట్ల అధికారంలో ఉన్న పార్టీ అనే ఘనతను ‘ఆప్’కు కట్టబెట్టారు. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల గెలుపు 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ విజయాన్ని సుస్థిరం చేస్తుందా అన్నది ప్రశ్న. తాజా విజయోత్సాహంలో మోదీ అవునంటున్నా, అప్పుడే ఏమీ చెప్పలేం. మోదీ పాపులారిటీని, దేశవ్యాప్తంగా మానసిక సానుకూలతను కచ్చితంగా పెంచాయి. ఈ ఫలితా లతో ఆగస్టులో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం బీజేపీకి తగ్గిపోనుంది. ఈ ఏడాదే వచ్చే కశ్మీర్, గుజరాత్ ఎన్నికల్లోనూ ఈ హవా కొనసాగితే ఆశ్చర్యం లేదు. ప్రతిపక్షాల సంగతికొస్తే, జాతీయ వేదికపై ఇక బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోతుంటే, ఆ లోటు భర్తీకి ఆప్, తృణమూల్ సహా అనేకం పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా ఇది కాంగ్రెస్‌కు ఆఖరి మేలుకొలుపు. ఇప్పటికైనా నాయకత్వ లోపాలను సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్తు కష్టమే. ఒక్క కాంగ్రెస్‌కే కాదు... ఇతర ప్రతిపక్షాలకూ ఈ ఎన్నికల ఫలితాలు పాఠం నేర్పాయి. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా కలసి పోరాడితే తప్ప, మోదీనీ, బీజేపీనీ 2024లోనైనా సరే ఎదుర్కోవడం అంత సులభం కాదని స్పష్టం చేశాయి. కానీ, పీఠం మీద పైచేయి కోసం కాంగ్రెస్, కాంగ్రెసేతర కూటములుగా చీలి కలహించుకుంటున్న ప్రతిపక్షాలకు ఈ వాస్తవం తలకెక్కుతోందా? -
‘హస్త’వ్యస్తం.. చివరికి మిగిలింది ఆ ‘రెండే’..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాభవం రోజురోజుకూ మసకబారుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమినే మూటగట్టుకుంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలబడింది. తాజాగా పంజాబ్‌ను చేజార్చుకుంది. 2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నిరాశ నెలకొంది. ప్రసుత్తం దేశంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు. నిలబెట్టుకోవడం కష్టమైందా? 2004లో దేశంలో మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా పలు రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. అయితే పదేళ్ల పాలన తర్వాత ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. 2014 తర్వాత జాతీయస్థాయిలో పట్టు కోల్పోయిన హస్తం పార్టీ రాష్ట్రాల్లోనూ అదే తోవలో నడిచింది. 2014 సాధారణ ఎన్నికల్లో కీలకమైన మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటమి చెందింది. 2016 ఎన్నికల్లో కేరళ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది. 2017లో పంజాబ్‌లో అధికారంలోకి రాగా, ఉత్తరాఖండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లో ఓటమి పాలైంది. 2018లో మిజోరం, మేఘాలయా రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. 2021 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరి, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్లో ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఆ రెండే ‘చేతి’లో.. 2014లో భారతీయ జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 282 దక్కించుకుని బీజేపీ తొలిసారి సొంతంగా మెజారిటీ సాధించింది. అనూహ్యమైన ఈ అపజయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తుందనీ, మళ్లీ పుంజుకుంటుందనీ చాలామంది ఊహించారు. కానీ 2019 ఎన్నికల్లో మరోసారి భంగపాటుకు గురైంది. ఒక్కటొక్కటిగా రాష్ట్రాలు హస్తం చేజారిపోగా.. తాజాగా పంజాబ్‌లో కూడా అధికారం కోల్పోయింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే మిగిలాయి. -
ఆ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఫ్లాప్ షో.. ఎందుకిలా? అవే కారణాలా?
ఢిల్లీ: వచ్చే సార్వతిక ఎన్నికలకు సెమీస్‌గా సాగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఉత్తరాఖండ్‌లో ప్రభావం చూపని ఆ పార్టీ.. పంజాబ్‌లో అధికారం పోగొట్టుకుంది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో మళ్లీ బీజేపీ పాగావేసింది. యూపీలో కాంగ్రెస్ అడ్రస్‌లేకుండా పోయింది. ప్రియాంకగాంధీ కూడా కాంగ్రెస్ హస్తవాసిని మార్చలేకపోయింది. సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యింది. ప్రధానంగా పంజాబ్ నుంచి అవమానకర రీతిలో ఓటమి పాలైంది. సిద్ధూ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకం, చన్నీ సామాజిక వర్గ ఆదరణ.. రెండు అంచనాలూ ఘోరంగా విఫలం అయ్యాయి. ఉత్తరప్రదేశ్.. యూపీలో కాంగ్రెస్‌కు ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. అతిపెద్ద రాష్ట్రంలో పొతులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం, ప్రియాంకగాంధీ ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోకపోవడం బలమైన నేతలు లేకపోవడం, అతి విశ్వాసం, జాతీయస్థాయిలోనే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ బలహీనపడటం, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోవడం, ఎన్నికల్లో కర్షక హామీలు ఇవ్వలేకపోవడం వంటి కారణాలు చెప్పవచ్చు. ఉత్తరాఖండ్.. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. రూ.500 గ్యాస్ సిలిండర్ హామీ, పేదలకు రూ.40వేల పథకం ఓటర్లను ఆకర్షించలే ఆకట్టుకోని 4 లక్షల ఉద్యోగాల హామీ కూడా ఓటర్లను ఆకట్టుకోలేదు. టూరిజం అభివృద్ధికి కాంగ్రెస్ హామీ ఇవ్వకపోవడం వంటి కారణాలు కాంగ్రెస్ ఓటమికి ఓటమికి కారణాలుగా విశ్లేషించవచ్చు. పంజాబ్.. పంజాబ్‌లో కాంగ్రెస్ భంగపాటుకు కారణాలను పరిశీలిస్తే.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం మాఫియా, మాదకద్రవ్యాల ముప్పు, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత.. కాంగ్రెస్ ఓటమికి గల కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టి వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయితే, గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు ఆప్కే పట్టం కట్టారు. పంజాబ్‌లో అధికారి మార్పిడి జరగాలని ఆప్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. అలాగే ఢిల్లీ తరహాలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన ‘ఢిల్లీ మోడల్’హామీ కూడా వర్కవుట్ అయ్యింది. దీంతో పంజాబ్‌లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది. -
Exit Poll Results 2022: సెమీస్ బీజేపీదే!
కీలకమైన పొలిటికల్ సెమీఫైనల్స్‌లో విజేత బీజేపీయేనని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో ప్రకటించాయి. దేశమంతా ఆత్రుతగా, ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవాయే నడిచిందని తేల్చాయి. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని సర్వేలన్నీ స్పష్టం చేశాయి. ఉత్తరాఖండ్‌లోనూ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరవచ్చని పలు సర్వేలు వెల్లడించాయి. ఒకట్రెండు సర్వేలు కాంగ్రెస్‌కు ఓటేశాయి. మణిపూర్‌లోనూ బీజేపీకే అధిక సీట్లు కట్టబెట్టాయి. అతి పెద్ద పార్టీగా మెజారిటీకి దగ్గరగా వెళ్తుందని అంచనా వేశాయి. పంజాబ్‌ను మాత్రం కేజ్రీవాల్ కరిష్మా కమ్మేసిందని, కాంగ్రెస్‌ను కంగుతినిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు స్పష్టం చేశాయి. అత్యధిక సర్వేలు ఆప్‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టడం విశేషం. మణిపూర్, గోవాల్లోనూ ఆప్ ఉనికి చాటుకుంటుందని అంచనా వేశాయి. ఇక గోవాలో ఓటరు తీర్పు హంగ్ దిశగా సాగిందని సర్వేలు తేల్చాయి. కొన్ని బీజేపీకి, మరికొన్ని కాంగ్రెస్‌కు అధిక సీట్లు కట్టబెట్టాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల పోరు సోమవారం యూపీలో చివరిదైన ఏడో విడత పోలింగ్‌తో ముగిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసీ ముగియగానే ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలు ఒకటి తర్వాత ఒకటి వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగి అసలు ఫలితాలు వెల్లడి కానున్న గురువారం మీదే నెలకొని ఉంది! ఇక్కడ చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెబుతున్నాయంటే? -
యూపీలో కాషాయ జెండా ఎగురవేస్తాం: ప్రధాని మోదీ
వారణాసి: యూపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు యోగి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇదే పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వారణాసి నియోజకవర్గంలోని ఖజురి గ్రామంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. తనపై ఉన్న వ్యతిరేకతతోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ వంటి పథకాలను ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయని విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు కార్యక్రమాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లపాటు ఖాదీని రాజకీయ లాభానికి వాడుకున్న కాంగ్రెస్ పార్టీ...ఇప్పుడు ఆ పేరును కూడా తలుచుకోవడం లేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఖాదీ, యోగాకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజీని తెచ్చిందన్నారు. అనంతరం ప్రధాని వారణాసిలో మేథావులు, పలువురు ప్రముఖులతో ముఖాముఖి మాట్లాడారు. యూపీ అభివృద్ధి కొనసాగేందుకు బీజేపీకే మళ్లీ అవకాశమివ్వాలని కోరారు. -
ప్రధానికి టెన్షన్.. మోదీ కోటలో అఖిలేష్ పాగా వేస్తారా..?
యూపీ పీఠమెవరిదో తేల్చనున్న ఆఖరిదశ (7వ దశ) పోలింగ్ సోమవారం జరగనుంది. పూర్వాంచల్‌లో తొమ్మిది జిల్లాలోని 54 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి కూడా పూర్వాంచల్‌లో భాగమే. దాంతో ఆయన మూడు రోజులు వారణాసిలోనే ఉండి శనివారం ప్రచారం ముగించారు. ప్రధాన పోటీదారులైన సమాజ్‌వాదీ, బీజేపీలు ఎవరికి వారే.. తామిప్పటికే యూపీ అసెంబ్లీ రేసులో గెలిచేశామని చెప్పుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీ, అఖిలేశ్–మమతా బెనర్జీలు, రాహుల్– ప్రియాంక గాంధీల్లాంటి అగ్రనేతలు సీరియస్‌గా ప్రచారంలో మునిగిపోవడాన్ని బట్టి.. ఎవరికైనా విజయం అంత తేలిక కాదనే సంకేతాలను ఇస్తోంది. యాదవేతర బీసీల ఓట్లలో చీలిక! ప్రతీ ఓటూ ముఖ్యమేనని ముందే లెక్కలేసుకున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కులా ఆధారిత చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. సుహల్దేవ్ రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బీఎస్‌బీ, మహాన్‌దళ్, జేపీ (ఎస్) లాంటి చిన్నాచితక పార్టీలతో మాల అల్లిన అఖిలేశ్.. బీజేపీకి అండగా నిలబడ్డ యాదవేతర కులాల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదిపారు. అల్పసంఖ్యాల కులాల్లో 2017లో బీజేపీ 61 శాతం ఓట్లను సాధించింది.అయితే ఈ యాదవేతర ఓబీసీలు బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు కాదు. ఈ ఓబీసీల్లో 76 ఉపకులాలున్నాయి. ప్రతి కూలానికి వేర్వేరు అవసరాలు– ఆంకాక్షలు, డిమాండ్లు ఉన్నాయి. అందువల్ల యాదవేతర బీసీలను ఏకం చేయడం కష్టం.అప్నాదళ్ (ఎస్) ఇంటిపోరు, స్వామి ప్రసాద్ మౌర్య నిష్క్రమణలు పూర్వాంచల్‌లో బీజేపీకి మరిన్ని తలనొప్పులు తెస్తున్నాయి. పైన చెప్పిన ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు బీజేపీ కొత్తగా నిషాద్ పార్టీతో జతకట్టింది. మల్లాల్లో ఈ పార్టీకి మంచి మద్దతుంది. ఏడోదశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎస్సీలతో పాటు కుర్మీలు, పటేళ్లు, బనియాలు, రాజ్భర్లు, నిషాద్‌లు, మౌర్యాల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ జిల్లాల్లో మైనార్టీ జనాభా 12 శాతముండగా, ఎస్సీ జనాభా 24 శాతం, బ్రాహ్మణ మరియు ఠాకూర్ల జనాభా 20 శాతం మేర ఉంది. జాతీయవాదం + హిందుత్వ.. 2017లో పూర్వాంచల్‌లో బీజేపీ ప్రదర్శన మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఈ ప్రాంతంలోని 50 సీట్లలో బీజేపీ 2017లో 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత స్థానాల్లో ఎస్పీ(11), బీఎస్పీ(6) నిలిచాయి. ఇతరప్రాంతాలతో పోలిస్తే బీఎస్పీ అత్యధిక ఓట్ల శాతం సాధించిన ప్రాంతం ఇదే కావడం గమనార్హం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈదఫా ఒక సమ్మిళిత సూత్రాన్ని అవలంబిస్తోంది. జాతీయవాదం (ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు), హిందుత్వ (కాశీ విశ్వనాధ కారిడార్ పనులు), మోడీ, యోగి కాంబినేషన్ విజయాలు.. అనే మూడు అంశాలను సమ్మిళితం చేసి చూపడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ఓబీసీకి చెందిన మోదీని చూపి వెనుకబడ్డవర్గాలకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని చెబుతోంది. మరోవైపు బీజేపీ ఓబీసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ వారిని ఆకట్టుకోవాలని అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారు. కులాలవారీ జనగణనను బీజేపీ పక్కనపెట్టిందని, తద్వారా రిజర్వేషన్లకు ముగింపు పలికే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీఎస్పీ మాత్రం గతంలో మాదిరే తమకు ఈ ప్రాంతంలో మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తోంది. కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆశలు కనిపించడంలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానికి కీలకంగా మారిన ఈ ప్రాంతంపై పట్టు తమకే దక్కుతుందని ఎస్పీ, బీజేపీ ఆశిస్తున్నాయి. -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు; విస్తుగొలిపే నిజాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది నేరచరితులు, 41 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నేర చరితులకు పెద్దపీట ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,874 మంది అఫిడవిట్లను పరిశీలించామని, మిగతా 70 మంది అఫిడవిట్లను విశ్లేషించాల్సి ఉందని ఏడీఆర్ తెలిపింది. ఈ 6,874 మందిలో 1,916 మంది జాతీయ పార్టీలకు, 1,421 మంది ప్రాంతీయ పార్టీలకు, 1,829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు. 1,708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 6,874 అభ్యర్థుల్లో 1,694 మంది(25 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు 1,262 మంది (18 శాతం) మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నవారు.. వీరిలో ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి చూస్తే అన్ని పార్టీలకు నేరచరితులకు పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. పోటీలో కోటీశ్వరులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 41 శాతం మంది(2,836) కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్(1,733), పంజాబ్(521), ఉత్తరాఖండ్(252), గోవా(187), మణిపూర్(143) వరుస స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గోవా ముందజలో నిలిచింది. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 93 శాతంతో అకాలీదళ్ అగ్రస్థానంలో ఉంది. బీజేపీ(87 శాతం), ఆర్ఎల్డీ(66), ఎన్పీఎఫ్(80), ఎస్పీ(75), బీఎస్పీ(74), ఏఐటీసీ(65), కాంగ్రెస్(63), ఆప్(44), యూకేడీ(29 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో 347 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ టాప్.. బీజేపీ 534 మంది కుబేరులకు టిక్కెట్లు కట్టబెట్టగా, కాంగ్రెస్ 423 మంది ధనవంతులకు సీట్లు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ(349), బహుజన సమాజ్‌వాదీ పార్టీ(312), ఆమ్ ఆద్మీ పార్టీ(248) కూడా కోటీశ్వరులకు పెద్దపీటే వేశాయి. అకాలీదళ్(89), ఆర్ఎల్డీ(32), ఎన్పీపీ(27), తృణమూల్ కాంగ్రెస్(17), పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(16), యూకేడీ(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 13, అప్నా దళ్ (సోనీలాల్) 12, మహారాష్ట్రవాది గోమంతక్ 9, ఎన్‌పిఎఫ్ 8, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇద్దరు కోటీశ్వరులను పోటీకి నిలబెట్టాయి. మహిళలకు దక్కని ప్రాధాన్యం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 6,874 అభ్యర్థుల్లో కేవలం 11 శాతం(755) మాత్రమే మహిళలు ఉన్నారు. 6,116 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు పోటీలో ఉన్నారు. (క్లిక్: తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా) కుర్రాళ్ల నుంచి కురువృద్ధుల వరకు.. వయసు పరంగా చూస్తే 41 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 54 శాతం(3,694) మంది ఎన్నికల బరిలో నిలిచారు. 25 నుంచి 40 ఏళ్లలోపు 32 శాతం(2,195) మంది ఉన్నారు. 61 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న వారు 14 శాతం మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన కురువృద్ధులు 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరెవరు విజయం సాధిస్తారనేది మార్చి 10న వెల్లడవుతుంది. (క్లిక్: యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?) -
అబద్ధాల పునాదులపై మోదీ ఓట్లు అడుగుతున్నారు..
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం అబద్ధాల పునాదులపై ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అబద్ధాలు ఆడొచ్చని హిందూ మత గ్రంథాలు ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం, యువత కోసం ఉద్యోగాలు సృష్టిస్తాం అంటూ మోదీ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ సంగతే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ, ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా శుక్రవారం కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిండిరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎన్నడూ మాట తప్పలేదని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ధర్మం పేరిట ఓట్లు అడగాల్సింది పోయి అబద్ధాలను ఆధారంగా చేసుకొని ఓట్ల వేట సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ తరచూ చెబుతున్న డబుల్ ఇంజన్ అంటే అదానీ, అంబానీ మాత్రమేనని రాహుల్ ఎద్దేవా చేశారు. ఇలాంటి డబుల్ ఇంజన్ ప్రజలకు ఉద్యోగాలు కల్పించలేదని తేల్చిచెప్పారు. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా అనుకూల అజెండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. -
కుటుంబ, మాఫియా రాజకీయాలను ఓడించండి: ప్రధాని మోదీ
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో చివరి దశ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. మీర్జాపూర్లో ఎన్నికల ప్రచార సభ అనంతరం వారణాసికి చేరుకున్నారు. కాషాయం రంగు టోపీ, కండువా ధరించి ఓపెన్ టాప్ వాహనంలో నిల్చొని ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. నగరంలో మూడు కిలోమీటర్ల మేర రోడ్‌షో కొనసాగింది. మోదీ కాశీ విశ్వనాథ ఆలయంలో షోడశోపార పూజ చేశారు. సమస్య ఎలాంటిదైనా ధీటుగా ఎదుర్కొంటాం ప్రస్తుతం యావత్ ప్రపంచం సంక్షోభం ముంగిట ఉందని ప్రధాని మోదీ అన్నారు. అయితే, సమస్య ఎంతపెద్దదైనా భారత్ అంతకంటే ధీటుగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. మీర్జాపూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘కోవిడ్ మహమ్మారి, అశాంతి, అస్థిర పరిస్థితులను ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి. సంక్షోభం ఎంత పెద్దదయినా అంతకంటే బలం, పట్టుదలతో దేశం ఎదుర్కొంటుంది’ అని చెప్పారు. తమ ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం కింద వేలాది మందిని స్వదేశానికి తీసుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ, మాఫియా రాజకీయాలను ఓడించి బీజేపీ ప్రభుత్వానికే ఓటేయాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విభజించి, అధికారాన్ని చేజిక్కించుకుని, ఆ తర్వాత దోచుకోవడమే ప్రతిపక్షాల ఏకైక లక్ష్యమంటూ మోదీ దుయ్యబట్టారు. -
అయోధ్య.. అంత వీజీ కాదు
రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రామమందిర క్షేత్రమైన అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్థానిక పరిస్థితులు చెపుతున్నాయి. రామాలయ అంశంలో తప్ప చాలా విషయాల్లో బీజేపీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ మళ్లీ బరిలో నిలపగా, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని బరిలో దించింది. 2012లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను ఓడించిన తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేకు టికెటిచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడూ వదిలి పెట్టలేదనే సానుకూలత ఈసారి కూడా కాషాయదళానికి కలిసి రానుంది. బీజేపీ, ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామమందిర సమస్యను తమ పక్షాన పరిష్కరించలేకపోయేవారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి గుప్తాపై మాత్రం ఇక్కడి వాళ్లలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆయన మరోసారి మోది, సీఎం యోగి ఇమేజీనే నమ్ముకుని ప్రచారం చేశారు. ఫ్రీ రేషన్, గృహ నిర్మాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, మోదీ, యోగీ పాలనపైనే ఓట్లడిగారు. కానీ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధేమీ లేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది. బీఎస్పీ మ్రాతం అయోధ్యలో కులసమీకరణలపై గట్టిగా దృష్టి పెట్టింది. సమాజ్‌వాదీకి అండగా నిలిచే యాదవులు, ముస్లింలు కలిపి అయోధ్యలో 92 వేల మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ ఎత్తుగడతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి ఉంటాయని, ఇది ఎస్పీకి ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐదో దశలో భాగంగా గత ఆదివారం ఇక్కడ పోలింగ్ జరిగింది. ఎస్పీ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందన్నది ఈ నెల 10న కౌంటింగ్‌లో తేలనుంది. కాంగ్రెస్, ఆప్ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రంగానే కన్పిస్తోంది. కూల్చివేతలపై గుర్రు అయోధ్య పట్టణానికి చుట్టుపక్కల వేల దుకాణాలను రోడ్ల వెడల్పు పేరుతో కూలగొట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్తున్నా తరతరాలుగా ఈ దుకాణాలను నడుపుకుంటున్న దుకాణదారులు మాత్రం అధికార బీజేపీపై కోపంగానే ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి గుప్తా 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ 1991 నుంచీ బీజేపీనే గెలుస్తోంది. 2012లో మాత్రం ఎస్పీ నుంచి పాండే కేవలం 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రామమందిరంతో పాటు బ్రాహ్మణ, యాదవ, ముస్లిం కులాల సమీకరణలు, జాతీయ స్థాయిలో మోదీ పాలన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చిన యోగి హయాంలో నెలకొన్న సుస్థిరత తదితరాలు అయోధ్యలో ఈసారి కీలక పాత్ర పోషించాయి. ఐదు దశలపై అంతటా ఆసక్తి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఐదు దశల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 6, 7 దశల్లో మిగతా 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఏడో తేదీతో పోలింగ్ ప్రకియ ముగుస్తుంది. మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో పోలింగ్ ముగియడంతో వీటిలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కనున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ పూర్తయిన 292 స్థానాల్లో బీజేపీ, సమాజ్ వాది–ఆర్ఎల్డీ కూటమి దాదాపు సమానంగా పంచుకోవచ్చని సర్వే పండితులు చెపుతున్నారు. మెజారిటీ ఎవరికి దక్కేదీ ఆరు, ఏడు దశల్లోనే తేలవచ్చని జోస్యం చెప్తున్నారు. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన 292 సీట్లలో బీజేపీ కాస్త ముందున్నట్టు కన్పిస్తున్నా ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అనూహ్య విజయాలు సాధిస్తుందని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా లక్నో అసోసియేట్ ఎడిటర్ సంపత్ పాండే అంచనా వేశారు. మొత్తంమీద ఏడో దశ పోలింగే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేదని ఆయన విశ్లేషించారు. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి సానుకూలత బాగా వ్యక్తమైందని ఓ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తర్వాతి మూడు దశల్లో కూటమికి, బీజేపీకి పోటీ రసవత్తరంగా సాగిందని విశ్లేషించింది. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఆశించిన స్థాయిలో కాకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలవనుందని యూపీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం అంచనా వేసింది. ‘‘తొలి మూడు దశల పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మేం ఒకటికి రెండుసార్లు పోస్టు పోల్ సర్వే చేయించాం. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి స్వల్పంగా స్థానాలు పెరుగుతున్నాయి. మా అంచనా మేరకు చివరి నాలుగు దశల పోలింగే మెజారిటీ ఎవరికన్నది తేల్చనుంది’’ అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: అయోధ్య (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు -
ముగిసిన మణిపూర్ తొలిదశ పోలింగ్
-
కులం, మతం పేరుతో ఇంకెన్ని రోజులు రెచ్చగొడతారు.. ప్రియాంక ఫైర్
లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, పీఎం ఇద్దరు ఒకే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం జరగలేదని ఆరోపించారు. యూపీని మూడు దశాబ్దాల పాటు పాలించిన ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధిని మరచిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ.. బలరాంపూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు కులం, మతంపై రాజకీయాలు చేయడంతో యూపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మూడు పార్టీలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ నేతలు యూపీకి వచ్చి పాకిస్తాన్, ఉగ్రవాదం, మతం గురించి మాట్లాడతారు తప్ప ఇక్కడి ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. మీ పిల్లలకు సరైన విద్య, ఉద్యోగాలు రాకపోయినా ఓటర్లు మాత్రం అనవసరమైన భావోద్వేగాలకు లోనై వారికి ఓట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. యూపీలో ఐదో దశలో ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరుగనుంది. మార్చి 3న ఆరో దశలో, మార్చి 7న ఏడో దశలో పోలింగ్ కొనసాగనుండగా.. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
పేరుకు పొలిటికల్ లీడర్.. పాపం ఇలా బుక్కయ్యాడు.. వీడియో వైరల్
సాక్షి, ముంబై: పేరుకు ఆయనో పెద్ద లీడర్.. కానీ, మాస్కు పెట్టుకోవడం మాత్రం రాదు. కరోనా సమయంలో మాస్కు ధరించాలని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ప్రభుత్వాలు మాస్కులు ధరించని వారికి జరిమానాలు సైతం విధించింది. దీంతో పల్లెటూరు నుంచి పట్నం దాకా.. మాస్కు ఎలా ధరించాలో అందరికీ తెలిసిపోయింది. కాగా, శివసేన పార్టీకి చెందిన ఓ నేత తాజాగా మాస్కు ధరించేందుకు 2 నిమిషాల పాటు తర్జనభర్జన పడ్డారు. అప్పటికీ మాస్కు ఎలా పెట్టుకోవాలో తెలియక మరో వ్యక్తి సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన తీరుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన 41 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా, శివసేన నేతలు గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో శివసనే నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడుతుండగా.. ఆయన వెనుక నిలుచున్న ఓ శివసేన నేత.. ఎన్-95 మాస్కును ఎలా ధరించాలో తెలియక దాదాపు రెండు నిమిషాలు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాస్కు పెట్టుకోవాడం రాకపోవడంతో చివరకు పక్కనున్న మరో నేత సాయం కోరాడు. ఆయన సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నేతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటు.. మాస్క్ పెట్టుకోగానే ప్రజలు సంబురాలు చేసుకున్నట్లు ఓ స్పూఫ్ వీడియో కూడా జతపరిచారు. w8 for it...! 😁 pic.twitter.com/uG7gkaNLBg — Andolanjivi faijal khan (@faijalkhantroll) February 24, 2022 -
UP Election: ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో తన తల్లి గురించి మాట్లాడిన మోదీ.. ఏమన్నారంటే..?
లక్నో: ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శల వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా, యూపీలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలపై పరోక్షంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తాను, ఆయన తల్లి (హీరాబెన్ మోదీ) వ్యాక్సిన్ తీసుకున్నామన్నారు. ఆమెకు 100 ఏండ్లు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని చెప్పారు. ఆమె వంతు వచ్చినప్పుడే వాక్సిన్ తీసుకున్నట్టు మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆమె బూస్టర్ డోసును కూడా తీసుకోలేదని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. వారిని పరోక్షంగా రాజవంశీకులతో పోల్చి.. వారైతే నిబంధనలు పాటించుకుండా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం ముందు వరుసలో ఉండే వారని విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే వ్యాక్సిన్లను అమ్ముకునేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూపీలో ఫిబ్రవరి 27న ఐదో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
UP Elections: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్ కౌంటర్
లక్నోః యూపీలో బుధవారం నాలుగో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఓ వైపు ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగానే యూపీ ప్రజలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. బీజేపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, యూపీలోని అమేథిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగి మాట్లాడుతూ.. సంరక్షణ కరవైన గోవులను పెంచే రైతులకు రూ. 1000 సాయంగా అందజేస్తామన్నారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్‌లో గో హత్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ గోవధ శాలలను శాశ్వతంగా మూసివేస్తామన్నారు. వాటిని తెరవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంరక్షణ లేని గోవులు రైతుల పంటపొలాలను పాడు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దెబ్బతీయకుండా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా యూపీలోని బహ్రెయిచ్‌లో మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. రైతులకు నష్టం కలిగేలా పంట పొలాలను గోవులు నాశనం చేస్తున్నాయని విమర్శించారు. Uttar Pradesh | We have completely stopped illegal slaughterhouses. I promise that we will not let 'Gaumata' be slaughtered while we'll also protect fields of farmers from stray cattle: UP CM Yogi Adityanath at a rally in Amethi#UttarPradeshElection2022 pic.twitter.com/Vr3vEJqXJ1 — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 23, 2022 -
సార్వత్రిక ఎన్నికలకు కొలమానం
చిన్న పార్టీలను చేర్చుకోవడంలో బీజేపీ విఫలమై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగినట్లయితే, దాని తక్షణం ప్రభావం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పైనే పడుతుంది. జాతీయ స్థాయికి ఎదగాలనే ఆయన ఆంక్షలకు గండి పడవచ్చు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్లాన్‌లో భాగంగా, కిందిస్థాయి ఓబీసీలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి, మరింత యోగ్యత కలిగిన మరొక నేత యోగి స్థానాన్ని భర్తీ చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తునే కాదు... జాతీయ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో నడుస్తున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేక కారణాల వల్ల బీజేపీపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో నాలుగింటిలో అధికారంలో ఉన్న బీజేపీ గత అయిదేళ్లలో తన పనితీరును సమర్ధించుకుని ప్రజావ్యతిరేకతను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత కీలకంగా మారనున్న 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దిశానిర్దేశం చేయనున్నాయి. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో 302 సీట్లను బీజేపీ గెల్చుకోవడంతో ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బలమైన పునాది ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా యూపీలో 71 లోక్‌సభా స్థానాలను బీజేపీ గెల్చుకోకపోయి ఉన్నట్లయితే కేంద్రంలో సంకీర్ణప్రభుత్వం తప్పేది కాదు. దానితో మోదీ రాజకీయ ప్రాభవం మరోరకంగా ఉండేది. కాబట్టి, యూపీ అసెంబ్లీ ఎన్నికలు అంటే కేవలం ఆ రాష్ట్రానికి సంబం ధించిన వ్యవహారం కాదు. అవి జాతీయ రాజకీయాలకు దిక్సూచి లాంటివి. యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడయిన వెంటేనే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు వస్తాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో అధికారం పోగొట్టుకోవడం లేదా కనాకష్టంగా గెలుపొందడం అనేవి, బీజేపీకి చెందిన వ్యక్తిని మళ్లీ అదే పదవిలో కూర్చోబెట్టడం విషయంలో ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలుపు బీజేపీకి చాలా ముఖ్యం. 2012లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మోదీని రైజీనా హిల్స్ మార్గం పట్టించినట్లే, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు భావి ప్రధాని భవిష్యత్తును నిర్ణయించనున్నాయని ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. తదుపరి దశలో హిందూ రాజ్యం వైపుగా ప్రయాణం సాగించడానికి, హిందూ ప్రతినిధిగా ఉండే కాషాయాంబరధారి యోగి ఆదిత్యనాథ్ సమర్ధుడని ఆరెస్సెస్ కుటుంబంలోని కొన్ని వర్గాలు ఇప్పటికే భావిస్తున్నాయి. ఒక వర్గం ప్రజలు ఇప్పటికే యోగిని ఆరాధిస్తున్నారు. ఇది మోదీ ఆస్వాదిస్తున్న ఆరాధనకు పూర్తిగా భిన్నమైనది. ముస్లింలను నిర్మూలించాలని పిలుపునిస్తూ హరిద్వార్‌లో యతి నర్సింగానంద్ చేసిన విద్వేషపూరిత ప్రసంగం కానీ, భవిష్యత్తులో కాషాయ జెండా మన జాతీయ జెండా కావచ్చంటూ కర్ణాటకలో బీజేపీ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప చేసిన ప్రకటన కానీ ట్రయల్ బెలూన్లు మాత్రమే. చీకట్లో రాళ్లు వేయడానికి వీటిని డిజైన్ చేశారు. జనం వీటిని ఎలా తీసుకుంటారో చూడటానికి ఇలా ముందస్తుగా కొన్ని మాటలు వదులుతుంటారు. కరుడుగట్టిన హిందుత్వకు యోగి అధికార ప్రచారకర్త. ఎన్నికల సమయంలో వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీ ఆయన్ని ప్రచారం కోసం ఉపయోగించింది. ఈ క్రమంలో ఆయనకు అఖిల భారత స్థాయి లభించేలా చేయడమే దీని లక్ష్యం. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలను మెరుగుపర్చడం వంటి తాను సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, యూపీలో హిందూ, ముస్లిం ఓటర్లను వేరు చేయడం గురించి ఏకరువు పెడుతూ హిందువులు తన వెనకాలే నిలిచేలా చూసుకుంటారు. గోరఖ్‌పూర్ నుంచి అయిదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారణాసి, మథుర, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్ హిందూ మత క్షేత్రాలను యోగి పునరుద్ధరించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేస్తున్న ఘనత తన ఖాతాలోనే చేర్చుకున్నారు. రాబోయే ఎన్నికలు 80 శాతానికి 20 శాతానికి మధ్య పోరాటంగా ఉంటాయని యోగి జనవరిలో పేర్కొన్నారు. అంటే హిందూ మెజారిటీకి ముస్లిం మైనారిటీకి మధ్య యుద్ధం అని నొక్కి చెప్పారన్నమాట. తర్వాత తన ఉద్దేశం అది కాదని చెప్పారనుకోండి. హిందూస్తాన్ కోసం యుద్ధం గురించి కలగంటున్న వారు ఎన్నడూ విజయం సాధించలేరని, ఎందుకంటే దేశాన్ని నడుపుతోంది రాజ్యాంగమే కానీ షరియత్ కాదని యోగి స్పష్టం చేశారు. తర్వాత యూపీ వాలాలు బీజేపీకే ఓటు వేస్తారని, యూపీని కశ్మీర్‌లాగా, బెంగాల్‌లాగా, కేరళలాగా మార్చే తప్పిదం వారు చేయరని యోగి నొక్కిచెప్పారు. ఈ రాష్ట్రాలు ముస్లింలను బుజ్జగిస్తున్నాయని బీజేపీ ఆరోపణ. అందుకే యోగి ఈ అంశాన్ని వీలైన ప్రతిచోటా ప్రస్తావిస్తుంటారు. అయితే ఈ సారి ఎన్నికల క్షేత్రంలో ఇది నిజానికి పనిచేస్తుందా అనేది చూడాలి. మరోవైపున అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరి ప్రజలను బాగా ఆకర్షిస్తున్నారు. ప్రత్యేకించి పశ్చిమ యూపీలో రైతుల ఆగ్రహం మిన్నంటుతోంది. జాట్లు కూడా బీజేపీకి దూరం జరిగారు. 2014 ఎన్నికలను ప్రభావితం చేసిన 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల నేపథ్యంలో తాము వ్యవహరించినట్లుగా... ఈసారి హిందూ–ముస్లిం అంటూ వేరుచేసి చూసే పదాల డాంబికానికి తాము లోబడిపోమని చాలామంది ఓటర్లు చెప్పారు. 2013 ముజఫర్‌నగర్ అల్లర్లను బీజేపీ ఎంతగా వాడుకుందంటే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అవి వరంలా మారాయి. ఏ రకంగా చూసినా ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ యూపీలో జరిగిన తొలి రెండు దశల ఎన్నికలు ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి వైపే మొగ్గు చూపాయి. కానీ ఇంకా అయిదు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. (చదవండి: పశ్చిమ యూపీ... కాషాయానికి కీలకం!) చిన్న పార్టీలను చేర్చుకోవడంలో బీజేపీ విఫలమై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగితే, తక్షణం కలిగే ప్రభావం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పైనే పడుతుంది. ముఖ్యమంత్రి పదవిని యోగి కోల్పోతారు. అలాగే జాతీయ స్థాయికి ఎదగాలనే ఆయన ఆంక్షలకు గండి పడవచ్చు కూడా. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్లాన్‌లో భాగంగా కిందిస్థాయి ఓబీసీలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి, మరింత యోగ్యత కలిగిన మరొక నేత యోగి స్థానాన్ని భర్తీ చేయవచ్చు. 2017, 2019 ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన వారు గణనీయంగా మోదీకే ఓటేశారు. ప్రత్యేకించి బీజేపీ నుంచి డజనుకు పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వీరిలో చాలామంది ఈబీసీలకు చెందినవారు కావడం గమనార్హం. యోగికి కళ్లెం వేయడం బీజేపీకి కష్టసాధ్యమని ఇప్పటికే రుజువైపోయింది. ప్రధానమంత్రి విశ్వాసం చూరగొన్న బ్యూరోక్రాట్ అయిన ఏకే శర్మను యూపీకి పంపించడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం యోగిపై స్వారీ చేయాలని ప్రయత్నించింది. ప్రభుత్వాధికారిగా ఉండి ఎంఎల్సీ అయిన శర్మను డిప్యూటీ సీఎంగా చేయాలన్నది ప్లాన్. కానీ యోగి దాన్ని అడ్డుకోవడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం రచించిన పథకం ఫలించలేదు. (చదవండి: మూడో ఫ్రంట్ మనగలిగేనా?) ఉత్తరప్రదేశ్‌లో చాలామంది నేడు మార్పు కోరుకుంటున్నారు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమివైపు జనం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఎన్నికలు ప్రజల మనోభావాల మీద మాత్రమే ఆధారపడి ఉండవు. ఆ సెంటిమెంట్లను మేనేజ్ చేయడానికి తగిన యంత్రాంగం కూడా అవసరం. ఇక బీజేపీ విషయానికి వస్తే అత్యధిక వనరులతో కూడిన సుసంపన్న యంత్రాంగం దానికి ఉంది. చివరి నిమిషంలో తలెత్తే సమస్యలను కూడా అది నిర్వహించుకోగలుగుతుంది. అయితే, ఈ సెంటిమెంట్ ప్రభుత్వంపై కేవలం అసంతృప్తిగా మాత్రమే ప్రతిఫలిస్తుందా లేక ఆగ్రహంగా మారుతుందా అనే అంశంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇదొక్కటే ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, యోగి ఆదిత్యనాథ్‌ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. (చదవండి: బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా?!) చివరగా చెప్పాలంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తునే కాదు... జాతీయ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయం. – నీరజా చౌదరి సీనియర్ రాజకీయ వ్యాఖ్యాత -
ప్రచారానికి వెళ్తున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా కాన్వాయ్ ఆపి..
ఇంపాల్: మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరో ఆరు రోజుల్లో మొదటి దశలో ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇంపాల్లోని లువాంగ్సంగ్బామ్ క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని వస్తున్న మార్గంలో బీజేపీ మహిళా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. భారత్ మాతా కీ జై, మోదీ జీకి జై అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్‌లో నుంచి అక్కడున్న మహిళలకు కరచాలనం అందించారు. వారితో ముచ్చటించారు. ఈ వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్లో పోస్టు చేశారు. మణిపూర్‌లో విలువైన క్షణాలు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ప్రధాని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. Precious moments in Manipur. Grateful for the affection… pic.twitter.com/ERopqqtVbg — Narendra Modi (@narendramodi) February 22, 2022 -
కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ వార్తా సంస్థ టీవీ, యాప్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్ర ప్రభుత్వం కేంద్రం కొరడా ఝుళిపించింది. సదరు వార్తా సంస్థకు చెందిన వెబ్సైట్, యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిఘా వర్గాల సమాచారం మేరకు Sikhs For Justice (SFJ)తో ఆ వార్తా సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈ ఛానెల్ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి వార్తా సంస్థపై నిషేధం విధించినట్టు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. Ministry of Information & Broadcasting has ordered blocking of apps, website, and social media accounts of foreign-based “Punjab Politics TV” having close links with Sikhs For Justice — ANI (@ANI) February 22, 2022 -
సోనూ సూద్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?
Punjab Legislative Assembly Election 2022: ఎన్నికల ప్రవర్తనా నియామావళికి సంబంధించి పంజాబ్‌లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సినీ నటుడు సోనూ సూద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు ఆదివారం సోనూను అడ్డుకున్న సంగతి తెలిసిందే. -
ఎన్నికల వేళ కేంద్ర హెం శాఖ కీలక నిర్ణయం.. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను వేర్పాటు వాదినే అయితే అరెస్ట్ చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుమార్ విశ్వాస్‌కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమార్ విశ్వాస్‌కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. ‘వై’ కేటగిరీ భద్రత ఇదే.. వై కేటగిరి భద్రతలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు విధులు నిర్వర్తిస్తారు. అయితే, వీరిలో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వద్ద భద్రతలో ఉంటారు. మిగిలిన వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా ఆయనతో పాటే వెళ్తారు. -
ఎన్నికల వేళ.. కేజ్రీవాల్, చన్నీలపై కేసు నమోదు
ఛండీఘడ్: మరికొన్ని గంటల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసు కేసు నమోదైంది. అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై పంజాబ్ ఎన్నికల పోలింగ్ అధికారి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దూషించినట్లు ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంపై ఆయా పార్టీ నేతలు కేజ్రీవాల్‌పై పంజాబ్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కాగా, ప్రచార సమయం ముగిసినప్పటికీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కూడా కేసు నమోదు చేశారు. -
యూపీ సీఎం వార్నింగ్.. వారి కోసం మార్చి 10 తర్వాత బుల్డోజర్లు వస్తాయి..
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నేతల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. రాష్ట్రంలో బుల్డోజర్ల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఒకరు.. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్డోజర్లను ఉపయోగించింది. ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లను అలా ఉపయోగించగలదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మెయిన్‌పురీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు బుల్డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని బుల్డోజర్లన్నింటిని రిపేర్ కోసం పంపించామన్నారు. బుల్డోజర్ల విషయంలో చింతించాల్సిన పని లేదు. గత నాలుగున్నరేళ్లుగా దాక్కున్న కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రకటన వెలువడగానే బయటకు వస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పనిచెబుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యోగి హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్ది రోజుల క్రితం బుల్డోజర్ల అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీలో ఉండాలంటే యోగీకి ఓటు వేయాల్సిందేన్నారు. ఓటు వేయని వారు యూపీ నుంచి వెళ్లిపోవాలని వీడియోలో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా బీజేపీకి ఓటు వేయని వారి కోసం జేసీబీలు, బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని సృష్టించింది. #WATCH | I have come here to assure you that I have send the bulldozer for repair. 10 March ke baad jab ye fir se chalna prarambh hoga to jin logo me abhi jyada garmi nikal rahi hai, ye garmi 10 March ke baad apne aap shant ho jayegi: UP CM Yogi Adityanath in Karhal, Mainpuri pic.twitter.com/hvjcQsKbeE — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 18, 2022 -
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
ఛండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లో ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. గురునానక్ స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం.. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాలపై మాఫియా రాజ్‌ను అంతం చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా పైలట్ కావచ్చు, కానీ తుఫాను వచ్చినప్పుడు, మనం కష్టాలను అవకాశంగా మార్చుకోగలగాలి.. అదే కాంగ్రెస్ మేనిఫెస్టో లక్ష్యమని సిద్ధూ పేర్కొన్నారు. కాగా, నూనెగింజలు, పప్పులు, మొక్కజొన్నలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నట్టు సిద్దూ వెల్లడించారు. మేనిఫెస్టోలోని అంశాలు.. - పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు. - మహిళలకు నెలకు రూ.1,100 అందజేత. - ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు. -
రెండు రోజుల్లో పోలింగ్.. మోదీ ఇంట కీలక సమావేశం
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జోరును పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కమలం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో దేశవ్యాప్తంగా సిక్కు మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని ఆతిథ్యమిచ్చారు. బీజేపీ గెలుపును కాంక్షిస్తూ వారితో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు.. సిక్కుల పవిత్రమైన కిర్పన్(ఖడ్గం)ను మోదీకి అందజేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్జీ సించేవాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
నేను ఉగ్రవాదినే.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకుంటున్నారు. నేతల తీవ్ర ఆరోపణతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ‘పంజాబ్ సీఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి’ కావాలనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శుక్రవారం కేజ్రీవాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఉగ్రవాదినేని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించి స్వీటెస్టు టెర్రరిస్టును(sweetest terrorist) అయ్యానంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తాను వేర్పాటువాదిని అని ప్రధాని మోదీకి తెలిస్తే.. ఈ ఆరోపణలను ఎందుకు నిరూపించలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను జాతీయ పార్టీల నేతలు(కాంగ్రెస్, బీజేపీ) దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్నారని, ఒక భాగానికి ప్రధానిని కావాలని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తాను నిజంగా వేర్పాటు వాదిని, టెర్రరిస్టుని అయితే.. కేంద్ర భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి. ప్రధాని మోదీజీ నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు. వారు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా అని మాటల తూటాలు పేల్చారు. ఈ సందర్భంగానే అన్ని పార్టీలు అవినీతిమయం అయ్యాయంటూ కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్‌ను ఓడించేందుకు అందరూ కలిసిపోయారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు పంజాబ్‌ను విభజించాలని కలలు కంటున్నారు. వారు అధికారంలోకి రావడం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. మరోవైపు 'వేర్పాటువాదం' ఆరోపణలపై విచారణ జరిపించాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీని కోరారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 20వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఓటేయొద్దు..
పనాజీ : దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో పోరు రసవత్తరంగా మారింది. పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుండగా.. మరి కొన్నిచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తమ సత్తా చాటేందుకు వినూత్న రీతిలో ముందుకు సాగుతోంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విభిన్న ఎత్తుగడులతో అధికార పార్టీలను ఇరుకున పెడుతున్నారు. తాజాగా గోవా రాజకీయ పరిణామాలపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 10న గోవా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మార్చి 11వ తేదీన కాంగ్రెస్ నుంచి నేతలందరూ బీజేపీలో చేరుతారని అన్నారు. కాబట్టి బీజేపీ ఓడిపోవాలని కోరుకునే గోవా ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నాను.. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు, వారి ఓటు వృధా అవడమే కాకుండా అది బీజేపీకే వెళ్తుందని తెలిపారు. మీ ఓట్లన్నీ ఆప్‌కి వేయండని గోవా ప్రజలను కేజ్రీవాల్ కోరారు ఈ క్రమలోనే తాము అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆరో నెలల్లోనే రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గత 10 సంవత్సరాల బీజేపీ పాలనలో గోవాలో మైనింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా గోవాలో సోమవారం (ఫిబ్రవరి 14న) ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. After results are announced on March 10, by March 11 all from Congress will join BJP. So I appeal to the people of Goa who want to see the BJP lose, don't vote for Congress. Their vote will go wasted, it will go to the BJP. Give all your votes to AAP: Arvind Kejriwal, AAP pic.twitter.com/zqgReiAoUv — ANI (@ANI) February 12, 2022 -
ఆప్‌తోనే పంజాబ్ కలల సాకారం
ధురి (పంజాబ్): పంజాబ్‌లో ఆప్ గెలుపు కోసం పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ భార్య సునీత, కూతురు హర్షిత కూడా చెమటోడుస్తున్నారు. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తరఫున శుక్రవారం ధురి అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్లు ప్రచారం చేశారు. ఆయన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కుటుంబ సంక్షేమం కోసం కలలు కనే, వాటిని నిజం చేసే ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనన్నారు. పరిశుభ్రమైన తాగునీరు, కరెంటు, విద్య, మెరుగైన ఆరోగ్య వసతులు అందరికీ ఉచితంగా అందాలి. ఆప్ మాత్రమే దీన్ని సుసాధ్యం చేయగలదు’’ అన్నారు. ఉచిత విద్య, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య తదితర మౌలిక సదుపాయాలకు కేజ్రివాల్ హామీ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వాగ్దానం చేసిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 కూతుళ్ల చదువుకు ఉపయోగపడుతుందన్నారు. పంజాబ్ రైతుల సమస్యలను పార్లమెంటులో చిరకాలంగా లేవనెత్తుతున్న ఏకైక ఎంపీ భగవంత్ మాన్ మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలోని చిన్నారుల భవిష్యత్తే ఆప్‌కు ముఖ్యమని హర్షిత అన్నారు. వారందరికీ నాణ్యమైన స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు కావాలన్నారు. ప్రచారంలో మాన్ తల్లి హర్పాల్ కౌర్, సోదరి మన్‌ప్రీత్ కూడా పాల్గొన్నారు. యూపీ పీఠానికి అదే దారి? కస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల నగరంగా పేరు పొందిన కస్గంజ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో నెగ్గితే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ నమ్మకాన్ని బలపస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏ పార్టీకి కూడా కంచుకోటగా లేదు. అక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం కాస్త కష్టమే. 2007లో కస్గంజ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి హస్రత్ ఉల్లా షేర్వాణి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మన్‌పాల్ సింగ్ కస్గంజ్లో విజయం సాధించారు. ఇక 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఏకం గా 49 వేల ఓట్ల మెజారిటీతో విజయం సా ధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ నుంచి ప్రముఖ రైతు నాయకుడు కుల్దీప్ పాండే ఎన్నికల బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్‌పాల్ సింగ్ పోటీ పడుతూ ఉంటే, బీఎస్పీ ప్రభుదయాళ్ వర్మకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 20న మూడోదశలో పోలింగ్ జరగనుంది. -
వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం!
వందేళ్ల కిందట స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైప శిరోమణి అకాలీదళ్ తర్వాత శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (గురుద్వారాల పాలనా వ్యవహారాలు చూసే సంస్థ) అవసరాల నిమిత్తం రాజకీయ పార్టీగా అవతరించింది. గత ఏడాది డిసెంబర్ 14న 101 వార్షికోత్సవాన్ని జరుపుకొన్న ఈ పార్టీ ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో అత్యంత కఠిన పరిస్థితులకు ఎదురీదుతోంది. సిక్కుల పార్టీగా దశాబ్దాలు హవా చలాయించిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కి ఈ పరిస్థితి రావడానికి 2007 నుంచి 2017 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. అధికారం కోల్పోయి ఐదేళ్లవుతున్నా.. ఆ కాలంలో పడిన ముద్రను తొలగించుకోవడానికి ఇప్పటికీ ఎస్ఏడీ గింజుకుంటూనే ఉంది. మరోవైపు పంజాబ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల పాటు అకాలీదళ్– కాంగ్రెస్‌ల మధ్యే ద్విముఖ పోరు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం. బీజేపీ-అమరీందర్ కూటమి, రైతు సంఘాలతో కూడిన సంయుక్త సమాజ్ మోర్చాలతో ప్రస్తుతం పంజాబ్ రాజకీయాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. అకాలీదళ్ స్వయం కృతాపరాధానికి కారణాలేమిటి, వాటి నుంచి బయటపడటానికి ఎస్ఏడీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రస్తుత పార్టీ పరిస్థితిపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం.. ముందు నుంచే దిద్దుబాటు చర్యలు ► జరిగిన నష్టాన్ని అంచనా వేసిన మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్... ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ పోయారు. 20 మందికి పైగా కొత్త ముఖాలకు చోటిచ్చారు. ► మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం రగిలిపోతుండటాన్ని గ్రహించిన సుఖ్బీర్ బీజేపీతో రెండు దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకొని... ఎన్డీయే నుంచి బయటికి వచ్చేశారు. ► భారత్‌లో మరే రాష్ట్రంలో లేనంతగా... పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుఖ్బీర్ 2021 జూన్‌లోనే బీఎస్పీతో పొత్తును ఖరారు చేసుకున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 నియోజకవర్గాలను కేటాయించారు. 2007లో 4.17 ఓట్ల శాతాన్ని, 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4.3 ఓట్ల శాతాన్ని సాధించిన బీఎస్పీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి దారుణంగా దెబ్బతింది. 1.59 శాతం ఓట్లు మాత్రమే పొందింది. ► అకాలీదళ్ అధికారంలోకి వస్తే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, ఇందులో ఒకటి బీఎస్పీకి కేటాయిస్తామని సుఖ్బీర్ ప్రకటించారు. దళిత ఓట్లను సాధ్యమైనంతగా ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా డిప్యూటీ సీఎంను బీఎస్పీకి ఆఫర్ చేశారు. ఎన్నెన్నో కారణాలు... ► ఏఎస్డీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయింది. ► ఇసుక మాఫియా చెలరేగిపోయింది. ► పంజాబ్ డ్రగ్స్ వాడకానికి భారత్‌లో కేంద్ర స్థానంగా మారిపోయింది. ‘ఉడ్తా పంజాబ్ (నిషాలో తేలిపోయే పంజాబ్)’గా పేరు స్థిరపడిపోయే స్థాయిలో ఇక్కడి యువత డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ► 2015 ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం.. ఎయిమ్స్, మరో స్వచ్చంద సంస్థతో కలిపి నిర్వహించిన సర్వేలో పంజాబ్‌లో 2.32 లక్షల మంది డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలయ్యారని తేలింది. అంటే రాష్ట్ర జనాభాలో (మైనారిటీ తీరిన వారిలో) 1.2 శాతం మంది డ్రగ్స్ లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇక డ్రగ్స్ అలవాటు ఉన్న వారి సంఖ్య 8.6 లక్షలుగా ఉందని తేలింది. ► 2015లో అక్టోబరులో సిక్కుల పవిత్రగ్రంధం... గురు గ్రంధ్ సాహిబ్‌ను కొందరు దుండగులు అపవిత్రం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సిక్కులపైకి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన శిరోమణి అకాలీదళ్‌పై ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా పెంచేసింది. ► 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎస్డీ కేవలం 15 స్థానాలు మాత్రమే సాధించి... అవమానకరంగా మూడోస్థానానికి పడిపోయింది. సిక్కుల ఆత్మగౌరవ నినాదం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్నా... పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారపర్వంలో చురుకుగా పాల్గొనడం లేదు. ఇక ఆమె పంజాబ్‌పై దృష్టి సారించడంపై అకాలీదళ్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. పైగా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తెచ్చిన సమయంలో శిరోమణి అకాలీదళ్ నరేంద్ర మోదీ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పదేపదే లేవనెత్తుతూ ఎస్ఏడీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. రైతుల్లో ఆగ్రహం తగ్గి అకాలీదళ్‌ను పూర్వస్థాయిలో ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ప్రకాశ్‌సింగ్ బాదల్ హయాంలో అయితే రైతుల్లో అనేక మంది తరతరాలుగా అకాలీదళ్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ నేటితరం ఆలోచన మారుతోంది. రాజకీయాల్లో వారు కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఫలితంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే సుఖ్బీర్ తండ్రిపై రైతుల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచుకోవాలనే ఉద్దేశంతో 94 ఏళ్ల వయసులో ఆయన్ను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో లాంబీ నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తున్నారు. గతంలో ఐదుసార్లు పంజాబ్ సీఎంగా వ్యవహరించిన ప్రకాశ్ సింగ్ బాదల్ భారత్‌లో అత్యధిక వయసులో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సంప్రదాయ ఓటు బ్యాంకు తగ్గడం, కొత్త ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నామనే అంశాన్ని గ్రహించిన సుఖ్బీర్ సిక్కుల ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు. బెంగాల్‌ను బెంగాలీలే పాలించుకుంటారని, బయటివారు ఇక్కడ అక్కర్లేదంటూ ప్రచారం చేసి బీజేపీని మట్టికరిపించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందిన సుఖ్బీర్ ఇప్పుడు అకాలీదళ్‌కు ఏకైక పంజాబీ ప్రాంతీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అకాలీదళ్ ప్రస్తుతం ఎదురీదుతోంది. పంజాబ్‌లో ఈనెల 20 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కెడ (అకాలీదళ్ ఎన్నికల గుర్తు కూడా) ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.! -
కమలానికి కఠిన పరీక్ష.. దేశంలో తగ్గుతున్న బీజేపీ పట్టు!
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా మాత్రమే కాదు, బీజేపీకి అత్యంత కీలక పరీక్షగా కూడా నిలుస్తున్న ఎన్నికలివి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతున్న వేళ తిరిగి జాతీయ రాజకీయాలపై పట్టు సాధించాలంటే కమలదళానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. రానున్న రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వీటి ప్రభావం ఉంటుంది. అందుకే కమలనాథులకి అయిదు రాష్ట్రాల ఎన్నికలు కఠిన సవాలే విసురుతున్నాయ్.. అందరిలోనూ ఉత్కంఠని పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఆయా రాష్ట్రాల్లో తన పట్టు నిలుపుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్‌పై అంతగా ఆశలు పెట్టుకోని కమలనాథులు ఈసారి ఎక్కువగా యూపీపైనే దృష్టి సారించారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించకపోతే జాతీయ రాజకీయాలపై బీజేపీ పట్టు తగ్గిపోయిందనే సంకేతం వెళుతుంది. పట్టు కోల్పోతోందనే భావన ప్రబలితే... ప్రమాద ఘంటికలు మోగినట్లే లెక్క. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో వరుసగా రెండోసారి కేంద్రంలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలపడిపోతోంది. అందుకే ప్రస్తుతం జరగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ వ్యాప్తంగా వివిధ అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 19 రాజ్యసభ స్థానాలపై.. ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్, జూన్లలో సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉండటంతో జూలైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న యూపీ నుంచి 11, పంజాబ్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 1 స్థానం, అంటే మొత్తంగా 19 మంది ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలన్నీ ఎన్డీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఖాళీ అవుతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటముల ప్రభావం ఈ రాజ్యసభ ఎన్నికలపై పడుతుంది. పంజాబ్‌లో అధికారంపై పెద్దగా ఆశల్లేని బీజేపీ 11 మందిని రాజ్యసభకు ఎన్నుకునే యూపీపైనే తన దృష్టి అంతా కేంద్రీకరించింది. రాష్ట్రపతి ఎన్నికలపై .. ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిపోతోంది. కొత్త రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఎన్నికవ్వాలంటే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి మెజార్టీ వచ్చి తీరాలి. పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జనాభా ఎక్కువగా ఉండడంతో ఎలక్టోరల్ కాలేజీలో యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అందరూ కలసికట్టుగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎన్నికలయ్యే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కూడా ఈ సారి 19 మంది సభ్యులు ఎన్నికవుతారు. వారు కూడా రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకే ఈసారి ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్‌గానే మారాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై .. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించడంపైనే బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటగలదన్నది ఆధారపడి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 301 లోక్‌సభ స్థానాలు సాధించగా.. ఇందులో 62 ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అందుకే యూపీలో తన పట్టు నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యావశ్యకం. కానీఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ –ఆర్ఎల్డీ కూటమి గట్టిగా సవాల్ విసురుతూ ఉండడంతో కమలనాథులు కలవరానికి గురవుతున్నారు. తదుపరి నాయకత్వం పైనా... బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరే నాయకుడికి లేదు. సమర్థుడైన నాయకుడిగా ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. అంతటి ఛరిష్మా కలిగిన మోదీకి వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు బీజేపీ అభిమానులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరే చెబుతారు. భావిభారత ప్రధాని యోగియే అంటూ బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. మోదీకి సరైన వారసుడిగా యోగి నిలవాలన్నా, జాతీయ రాజకీయాల్లో బీజేపీ పట్టును కొనసాగించాలన్నా ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. 2017 డిసెంబర్ నాటికి దేశంలో బీజేపీ, దాని మిత్రపక్ష పాలిత రాష్ట్రాలు, 2019 డిసెంబర్ నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గాయిలా.. రాష్ట్రాలపై పట్టు ... 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కాక ఆయనకున్న క్రేజ్‌తో క్రమంగా రాష్ట్రాలపై కూడా బీజేపీ పట్టు బిగించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ, అమిత్ షా కాంబినేషన్‌కు ఎదురే లేకుండా ఉండేది. 2018 సంవత్సరం మొదట్లో ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ, లేదంటే ఆ పార్టీ మిత్రపక్షాల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దేశ జనాభాలోని 70 శాతం మంది బీజేపీ పరిపాలన కిందకి వచ్చారు. కానీ అదే ఏడాది చివర్లో తాను అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార వ్యతిరేకతను ఎదుర్కొని బీజేపీ ఓడిపోయింది. ఆ ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. మోదీ తన ప్రభ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే, హరియాణాలో సీట్ల సంఖ్య తగ్గిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక శివసేనకు అప్పగించింది. 2021లో జరిగిన అసోంలో కూడా మెజార్టీ స్థానాల్లో కోత పడింది. మొత్తంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ రాష్ట్రాల్లో కూడా తన హవా కొనసాగాలంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పనిసరిగా మారింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే..
లఖింపూర్ ఖేరి ఘటనపై ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మొదటి దశ పోలింగ్ జరుగుతుండగా.. నిన్న(బుధవారం) ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు తమ వైపే ఉన్నారంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులను కారుతో తొక్కించి చంపిన లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తున్నదని తెలిపారు. కేసు దర్యాప్తు ఆగబోదని అన్నారు. సుప్రీంకోర్టు ఎలా కొరితే ఆ విధంగా.. ఆ జడ్జీతోనే దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 2021 అక్టోబర్ 3న, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో రైతులపైకి దూసుకెళ్లిన SUVని అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడు. లఖింపూర్ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు బలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయగా.. గత అక్టోబరు నుండి జైలులో ఉన్నాడు. అయితే ఈ ఘటనకు బాధ్యతగా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతను హోం శాఖ సహాయ మంత్రిగా PM మోడీ ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు. యూపీ పోలీసులు, పరిపాలనా యంత్రాంగం విచారణలో నిదానంగా సాగుతోందని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఇక వ్యవసాయం చట్టాల రద్దు గురించి ప్రధాని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఉపసంహరించుకున్నాం. దీన్ని ఇకపై వివరించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ చర్యలు ఎందుకు అవసరమో భవిష్యత్తే స్పష్టం చేస్తుంది”అని ప్రధాని ఉద్ఘాటించారు. -
ఉత్తరాఖండ్ అభివృద్ధే కాంగ్రెస్‌కు నచ్చదు: మోదీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఇన్నేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ప్రధాని నరంద్ర మోదీ ఆరోపించారు. వారి పాలనలో తరాల తరబడి రాష్ట్ర ప్రజలు ఉపాధి కోసం వలస పోతూ వచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. ఈసారి ఓటేసేటప్పుడు ఎలాంటి పొరపాటూ చేయొద్దని రాష్ట్ర ప్రజలకు హితవు పలికారు. మంగళవారం వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రానికి చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌తో తనకు ప్రత్యేక బంధముందని, ప్రజల సమస్యలు, ఆకాంక్షలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ పెడతామన్న కాంగ్రెస్ వాగ్దానాన్ని ప్రస్తావిస్తూ, ఓటు బ్యాంకు, సంతుష్టీకరణ రాజకీయాలను ఆ పార్టీ ఇంకా మానుకోలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పాటే కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మోదీ అన్నారు. -
ఎన్నికల ప్రచార ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షల్ని సడలించింది. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లో కరోనా పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా సభలను ఏర్పాటు చేసుకోవడానికి ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సభలను నిర్వహించుకునే అవకాశం వచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత ఫిబ్రవరి 10న మొదలు అవుతుండగా ఫిబ్రవరి 8 సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసిపోతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని ఇప్పటికే ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ జనవరి 22న అత్యధికంగా 32 వేల కేసులు నమోదైతే ఫిబ్రవరి 5 నాటికి అయిదు రాష్ట్రాల్లో మొత్తం కేసుల సంఖ్య 7 వేలకు తగ్గిపోయింది. దీంతో ఎన్నికల సభలపై ఆంక్షల్ని సడలించిన ఈసీ రోడ్డు షోలు, పాదయాత్రలపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తోంది. ‘‘బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షల్ని సడలిస్తున్నాం. హాలుల్లో జరిగే సమావేశాల్లో 50% సామర్థ్యంతోనూ, బహిరంగ సమావేశాల్లో ఆ గ్రౌండ్స్‌లో 30% సామర్థ్యంతో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికారులు విధించే ఆంక్షలకు అనుగుణంగా ఇవి మారుతాయి. ఏ నిబంధనల ప్రకారం తక్కువ సంఖ్యలో హాజరవుతారో దానినే పాటించాలి’’ అని ఈసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లకి పకడ్బందీ భద్రత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి తిరిగి వస్తుండగా హపూర్‌లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో స్టార్ ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల భద్రతపై ఈసీ దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాలంటే ఆయా పార్టీల ముఖ్య ప్రచారకర్తల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి నోటీసులు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ ఫొటోని ముస్లిం మత ప్రబోధకుడిగా మార్ఫింగ్ చేసి, ట్విట్టర్లో షేర్ చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర బీజేపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ స్పష్టం చేసింది. -
సిద్ధూ త్యాగం.. చన్నీ పాదాభివందనం
Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించిన ముఖ్యమంత్రి ఎంపిక.. ప్రకటనను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను ఎలాగోలా పార్టీ చల్లబర్చింది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీనే.. సీఎం అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందు కొన్ని గంటలపాటు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్. ఈ తరుణంలో.. స్టేజ్‌పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం. లూథియానా: ఇక పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ పేరును రాహుల్ ఆదివారం పంజాబ్‌లో వర్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. ప్రసంగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని, ఆకలిని అర్థం చేసుకున్నవారే కావాలని అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. దాన్ని మీరు సులభతరం’’ చేశారు అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్ జాఖర్‌ను రాహుల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీడియా, టీవీ చర్చా కార్యక్రమాల్లో నాయకులు పుట్టుకురారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పోరాటంతోనే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని వివరించారు. గొప్ప నాయకులకు తమ పార్టీలో లోటు లేదన్నారు. ప్రజల కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూల రక్తంలో పంజాబ్ ఉందన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంది. ఇందుకోసం అటోమేటెడ్ కాల్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంది. దళిత సిక్కు నాయకుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. వర్చువల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ రోడ్లపై ఎవరికైనా సాయం చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయన ప్రజల మధ్య ఉండడం ఎప్పుడైనా గమనించారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పదవుల కోసం పాకులాడలేదు: సిద్ధూ తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన లూథియానాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత 17 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని, పదవులపై ఎప్పుడూ ఆశపడలేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నానని వివరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేశారని కొనియాడారు. మార్పునకు సమయం ఆసన్నమైందని వెల్లడించారు. పంజాబ్ అభివృద్ధి కంటే తనకు కావాల్సింది ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రుతులకు అనుగుణంగా అమరీందర్ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌ను లూటీ చేసిన నాయకులు ఇప్పుడు డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ అధికారం రాహుల్‌కు ఎక్కడిది?: బీజేపీ చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అధికారం రాహుల్ గాంధీకి ఎక్కడుందని బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదివారం ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఎలాంటి హోదా లేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ అధికారంతో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. పేరు చివర ‘గాంధీ’ అన్న ఒక్క అర్హత మాత్రమే రాహుల్‌కు ఉందని ఎద్దేవా చేశారు. -
ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్కో పార్టీ ప్రత్యర్థులను ఎద్దేవా చేసే నినాదాలతో తమ ప్రచారాల్లో, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నాయి. యూపీ, యోగీ కలిస్తే ‘ఉప్‌యోగీ’ అంటూ బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని తీవ్రతరం చేయగా, ‘బదలావ్ కీ యే ఆంధీ హై.. నామ్ ప్రియాంక గాంధీ హై’ (ఇది మార్పు తుఫాను.. పేరు ప్రియాంక గాంధీ) అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ‘ఆడపిల్లను.. పోరాడగలను’ అంటూ నవయువతను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్న సమాజ్‌వాదీ సైతం ‘కృష్ణ, కృష్ణ హరే హరే.. అఖిలేశ్ భయ్యా ఘరే ఘరే’ అని నినాదాన్ని ఎత్తుకొని విస్తృత ప్రచారం చేస్తోంది. బీజేపీ కొత్తగా మథురలో కృష్ణమందిర నిర్మాణ అంశాన్ని తెరపైకి తేవడంతో దానికి చెక్ పెట్టేలా యాదవ కులపతి ‘కృష్ణుడే’ కలలోకి వచ్చి తనతో స్వయంగా మాట్లాడుతున్నాడని అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. ఎస్పీకి గట్టి మద్దతుదారులైన యాదవ సామాజికవర్గంపై సహజంగానే ఇది ప్రభావం చూపుతోంది. సమాజ్‌వాదీ పాలనలో ముస్లింల ఆగడాలు అంతుండేది కాదని పరోక్షంగా చెబుతూ ‘గతంలో రేషన్‌కార్డులైనా, ఇతర ప్రభుత్వ పథకాలైనా అబ్బాజాన్ అని పిలిచే వారికే దక్కేవి’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంధించిన విమర్శనాస్త్రం జనంలోకి బాగా వెళ్లింది. 2017కు ముందు యూపీలో అరాచకం రాజ్యమేలేదని, అభివృద్ధి శూన్యమని... యోగి హయాంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటూ బీజేపీ టీవీల్లో ‘ఫరక్ సాఫ్ హై (మార్పు సుస్పష్టం) అంటూ ప్రకటనలను హోరెత్తిస్తోంది. గతంలోనూ ఆయా పార్టీలు ఎత్తుకున్న నినాదాలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషించాయి. దళిత హక్కులపై మాయావతి లేవనెత్తిన నినాదం, రామ్ మందిరంపై బీజేపీ లేవనెత్తిన నినాదాలు ప్రజల మెదళ్లలోకి చొచ్చుకువెళ్లి ఆయా పార్టీలకు అధికార పీఠం కట్టబెట్టాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు పార్టీలు చేసిన ప్రధాన నినాదాలను పరిశీలించినపుడు జనబాహుళ్యంలోకి ఇవి ఎంతగా బలంగా వెళ్లాయో, ఓటర్లను ఆలోచనా సరళిని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తుంది. ‘తిలక్ తరాజు ఔర్ తల్వార్, ఇన్కో మారో జూతే చార్’ (అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, వైశ్యులు, రాజ్‌పుత్‌లకు నాలుగు తలిగించండి...) ► ఈ నినాదాన్ని అణగారిన వర్గాల కోసం బహుజన నేత కాన్షీరాం తెరపైకి తెచ్చారు. బహుజనుల కోసం పదేళ్లుగా పోరాటం చేసినా సాధించిందేమీ లేకపోవడంతో 1984 ఆయన బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగానేకాన్షీరాం చేసిన ఈ నినాదం రాష్ట్రవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. ‘జిస్కీ జిత్నీ సంఖ్యా భారీ..ఉస్కీ ఉత్నీ హిస్సేదారి’ (ఏ వర్గం సంఖ్య ఎక్కువుందో వారికే అధికారంలోనూ అంత ఎక్కువ వాటా దక్కాలి), ఓట్ హమారా, రాజ్ తుమ్హారా.. నహీ చలేగీ, నహీ చలేగీ’ (ఓట్లు మావి, రాజ్యం మీదా? ఇకపై చెల్లదు మీ పెత్తనం) అంటూ ఇచ్చిన నినాదాలు బాగా పనిచేశాయి. వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో 1991లో కేవలం 12 సీట్లు గెలుచుకున్న బీఎస్పీ 1993లో 67 సీట్లకు చేరుకుంది. ఆ తర్వాత నాలుగుసార్లు మాయావతి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ నినాదాలూ దోహదపడ్డాయి. రాంలల్లా హమ్ లాయింగే.. మందిర్ వహీ బనాయేంగే (రామున్ని తీసుకొస్తాం..ఆలయం అక్కడే నిర్మిస్తాం) ► 1991 ఎన్నికలకు ముందు బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. 1990లో రామమందిర నిర్మాణాన్ని బలంగా డిమాండ్ చేసిన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. అధికారంలో ఉన్న ములాయంసింగ్ యాదవ్ ‘నా హయంలో బాబ్రీ మసీదుపై ఉన్న ఒక్క పక్షిని కూడా మరో పక్షి చంపలేదు’ అని ప్రకటించారు. అయినా కరసేవకులు చొచ్చుకొచ్చారు. వారిపైకి కాల్పులు జరపడంతో ఐదుగురు చనిపోయారు. ఈ సందర్భంగా బీజేపీకి నేతృత్వం వహించిన కల్యాణ్‌సింగ్ ఎత్తుకున్న ఈ నినాదం బలంగా పనిచేసి 1991 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 221 సీట్లు సాధించింది. కల్యాణ్‌సింగ్ సీఎం అయ్యారు. మిలే ములాయం, కాన్షీరాం.. హవా మే ఉడ్ గయే జై శ్రీరామ్ (కాన్షీరాం, ములాయం ఒక్కటయ్యారు. జై శ్రీరామ్ నినాదం గాల్లో కొట్టుకుపోయింది) ► బాబ్రీ మసీదు కూల్చవేత తర్వాత 1992 డిసెంబర్ నుంచి 1993 డిసెంబర్ దాకా యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. దాన్ని ఎత్తివేసేందుకు ముందు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ సందర్భంగానే ములాయం, మాయావతి ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. దళితులు–యాదవ్–ముస్లిం ఫార్ములా పనిచేసి ఈ ఎన్నికల్లో ఎస్పీ కూటమి అధికారంలోకి రాగా ములాయం ముఖ్యమంత్రి అయ్యారు. ‘చఢ్ గుండన్ కీ ఛాతీపర్ మొహర్ లగేగీ హాథీ కే’ (గూండాల గుండెలపై ఏనుగు బొమ్మను ముద్రిస్తాం’) ► ఈ నినాదాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెరపైకి తెచ్చారు. 1995లో మాయావతిపై ఎస్పీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ఎస్పీతో దూరంగా ఉన్న మాయావతి తర్వాతి ఎన్నికల్లో ఈ నినాదంతో ముందుకు పోయారు. ముఖ్యంగా 2007 ఎన్నికల ముందు ఎస్పీ మద్దతుదారులను గూండాలంటూ మాయ పిలవడం ప్రారంభించారు. ఎస్పీకి వ్యతిరేకంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఫలితంగా బీఎస్పీ ఏకంగా 206 సీట్లు సాధించి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ‘జిస్ కా జల్వా కాయం హై..ఉస్ కా నామ్ ములాయం హై’ (ఎవరి పనితీరైతే చెక్కుచెదరలేదో అతనే ములాయం) ► 2012 ఎన్నికల సందర్భంగా ములాయంసింగ్ యాదవ్ ఈ నినాదంతో ప్రచారం చేశారు. తన హయాంలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మరిచిపోలేదని, ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ఈ నినాదం యాదవ్‌లను బాగా ఆకర్షించడంతో ఏకంగా 224 సీట్లు సాధించింది. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ‘న గూండారాజ్.. న భ్రష్టాచార్.. అబ్ కీ బార్ భాజపా సర్కార్’ (గూండారాజ్యం వద్దు..అవినీతిపరులొద్దు.. ఈసారి బీజేపీ ప్రభుత్వం కావాలి) ► అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు, గూండాల ఆధిపత్యం, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ 2017లో బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. దీనికి కౌంటర్‌గా ‘యూపీ కీ కంపల్షన్ హై.. అఖిలేశ్ జరూరీ హై’ (యూపీకి ఎస్పీ తప్పనిసరి.అఖిలేశ్ అవసరం చాలా ఉంది) అని ఎస్పీ నినాదం చేసినా అదంతగా పని చేయలేదు. ఫలితంగా బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. ► ఇదివరకు రేషన్‌కార్డులు, పథకాలు ‘అబ్బా జాన్’ అనే వాళ్లకు మాత్రమే అందేవి – యూపీ సీఎం యోగి ► సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్‌లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్‌రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్‌లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా సమక్షంలో సీఎం యోగి నామినేషన్
UP Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కీలక నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే.. గతంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా పని చేసిన యోగి.. ఎమ్మెల్సీ కోటాలో యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే ముందు గోరఖ్‌నాథ్ టెంపుల్లో పూజల్లో పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో మంత్రి అమిత షా ర్యాలీ నిర్వహించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో ముఠాలను యోగి తుడిచిపెట్టారని గర్వంగా చెప్తున్నా. పాతికేళ్ల తర్వాత యూపీలో న్యాయబద్ధంగా పాలన నడుస్తోంది. యోగి నాయకత్వంలో యూపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ’ అని షా అన్నారు. #WATCH | Accompanied by Union Home Minister Amit Shah, Uttar Pradesh CM Yogi Adityanath files nomination papers as a BJP candidate from Gorakhpur Urban Assembly constituency pic.twitter.com/BYzpDtVmlS — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 4, 2022 -
పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు అరెస్ట్
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ అలియాస్ హనీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్టు చేసింది. అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించి హనీకి మనీల్యాండరిం గ్‌తో సంబంధాలున్నాయని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి చాలా సేపు హనీని విచారించి అనంతరం పీఎంఎల్ చట్టం కింద అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. విచారణలో సహకరించనందుకే హనీని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆయన్ను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఐదురోజుల ఈడీ కస్టడీ విధించింది. గతనెల 18న హనీ నివాసాలపై ఈడీ దాడులు జరిపి రూ. 8 కోట్ల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ప్రత్యర్థులకు అస్త్రం హనీ అరెస్టుతో పంజాబ్ ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు, సొంతపార్టీలోని వ్యతిరేకులకు చన్నీ మేనల్లుడి అరెస్టు వరంలా మారనుందని నిపుణుల అంచనా. ఈనెల 6న పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును రాహుల్ గాంధీ ప్రకటించే నేపథ్యంలో చన్నీకి చాన్సు లభించడంపై ఉత్కంఠ నెలకొంది. హనీ అరెస్టు రాజకీయ గిమ్మిక్కని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే చన్నీ బంధువుల్లో ఒక్కరే 111 రోజుల చన్నీ పాలనలో కోట్లు కూడబెడితే, ఆయన చుట్టాలంతా కలిసి ఎంత పోగేసి ఉంటారో ఊహించవచ్చని ఆప్ పార్టీ దుయ్యబట్టింది. ఈ విషయంలో చన్నీ సమాధానం చెప్పాలని శిరోమణి అకాలీదళ్ నేత మజితియా డిమాండ్ చేశారు. -
ఉత్తరాఖండ్ బరిలో 632 మంది పోటీ
డెహ్రాడూన్: ఈనెల 14న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని 81.43 లక్షలమంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. నామినేషన్ వేసిన వారి నుంచి 95మంది ఉపసంహరించుకోగా 632 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 136 మంది స్వతంత్ర అభ్యర్థ్ధులున్నారు. డెహ్రాడూన్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 117 మంది, హరిద్వార్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 110మంది పోటీచేస్తున్నారు. చంపావత్, బాగేశ్వర్ జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి 14మంది పోటీపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. బరిలో ఎస్పీ, ఆప్, బీఎస్పీ, యూకేడీ కూడా ఉన్నాయి. ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. -
బడ్జెట్ 2022: ఆ రాష్ట్రాల మీదే ఫుల్ ఫోకస్?
Union Budget 2022 Updates: ప్రధాని మోదీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ వివరాలు తెలిపారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో రోజు ప్రారంభం కానుంది. 80సీ కింద మినహాయింపులు(లక్షన్నర నుంచి రూ. 3లక్షల పెంచుతారనే ఆశ) మీద వేత జీవుల ఆశలు, స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి లక్ష రూ. పెంచడం లాంటి అంశాల మీద అందరి దృష్టి ఉంది. అయితే.. కరోనాతో గత రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పురోగతికి ఈ ఏడాది కలిసి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉన్నప్పటికీ.. పరిస్థితి మెరుగైందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితి మినహాయింపులు పెరిగే అవకాశాలు తక్కువనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐదు స్టేట్స్లో ఎలక్షన్స్ నేపథ్యంలో.. వాటి మీదే ప్రధాన ఫోకస్ ఉండొచ్చని, వ్యవసాయ, పారిశ్రామికరణ.. ఇతరత్ర కేటాయింపులు ఉండొచ్చనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. (చదవండి: Budget 2022 LIVE Updates) గతంలో ఎలక్షన్ సంబంధిత రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులనే అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మౌలిక వసతులు, రోడ్లు, రైల్వే, ఇరిగేషన్, మెడిసిన్ సంబంధిత బడ్జెట్ వరాలు సైతం ఆయా రాష్ట్రాల పైనే కురవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోనూ పట్టు కోసం బడ్జెట్ ఫోకస్ ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. దీంతో అసంతృప్త రాష్ట్రాల పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో.. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చనే లెక్కల నడుమ.. రాబడి పెరగడంతో(గత రెండేళ్లలో పోలిస్తే) ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించే ఆస్కారం ఉందనే ఆశ మాత్రం ఉంది. వ్యాక్సినేషన్, సర్వీస్ సెక్టార్, నియంత్రణల సడలింపులు, ఎరువుల రాయితీలు, అంతరిక్షంలో ప్రైవేటీకరణ, రైల్వేలో పెట్టుబడులకు అవకాశం, రహదారుల నిర్మాణం, స్టార్టప్‌లకు వెన్నుదన్ను.. తదితర అంశాలపైనే ప్రధాన ఫోకస్ ఉన్నట్లు అర్థమవుతోంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అసంతృప్త రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో కేంద్రం కరుణ చూపిస్తుందా? లేదంటే ఎప్పటిలాగే మొండి చేయి ఇస్తుందా? అనేది మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. సంబంధిత వార్త: బడ్జెట్ బూస్ట్.. భారీ లాభాలు! -
ఎన్నికల వేళ.. డిజిటల్ క్యాంపెయినర్ల హవా!
లక్నో: కరోనాతో ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు, ఎన్నికల వేళ కొత్త ఉద్యోగాలను కూడా కల్పిస్తోంది. ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తూ ఉండటంతో జనవరి 31 వరకు భౌతిక ప్రచారాలు, రోడ్డు షోలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఆన్లైన్ ప్రచారాలే ఉధృతంగా సాగుతున్నాయి. వీటిని నిర్వహించడానికి టెక్నాలజీపై పట్టున్న యువకులకు తాత్కాలికంగానైనా ఉపాధి లభిస్తోంది. (క్లిక్: ప్రతిష్టాత్మక పోరు.. ‘కైరానా’ మే హైరానా!) సామాజిక మాధ్యమాలపై అవగాహన, కంప్యూటర్ నాలెడ్జ్, ఫొటోగ్రఫీ ఎడిటింగ్ తెలిసి ఉన్న గ్రామీణ ప్రాంతంలో యువతని వెతుక్కుంటూ వెళ్లి మరీ వివిధ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉద్యోగాలు ఇస్తున్నారు. సైబర్ స్మార్ట్ డిజిటల్ క్యాంపెయినర్లుగా నియమిం చుకుంటున్నారు. ప్రచారం కొత్తగా ఉండడం, ఓటు వేయాలని అభ్యర్థిస్తూ తయారు చేసే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూడడం వంటివి చెయ్యాల్సి ఉంటుంది. ‘‘వివిధ సామాజిక మాధ్యమాల్లో రోజుకి కనీసం 10 నుంచి 15 పోస్టులు పెట్టాలి. అవన్నీ రీ ట్వీట్ అయ్యేలా చూసుకోవాలి. రకరకాల గ్రూపులు నిర్వహించాలి. ఆ పోస్టులు వైరల్ అయ్యేలా చూడాలి. ఓటు వేయమని అభ్యర్థిస్తూ సృజనాత్మకంగా పోస్టులు తయారు చేయాలి’’ అని తనూజ్ పాండే అనే యువకుడు చెప్పాడు. (క్లిక్: బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా?) బారాబంకికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర సింగ్ తరఫున పాండే పని చేస్తున్నారు. ఈ డిజిటల్ క్యాంపెయినర్లకి వారు చేసే పని, పోటీ చేసే అభ్యర్థి స్థాయి, వారు పని చేసే ప్రాంతం ఆధారంగా నెలకి రూ.20 వేల నుంచి లక్ష వరకు వేతనం లభిస్తోంది. బాదాన్కి చెందిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్ చంద్ర దగ్గర డిజిటల్ క్యాంపెయినర్ల బృందంలో అయిదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు గ్రాఫిక్ డిజైనర్లు, సోషల్ మీడియా వ్యవహారాలు చూసే ఒక టెక్కీ ఉన్నారు. ఇలా ఎవరి స్థాయిలో వారు డిజిటల్ క్యాంపెయినర్లను నియమిస్తూ ఉండడంతో యూపీ పల్లెల్లో యువత బిజీ బిజీగా కాలం గడుపుతోంది. (క్లిక్: ఆ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత ఆయనే) -
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా
ఛండిఘర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20 వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్లకు ఫిబ్రవరి 1 తుది గడువు, నామినేషన్ల పరిశీలనకు తుది గడువు ఫిబ్రవరి 2, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ఫిబ్రవరి 4, ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 20న, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. చదవండి: సీఎం చన్నీ సోదరుడికి కాంగ్రెస్ టికెట్ నిరాకరణ -
పార్టీ షాక్ ఇచ్చింది.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయాడు
లక్నో: దేశవ్యాప్తంగా అందరి చర్చ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద సాగుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు విషయంతో జాగ్రత్త వహిస్తూ గెలుపుగుర్రాలను మాత్రమే బరిలోకి దించుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం ఇచ్చే షాక్‌లకు అసెంబ్లీ టికెట్ ఆశావహులు తీవ్రమైన భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెలే టికెట్ ఆశించి దక్కకపోవటంతో ఓ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం ఎదుట అలీగఢ్‌కు చెందిన ఎస్పీ నేత ఆదిత్య ఠాకూర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. అయితే ఆదిత్య ఠాకూర్ అలీగఢ్‌లోని ఛారా నియోజకవర్గ నుంచి ఎస్పీ తరపున పోటీ చేయాలని భావించాడు. పార్టీ కోసం పని చేస్తున్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కచ్చితంగా వస్తుందని ఆశించాడు. కానీ, చివర క్షణంలో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆదిత్య ఠాకూర్.. పార్టీ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ స్థానం నుంచి టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత అర్షద్ రాణా మీడియా ముందు భోరున విలపించిన విషయం తెలిసిందే. చదవండి: Punjab Elections 2022: నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
బీజేపీ తొలి జాబితా విడుదల..ఎన్నికల బరిలో సీఎం యోగి...
-
UP Election 2022: అయోధ్య కాదు గోరఖ్‌పూర్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం ఒక లిస్ట్‌ను ప్రకటించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీ, యోగిపై సెటైర్లు పేల్చాడు. ఇంతకు ముందు ఆయన అయోధ్య, మథుర, ప్రయాగ్‌రాజ్ నుంచి యోగి పోటీ చేయొచ్చని బీజేపీ బహిరంగంగా ప్రకటించుకుంది. ఇప్పుడేమో ఆయన్ని.. బీజేపీ ఆయన సొంత స్థానానికే పంపించింది. యోగిగారు మీరు అక్కడే ఉండిపోండి. మీరు మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటూ సెటైర్లు పేల్చాడు అఖిలేష్. ఇదిలా ఉంటే.. పార్టీ ప్రకటన తర్వాత ‘పార్టీ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాన’ని సీఎం యోగి ప్రకటించడం తెలిసిందే. అయితే గోరఖ్‌పూర్ ఎంపికపై యోగి అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న మీడియా కథనాలను రాష్ట్ర ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టిపారేశారు. గతంలో యోగి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠ్లోమహంత్(ప్రధాన అర్చకుడిగా) పని చేశారు. ఆపై రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించాక.. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానంలో 1998 నుంచి ఐదుసార్లు వరుసగా ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2017 నుంచి ఎమ్మెల్సీ హోదాలో యూపీ సీఎంగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొట్టమొదటిసారి పోటీ చేయనున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక మొదటి, రెండో దశ పోలింగ్‌కు సంబంధించి.. మొత్తం 105 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌ను రిలీజ్ చేసింది బీజేపీ. ఇందులో 63 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రెయిన్బో కూటమి ద్వారా ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. రూలింగ్ పార్టీకి గట్టి పోటీనే ఇవ్వబోతున్నారు. కొన్నిసర్వేలు యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో ఎస్పీకి జంప్ అవుతున్న బీజేపీ నేతల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
అసెంబ్లీ ఎన్నికలు 2022: ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు షురూ..
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. ఏడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ జనవరి 8న ప్రకటించింది. దీంతో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై కూడా నిషేదం విధించారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా 900 మంది అబ్జర్వర్లను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ఇదే అభ్యర్థి వ్యయాన్ని రూ.28లక్షలుగా నిర్ణయించారు. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియ జనవరి 14న మొదలై.. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఫలితాలతో ముగియనుంది. చదవండి: (ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల) -
కోవిడ్‌పై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది. దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. -
అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ. 70 నుంచి 95 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 54 నుంచి 75 లక్షలు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 నుంచి 40 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 20 నుంచి 28 లక్షలకు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు) పెంచుతున్నట్లు ఈసీ గురువారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాబోయే ఎన్నికల నుంచి ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎన్నికల సంగం గ్రీన్ సిగ్నల్
-
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: ప్రతి రోజూ మరింత ఎక్కువ మంది అర్హులైన వయోజనులకు కోవిడ్ టీకాలను వేయాలని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు కోవిడ్‌పై సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘క్రిస్మస్, కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే రాష్ట్రాలు కంటైన్మెంట్ చర్యలు, ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధిస్తే కనీసం 14 రోజులపాటు అమలుచేయాలి. తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్, అర్హులైన వారికి రెండు డోస్‌లూ ఇవ్వాలి. తొలి, రెండో డోస్‌లు పూర్తి చేయడంలో జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ శాతం నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ’అని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. ‘కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా పెరిగినా, ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయమున్న ఐసీయూ పడకలు 40 శాతానికి మించి నిండినా స్థానికంగా కంటైన్మెంట్ చర్యలు వెంటనే తీసుకోవాలి’అని ప్రకటనలో సూచించింది. (చదవండి: ఆవు తల్లితో సమానం) -
ఎన్ని‘కలవర’మేనా!
ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తున్నా... అసలు ఆదో సమస్య కాదన్నట్లే వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ... దాని ప్రస్తావనే రానిచ్చేవారు కాదు. కేంద్రమంత్రులు, బీజేపీ సీఎంలు ఆందోళన చేస్తున్న రైతులను దేశద్రోహులు, విదేశీ నిధులతో కృత్రిమ ఉద్యమాలు నడుపుతున్నారని ఆరోపించే దాకా వెళ్లారు. మరి ఇప్పుడు ఆకస్మాత్తుగా మోదీ ఎందుకు జాతిముందుకు వచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా దేశానికి క్షమాపణ చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా... అహంకారిగా ముద్రపడుతున్నా, ఒంటెత్తు పోకడలు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమైనా... ఆత్మావలోకనం చేసుకున్న సందర్భాలు, వెనక్కితగ్గిన ఉదంతాలు చూడలేదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరి తాజా వెనుకడుగు మాత్రం కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేసిందేనని చెప్పొచ్చు. వచ్చే ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి– మార్చి నెలల్లో) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా రైతు ఆందోళనల్లో పశ్చిమ యూపీ, పంజాబ్, హరియాణా రైతులే ముఖ్య భూమిక పోషించారు. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో వెంటనే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం వెలువడింది. ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది సుస్పష్టం. సామాన్య ప్రజానీకంలో ధరాఘాతంతో పెల్లుబికిన ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించగలిగామని భావించిన బీజేపీ వ్యూహకర్తలు... రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులపైకి దృష్టి మళ్లించారు. ఆజ్యం పోసిన హరియాణా హరిణాయా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులపై దాడులు చేయాల్సిందిగా పరోక్షంగా బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టడం, అరునెలలు జైలులో ఉండొస్తే నేతలు అవుతారని ఉద్భోదించడం... రైతులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. కర్నాల్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ అయూష్ సిన్హా రైతుల తలలు పగలగొట్టండని పోలీసులు ఆదేశాలు ఇస్తున్న వీడియో వైరల్ కావడం... పోలీసు లాఠీచార్జీలో 10 మంది రైతులు రక్తమోడగా... తర్వాత అందులో ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇవన్నీ బీజేపీపై రైతుల ఆగ్రహాన్ని పెంచుతూ పోయాయి. హిమాచల్ ఓటమి... మరో కనువిప్పు ఇటీవలి ఉప ఎన్నికల్లో కొంచెం అటుఇటుగా అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల హవాయే కనపడింది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ దారుణంగా దెబ్బతింది. అంతుకుముందు నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గిన మండీ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కోల్పోయింది. అలాగే ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. ఇది కమలనాథులకు కనువిప్పు కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే హిమాచల్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్‌లో నాలుగు స్తంభాలాట! రైతు ఉద్యమంలో సిక్కులు ముందువరుసలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రైతు చట్టాలపై ఎన్డీయేతో తమ సుదీర్ఘ బంధాన్ని శిరోమణి అకాలీదళ్ తెగదెంపులు చేసుకుంది. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళితులు ఉండటంతో బీఎస్పీతో అకాలీదళ్ జట్టుకట్టింది. మరోవైపు కాంగ్రెస్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా, దళితుడైన చన్నీని సీఎంగా పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో జట్టు కడతానని బహిరంగంగానే ప్రకటించారు. ఈ కొత్త కూటమి ఏమేరకు ప్రభావం చూపుతుందనే పక్కనబెడితే పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారనున్నాయి. అకాలీదళ్‌తో పాత అనుబంధం దృష్ట్యా హంగ్ అసెంబ్లీ వస్తే కెప్టెన్–బీజేపీ కూటమి ఎన్నోకొన్ని సీట్లతో కింగ్‌మేకర్ పాత్రను ఆశించొచ్చు. పశ్చిమంతో మొదలై పాకుతుందని...! పశ్చిమ యూపీలోని ఆరు రీజియన్లలో (26 జిల్లాల్లో) మొత్తం 136 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఏకంగా 103 అసెంబ్లీ స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. (27 లోక్‌సభ స్థానాల్లో 20 కాషాయదళానికే దక్కాయి). మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా 312 చోట్ల నెగ్గి ఘన విజయం సాధించింది. రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాట్లు పశ్చిమ యూపీలో బలంగా ఉన్నారు. 18–20 శాతం దాకా ఉంటారు. 49 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల జనాభా 30 శాతం పైనే. 25 స్థానాల్లో ముస్లిం– జాట్లు కలిస్తే... జనాభాలో సగం కంటే ఎక్కువే ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 5న కిసాన్ సంయుక్త్ మోర్చా... ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన మహా పంచాయత్‌కు అనూహ్యంగా లక్షలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇదే వేదిక పైనుంచి రాకేశ్ తికాయత్ బీజేపీ విభజన రాజకీయాలను ఎండగడుతూ... రైతుల ప్రయోజనాల దృష్ట్యా హిందూ– ముస్లింలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని నినదించారు. ఇకపై రైతు వేదికల పైనుంచి ‘అల్లా హు అక్బర్’, ‘హరహర మహదేవ్’ నినాదాలను వినిపించి సామరస్యాన్ని చాటుతామని నొక్కిచెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో పనిచేస్తామన్నారు. త్యాగిలతో కలిపి వెనుకబడినవర్గాలైన సైనీ, కశ్యప్, గుజ్జర్లను కలుపుకొనిపోతే రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావించారు. సమాజ్‌వాదితో ఆర్ఎల్డీ జతకట్టడం ఈ ప్రాంతంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ. క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలు బీజేపీ వ్యూహకర్తలకు ఉలికిపాటుకు గురిచేశాయి. నష్టనివారణ చర్యలకు దిగారు. సెప్టెంబరు 14న ప్రధాని మోదీ జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరిట యూనివర్శిటీ శంకుస్థాపన చేశారు. పశ్చిమ యూపీలో బలపడుతున్న రైతు ఐక్యతకు... సామాజికవర్గాల పునరేకీరణ తోడై... మొత్తం ఉత్తరప్రదేశ్‌కు పాకితే తట్టుకోవడం కష్టమనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చారు. అసలే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తారు. అందుకే కాషాయదళం భేషజాలను పక్కనబెట్టి... పోల్ మేనేజ్మెంట్కుదిగింది. మృత చట్టాలే... ఖననం చేసేద్దాం! కార్పొరేట్ మిత్రులకు లబ్ధికొరకే వ్యవసాయ చట్టాలను తెచ్చారని... తీవ్ర అపవాదును మూటగట్టుకొన్న బీజేపీ నిజానికి వీటి ద్వారా సాధించింది ఏమీలేదు. 11 దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు జరిపిన కేంద్రం మొండిగా వ్యవహారించింది. ‘ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా... (చట్టాల రద్దు మినహా)’ ఏమైనా అడగండి... చర్చలకు సిద్ధం అంటూ పాడినపాటే పాడింది. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమే తప్ప తాము మరోటి కోరుకోవడం లేదని రైతులూ తేల్చిచెప్పడంతో చర్చల్లో ఏమీ తేలలేదు. నిజానికి సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ఈ ఏడాది జనవరి 12నే ‘స్టే’ విధించింది. కోర్టులో వ్యవహారం ఎప్పటికి తేలుతుందో తెలియదు. కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న చట్టాల కోసం పార్టీ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టడం వివేకవంతమైన చర్య కాదనేది బీజేపీ పెద్దలు నిర్ణయానికి వచ్చి... మోదీ ‘ఇమేజ్’కు భిన్నంగా వెనక్కి తగ్గుతూ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలతో ఊదరగొడుతున్న బీజేపీకి యూపీలో తాజా నిర్ణయం ఏమేరకు కలిసొస్తుందో కాలమే చెప్పాలి. –నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీలో కమలదళం రోడ్ మ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు కమలదళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహంపై ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్తో సహా పలువురు బీజేపీ నేతలు కసరత్తు చేసి రోడ్‌మ్యాప్ రెడీ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌పైనే పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే వచ్చే నెలన్నరలోపు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో 200కి పైగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటి బాధ్యతలను 30మందికి పైగా కేంద్రమంత్రులకు అప్పగించారు. తొలిదశలో భాగంగా వచ్చే 30 రోజుల్లో 18 మంది కేంద్రమంత్రులు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ర్యాలీలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కీలక నేతల ఎన్నికల ర్యాలీలు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా జరుగనున్నాయి. రానున్న 45 రోజుల పాటు ప్రతిరోజూ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ, కార్యక్రమం ద్వారా ప్రజలతో సన్నిహితంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రచార వ్యూహంతో సంబంధం ఉన్న పార్టీ నేత ఒకరు తెలిపారు. అంతేగాక రాబోయే 30 రోజుల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సంబంధించి యూపీలో అత్యధిక పర్యటనలు ఉండనున్నాయి. వచ్చే రెండు నెలల పర్యటన షెడ్యూల్ సైతం ఖరారు చేసే పనిలో కమలదళం బిజీగా ఉంది. నేటి నుంచి ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు సుల్తాన్పూర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను మోదీ ప్రారంభించనున్నారు. 19న ప్రధాని బుందేల్‌ఖండ్ వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది. నవంబర్ 20న లక్నోలో జరుగనున్న దేశవ్యాప్త డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు అధికారుల కార్యాక్రమంలో ప్రధాని, హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు భారీ ప్రాజెక్టులను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఇందులో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ సహా పలు భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని సమాచారం. -
ఐదు అసెంబ్లీల ఎన్నికల ప్రచారానికి రూ.252 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ప్రచారం కోసం రూ.252 కోట్లు ఖర్చు చేసినట్లు బీజేపీ వెల్లడించింది. ఇందులో 60% మేర బెంగాల్లోనే ఖర్చు చేసినట్లు తెలిపింది. అస్సాం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార ఖర్చు వివరాలను బీజేపీ తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించింది. మొత్తం ఖర్చు రూ.252 కోట్లకుగాను అత్యధికంగా రూ.151 కోట్లను బెంగాల్లో ఖర్చు పెట్టింది. అస్సాంలో రూ.43.81 కోట్లు, పుదుచ్చేరిలో రూ.4.79 కోట్లు, తమిళనాడులో రూ.22.97 కోట్లు వ్యయం చేసింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీకి 2.6% ఓట్లు మాత్రమే పడ్డాయి. కేరళలో రూ.29.24 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఉంచింది. బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.154.28 కోట్లు వెచ్చించినట్లు ఎన్నికల సంఘానికి తెలిపింది. -
విశ్వసనీయ వారధిగా మారండి
న్యూఢిల్లీ: పార్టీకి, సామాన్య ప్రజలకు మధ్య విశ్వసనీయ వారధిగా మారాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ఎండీసీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా, సంకల్పం, అంకితభావం అనే విలువలపై ఆధారపడి బీజేపీ పని చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం చుట్టే తిరగడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఒక కుటుంబం పెత్తనం కింద కొనసాగడం లేదన్నారు. ప్రజా సంక్షేమం అనే సంస్కృతే బీజేపీకి ఆయువుపట్టు అని వ్యాఖ్యానించారు. ప్రజల బాగు కోసం పని చేస్తోంది కాబట్టే కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని వివరించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే బీజేపీకి పరమావధి అని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎజెండాకు ప్రజామోదం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిందని మోదీ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ ఉప ఎన్నికలోనూ ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుందని వివరించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి కేవలం 750 ఓట్లు వచ్చాయని, ఈసారి ఏకంగా 21,000కుపైగా ఓట్లు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధి అజెండాకు ప్రజామోదం లభిస్తోందనడానికి ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకోవాలని, వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు నడ్డా దిశానిర్దేశం వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షులు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి 10.40 లక్షల పోలింగ్ స్టేషన్ల పరిధిలో బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటును పూర్తిచేస్తామన్నారు. రాజకీయ తీర్మానం ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను కొనియాడుతూ, ప్రతిపక్షాల అవకాశవాద వైఖరిని ఎండగడుతూ బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని తీర్మానంలో పేర్కొన్నారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం పట్ల మోదీని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రతిపక్షాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
కమలదళం మేధోమథనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్–19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. 124 మంది కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రత్యక్షంగా హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గంలోని ఇతర సభ్యులు రాష్ట్ర కార్యాలయాల్లో వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, రాజాసింగ్, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో వచ్చే ఏడాది ఆఖర్లో ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏడు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో మేధోమథనం నిర్వహించనున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహం రూపొందించే అవకాశం ఉంది. -
ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగబోయే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కమలదళం సన్నద్ధమవుతోంది. అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జీలను, సహ ఇన్‌చార్జీ్జలను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 403 అసెంబ్లీ స్థానాలున్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఆయన టీమ్‌లో సహ ఇన్చార్జులుగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, శోభా కరంద్లాజే, అన్నపూర్ణ దేవీతోపాటు ఎంపీలు సరోజ్ పాండే, కెప్టెన్ అభిమన్యు, వివేక్ ఠాకూర్ ఉన్నారు. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు సంస్థాగత ఇన్‌చార్జీ్జలను సైతం నియమించారు. ఉత్తరాఖండ్‌కు ప్రహ్లాద్ జోషీ పంజాబ్‌పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను, కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరి, మీనాక్షి లేఖి, ఎంపీ వినోద్ చావడాను సహ ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇక ఉత్తరాఖండ్‌లో రాజకీయంగా కీలకంగా వ్యవహరించే బ్రాహ్మణులను మెప్పించేందుకు ఇన్చార్జీ బాధ్యతలను అదే సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించింది. సహ ఇన్‌చార్జీలుగా పశ్చిమ బెంగాల్ ఎంపీ లాకెట్ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ను ఖరారు చేసింది. మణిపూర్‌కు భూపేందర్ యాదవ్ ఇటీవల కేంద్ర మంత్రి అయిన భూపేందర్ యాదవ్‌కు మణిపూర్ ఎన్నికల ఇన్‌చార్జీగా బాధ్యతలను అప్పగించారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, అస్సాం మంత్రి అశోక్ సింఘాల్‌ను సహ ఇన్చార్జులుగా నియమించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను గోవా ఎన్నికల ఇన్‌చారీ్జగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి దర్శనా జర్దోశ్‌ను సహ ఇన్‌చార్జీలుగా బీజేపీ అధిష్టానం నియమించింది. -
ఎన్నికల్లో తప్పని రైతుల సెగ
ఆగస్ట్ తొమ్మిదో తేదీని క్విట్ ఇండియా దినోత్సవంగా పాటిస్తున్నాం. 1942లో ఇదేరోజున బ్రిటిష్ పాలనకు వ్యతి రేకంగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలై, అనంతర పరిణామాల్లో ఇంగ్లిష్ వారు భారతదేశాన్ని వదలడమూ, దేశం స్వాతంత్య్రం పొందడమూ జరిగాయి. అదే తరహాలో మొన్న ఆగస్ట్ 9న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తున్న రైతులు ‘మోదీ గద్దె దిగాలి’ అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు. ఇది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవ కాశం ఉంది. వచ్చే ఏడాది వరుసగా మార్చి, మే నెలల్లో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటగా ఈ ప్రభావం పడనుంది. గతేడాది నవంబర్ 26న మొదలైన రైతుల నిరసన పోరాటం, తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ, రైతులకు ప్రాతినిధ్యం వహి స్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకూ మధ్య జరిగిన పదకొండు దశల చర్చలు కూడా ఫలవంతం కాలేదు. వ్యవసాయ చట్టాలను అమలుచేసి తీరాలని కేంద్రమూ, వాటిని వెంటనే రద్దు చేయాలని రైతుసంఘాలూ– ఇరుపక్షాలూ కూడా తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో ఏ రాజీకి రాలేకపోయాయి. పదకొండో దశ చర్చలు జనవరి 22న విఫలమయ్యాక మళ్లీ చర్చలకు కేంద్రం ఏ ముందడుగూ వేయలేదు; రైతులు తమ నిరసననూ వీడలేదు. తమను తాము ఐక్యంగా ఉంచుకుంటూనే, కేంద్ర ట్రేడ్ యూనియన్లు, ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొంటూ పద్ధతి ప్రకారం దశల వారీగా రైతులు తమ నిరసనను సజీవంగా ఉంచుతున్నారు. ఢిల్లీ మూడు సరిహద్దులు– సింఘు, తిక్రీ, ఘజియాబాదుల్లో ధర్నాలు కొనసాగిస్తూనే దేశంలోని అన్ని రాష్ట్రాలూ జిల్లాలూ బ్లాకు ల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిపారు. భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశాలు జరుగుతున్న దేశ పార్లమెంటుకు కొన్ని వందల మీటర్ల దూరం లోనే, నిరసనగా జంతర్ మంతర్‌లో రైతుల పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రెండూ నేటితో ముగియనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రైతులు తమ పోరాటానికి కొత్త మలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత కిసాన్ సభ సారథ్యంలో సమావేశమై క్విట్ మోదీ ఉద్యమాన్ని ప్రారంభించారు. సుమారు 40 రైతు సంఘాలు అందులో భాగమయ్యాయి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. రానున్న కాలంలో జిల్లాలవారీగా కూడా ఇవి ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయికీ పోరాటాన్ని చేర్చాలనేది వీరి లక్ష్యం. జాతీయ రాజకీయాలను రైతుల పోరు ఇదివరకే ప్రభావితం చేసింది. అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించి మనలేని స్థాయికి ఈ పోరాటం చేరింది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటా కూడా రైతుల సమస్యలను లేవనెత్తడానికి విపక్షాలు ప్రయత్నించడం, సభా వ్యవహారాలకు చాలాసార్లు ఆటంకం కలగడం చూశాం. రైతుల ఉద్యమం రాజకీయాలకు అతీతంగానే కొనసాగుతున్నప్పటికీ, రైతు సంఘాలు తమ డిమాండ్లు నెరవేరేలా అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ సహా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని కూడా రైతులకు పిలుపునిచ్చాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ మూల్ కాంగ్రెస్‌ను ఓడించి, పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ విఫలం కావడం చూశాం. నిరసన చేస్తున్న రైతుల్లో సింహభాగం పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడంతో మోదీ వ్యతిరేక ఉద్యమం ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ ప్రభావకారి కానుంది. గత ఎనిమిది నెలల నిరసన కాలంలో ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇది అంత సులభంగా వారి మనోఫలకాల్లోంచి తొలిగేది కాదు. ఇప్పటికే పంజాబ్ స్థానిక సంఘాల ఎన్నికల్లో రైతులు ఎలాంటి పాత్ర పోషించారో చూశాం. బీజేపీకి వ్యతిరేకంగా వారు ఇచ్చిన ఆగ్రహపూరిత ప్రకటనల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేకపోయారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చాక, బీజేపీకి సంప్రదాయ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి రైతుల సమస్యల మీద ప్రచారం చేస్తోంది. అలాగే ఇతర రెండు ప్రధాన పార్టీలు– అధికారంలో ఉన్న కాంగ్రెస్, విపక్షం ఆమ్ ఆద్మీ కూడా రైతులకు మద్దతిస్తున్నాయి. అంటే పంజాబ్ ఎన్నికల్లో రైతుల నిరసనోద్యమం ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. – జ్ఞాన్ పాఠక్ -
2022లో ఐదు అసెంబ్లీలకు సకాలంలోనే ఎన్నికలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది సకాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించిన ఎన్నికలతో ఎంతో అనుభవం గడించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ‘అసెంబ్లీల పదవీకాలం ముగియకముందే ఎన్నికలు జరపడం, విజేతల జాబితాలను గవర్నర్‌కు సమర్పించడం ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యం’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ ఉపఎన్నికలను, ఎమ్మెల్సీ ఎన్నికలను ఇటీవలి కాలంలో వాయిదా వేసినందున..వచ్చే ఏడాది మొదట్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు సాధ్యమేనా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..‘ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. కేసులు కూడా కొద్దిగా తగ్గాయి. మహమ్మారి సమయంలోనే బిహార్‌తోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిపిన అనుభవం వచ్చింది. మహమ్మారి సమయంలోనూ ఎన్నికలు ఎలా జరపాలనే విషయంలో ఎన్నో నేర్చుకున్నాం’అని వివరించారు. ‘ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతోంది. ఈ మహమ్మారి త్వరలోనే అదుపులోకి వస్తుందనే నమ్మకం మాకుంది. వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కచ్చితంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అవకాశం ఉంది’అని సుశీల్ చంద్ర పేర్కొన్నారు. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవిడ్ వ్యాపించకుండా ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. 80 ఏళ్లు పైబడిన వారికి, కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు వీలు కల్పించింది. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ల సంఖ్యను 1,500 నుంచి వెయ్యికి తగ్గించింది. అదేవిధంగా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఎన్నికలకు గాను ఓటర్లు భౌతిక దూరం పాటించేందుకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను సుమారు 80వేలకు పెంచింది. పశ్చిమబెంగాల్లో ఎన్నికల సందర్భంగా నిబంధనల అతిక్రమణను గమనించిన ఈసీ కొన్ని దశల పోలింగ్‌కు.. రాజకీయ పార్టీల రోడ్‌షోలు, ర్యాలీలను నిషేధించింది. బహిరంగ సమావేశాల్లో పాల్గొనాల్సిన వారి సంఖ్యను 500కు పరిమితం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలోనూ, ఫలితాల అనంతరం రాజకీయ పార్టీల విజయోత్సవాలను కూడా నిషేధించింది. కాగా, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం 2022 మార్చితో పూర్తవుతుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మేలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల్లో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాలు, పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. -
‘దీదీ ఓ దీదీ సినిమా..’ ఆర్జీవీ వైరల్ వీడియో..!
బెంగాల్ దంగల్‌లో మమతా బెనర్జీ విజయకేతనం ఎగరవేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాలు బెడిసికొట్టాయి. బెంగాల్ ప్రజలు తిరిగి దీదీకే పట్టం కట్టారు. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటీకి, తిరిగి మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుంది. కాగా, ఈ ఎన్నిక ఫలితాలపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని ట్విటర్లో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ట్విటర్లో ‘దీదీ ఓ దీదీ సినిమా.. కథనాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, మమతా బెనర్జీ’ అంటూ రాసుకొచ్చారు. వీడియోలో ఒంటరిగా వెళ్తున్న మహిళను ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి, ఆ మహిళ దగ్గర ఉన్న బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. తెలివిగా ఆ మహిళ తన దగ్గర ఉన్న బ్యాగును దూరంగా విసిరేసి, వారు బ్యాగును తీసుకోవడానికి వెళ్లేలా ఆగంతకుల దృష్టి మరల్చి వారి బైకును తీసుకొని పారిపోయింది. దీంతో ఆగంతకులు బిత్తరపోయి, ఒకరి మోహాళ్లు ఒకరు చూసుకుంటారు. అటువైపుగా వెళ్తున్న వారి నుంచి ఆ మహిళ బైక్‌పై తిరిగి వచ్చి తన బ్యాగును తీసుకొనిపోతుంది. ఆర్జీవీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఈ వీడియోతో పోల్చారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. DIDI O DIDI film ..starring Mamta,Modi and Amit pic.twitter.com/eNaRGT9wkS — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2021 చదవండి: నారా లోకేష్‌పై ఆర్జీవీ సంచలన కామెంట్లు..! -
36 స్థానాల్లో బీజేపీ, టీఎంసీ పార్టీల మధ్య ఆసక్తికరంగా మెజార్టీ...!
కోల్కత్తా: బెంగాల్ దంగల్‌లో సీఎం మమతా బెనర్జీ మరోసారి తన సత్తా చాటింది. నందిగ్రామ్‌లో దీదీ సమీప బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై 1736 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటీకి దీదీ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 292 స్థానాలకుగాను అధికార టీఎంసీ 200కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ సుమారు 80 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాగా బెంగాల్ ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో బీజేపీ, టీఎంసీ పార్టీ అభ్యర్థుల మధ్య వెయ్యిలోపు మాత్రమే మెజార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 60 స్థానాల్లో టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల మధ్య మెజార్టీ ఓట్ల తేడా 2000 లేదా అంతకన్నా తక్కువగా ఉంది. టీఎంసీ లీడ్‌లో ఉన్న36 స్థానాల్లో ఓట్ల తేడా వెయ్యి కంటే తక్కువగా ఉంది. టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల మధ్య 11 స్థానాల్లో 500 కన్నా తక్కువగా, పది స్థానాల్లో వెయ్యి నుంచి 500 ఓట్ల మెజార్టీ తేడా ఉంది. చదవండి: బెంగాల్లో ఓడింది.. మరి ఆ 5 రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటో? -
బెంగాల్లో ఫెయిల్.. మరి ఆ 5 రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటో?
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరిన బీజేపీ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. మరోసారి దీదీ మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కే పట్టం కడుతూ తీర్పునిచ్చారు. ప్రస్తుత సమాచారం ప్రకారం 216 పైగా స్థానాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుండగా.. బీజేపీ 73 చోట్ల ముందంజలో ఉంది. అయితే, గతంతో పోలిస్తే బెంగాల్లో ఊహించిన దానికంటే కాషాయ దళం మెరుగైన స్థానంలో నిలిచినట్లే లెక్క. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన కమలం పార్టీ, అప్పటితో పోలిస్తే ఈసారి 70 స్థానాల్లో ముందు వరుసలో ఉంది. లెఫ్ట్ పార్టీల ఓట్లకు భారీగా గండికొట్టింది. అయితే, అప్పుడు 211 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టిన టీఎంసీ ఈసారి ఏకంగా 216 స్థానాల్లో సత్తా చాటింది. ఇక బెంగాల్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ తదుపరి.. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులు భారీగా ప్రచారం నిర్వహించినా బెంగాల్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోతున్న కాషాయ దళం.. మరి ఈ రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యూపీలో మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరుగనున్నాయి. నిజానికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుపొందడంలో ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ సహా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. కేవలం తన నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతా పర్యటించి.. మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు బీజేపీ గెలవడంలో కీలకంగా మారారు. ఇదే హవాను కొనసాగిస్తూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలనాథులు స్పష్టమైన మెజారిటీ దక్కించుకోవడంతో యోగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే, అప్పుడు అఖిలేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీజేపీపై, ప్రస్తుతం అదే తరహా విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దళితులు, మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కరోనా విజృంభణ, ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ప్రభావం తదితర అంశాల నేపథ్యంలో బీజేపీ 2017 నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేయడం కాస్త కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గోవాలోనూ దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేయడంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్ షా, నితిన్ గడ్కరీ మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమై మద్దతు కూడగట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ఇక గోవా శాసనసభకు సైతం 2022లోనే ఎన్నికలు జరుగనుండగా, గెలుపు కోసం బీజేపీ శ్రమించకతప్పదని విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన స్థానంలో బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్‌ను సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం మాత్రమే ఉన్న సమయంలో ఇలా స్థానిక నేతల్లో విభేదాలు తలెత్తడం, సీఎం మార్పు వంటి అంశాలు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మణిపూర్‌లో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేనా? ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ పీపుల్స్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి అధికారం చేపట్టింది. స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మరీ మంత్రి పదవులు కట్టబెట్టింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం కచ్చితంగా గట్టి పోటీనిస్తామంటూ ఇప్పటికే సంకేతాలు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పదవులు కట్టబెట్టిన బీజేపీకి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్ -
మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చర్యలు తీసుకోవాలన్నా రాష్ట్రాల ఇష్టమేనని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం చేయడం లేదని సర్వత్రా వినిపిస్తున్న మాట. కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అడ్డంకిగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే మే 2వ తేదీ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా చర్చ సాగుతోంది. వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే అప్రమత్తం కావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న ఎన్నికలతో కరోనా కట్టడి చర్యలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. తత్ఫలితం ఇంత పెద్ద స్థాయిలో కరోనా విస్ఫోటనం జరిగిందని విదేశీ మీడియా నొక్కి చెబుతోంది. కరోనా వ్యాప్తికి ఇటీవల జరిగిన ఎన్నికలే కారణమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యమని మేధావులు చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, ప్రభుత్వాలు కరోనాను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు చేస్తున్నారు. అందువలనే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రికి కరోనా సోకిందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సభతోనే సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిందని అందరికీ తెలిసిన రహాస్యమేనని పేర్కొంటున్నారు. ఇక పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిల్లోనూ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తగ్గినట్టు తగ్గి ఒక్కసారిగా కేసులు పెరగడంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ఇంత జరుగుతున్నా కేంద్రం ఇప్పుడు కూడా స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రతిపక్షాలతో పాటు మేధావులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కట్టడి చర్యలపై కఠిన నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడానికి ఎందుకు జంకుతోందని నిలదీస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల వెల్లడే కారణమని వారే సమాధానం చెబుతున్నారు. ఇంకా పశ్చిమబెంగాల్లో మరో దశ పోలింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే యోచనలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఖాతరు చేయడం లేదని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. అయితే ఎన్నికల ముగింపుతో పాటు ఫలితాలు మే 2వ తేదీన ఫలితాల వెల్లడి తర్వాతనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాతో పాటు విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే సమాచారంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు. మే 2వ తేదీన ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోందని పునరుద్ఘాటిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మరి మే 2వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి. చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు -
66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై , బీజేపీ నేత నందీగ్రామ్‌లో ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి నోరు పారేసుకున్నారు. మాజీ టీఎంసీ నేత అయిన సువేందు సీఎం మమతా 66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో సువేందు కౌంటర్ ఎటాక్ చేశారు. దీదీ ఈ వయస్సులో నోటిని అదుపులో పెట్టుకోవాలని, భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పదని హెచ్చరించారు. అలాగే మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని ఆరోపించారు.ఈ సందర్బంగా బెంగాల్ సీఎంను ఆంటీ అంటూ ఆయన సంబోధించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మమతా మీడియాతో మాట్లాడారని మండిపడ్డారు. కాగా రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా తన ఓటుహక్కును వినియోగించుకున్న సువేందు అధికారి, ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని, రీపోలింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘కేరళ ప్రభుత్వం విదేశీ బంగారంపై కన్నేసింది’
కొల్లాం/కరునగపల్లి: కేరళ ప్రభుత్వం కుంభకోణాలకు, అవినీతికి నిలయంగా మారిందంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ తరహా విధానాలనే పినరయి ప్రభుత్వం కూడా పాటిస్తోందని వ్యాఖ్యానించారు. కేరళలో త్వరలో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున చేస్తున్న ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళకు నిజమైన బంగారం ప్రజలేనని, కానీ ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి వస్తున్న బంగారంపై కన్నేసిందంటూ ‘గోల్డ్ స్కామ్’ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. స్థానిక జాలరుల కడుపుకొట్టేలా.. వేరే దేశానికి చెందిన కార్పొరేట్ కంపెనీకి డీప్ ఫిషింగ్‌కు అనుమతులు ఇచ్చారని అన్నారు. వారి ఉద్దేశం రాష్ట్ర ఆస్తులను కార్పొరేట్లకు అమ్మడమేనని విమర్శించారు. 2017లో వలయార్‌లో జరిగిన హత్యాచార ఘటన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఇద్దరు అమ్మాయిలపై హత్యాచారం జరిగితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు, సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని చెప్పారు. ప్రభుత్వం వారిని శిక్షించకపోగా, అభినందించిందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మహిళలు ఎలా ఎన్నుకుంటారంటూ ప్రశ్నలు సంధించారు. చదవండి: మెహబూబా తల్లికి పాస్‌పోర్ట్ నిరాకరణ -
టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ నేతలు పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కు సంబంధించిన వీడియో చర్చనీయాంశమైంది. పార్టీకి గంట కంటే ప్రచారం చేయలేనని, సీఎం కోసం కూడా అంత సమయం కేటాయించలేను అన్నట్లుగా నుస్రత్ వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియోను బీజేపీ బెంగాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా, సొంత పార్టీకి ఎన్నికల్లో సరైన ప్రచారం చేయలేని స్థితిలో టీఎంసీ పార్టీ ఎంపీలు ఉన్నారని విమర్శించింది. అంతేకాకుండా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోతున్నారని బీజేపీ జోస్యం చెప్పింది. కాగా, ఇరు పార్టీల నుంచి నందిగ్రామ్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్లను దించారు. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల అసెంబ్లీ ఎన్నికలలో మొదటి విడత పోలింగ్ శనివారం ముగిసింది, 84 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1 న జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2 న జరుగనుంది. TMC MP Nusrat Jahan " I can't do rally for more than 1 hour, I don't even do it for CM"😆 #MamataLosingNandigram pic.twitter.com/p0jOm4iy03 — BJP Bengal (@BJP4Bengal) March 28, 2021 చదవండి: హత్రాస్ కంటే బెంగాల్ ఎన్నికలే ముఖ్యమా? -
బెంగాల్, అస్సాంలలో అధికారం మాదే
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు, అస్సాంలో 47 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. తొలి దశలో బెంగాల్లో 26 స్థానాలు, అస్సాంలో 37 స్థానాలను తాము కచ్చితంగా గెలుచుకుంటామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తాను ఈ విషయం చెబుతున్నానని వెల్లడించారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్లో 200కు పైగా స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తుచేశారు. లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటామన్నారు. అస్సాంలో అధికార బీజేపీ కూటమికి ప్రస్తుతం 86 స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో ఈ సంఖ్యను మరింత పెంచుకుంటామని అమిత్ షా చెప్పారు. బీజేపీ ప్రవచించిన పాజిటివ్ ఎజెండాకు మద్దతుగా ప్రజలు ఓటు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. బెంగాల్లో మాతువాల ఓట్ల కోసమే ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో ఆ వర్గానికి చెందిన ఆలయాన్ని సందర్శించారంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఆలయాన్ని సందర్శించడానికి, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడాలన్నదే ప్రధానమంత్రి లక్ష్యమన్నారు. వరదల రహిత రాష్ట్రంగా అస్సాం మహారాష్ట్రలో ఎన్సీపీ నేతలతో తాను సమావేశం కాబోతున్నానంటూ వచ్చిన వార్తలపై స్పందించేందుకు అమిత్ షా నిరాకరించారు. అన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేమని అన్నారు. బెంగాల్, అస్సాంలో తొలి దశలో భారీగా ఓటింగ్ నమోదు కావడం తమకు సానుకూల అంశమని వ్యాఖ్యానించారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అక్రమ వలసదారులను రాష్ట్రంలోకి యథేచ్ఛగా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, అభివృద్ధి ఆగిపోయిందని దుయ్యబట్టారు. అందుకే బెంగాల్లో ‘సోనార్ బంగ్లా’ అనే ఎజెండాతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకొచ్చారని అన్నారు. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని గెలిపించాలని ఓటర్లకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. అస్సాంలో మళ్లీ అధికారంలోకి వస్తే వరదల రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మా నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అమిత్ షా ఆరోపించారు. తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు ముకుల్ రాయ్, శిశిర్ బజోరియా మాట్లాడుకున్నట్లుగా టీఎంసీ విడుదల చేసిన ఓ ఫోన్ కాల్‌పై అమిత్ షా స్పందించారు. వారు మాట్లాడుకున్న దాంట్లో రహస్యమేదీ లేదన్నారు. పోలింగ్ ఏజెంట్ స్థానికుడే కావాల్సిన అవసరం లేదని గతంలోనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇది తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. -
ఐదు రాష్ట్రాల్లో అధికారం ఆ పార్టీలదే..
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్లో ఆ పార్టీకి విజయం దక్కకపోవచ్చని ‘టైమ్స్ నౌ – సీ ఓటర్’ సర్వే పేర్కొంది. సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్నా మెజారిటీ స్థానాలను గెల్చుకోలేదని తేల్చింది. 2016లో సాధించిన సీట్ల కన్నా తక్కువే గెల్చుకున్నప్పటికీ మెజారిటీకి అవసరమైన సీట్లను టీఎంసీ గెల్చుకుంటుందని పేర్కొంది. తమిళనాడులో డీఎంకే, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తా్తయని వెల్లడించింది. అస్సాంలో ఎన్డీఏ, కేరళలో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని వివరించింది. పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని టైమ్స్ నౌ– సీ ఓటర్ సర్వే తేల్చింది. అయితే, చివరకు విజయం మాత్రం మమత బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌కే దక్కుతుందని, రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీ భారీగా బలపడుతుందని పేర్కొంది. మొత్తం 294 సీట్లకు గానూ టీఎంసీ 152 నుంచి 168 స్థానాలను, బీజేపీ 104 నుంచి 120 స్థానాలను గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. లెఫ్ట్, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమికి 18 – 26 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. స్వతంత్రులు రెండు స్థానాలు గెల్చుకోవచ్చని పేర్కొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ 211 సీట్లను గెల్చుకుని ఘనవిజయం సాధించగా, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది 3 సీట్లలోనే కావడం గమనార్హం. ఓట్ల శాతంలో బీజేపీ, టీఎంసీల మధ్య తేడా పెద్దగా ఉండకపోవచ్చని సర్వే అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ 42.1%, బీజేపీ 37.4% ఓట్లు గెల్చుకుంటాయని తేల్చింది. కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమికి 13% ఓట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలుస్తుందని 44.6%, బీజేపీ గెలుస్తుందని 36.9% అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా మమత బెనర్జీనే సరైన వ్యక్తి అని 55% మంది, రాష్ట్ర బీజేపీ చీఫ్ గౌతమ్ ఘోష్ సీఎంగా సరైన వ్యక్తి అని 32.3% అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చ్ 3వ వారంలో 17850 మంది నుంచి ‘టైమ్స్ నౌ – సీ ఓటరు’ అభిప్రాయాలు సేకరించింది. తమిళనాడు: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, పలు ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి యూపీఏ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు సర్వే తేల్చింది. మొత్తం 234 స్థానాలకు గానూ.. ఆ కూటమికి 173 నుంచి 181 సీట్లు వస్తాయని, అన్నాడీఎంకే, బీజేపీల ఎన్డీఏ 45 నుంచి 53 సీట్లు మాత్రమే గెల్చుకుంటుందని పేర్కొంది. ఎంఎన్ఎం, ఏఎంఎంకే 3 చొప్పున సీట్లు గెల్చుకుంటాయని, ఇతరులు రెండు సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది. మార్చ్ 17 – 22 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 8709 మందిపై ఈ సర్వే జరిపారు. యూపీఏకు 46%, ఎన్డీఏకు 34.6% ఓట్లు వస్తాయని తేల్చింది. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 136 సీట్లు, యూపీఏకు 98 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ఓట్లను టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే గణనీయంగా చీలుస్తుందని 39% అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా డీఎంకే నేత స్టాలిన్‌కు 43.1% మంది మద్దతు పలకగా, పళనిసామి(అన్నాడీఎంకే)కు 29.7% మంది, శశికళకు 8.4% మంది ఓటేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అస్సాం: అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుందని సర్వే తేల్చింది. ఎన్డీయేకు 69 సీట్లు, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు 56 సీట్లు వస్తాయని, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. అస్సాంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 126. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 45%, యూపీఏకు 41.1% ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత సీఎం శర్బానంద సొనోవాల్కు 46.2% మంది, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయి 25.2% మంది మద్దతు పలికారు. కేరళ: ఈ ఎన్నికల్లో వామపక్ష ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ, సీ ఓటరు సర్వే వెల్లడించింది. మొత్తం 140 స్థానాలకు గానూ, మెజారిటీ కన్నా స్వల్పంగా అధికంగా 77 సీట్లను ఎల్డీఎఫ్ గెల్చుకుంటుందని పేర్కొంది. 2016లో గెల్చుకున్న సీట్ల కన్నా ఇది 14 సీట్లు తక్కువ. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ 62 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని తేల్చింది. గత ఎన్నికల్లో యూడీఎఫ్ 47 స్థానాల్లో గెలుపొందింది. 42.4% ఓట్లను ఎల్డీఎఫ్, 38.6% ఓట్లను యూడీఎఫ్ గెల్చుకుంటాయని పేర్కొంది. సీఎం క్యాండిడేట్‌గా ముఖ్యమంత్రి విజయన్‌కు 39.3% ఓటేయగా, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీకి 26.5% మద్దతిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పనితీరుకు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 60% మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. పుదుచ్చేరి: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటరు తేల్చింది. బీజేపీ, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేల ఎన్డీఏ మొత్తం 30 స్థానాలకు గానూ 21 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. డీఎంకే కాంగ్రెస్‌ల యూపీఏకు 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏకు 47.2% , యూపీఏకు 39.5% ఓట్లు వస్తాయని పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగసామికి 49.2% మంది మద్దతు పలికారు. -
స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా
చెన్నై:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో నాయకులు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన వద్ద రూ.4.94 కోట్ల స్థిరాస్తులు, 2.24 కోట్లు చరాస్తులు ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. తన పేరిట ఎలాంటి వాహనం లేదని, నగదు రూపంలో రూ. 50,000 ఉన్నట్లు తెలిపారు. మరో వైపు తన భార్య పేరిట 30,52,854 విలువైన చరాస్తుల ఉన్నాయని , 24.77 లక్షల విలువైన పాత బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు ఏవీ లేవని, ఇతర అప్పులు కూడా లేవని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తన ఆదాయం సమకూరుతున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2016 లో ప్రకటించిన అఫిడవిట్ లో, స్టాలిన్ 80.33 లక్షల విలువైన చరాస్తులు, 3.33 కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తులను చూపించారు. ఒక దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న అన్నాడిఎంకేను గద్దె దించడమే లక్ష్యంత ఏర్పడిన ప్రతిపక్ష కూటమికి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సారి తనయుడి రాజకీయ ఆరంగ్రేటం ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మొదటి సారిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వద్ద 21.13 కోట్ల చరాస్తులు ,రూ.6.54 కోట్ల విలువవైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నగరంలోని చెపాక్-ట్రిప్లికేన్ సెగ్మెంట్ కు నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో డిఎంకె యూత్ వింగ్ చీఫ్ ఈ విధంగా పేర్కొన్నారు. -
ఐదు అసెంబ్లీల ఎన్నికలపై ప్రధాని లీకులు
డిస్పూర్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీల గడువు ముగుస్తోంది. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను మినీ సమరంగా పేర్కొంటారు. దేశంలోనే కీలకమైన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ఇప్పటికే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఈ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీకులు వదిలారు. అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఎన్నికలపై కొన్ని సంకేతాలు పంపారు. మార్చి 7వ తేదీన ఐదు అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని మోదీ తెలిపారు. ప్రధానమంత్రి సోమవారం అస్సాంలోని డెమాజీ జిల్లా, సిలాపతార్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు. ‘గత ఎన్నికలు 2016 మార్చ్ 4వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈసారి మార్చ్ 7వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నా’ అని ప్రధానమంత్రి నేంద్ర మోదీ తెలిపారు. ‘ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసేలోపు వీలైనంత పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పర్యటిస్తా’ అని ప్రధాని బహిరంగసభలో తెలిపారు. అధికారిక సమాచారం మేరకే ప్రధాని ప్రకటన చేశారని పలు వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రకటనతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని ప్రకటన మేరకు షెడ్యూల్ మార్చ్‌లో విడుదలైతే ఏప్రిల్, మేలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టింది. ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగంతో మంతనాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఐదు అసెంబ్లీల నగారా మోగనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎన్నికల ప్రచారం మొదలైంది. ఆయా రాజకీయ పార్టీలు విజయం కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యాయి. ఇక పుదుచ్చేరిలో ఇప్పటికే ప్రభుత్వం కూలిపోగా.. రెండు, మూడు రోజుల్లో పుదుచ్చేరి ప్రభుత్వ భవితవ్యం తేలనుంది. మూడోసారి అధికారంలోకి రావాలని తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి అధికారంలోకి రావాలని బీజేపీ, పశ్చిమబెంగాల్లో అయితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు తీవ్రంగా శ్రమిస్తోంది. చదవండి: కాంగ్రెస్‌కు భంగపాటు: ఏడాదిలో రెండో ప్రభుత్వం -
ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం?
న్యూఢిల్లీ: మరో ఎన్నికల సమరం దూసుకురానుంది. మినీ సమరంగా పేర్కొనే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 15 తర్వాత రానున్నాయని సమాచారం. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దక్షిణాది పర్యటన చేపట్టింది. ఈసీ పర్యటన ఈనెల 15వ తేదీ వరకు కొనసాగనుంది. పర్యటన ముగిసిన అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఎన్నికలు రెండు నెలల్లో రానున్నాయి. మొత్తం మూడు నెలల్లో ముగించేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15 తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన మొదలుపెట్టింది. ఆ పర్యటన ఈనెల 15వ తేదీతో ముగియనుంది. దీని తరువాత నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. పది, 12వ తరగతులకు సీబీఎస్ఈ బోర్డు పరీక్ష ప్రారంభమయ్యే లోపు అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసే యోచనలో ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్‌తో కూడిన ఎన్నికల సంఘం బృందం ఆరు రోజుల (ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ) పాటు నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటిస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో, అస్సాంలో పలు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే పెద్ద రాష్ట్రం, రాజకీయంగా హాట్‌హాట్‌గా ఉండే పశ్చిమ బెంగాల్లో మాత్రం దాదాపు 8 దశల్లో నిర్వహించే యోచనలో ఉంది. ఈ ఎన్నికలన్నీ ఒకే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ మేరకు కొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్లో రాజకీయ వేడి రగులుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకటన వెలువడితే మినీ సమరం ప్రారంభం కానుంది. తమిళనాడులో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాలతో పాటు శశికళ రాకతో కాక రేపింది. ఈ రెండు తర్వాత కేరళపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు మంత్రులుగా 17 మంది ప్రమాణం -
‘బ్యాంక్లున్నది విజయ్ మాల్యా లాంటి వారి కోసం కాదు’
ముంబై : మోదీ నాయకత్వం మీద, విధానాల గురించి జనాలకు ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ అందరిలాంటి వారు కాదు. ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలకు విరుద్ధం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారా’ అని అడగ్గా.. ఇలాంటి రాజకీయ ప్రశ్నలకు సమాధనం ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు అంటూ తెలివిగా తప్పించుకున్నారు రామ్‌దేవ్. అయన మాట్లాడుతూ.. ఒక విషయం అయితే చెప్పగలను.. మోదీ నాయకత్వం, విధానల పట్ల జనాలకు ఇంకా నమ్మకం ఉంది. మోదీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయరు అంటూ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమీ మాత్రమే నల్లధనాన్ని పూర్తిగా అరికట్టగల్గుతుందని పేర్కొన్న రాందేవ్.. ఈ సందర్భ్ంగా నల్లధనం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల ధనం సమానంగా ఉంది. అయితే ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే.. ఇంత డబ్బును ఏం చేయాలి అని. ఈ మొత్తాన్ని వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ఉత్పత్తి రంగాలకు కేటాయిస్తే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారిందని తెలిపారు. అయితే మరిన్ని సంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు కూడా ఇందుకు సహాకారం తెలపాలని కోరారు. సాయం కావాలని బ్యాంకుకు వచ్చిన వారిలో విజయ్ మాల్యా ఎవరో.. నిజాయతి పరుడు ఎవరో గుర్తించగలగే సామార్థ్యం బ్యాంక్‌లకు ఉండాలని తెలిపారు. ఎందుకంటే బ్యాంకులున్నది నిజాయతిపరుల కోసం కానీ విజయ్ మాల్లా లాంటి వారి కోసం కాదని వ్యాఖ్యానించారు. -
‘పప్పు’ పరమ పూజ్యుడయ్యాడు
ముంబై : లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల విజయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో.. ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చిన ఎన్నికలు కూడా ఇవే. ఈ ఎన్నికల విజయానంతరం రాజకీయ విశ్లేషకులు, ప్రతి పక్షాలు సైతం రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. తొలినాళ్లలో రాహుల్‌ని ‘పప్పు’ అన్న వాళ్లే నేడు రాహుల్ గాంధీ ‘పరిణతి’ సాధించాడని ప్రశంసిస్తున్నారు. ఇలా మెచ్చుకునే వారి కోవలోకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా చేరారు. రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో స్వంతంగా, మధ్యప్రదేశ్‌లో ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘గుజరాత్, కర్ణాటక, ఇప్పుడీ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒంటరిగా పొరాడారు. అప్పుడు శత్రువులు రాహుల్‌ని పప్పు అన్నారు. కానీ నేటి ఫలితాలు రాహుల్ పప్పు కాదు పరమ పూజ్యుడు అని నిరూపిస్తున్నాయి. అతి త్వరలోనే దేశ రాజకీయాల్లో రాహుల్ నాయకత్వాన్ని మనం చూడబోతున్నాం’ అంటూ రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు చేశారు. ‘నాలుగున్నరేళ్లలో మోదీ, అమిత్ షా ప్రవర్తనకు నిదర్శనం ఈ ఫలితాలు. వీరు మాటల్లో ఘనం.. చేతల్లో శూన్యం అనే విషయం భారత ప్రజలకు కూడా పూర్తిగా అర్థమయ్యింది. నేడు బీజేపీ ఓటమికి అమిత్ షా, మోదీలే ప్రధాన కారణమంటూ రాజ్ ఠాక్రే ఆరోపించారు. -
జాతీయ కాంగ్రెస్‌కు నేడే సుదినం
సాక్షి, న్యూఢిల్లీ : 2014, మే 16వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇదే సుదినం. ఆ రోజున వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పార్లమెంట్లో 44 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత మొన్నటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూనే వస్తోంది. ఒకటి, రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. బీజేపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తన విజయపరంపరను కొనసాగిస్తూ ఏకంగా 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఓ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకన్నా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఇతరులతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, మధ్యప్రదేశ్‌లో బీజేపీతో దీటుగా ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు. ఒక్క తెలంగాణాలోనే ఆశించిన ఫలితాలు అందలేదు. రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు రోజులు ఉంటాయని ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభకు జరిగిన ఎన్నికల ఫలితాలే చెప్పాయి. నాడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటి చీఫ్ కేశవ్ ప్రాతినిథ్యం వహించిన రెండు స్థానాలతోపాటు మరో లోక్‌సభ సీటును బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల ఫలితాలు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
రాజస్తాన్‌లో కాంగ్రెస్ హవా
జైపూర్: ఊహించినట్టుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 108, బీజేపీ 76, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ 145 స్థానాల వరకు గెల్చుకునే అవకాశముందు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ముఖ్యమంత్రి వసుంధర రాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఆధిక్యంలో ఉన్నారు. ఉదయ్‌పూర్ మంత్రి గులాబ్‌చంద్ కఠారియా వెనుకంజలో ఉన్నారు. -
హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న సెమీఫైనల్ పోరు
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా విపక్షాలను ఏకం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఎన్నికల్లో విజయం సాధించి కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కుల సమీకరణాలు, చివరినిమిషంలో అభ్యర్థులు పార్టీలు మారడం, అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ ఎన్నికలు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు కీలక ఎన్నికలు కావడంతో విజయం కోసం బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. బీఎస్పీతోనే తంటా.. ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రమణ్‌సింగ్ సర్కారు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్ పార్టీ గంపెడాశతో ఉంది. అయితే అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జేసీసీ)–బీఎస్పీ కూటమి ఈ ఆశలపై నీళ్లు చల్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటునే గెలుచుకున్నప్పటికీ 4.27 శాతం ఓట్లను చీల్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 1.57 శాతం ఓట్లను, గోండ్వానా గణతంత్ర పార్టీ 0.29 ఓట్లను పొందాయని తెలిపారు. దాదాపు 10 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై బీఎస్పీ–జేసీసీ కూటమి దృష్టిసారించినట్లు వెల్లడించారు. అయితే ఈ కూటమి వల్ల నష్టం మీకేనని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. 2013 ఎన్నికల్లో ఈ పదింటిలో బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. శివరాజ్‌సింగ్‌కు వ్యతిరేక పవనాలు.. మధ్యప్రదేశ్‌లో గత 18 ఏళ్లుగా అధికారాన్ని నిలుపుకున్న శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. మంద్సౌర్ రైతులపై కాల్పులు, పంటలకు మద్దతు ధర సహా పలు అంశాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలో విస్తృతంగా పర్యటించారు. భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం కృషి చేయాలని నేతలు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్, దిగ్విజయ్‌లకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఇక్కడ సైతం బీఎస్పీ గట్టి ప్రభావాన్ని చూపనుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గానూ బీజేపీ 165 సీట్ల(44.88 శాతం ఓట్లు)తో అధికారాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ 58 స్థానాలకు(36.38 శాతం ఓట్లు) పరిమితమైంది. ఇక బీఎస్పీ 6.29 శాతం ఓట్లతో నాలుగు సీట్లను దక్కించుకోగా, స్వతంత్రులు మూడు చోట్ల గెలిచారు. ఇటీవల సీఎం శివరాజ్‌సింగ్ బావ సంజయ్ సింగ్, మరో నేత సర్తాజ్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం, దళిత నేత ప్రేమ్‌చంద్ గుడ్డు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో 28న జరగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వసుంధర రాజేకు గుబులు.. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు అంటున్నారు. 119 స్థానాలున్న అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో 63 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అలాగే మిజోరంలో పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకత ఎదురుకానుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగించని రాజస్తాన్ ప్రజల మనస్తత్వం సీఎం వసుంధరా రాజేను కలవరపెడుతోంది. మొత్తం 200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీకి 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 చోట్ల ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లతో చతికిలపడింది. -
మినీ మహా సంగ్రామం
అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తాలు ఖరారయ్యాయి. వచ్చే నెల 11తో మొదలై మార్చి 8 వరకూ వివిధ దశల్లో జరిగే ఈ ఎన్నికలకు బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తంగా రెండు నెలలకు పైగా సాగే ఈ సమరం హోరాహోరీగా ఉండ బోతున్నదని ఇప్పటికే అర్ధమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృ త్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకరకంగా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడం దాని ముందున్న ప్రధాన లక్ష్యం. ఆ రాష్ట్రం అనేక విధాల బీజేపీకి ప్రతిష్టాత్మకమైంది. అది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. 80 ఎంపీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు 71 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇక పంజాబ్, గోవాలు చిన్న రాష్ట్రాలైనా ప్రస్తుతం అధికారంలో ఉండటం వల్ల ఆ రెండూ కూడా బీజేపీకి ముఖ్యమైనవే. పంజాబ్‌లో అకాలీదళ్‌తో కలిసి వరసగా రెండో దఫా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ నెగ్గుకొస్తుందన్న భయం బీజేపీకి లేకపోయినా...ఆప్‌ను ఎదుర్కొ నడం దానికొక సవాలు. వీటిని నిలబెట్టుకోవడంతోపాటు ఉత్తరాఖండ్‌ను, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను చేజిక్కించుకోవడం బీజేపీకున్న ఇతర లక్ష్యాలు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో ఏర్పడ్డ పరిస్థితుల నేప థ్యంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనగలమన్న విశ్వాసం అటు విపక్షాల్లో ఉంది. నిజానికి ఈ పరిణామం జరగకపోయి ఉంటే పంజాబ్ మినహా యూపీ తదితర రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు చాలా సునాయాసంగా ఉండేది. ఉత్తరప్రదేశ్‌లో అధి కారంపై ఆశలు పెట్టుకున్న బీఎస్పీతో నువ్వా నేనా అన్నట్టు తలపడేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటిపై అందరి లోనూ ఆసక్తి, ఉత్కంఠ పెరిగాయి. ఇండియా టుడే తాజా సర్వే యూపీలో బీజేపీ ఓట్ల శాతం 31 నుంచి 33 శాతానికి పెరిగిందని, సమాజ్‌వాదీ ద్వితీయ స్థానంలో ఉన్నదని చెబుతున్న నేపథ్యంలో సహజంగానే అందరి దృష్టీ ఆ రాష్ట్రంపై పడింది. అక్కడ ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ భరితమే. మణిపూర్ చిన్న రాష్ట్రమైనా అక్కడి ఎన్నికల బరిలో దిగనున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సర్కారును పడగొట్ట బోయి భంగపడిన బీజేపీ ఎన్నికల్లో ఏం సాధిస్తుందో చూడాలి. తమ డబ్బు కోసం దేశ ప్రజలంతా ఇప్పటికీ బ్యాంకుల ముందూ, ఏటీఎంల ముందూ క్యూ కట్టడం... అట్టడుగు వర్గాలకు చెందినవారి ఉపాధి దెబ్బతినడం... వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు ఇబ్బందుల్లో పడటం... మొత్తంగా తమ కనీసావసరాలపై కూడా ప్రజానీకం కోత విధించుకోక తప్పని స్థితి ఏర్పడటం వంటివి బీజేపీ నేతలకు ప్రతికూలాంశాలే. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించినాడు, ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించిన మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలు సైతం రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో నిరాశకు లోనయ్యాయి. ఈ వ్యవహారంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తవచ్చునో ముందే అంచనా వేసుకుని దానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకోలేకపోవడం రిజర్వ్‌బ్యాంక్ అసమర్ధతేనన్న ప్రచారం జరిగినా దాన్ని ఎవరూ స్వీకరించలేకపోయారు. అటు వెనక్కొచ్చిన పెద్ద నోట్ల లెక్కలు చూస్తే ఈ చర్యతో నల్లడబ్బును అంతం చేస్తామన్న కేంద్రం హామీ నెర వేరేలా లేదు. ఇలాంటి అనిశ్చిత స్థితిలో తమ చర్యను, దానివల్ల దేశానికి కలిగిన, కలగబోయే ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీజేపీ అగ్ర నేతలపై పడింది. ఈ విషయంలో వారు ఏమేరకు కృతకృత్యులవుతారో చూడాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ అయోమయంలో ఉంది. ఇటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ఆ పార్టీ చీలుతుందా, ఐక్యంగా నిలబడుతుందా అన్నది తేలలేదు. రాజీ యత్నాలు రోజుకో మలుపు తిరిగి ప్రజలు కూడా అయో మయంలో పడే స్థితి ఏర్పడింది. ములాయం సింగ్‌ను అఖిలేశ్తోసహా పార్టీలో అందరూ ‘నేతాజీ’ అని గౌరవిస్తున్నా... నేతగా మాత్రం అఖిలేశ్‌ను మాత్రమే గుర్తి స్తున్నారు. ఆయనతోనే తమ భవిష్యత్తు ముడిపడి ఉన్నదని విశ్వసిస్తున్నారు. ములాయం వెనకున్న నేతలతో అఖిలేష్ సర్దుకుపోవడం కంటే... వారితో బంధాన్ని తెంచుకుంటేనే ప్రయోజనం ఉంటుందని జోస్యం చెబుతున్నవారున్నారు. అఖిలేష్ మాత్రం ఇంకా నిర్ణయాత్మకంగా వ్యవహరించలేకపోతున్నారు. ఇప్పుడు ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి గనుక ఆ గందరగోళం సమసిపోతుందని భావించాలి. చిత్రమేమంటే ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఆశాజనకమైన పరిస్థితి లేదు. బీజేపీపై ఏమైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు వెళ్తుంది తప్ప కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరబోదని చెబుతున్నారు. పంజాబ్ లోనైనా, గోవాలోనైనా పాలక పక్షాలపై ఉన్న వ్యతిరేకత నిన్న మొన్న పుట్టిన ఆప్‌కు లాభిస్తుందన్న అంచనాలున్నాయి. మూడేళ్లక్రితం దేశాన్నేలిన పార్టీని ఇంత దిక్కు మాలిన స్థితిలో పడేసిన ఘనత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు దక్కుతుంది. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్న తీరు గురించి మాట్లాడుకోవాలి. శాంతిభద్రతల రీత్యా పలు దశల్లో ఎన్నికలు తప్పనిసరైనా రెండు నెలల సుదీర్ఘ కాలం జనమంతా ఎన్నికల జాతరలో ఉండాల్సిరావడం సరైందేనా? సుదీర్ఘ ఎన్ని కల ప్రక్రియ వల్ల పార్టీలు చేసే వ్యయం మాత్రమే కాదు... ప్రభుత్వ వ్యయం కూడా ఆకాశాన్నంటుతుంది. పైగా ఒకే దశలో ఎన్నికలు పూర్తయ్యే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు ఫలితాల కోసం దాదాపు నెలరోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆధునాతన టెక్నాలజీ అందుబాటులోకొచ్చిన నేపథ్యంలో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ అవసరమా అన్నది ఆలోచించాలి. మొత్తానికి మినీ మహా సంగ్రామంగా భావించే ఈ ఎన్నికల్లో వెలువడే తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ ఏర్పడింది. -
ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : దేశంలోని అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. 16 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నియామవళి ఈరోజు నుంచే అమల్లోకి రానుంది. (అయిదు రాష్ట్రాల సమగ్ర సమాచారం..► పాంచ్ పటాకా) యూపీలో ఎస్పీ, ఉత్తరాఖండ్, మణిపూర్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా... గోవాలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ సంకీర్ణం పాలకపక్షాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల పోలింగ్ సమయానికి ప్రధాని మోదీ ప్రభుత్వానికి దాదాపు మూడేళ్లు నిండుతాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేసుకున్న కారణంగా యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 102 నియోజకవర్గాలున్న ఈ ఐదు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ సాధించే ఫలితాలను మోదీ పనితీరుకు గీటురాయిగా పరిగణించే అవకాశముంది. పంజాబ్ : 117 స్థానాలు ఉత్తరాఖండ్ : 70 స్థానాలు మణిపూర్ : 60 స్థానాలు గోవా : 40 స్థానాలు అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంల వినియోగం ఐదు రాష్ట్రాల్లో 16 కోట్ల మంది ఓటర్లు లక్షా 85 వేల పోలింగ్ కేంద్రాలు గతంలో కంటే 15 శాతం పోలింగ్ బూత్‌ల పెంపు వికలాంగులకు పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక సదుపాయాలు నేటి నుంచే అమల్లోకి ఎలక్షన్ కోడ్ యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ లో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.28 లక్షలు మణిపూర్, గోవాలో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.20 లక్షలు బ్యాలెట్ పత్రాలపై ఈసారి అభ్యర్థి ఫోటో తప్పనిసరి ఆర్మీ ఉద్యోగులు ఆన్ లైన్లో ఓటువేసే సదుపాయం ఈసారి అందుబాటులోకి ఫోటో ఓటరు జాబితా యూపీలో ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో దశలవారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎన్నికల కమిషన్ ఏడుదశల్లో ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల తేదీలు తొలి దశ : ఫిబ్రవరి 11 రెండో దశ: ఫిబ్రవరి 15 మూడో దశ: ఫిబ్రవరి 19 నాలుగో దశ : ఫిబ్రవరి 23 ఐదో దశ : ఫిబ్రవరి 27 ఆరో దశ : మార్చి 4 ఏడు దశ : మార్చి 8 పంజాబ్ : ఫిబ్రవరి 4 (ఒకే దశలో ఎన్నికలు) 117 నియోజకవర్గాల్లోని దాదాపు కోటీ 96 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల ద్వారా కీలకమైన తీర్పు ఇవ్వనున్నారు. ఉత్తరాఖండ్ : ఫిబ్రవరి 4 (ఒకే దశలో ఎన్నికలు) 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో నాలుగో అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2000లో ఏర్పాటైన ఉత్తరాఖండ్‌లో 2002, 2007, 2012లో ఎన్నికలు జరిగాయి. మణిపూర్ : మార్చి 4, 8 (రెండు దశల్లో ఎన్నికలు) 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 12 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గోవా : ఫిబ్రవరి 4 (ఒకేదశలో ఎన్నికలు) 40 స్థానాలు ఉన్న గోవా జనాభా రీత్యా చిన్నదే అయినా పరిశ్రమలు, టూరిజం, భౌగోళిక స్థితిగతులు, చరిత్ర కారణంగా ఈ రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యం ఉంది. -
నరేంద్ర + ఇందిరా =నరీంద్ర మోదీ
న్యూఢిల్లీ: ‘వో కహతే హై మోదీ హఠావో, మై కహతా హు కాలే ధన్ హఠావో’ సోమవారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నమాటలివి. ‘వో కహతే హై ఇందిరా హఠావో, మై కహతీ హు గరీబీ హఠావో’ అని 1971లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అన్నమాటలివి. నేడు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలపై మోదీ ఈ వ్యాఖ్యలు చేయగా, నాడు తమళనాడు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా (0–ఆర్గనైజేషన్) నాయకుడు కే. కామరాజ్ చేసిన విమర్శలపై ఇందిరా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు ఇందిరాగాంధీ చేసిన వ్యాఖ్యలనే నేడు నరేంద్ర మోదీ ఉచ్ఛరించడమే కాకుండా జాగ్రత్తగా గమనిస్తే ఆమె తరహాలోనే పరిపాలన సాగిస్తున్నారు. ఇందిర హయాంలో ప్రధాన మంత్రి పీఠమే అ«ధికార కేంద్రంగా పరిపాలన సాగగా, నేడు మోదీ హయాంలో కూడా అదే కొనసాగుతోంది. నాడు ప్రజాప్రతినిధులకన్నా అధికారులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండగా, మోదీ హయాంలో అదే కొనసాగుతోంది. ఇందిర హయాంలో తోటి మంత్రులకాన్న పీఎన్ హక్సర్, పీఎన్ ధర్, పీసీ అలెగ్జాండర్లే ఎక్కువ అధికారాలు చెలాయించారు. నాడు కశ్మీర్ నుంచి నేడు గుజరాత్ నుంచి.... నాడు అధికారుల సలహా మేరకే ఇందిరాగాంధీ 1969లో ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణకు చొరవ తీసుకుంటే నేడు నరేంద్ర మోదీ తోటి మంత్రులకు కూడా చెప్పకుండా గుజరాత్‌కు చెందిన హాస్ముఖ్ అధియా లాంటి అధికారుల సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేశారు. నాడు ఇందిర కశ్మీరుకు చెందిన అధికారులనే ఎక్కువగా తన కొలువులో పెట్టుకోగా, నేడు గుజరాత్‌కు చెందిన అధికారులనే కేంద్ర క్యాడర్లోని ముఖ్యమైన పోస్టులకు తెచ్చుకుంటున్నారు. సమాఖ్య పాలన విస్మరణ.... ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన సమాఖ్య పాలనకు నాడు ఇందిరాగాంధీ చరమగీతం పాడగా, నేడు మోదీ కూడా అదే బాట అనుసరిస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కేంద్రం చెప్పుచేతుల్లో ఉండేలా చూసుకోవడం. అందుకు కీలుబొమ్మ ముఖ్యమంత్రులను నియమించడం పరిపాటి. 1978 నుంచి 1983 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుగురు ముఖ్యమంత్రులను చూసింది. నాడు పాత వారిని తొలిగించడం, వారి స్థానంలో కొత్త వారిని నియమించడంలో కీలక పాత్ర ఇందిరాగాంధీదే. మోదీ కూడా ఆమె తరహాలోనే.... ఇప్పుడు గుజరాత్, గోవా ముఖ్యమంత్రులు డమ్మీలే. వారు మోదీ ఆశీస్సులతోనే సీఎంలు అయ్యారు. మహారాష్ట్ర, హర్యానాలో కూడా స్థానికంగా ప్రాబల్యంగల కులానికి చెందిన వారు కాకుండా తన మాట వినేవారినే సీఎం కుర్చీలో కూర్చునేలా మోదీ చేశారు. 1980లో మరాఠా లాబీని దెబ్బతీయడం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏఆర్ అంతులేను ఇందిరాగాంధీ సీఎం చేసినట్లుగా మోదీ కూడా నడుచుకున్నారు. అందుకే ఇప్పుడు మోదీ సోషల్ మీడియా ‘నరీంద్ర’ మోదీగా అభివర్ణిస్తోంది. భవిష్యత్తు ఏమిటీ? ఏకఛత్రాధిపత్య పాలన సాగిస్తూ ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన ఇందిరా గాంధీ 1984లో హత్యకు గురవడంతో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన సానుకూల పవనాలు వీచి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 404 సీట్లు వచ్చాయి. వ్యక్తిగతంగా అంతటి గుర్తింపు తెచ్చుకోవాలని, విజయం సాధించాలని నరేంద్ర మోదీ కూడా అనుకున్నారేమో 2014 ఎన్నికల్లో అన్నీ తానై బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. నాడు ప్రైవేటు బ్యాంకుల జాతీయం, ‘గరీబీ హఠావో’ నినాదం ద్వారా నాడు(1971) ఎన్నికల్లో ఇందిరాగాంధీ పార్టీని గెలిపిస్తే స్తే నేడు ‘కాలా ధన్ హఠావో’ నినాదంతో మోదీ, రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని ఏం చేస్తారో!? -
ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
-
ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ డిసెంబర్ చివరి వారంలో ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ సమర్పణ జరిగిన అనంతరం ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని ఎలక్షన్ కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల్లో బోర్డు, ఇంటర్ పరీక్షలకు ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల తేదీలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచనలు చేసినట్లు సమాచారం. పంజాబ్, గోవా,మణిపూర్, ఉత్తరాఖండ్‌ల అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడవు 2017 మే 27తో ముగియనుండగా, ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ పదవీకాలం ముగియకముందే.. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని అధికార పార్టీ సమాజ్ వాదీ, మరోవైపు అధికారం కోసం బీఎస్పీ పోటీ పడుతున్నాయి. ఇక పంజాబ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతుండగా, కొత్తగా ఆమ్ ఆద్మీపార్టీ పోటీకి దిగటంతో అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఆప్ వెల్లడించింది. -
రాష్ట్రాల ఫలితాలు నేర్పుతున్న... ‘జాతీయ’ పాఠాలు
* దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ * తొలిసారిగా ఈశాన్యాన కమలవికాసం * అంతకంతకూ దిగజారుతున్న కాంగ్రెస్ * బెంగాల్లో అడుగంటుతున్న లెఫ్ట్ ప్రాభవం సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాలకు అద్దం పట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న దేశవ్యాప్తంగా బీజేపీ నానాటికీ బలోపేతమవుతోందన్న సంకేతాలిచ్చాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారుతున్న తీరుకు, వామపక్షాలు తమ కోటయిన పశ్చిమ బెంగాల్లోనే పూర్తిగా ప్రాభవం కోల్పోతున్న వైనానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రాంతీయ పార్టీల హవాను కూడా మరోసారి కళ్లకు కట్టాయి. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే తమిళనాట అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మూడు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది. బెంగాల్లో దీదీ సారథ్యంలోని తృణమూల్ తిరుగులేని విజయంతో అధికారాన్ని నిలుపుకుంది. మరోవైపు అసోంలో విజయఢంకా మోగించడం ద్వారా ఈశాన్య భారతంలో బీజేపీ తొలిసారిగా పాగా వేసింది. కేరళలోనూ బోణీ చేయగలిగింది. బెంగాల్లో కొన్ని సీట్లు దక్కించుకుంది. అసోం, కేరళల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్, పుదుచ్చేరిలో నామమాత్ర విజయంతో సరిపెట్టుకుంది. బెంగాల్లో దాదాపుగా మట్టికరిచిన సీపీఎంకు కేరళలో ఓదార్పు విజయం దక్కింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సంధించిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదాన్ని నిజం చేసేలా ఆ పార్టీ పనితీరు సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢి ల్లీల్లో చతికిలపడ్డ కాంగ్రెస్, తర్వాత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్నే మూటగట్టుకుంది. కనీసం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది! కర్నాటక, కొన్ని చిన్న రాష్ట్రాల్లో అధికారానికి పరిమితమైంది. అసలే తన ఉనికి నామమాత్రమైన తమిళనాట డీఎంకేతో పొత్తు కాంగ్రెస్‌కు లాభించలేదు. అసోంలో 15 ఏళ్ల తరుణ్ గొగొయ్ పాలనపై ఏర్పడ్డ ప్రభుత్వ వ్యతిరేక ఓటును అంచనా వేయడంలో, ఆయనకు ప్రత్యామ్యాయ నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో పార్టీ విఫలమైంది. కేరళలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కొట్టుకుపోయింది. బెంగాల్లో వామపక్షాలతో నెయ్యం, కేరళలో కయ్యం మలయాళీలకు రుచించలేదు. ఈ నేపథ్యంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లతో పాటు తాను అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, మణిపూర్లలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షే కానున్నాయి. ఏఐసీసీని అధినేత్రి సోనియా గాంధీ త్వరలో పునర్ వ్యవస్థీకరిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్లో వామపక్షాలది మూడో స్థానమే పశ్చిమ బెంగాల్లో సిద్దాతాలను పక్కకు పెట్టి మరీ బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో చేతులు కలిపినా సీపీఎంకు చివరికి మిగిలిందేమీ లేదు! కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా సీపీఎం మరీ 26 సీట్లకే పరిమితమై అప్రతిష్ట మూటగట్టుకుంది. లెఫ్ట్ హయాంలో తమపై జరిగిన దాడులను కాంగ్రెస్ కార్యకర్తలు మర్చిపోలేదని, అందుకే కాంగ్రెస్ వోట్లు సీపీఎంకు బదిలీ కాలేదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈశాన్య భారతానికీ బీజేపీ విస్తరణ ఈశాన్యభారతంలో తొలిసారిగా అసోంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. అయితే ఇదేమీ అకస్మాత్తుగా లభించిన విజయం కాదు. పాతికేళ్లుగా రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఇలా ఫలించాయి. ఆర్ఎస్ఎస్ ప్రముఖ నాయకుడు రాం మాధవ్ ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకోకుండా ఏజీపీ, బోడో పీపుల్స్ ఫ్రంట్‌తో బీజేపీ పొత్తులో కీలకపాత్ర పోషించారు. బెంగాల్లోనూ బీజేపీ ఓట్ల శాతం 4 నుంచి 10.2కు పెరిగింది! పైగా కేరళలోనూ తొలిసారిగా ఒక సీటును బీజేపీ దక్కించుకుంది! విజయ గర్వాన్ని తలకెక్కించుకోకుండా, మోదీ ప్రభుత్వం పదేపదే చెబుతున్న ‘కోపరేటివ్ ఫెడరలిజం’ స్ఫూర్తిని సరిగా అమలు చేస్తేనే బీజేపీకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనేందుకు ఈ ఫలితాలు సంకేతంగా నిలిచాయి. ఇక యూపీలో ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ ఎస్పీ గెలుచుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ కేవలం 2,500 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై కనాకష్టంగా నెగ్గింది! దీన్ని ఒకరకంగా బీజేపీకి హెచ్చరిక సంకేతంగానే చూడాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన ఉత్తరప్రదేశ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. -
'చలామణిలో 60 వేల కోట్లు'
ముంబై: ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల పంపకం విపరీతంగా పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ రఘరాం రాజన్ అన్నారు. సుమారు రూ.60 వేల కోట్లు చలామణిలో ఉందని చెప్పారు. మంగళవారం ద్రవ్య, పరపతి విధాన సమీక్ష ప్రకటన తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో ప్రజల వద్ద డబ్బుల గలగల ఎక్కువగా ఉంటుంది. ఎందుకో మీకూ తెలుసు.. నాకు తెలుసు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు: తొలిదశ పోలింగ్ ప్రారంభం
- అస్సాంలో 65, బెంగాల్లో 18 అసెంబ్లీ స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్ - బెంగాల్‌లోని 13 స్థానాల్లో 4 గంటల వరకే - కట్టుదిట్టమైన భద్రత నడుమ కొనసాగుతున్న ప్రక్రియ గువాహటి/కోల్‌కతా: ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా సోమవారం అస్సాం, పశ్చిమబెంగాల్లో మొదటిదశ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. అస్సాంలో 65, బెంగాల్లో 18 అసెంబ్లీ స్థానాలకు ఉదయం ఏడు గంటలనుంచిఓటింగ్ జరుగుతోంది. బెంగాల్లో మావోయిస్టుల ప్రాబల్యమున్న పశ్చిమ మిడ్నాపూర్, పురులియా, బంకుర జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో 133 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13 నియోజకవర్గాల్ని మావో ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఈ మేరకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. మావో ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా 5 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ కొనసాగుతుంది. పశ్చిమబెంగాల్లో ఆరు దశల్లో భాగంగా మొదటి దశలో ఏప్రిల్ 4, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అస్సాంలో 40 వేలమందితో భారీభద్రత అస్సాంలోని 65 నియోజకవర్గాల నుంచి 539 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 95 లక్షల మందికి పైగా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటారు. మొత్తం 12,190 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ఈసీ, 48 వేల మంది సిబ్బందిని ఎన్నికల కోసం వినియోగిస్తోంది. 3,663 కేంద్రాల్ని అతి సున్నిత ప్రాంతాలుగా, 7,629 పోలింగ్ బూత్‌లను సున్నితంగా ఈసీ గుర్తించింది. 40 వేలమందితో భద్రతను కట్టుదిట్టంచేసింది. అస్సాం సీఎం తరుణ్‌గొగోయ్ టిటాబోర్ నుంచి పోటీలో ఉండగా, ప్రస్తుత స్పీకర్ ప్రణబ్ గొగోయ్ సిబ్సాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి సరబానంద్ సోనోవాల్ మజులి నుంచి బరిలో ఉండగా, ఎంపీ కామఖ్య ప్రసాద్ టిటాబోర్ నుంచి సీఎం గొగోయ్‌పై పోటీచేస్తున్నారు.