
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు చేసే వ్యయం ఏడాదికేడాది తడిసిమోపెడవుతోంది. ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) బీజేపీ రూ.344.27 కోట్లు ఖర్చు చేసింది.2017లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చేసిన ఖర్చు కంటే ఇది 58% ఎక్కువ. అప్పట్లో బీజేపీ చేసిన ఖర్చు రూ.218.26 కోట్లుగా ఉంది.
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన నివేదికల ప్రకారం కాంగ్రెస్ చేసిన వ్యయం ఏకంగా 80 శాతం పెరిగింది. 2017లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి 108.14 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది రూ.194.80 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక బీజేపీ యూపీలో అత్యధికంగా రూ.221.32 కోట్లు ఖర్చు పెట్టగా, పంజాబ్, గోవాలలో ఖర్చు భారీగా పెరిగింది. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల వారీగా ఎంత ఖర్చు చేసిందో వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment