నోట్ల రద్దు అంశంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న తరుణంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నింటికీ కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.