Sugarcane crop
-
బాసట్.. చెరకు రసానికి బాసట!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వేసవి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో, శివారు ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన అనేకచోట్ల చెరకు రసం (కేన్ జ్యూస్) బండ్లు కనిపిస్తుంటాయి. చెరకు రసాన్ని ఇష్టంగా తాగేవారు చాలామందే ఉంటారు. చెరకు నుంచి చక్కెర, బెల్లం తయారు చేస్తారనేది అందరికీ తెలిసిందే. అయితే రసం కోసం ఓ ప్రత్యేకమైన చెరకు పంట ఉంది. అదే ‘బాసట్’. చెరకును సాగు చేసే సంగారెడ్డి జిల్లా రైతులు.. స్థానికంగా ‘బాసట్’ పేరుతో 62175 చెరకు రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ చెరకు తెల్ల రంగులో ఉండటంతో పాటు, ఇందులోంచి రసం (జ్యాస్) ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ చెరకుకు పూత ఉండదు. దీంతో జ్యూస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. సాధారణంగా చక్కెర కర్మాగారాలకు తరలించే చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కానీ ఈ రకంలో జ్యూస్ ఎక్కువగా వస్తుంది.సుమారు రెండు వేల ఎకరాల్లో..ఈ ప్రత్యేక వెరైటీ చెరకును సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డివిజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఈ ప్రత్యేక రకం సాగ వుతోంది. జహీరాబాద్ మండలంతో పాటు, ఝరా సంఘం, మొగుడంపల్లి, కొహీర్ మండలాల పరిధి లో ఈ బాసట్ రకం ఎక్కువగా సాగవుతోంది. ఏటా ఫిబ్రవరి నుంచే వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల వద్ద చెరకును కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు.ఎండలు ముదిరితే డిమాండ్ఎండల తీవ్రత ఎక్కువైతే ఈ చెరకుకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఎక్కువమంది చెరుకు రసం తాగుతుంటారు. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలుకుతుంది. ఒకవేళ మే లోనే వర్షాలు ప్రారంభమైతే ధరను తగ్గిస్తుంటారు. సాధారణంగా టన్ను రూ.3 వేల వరకు ఉంటుంది.రెండేళ్లుగా సాగు చేస్తున్నా..గత రెండు సంవత్సరాలుగా ఈ బాసట్ చెరకు పండిస్తున్నా. పది నెలల్లో పంట చేతికందుతుంది. ఇటీవలే పంట నరికి రెండురోజుల క్రితం హైదరాబాద్‌కు సరఫరా చేశా. టన్నుకు రూ.3 వేల చొప్పున రేటు వచ్చింది. ఎండాకాలం వస్తే చెరకు రసానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో బాసట్ చెరకును ఎక్కువగా తీసుకెళుతుంటారు. ఫ్యాక్టరీ చెరకు సాగు కంటే ఇది కొంత మేలే. – తెనుగు శేఖర్, చెరకు రైతు, ఈదుల్పల్లి, సంగారెడ్డి జిల్లారసం వస్తుందనే వ్యాపారులు కొంటారు..రెండు ఎకరాల్లో బాసట్ రకం వేశా. హైదరాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి ఈ చెరకును కొనుగోలు చేస్తుంటారు. ఎండాకాలం వస్తే డిమాండ్ పెరుగుతుంది. రసం బాగా వస్తుందనే ఈ రకాన్ని ఎక్కువగా తీసుకెళుతుంటారు. – మొగులప్ప, చెరకు రైతు,రాయికోడ్, సంగారెడ్డి జిల్లా -
చెరకు సాగులో సస్యరక్షణ చర్యలు కీలకం
-
చెరకు గడ్డిజాతికి చెందిన తీయటి మొక్క
-
చెరకు ధర క్వింటాల్‌కు రూ.315
న్యూఢిల్లీ: చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ను క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 సీజన్లో సంవత్సరంలో క్వింటాల్ చెరకు ధర రూ.315కు పెరిగింది. చక్కెర మిల్లులు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.315 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఎఫ్ఆర్పీని పెంచుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో క్వింటాల్ చెరుకు ఎఫ్ఆర్పీ రూ.305 ఉండగా, ఈసారి రూ.315 కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతన్నలకు మన ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా చెరుకు ఎఫ్ఆర్పీని ఖరారు చేస్తుంటారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 2014–15 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్‌కు రూ.210 ఉండేది. 2013–14లో చక్కెర మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకు పంటను కొనుగోలు చేశాయి. 2022–23లో రూ.1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును సేకరించాయి. ఇండియాలో దాదాపు 5 కోట్ల మంది రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు! దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023ను త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ‘సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం–2008’ స్థానంలో ఈ బిల్లును తీసుకొన్నట్లు వివరించారు. 2027–28 దాకా పరిశోధనల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.14,000 కోట్లను వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఖర్చు చేస్తుందన్నారు. మిగతా రూ.36,000 కోట్లను ప్రైవేట్ రంగ సంస్థలు, అంతర్జాతీయ పరిశోధక సంస్థల నుంచి సేకరిస్తామన్నారు. ఎన్ఆర్ఎఫ్ పాలక మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఇందులో 15 నుంచి 25 మంది నిపుణులు, పరిశోధకులు సభ్యులుగా ఉంటారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం పని చేస్తుందన్నారు. ‘పీఎం–ప్రణామ్’కు ఆమోదం ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పీఎం–ప్రణామ్’ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.68 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.1,451 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలో సల్ఫర్–కోటెడ్ యూరియా(యూరియా గోల్డ్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా తోడ్పడుతుంది. నేల సారాన్ని కాపాడుకోవడమే ‘పీఎం–ప్రణామ్’ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. -
చెరకు నుంచి జీరిక వైపు!
నీటి వనరులను కొల్లగొట్టే చెరకు సాగుకు స్వస్తి చెప్పి, ఆరోగ్యదాయకమైన జీరిక చెట్ల సాగు వైపు తెలుగు రాష్ట్రాల్లో అభ్యుదయ రైతుల దృష్టి మరలుతోందా? ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే.. అవుననే సమాధానం వస్తుంది. తామర తంపరగా సుగర్ వ్యాధి వ్యాప్తికి తెలుగు రాష్ట్రాలు కేంద్రాలుగా నిలుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యదాయకమైన తాటి, ఈత, ఖర్జూర, జీరిక చెట్ల నీరాతో తయారయ్యే బెల్లం, చక్కెర, సిరప్ తదితర ఉత్పత్తుల వాడకంపై నగర, పట్టణ వాసుల దృష్టి మరలుతోంది. సుగర్ వ్యాధిగ్రస్తులు సైతం నిక్షేపంగా ఉపయోగించదగిన తీపి పదార్థాలు కావటంతో వీటికి మార్కెట్లో అధిక ధర లభిస్తోంది. దీంతో అభ్యుదయ రైతులు జీరిక చెట్ల సాగుపై దృష్టి సారిస్తున్నారు. వీరిలో అగ్రగణ్యులు ఎం. అప్పిరెడ్డి. ‘తాటి, ఈత, కొబ్బరి చెట్ల కన్నా అత్యంత నాణ్యమైన నీరాను జీరిక చెట్టు అందిస్తుంది. దీన్నే గిరిక తాడి, జీలుగ, డాలర్ చెట్టు అని పిలుస్తున్నారు. అంతేకాకుండా.. ఏడాదిలో 6 నెలలకు పైగా రోజుకు 40–50 లీటర్ల మేరకు ఎటువంటి పోషణా లేకుండా నీరా దిగుబడిని అందిస్తుంది. ఈ నీరాతో తయారయ్యే బెల్లం, పంచదారలో ఫ్రక్టోజు అధికంగా ఉంటుంది. కాబట్టి, సుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని వాడొచ్చు. అందుకే నేను 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న చెరకు సాగుకు స్వస్తి చెప్పి జీరిక సాగుకు శ్రీకారం చుడుతున్నా..’ అంటున్నారు సీనియర్ రైతు నేత అప్పిరెడ్డి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నివాసం ఉంటున్న ఆయన అఖిల భారత రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌గా ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర చెరకు రైతుల సంఘం మాజీ అధ్యక్షులు కూడా. ‘ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా నష్టదాయకమైన చెరకును వదిలెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా తాటి, ఈత, ఖర్జూర, జీరిక నీరా ద్వారా బెల్లం, పంచదార, బెల్లం పాకం తదితర 200 ఉత్పత్తులు తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ తాటి ఉత్పత్తుల పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త డా. వెంగయ్య విస్తృతంగా పరిశోధనలు చేసి, ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్ల క్రితం సాక్షి సాగుబడిలో ప్రచురితమైన డా. వెంగయ్య వ్యాసాల ద్వారానే అద్భుత వృక్షం జీరిక గురించి రైతులోకానికి తెలియవచ్చింది.. అన్నారాయన. కొరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇనుమడిస్తున్న ఆరోగ్యదాయకమైన ఆహార స్పృహ తాటి, జీరిక నీరాతో బెల్లం, పంచదార ఇతర తీపి ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ బాగా పెరుగుతోందని ఆయన అంటున్నారు. జీరిక పంచదారకు కిలో రూ. వెయ్యి వరకు ధర పలుకుతోంది. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అందువల్లనే తాను ఈ ఏడాది వంద ఎకరాల్లో జీరిక సాగుకు శ్రీకారం చుడుతున్నానని అప్పిరెడ్డి అంటున్నారు. కోట్లాదిగా ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరించి వాడుకలోకి తేవటంతోపాటు.. అంతకు ఎన్నోరెట్లు ఎక్కువ మోతాదులో నీరాను అందించే జీరిక చెట్ల పెంపకంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను ఎంతగానో పెంపొందించవచ్చని అప్పిరెడ్డి ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ ఏజన్సీ ప్రాంతాల్లో జీరిక చెట్లు వేల సంవత్సరాల నుంచి సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, స్థానికులు వీటి నుంచి నీరాను తీస్తూ ఆరోగ్యాన్ని పొందటమే కాక ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు. ఒక్క చెట్టుకు సంవత్సరానికి కౌలుకు ఇస్తే రూ. 30–35 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. సొంతంగా నీరా తీసే వారు ఏడాదికి చెట్టుకు రూ. లక్ష వరకు సంపాయిస్తూ, అదే తమ ముఖ్య ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఏ మాత్రం పోషణ ఖర్చు లేకుండానే జీరిక చెట్లు ఇస్తున్న ఆదాయం ఇది. జీరిక మరుగున పడిన గొప్ప ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అందించే చెట్టు. వీటి సాగును అభివృద్ధి చేయటం ద్వారా, రైతాంగం ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉందని శాస్త్ర పరిశోధనల ద్వారా రూఢి అయ్యింది. మన దేశ ప్రజల అవసరాలు తీర్చటంతో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయవచ్చు. శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాలు ఈ జాతి చెట్ల నీరా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయాన్ని గడిస్తున్నాయి. మన ప్రభుత్వాలు, రైతులు జీరిక చెట్ల పెంపకం ఆవశ్యకతను గుర్తెరగాలి. జీరిక మొక్క నాటిన ఆరేళ్లలో నీరా దిగుడిని ఇవ్వటం ప్రారంభం అవుతోంది. మరింత త్వరగా నీరా దిగుబడినిచ్చే విధంగా టిష్యూకల్చర్ మొక్కల ఉత్పత్తి కోసం కూడా చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయని అప్పిరెడ్డి తెలిపారు. స్వల్ప వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చు. గ్రామీణ ప్రాంతీయులకు ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చు. ప్రభుత్వాలు జీరిక ప్రయోజకత్వాన్ని గుర్తించాలి. ఇందుకోసం పెద్దగా నిధులు కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. కావలసిందల్లా శాస్త్రీయ దృక్పథం. సంకల్పం మాత్రమే అని అప్పిరెడ్డి (83090 24948) అంటున్నారు. -
విజయనగరం జిల్లాలో ఏనుగుల విధ్వంసం
-
చెరకు ‘కరువు’!
సాక్షి, హైదరాబాద్: వచ్చే క్రషింగ్ సీజన్ నాటికి రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పడిపోనున్నది.మద్దతు ధర చెల్లింపులో చక్కెర కర్మాగారాల వైఖరి, కరువు పరిస్థితులు తదితరాల నేపథ్యంలో ఈ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలు మూత పడ్డాయి. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోనుందనే అంచనాల నేపథ్యంలో ప్రైవేటు రంగంలోని చక్కెర కర్మాగారాలు కూడా మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 11 కర్మాగారాలు ఉండగా ఇప్పటికే సహకార రంగంలోని నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఎన్డీఎస్ఎల్ భాగస్వామ్యంలోని బోధన్, మెదక్, మెట్పల్లి చక్కెర కర్మాగారాలు కూడా మూత పడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటి క్రషింగ్ సామర్థ్యం రోజుకు 2,4700 టన్నులు. ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల సామర్థ్యానికి అనుగుణంగా చెరుకు సరఫరా కాకపోవడంతో క్రషింగ్ సీజన్‌ను గడువుకు ముందే ముగిస్తున్నారు. చెరకు, చక్కెర శాఖ గణాంకాల ప్రకారం 2018–19 క్రషింగ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,568 హెక్టార్లలో చెరుకు సాగు చేశారు. వచ్చే క్రషింగ్ సీజన్ 2019–20లో చెరకు సాగు విస్తీర్ణం కేవలం 23,188 హెక్టార్లకే పరిమితం అవుతుందని అధికారులు అంచనా వేశారు. గణపతి, కామారెడ్డి గాయత్రి షుగర్స్ మినహా మిగతా అన్ని ఫ్యాక్టరీల పరిధిలో కేవలం 2,500 హెక్టార్లలోపు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏడాది వ్యవధిలోనే 12,380 హెక్టార్లలో చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో ఫ్యాక్టరీల మనుగడకు సవాలుగా మారనుంది. భారీగా తగ్గనున్న దిగుబడి రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాల పరిధిలో గత ఏడాది 2018–19 క్రషింగ్ సీజన్లో 24.14 లక్షల మెట్రిక్ టన్నుల చెరకును క్రషింగ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో హెక్టారుకు సగటున 70 టన్నుల చెరుకు దిగుబడి వస్తోంది. సాగు విస్తీర్ణం పడిపోతున్న నేపథ్యంలో దిగుబడి కూడా 8.66 మెట్రిక్ టన్నుల మేర తగ్గనుంది. గత ఏడాదితో పోలిస్తే వచ్చే క్రషింగ్ సీజన్ నాటికి కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందని చక్కెర రంగం నిపుణులు చెప్తున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసినా కనీస మద్దతు ధర (ఎఫ్ఆర్పీ) టన్నుకు రూ.2845 మించడం లేదు. మరోవైపు క్రషింగ్ కోసం పంటను కర్మాగారాలకు తరలించినా ఫ్యాక్టరీ యాజమాన్యాలు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. గత ఏడాది క్రషింగ్‌కు సంబంధించి చక్కెర కర్మాగారాలు రైతులకు రూ. 729.69 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 476.57 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి చేరాయి. మరో రూ.245 కోట్ల బకాయిల కోసం రైతులు కర్మాగారాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుంగదీస్తున్న కరువు పరిస్థితులు దేశ వ్యాప్తంగా 527 చక్కెర కర్మాగారాలు ఉండగా తెలంగాణలో 11 కర్మాగారాలు ఉన్నాయి. చక్కెర కర్మాగారాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే నష్టాలతో రాష్ట్రంలో ఇప్పటికే సహకార, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య కర్మాగారాలు నాలుగు మూతపడ్డాయి. చెరకు సాగుకు పేరొందిన మంజీర, గోదావరి నదీ తీర ప్రాంతంలో వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సిం గూరు, నిజాంసాగర్ల్లో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరింది. ఎన్డీఎస్ఎల్, నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూత పడటంతో రైతులు ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు, వర్షాధార పంటల సాగువైపు మొగ్గు చూపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో మరింతమంది చక్కెర రైతులు పత్తి, సోయా వంటి ప్రత్యామ్నాయ పం టల సాగువైపు మొగ్గు చూపుతుండటంతో రాబోయే రోజుల్లో చక్కెర కర్మాగారాలు చెరకు కొరతను ఎదుర్కోనున్నాయి. -
చేదును పంచుతున్న చెరుకు
మెదక్‌జోన్: ఒకప్పుడు వేలాది ఎకరాల్లో చెరుకు పండించే మెతుకుసీమలో నేడు ఆ సంఖ్య భారీగా తగ్గింది. మూడు దశాబ్ధాల్లో జిల్లాలో చెరుకు సాగు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నాడు చెరుకు సాగుతో ఆర్థికంగా ఎంతో అభివృద్ది చెందిన రైతులు నేడు పంట సాగు లేక విలవిలలాడుతున్నారు. దీనికి కారణం ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ మూతపడటమే . జిల్లాలోని మంబోజిపల్లి శివారులో 1987 సంవత్సరంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్మించారు. నాటి నుంచి ఉమ్మడి జిల్లాలోని 12 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీ ఆధారంగా సుమారు 20 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగుచేసేవారు. దీంతో 4 లక్షల మెట్రిక్‌టన్నుల చెరుకును గానుగాడించేవారు. రైతులకు ప్రతియేటా కోట్లాది రూపాయలను పంచేవారు. అప్పట్లో ఆ ప్యాక్టరీలో పర్మినెంట్ కార్మికులు 300 మంది ఉండగా సీజనల్ వర్కర్లు మరో 300 మంది నిత్యం పనులు చేసేవారు. రైతులకు, కార్మికులకు కొండంత అండగా ఉన్న ఈ ఫ్యాక్టరీని 2003 సంవత్సరంలో చంద్రబాబునాయుడు హయాంలో ఈ ఫ్యాక్టరీని కేవలం రూ. 60 కోట్లకు మెదక్, బోధన్, చక్కర్‌నగర్లో ఉండే మూడు నిజాంషుగర్ ఫ్యాక్టరీలను 51శాతం వాటను నిజాందక్కన్ పేపర్‌మిల్లు యజమానికి విక్రయించాడు. ఇదిప్రైవేట్‌పరం అయిన నుంచి కార్మికులకు, రైతులకు యజమాని చుక్కలు చూపించాడు. ఎంతోమంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఏలు ఇచ్చి గెంటివేశాడు. ప్యాక్టరీని 2014లో అక్రమంగా లాకవుట్ ప్రకటించి కార్మికులను రోడ్డుపాలుజేశారు. దీంతో నాటివైభవం పూర్తిగా కనుమరుగైంది. ఫ్యాక్టరీ మూతతో సాగు కనుమరుగు ఒకనాడు ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ నడుస్తున్న క్రమంలో ఫ్యాక్టరీ పరిధిలోని వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, టేక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, మెదక్, చిన్నశంకరంపేట, చేగుంట, రామాయంపేట తదితర ఉమ్మడి జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఏటా 20 వేల ఎకరాల చెరుకు పంటను సాగుచేసేవారు. అది పూర్తిగా మూతపడటంతో ప్రస్తుతం జిల్లాలో కేవలం 800 ఎకరాల్లో మాత్రమే చెరుకు పంట సాగవుతోంది. పండించిన కొద్దిపాటి చెరుకును మెదక్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలోని ఫ్యాక్టరీలకు చెరుకును తరలిస్తున్నారు. కాగా వచ్చేలాభం రవాణా ఖర్చులకే పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అతికొద్ది మంది రైతులు మాత్రం బెల్లం తయారు చేస్తున్నారు. తక్కువనీటితో సాగు చెరుకు సాగుకు అతి తక్కువ నీరు ఉన్నా పండుతుంది. ఎకర వరిపంటకు ఉపయోగించే నీటితో 6 ఎకరాల్లో చెరుకు పంటను పండించవచ్చును. అంతేకాకుండా ఒక్క ఏడాది చెరుకును నాటితో ఇది మూడు సంవత్సరాలవరకు పెరుగుతూనే ఉంటోంది. దీంతో విత్తనం ఖర్చులు రైతుకు పూర్తిగా తగ్గిపోతాయి. వరుస కరువుకాటకాలతో బోరుబావుల్లో నీటిఊటలు గణనీయంగా తగ్గిపోతున్న క్రమంలో కొద్దిపాటిగా వచ్చే నీటితోనూ చెరుకు పంటను సాగుచేసేందుకు వీలు ఉంటుంది. కానీ పంటను సాగుచేస్తె ఇతర జిల్లాలకు తరలించేందుకు రవాణా ఖర్చులు అధిక మొత్తంలో అవుతాయని వచ్చేఆదాయం రవాణా ఖర్చులకే పోతాయనే ఉద్దేశంలో చెరుకు పంటను సాగుచేయడం లేదు. ఇకనైనా పాలకులు స్పందించి ప్యాక్టరీని తెరిపిస్తే ఈప్రాంతంలో చెరుకు సాగుకు పూర్వవైభవం రావటం ఖాయం ఇచ్చిన హామీని మరిచారు టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే రైతులకోసం ప్రత్యేకంగా పలు పథకాలను అమలు చేస్తూ అన్నదాతల అభివృద్ధి కోసం తోడ్పాటును అందిస్తోంది. కానీ 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో ఎవరికి అర్థంకాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాగోగుల దృష్ట్యా ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తే ఈ ప్రాంత చెరుకు రైతుల జీవితాల్లో తీపిని నింపినట్లు అవుతుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. -
చెరుకుతో మధుమేహ ముప్పు..
మీరట్ : చెరుకు పంటను అధికంగా పండించడం మధుమేహానికి దారితీస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. రైతులు చెరుకుతో పాటు ఇతర పంటలపై దృష్టిసారించడమే దీనికి పరిష్కారమని సూచించారు. అక్టోబర్ 15 నాటికి రైతులకు చెరుకు బకాయిలను చెల్లించని చక్కెర మిల్లులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. పేదలు, రైతులను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. చెరుకు రైతుల బకాయిలను వచ్చే నెల 15 నాటికి చెల్లించకుంటే చక్కెర మిల్లులపై కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఢిల్లీ-సహరన్పూర్ జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, యూపీలో దేశంలోనే అత్యధికంగా చెరుకు దిగుబడులు సమకూరుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకూ చెరుకు క్రషింగ్ సీజన్ కొనసాగుతుంది. కాగా దేశంలో మొత్తం చక్కెర అవసరాల్లో 38 శాతం మేరకు దాదాపు 32 మిలియన్ టన్నుల చక్కెర యూపీలోనే ఉత్పత్తవుతుంది. -
చెరకు.. మాయం!
కనుమరుగవుతున్న పంట ఈసారి 2వేలకు పడిపోయిన సాగు ఏడాది క్రితమే ఫ్యాక్టరీ మూత అయోమయంలో రైతన్న సొంత జిల్లాలోనైనా పూర్వవైభవం వచ్చేనా మెదక్ : ఒకప్పుడు ఈ ప్రాంతంలో చెరకు సాగుకు ఎనలేని ప్రాధాన్యత.. ప్రస్తుతం అదే పంట మచ్చుకు కూడా కనపడని దుస్థితికి చేరింది. ప్రపంచానికి తీపిని పంచిన ఈ ప్రాంత చెరకు రైతులకు చివరకు చేదే మిగిలింది. పాలకుల పుణ్యమా అని ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయటంతో దాని యజమాని మూసివేసి కార్మికులతో పాటు చెరకు రైతులను రోడ్డు పాలు చేశారు. ఫలితంగా ఈ ప్రాంతంలో చెరకు పంట కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మెదక్ ప్రాంతంలో ఒకప్పుడు వరి తరువాత అతిఎక్కువగా చెరకుకే ప్రాధాన్యతను ఇచ్చేవారు. పాతికేళ్ల కిత్రం మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి శివారులో నిజాంషుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. ఫ్యాక్టరీ పరిధిలోని మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, కౌడిపల్లి, చేగుంట, దౌల్తాబాద్, గుమ్మడిదలతో పాటు మొత్తం 12 మండలాలకు చెందిన రైతుల కోసం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభంలో ఈ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో చెరకును సాగుచేసేవారు. దీంతో సీజన్లో 5 లక్షల పైచిలుకు టన్నుల చెరకును గానుగ ఆడించేవారు. ఇందులో 600 పైచిలుకు పర్మనెంట్ కార్మికులు. మరో 1000కిపైగా సీజనల్ కార్మికులు పనులు చేసేవారు. ఈ ఫ్యాక్టరీ అటు చెరకు రైతులకు ఇటు కార్మికులకు కల్పవల్లిగా ఉండేది. కాగా ఫ్యాక్టరి నష్టాల్లో ఉందని కావాలనే తప్పుడు లెక్కలు సృష్టించి 2002 సంవత్సరంలో అప్పటికి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబునాయడు దీనిని డక్క¯ŒSపేపర్ మిల్లు యజమానికి ఫ్యాక్టరిలోని 51శాతం వాటాను విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. నాటి నుంచి అటురైతులకు, ఇటు కార్మికులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయ్యాక చెరకు రైతులకు ఒక్కోసారి రెండు సంవత్సరాల వరకు సైతం బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతంలో చెరకు సాగుకోసం అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. ప్రైవేట్ యజమాన్యం పూర్తి సబ్సిడీలను ఎత్తివేశారు. ఫ్యాక్టరిలో 600 మంది పర్మినెంట్ కార్మికులుండగా వారిలో చాలా మందికి బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపించారు. దీంతో ప్రస్తుతం 95 మంది మాత్రమే కార్మికులున్నారు. కార్మికులకు నెలనెలా వేయాల్సిన పీఎఫ్ డబ్బులను సైతం సరిగ్గా వేయలేదు. అంతేకాకుండా గత సంవత్సరం చెరకుసాగు లేదనే సాకుతో ఫ్యాక్టరిని గత డిసెంబర్ మాసంలో అక్రమంగా లేఆఫ్ ప్రకటించారు. కార్మికులకు 11 నెలలుగా వేతనాలు సైతం ఇవ్వటంలేదు. గత సంవత్సరం 5 వేల ఎకరాల్లో చెరకు పంటను సాగు చేయగా ఫ్యాక్టరీని నడిపించక పోవటంతో నిజామాబాద్ జిల్లాకు చెరకును తరలించి నానా అవస్తలు పడ్డారు. దీంతో ఈ యేడు కేవలం 2 ఎకరాలకే చెరుకు పంటను పరిమితం అయ్యింది. ఇలా ప్రతియేటా చెరుకు పంట కనుమరుగైయ్యే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం కొత్తజిల్లాలోనైనా చెరకు సాగుకు çపూర్వవైభవం వచ్చేనా? ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపించేనా? అంటు పలుమండలాల చెరుకు రైతులు పేర్కొంటున్నారు. -
చెరకు.. కిరికిరి!
పంట మద్దతు ధరపై ఏటా ఇదే పరిస్థితి సకాలంలో ప్రకటించని ట్రైడెంట్ యాజమాన్యం క్రషింగ్‌కు సమీపిస్తున్న గడువు టన్నుకు రూ.2,600 చెల్లిస్తామంటూ లీకులు రూ.2,723 చెల్లించాలని రైతుల డిమాండ్ స్పష్టత కరువు..ఆందోళనలో రైతులు జహీరాబాద్: చెరకు మద్దతు ధర నిర్ణయంలో ఏటా ఇదే పరిస్థితి. క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం మద్దతు ధర ప్రకటించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టన్నుకు రూ.2,600 చెల్లిస్తామంటూ లీకులిచ్చింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు రైతులు. గత ఏడాదికి సంబంధించి సరఫరా చేసిన చెరకు పంటకు ఇప్పటికీ మద్దతు ధరను నిర్ణయించకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. ధరలో కోత విధించడం, బకాయిలు పేరుకుపోవడం వంటి సమస్యలతో ఈ ప్రాంత రైతులు సతమతమవుతున్నారు. చెరకు మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో 8.5 చక్కెర శాతంపై కనీస మద్దతు ధరను ప్రకటించేవారు. 2010లో ఈ విధానాన్ని మార్చారు. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ కింద 9.5 శాతం రికవరీపై కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. కర్మాగారంలో రికవరీ శాతం పెరిగితే దానికి అనుగుణంగా ధరను లెక్కకట్టి యాజమాన్యాలు రైతులకు చెల్లించాలి. ఇంతకన్నా తక్కువ ధరకు కొనడానికి యాజమాన్యం, ఏజెంట్లు ఒప్పందం చేసుకోరాదని క్లాస్ 3(2) చట్టం చెబుతోంది. 1961 షుగర్ కేన్ రెగ్యులేషన్ ఫర్ పర్చేజ్ అండ్ సప్లై యాక్టు ప్రకారం ఫాం 3లో రైతులతో, రైతు సంఘాలతో యాజమాన్యం చేసుకున్న చెరకు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర గాని, రైతులు చేసుకున్న ఒప్పందంలో ఏది ఎక్కువ ధర ఉంటే దాన్ని అమలు చేయాలి. 2015-16 క్రషింగ్ సీజన్‌కు గాను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుంటే కర్మాగారానికి వచ్చిన రికవరీ ఆధారంగా కొనుగోలు పన్ను రూ.60 కలుపుకుని రైతులకు టన్నుకు రూ.2,723 మేర ధరను యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు. ఇప్పటివరకు రైతులకు టన్నుకు రూ.2,455 మాత్రమే యాజమాన్యం చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నికరంగా రూ.208 రావాలని, పర్చేజ్ ట్యాక్సు కలుపుకుంటే టన్నుకు రూ.268 మేర యాజమాన్యం చెల్లించాలని వారంటున్నారు. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్ యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుని రికవరీ ఆధారంగా చెరకు ధరను చెల్లించిందని వారు గుర్తు చేస్తున్నారు. రూ.8 కోట్ల మేర బకాయిలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుంటే రైతులకు ట్రైడెంట్ యాజమాన్యం రూ.8 కోట్ల మేర బకాయి పడింది. 2015-16 క్రషింగ్ సీజన్‌కు కర్మాగారం 3 లక్షల టన్నుల మేర చెరకు పంటను గానుగాడించింది. ఈ సీజన్‌కు కర్మాగారం 11శాతం చక్కెర రికవరీ సాధించింది. బకాయిల చెల్లింపులో మాత్రం ఏటా యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు వాపోతున్నారు. 2014-15 సీజన్‌కు సంబంధించిన బకాయిలను 2015-16 క్రషింగ్ సీజన్‌ను ప్రారంభించిన అనంతరమే చెల్లించిందని వారు గుర్తుచేశారు. ఇలా బకాయిలను ఏడాది పొడుగునా చెల్లించకుండా ఉంటే తామెలా బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బిల్లుల చెల్లింపులోనూ జాప్యం క్రషింగ్ నిమిత్తం చెరకును కర్మాగారానికి తరలించినా నెలల తరబడి బిల్లులను చెల్లించకుండా యాజమాన్యం దాటవేస్తోందని రైతులు చెబుతున్నారు. 2015-16 క్రషింగ్ సీజన్ అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నా బిల్లులను చెల్లించే విషయానికి వస్తే ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. చెరకును సరఫరా చేసిన 14 రోజుల్లోగా యాజమాన్యం బిల్లులు చెల్లించాలని క్లాజ్ 3ఏ నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. బిల్లులను సకాలంలో చెల్లించని పక్షంలో 15శాతం వడ్డీ లెక్కకట్టి ఇవ్వాలని షుగర్ కేన్ చట్టం చెబుతోంది. జనవరిలో మొదటి విడత కింద టన్నుకు రూ.2,225 మేర బిల్లులను చెల్లించిందని, వడ్డీని మాత్రం ఎగ్గొట్టిందని వారంటున్నారు. క్లాజ్ 8 ప్రకారం భూమి శిస్తు మాదిరిగా యాజమాన్యం వద్ద వసూలు చేసే వీలుందని రైతులు గుర్తుచేస్తున్నారు. పన్ను విషయంలో స్పష్టతేదీ? చెరకు కొనుగోలు పన్ను విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. కొనుగోలు పన్ను కింద ప్రభుత్వం రైతులకు ప్రభుత్వం టన్నుకు రూ.60 చెల్లిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు జీఓ విడుదల కాలేదు. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా యాజమాన్యం చెరకు ధరను చెల్లించాలి. ఇప్పటివరకు పర్చేజ్ ట్యాక్సును కలుపుకుని యాజమాన్యం చెరకు ధరను చెల్లిస్తూ వస్తోంది. ప్రభుత్వం ఈ బాధ్యతను యాజమాన్యానికి ఇవ్వడం వల్లే ఇలా చేస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వమే నేరుగా పర్చేజ్ ట్యాక్సును తమ ఖాతాలో జమచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి బిల్లులను సాధించుకుంటాం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు కర్మాగారం సాధించిన రికవరీ ఆధారంగా చెరకు బిల్లలను సాధించుకుంటాం. యాజమాన్యం తక్కువ ధర చెల్లించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. అధికారుల అసమర్థత వల్లే రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రైతులు అప్పులు చేసి పంటలను పండించుకుంటున్నారు. దీన్ని యాజమాన్యం గుర్తించి షుగర్ కేన్ చట్టం ప్రకారం బిల్లులు చెల్లించాలి. - ఎం.పాండురంగారెడ్డి, రైతు సంఘం నాయకుడు, జహీరాబాద్ చట్ట ప్రకారం ధర చెల్లించాల్సిందే షుగర్ కేన్ యాక్టు ప్రకారం యాజమాన్యం రైతులకు ధర ఇవ్వాల్సిందే. ఇందులో మినహాయింపు ఉండదు. యాజమాన్యానికి రూ.45 మేర సబ్సిడీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చక్కెర ధర బాగానే ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను పరిగణనలోకి తీసుకుని, కర్మాగారం సాధించిన రికవరీ మేరకు రైతులకు బిల్లులు చెల్లించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యంపై గత జూన్‌లో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. - రాజశేఖర్, కేన్ రెగ్యులేటర్ ఇన్స్పెక్టర్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం, జహీరాబాద్ -
చెరుకు పంట దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని జామి మండలం పావడ గ్రామంలో ఆదివారం చెరుకు పంట అగ్నికి ఆహుతి అయింది. పంట పోలంలోని కరెంట్ తీగలు ఒకదానికొకటి తగిలి రాసుకోపోవడంతో మంటలు చెలరేగాయి. సాగు చేసుకుంటున్న10 ఎకరాల చెరుకు పంటకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంట.. తమ కళ్ల ముందే బూడిద కావడంతో తట్టుకోలేని రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. -
'అధికారమదంతో రాక్షసుడు అవుతున్నాడు'
-
తీపి పంట పండించినా చేదు అనుభవమే..
అమరచింత (నర్వ) : చెరుకు పండించిన రైతుకు నిరాశ ఎదురైంది. దీంతో ఆ రైతు మనస్తాపానికి గురై తన ఐదెకరాల పంట చేను ట్రాక్టర్ తొలగించిన సంఘటన బుధవారం ఆత్మకూర్ మండలంలోని అమరచింత గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండల పరిధిలోని అమరచింత గ్రామానికి చెందిన రైతు గొల్ల శ్రీనివాసులు గత ఏడాది కొత్తతాండాకు సమీపంలోగల తన సొంత వ్యవసాయపొలంలో ఐదెకరాలలో చెరుకు పంటను వేశారు. మొదటి విడతగా కోత ద్వారా 150 టన్నుల చెరుకు దిగుబడి రూపంలో రాగా వాటినంతటిని సమీపంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి తరలించారు. అయితే ఆరు నెలల నుంచి రైతుకు ఇవ్వాల్సిన రూ.2 లక్షలను ఫ్యాక్టరీ వారు ఇగ ఇస్తామంటూ దాటవేస్తున్నారు. దీంతో ఆ రైతు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో మనస్తాపానికి గురై తాను సాగు చేసిన చెరుకు పంటను పూర్తిగా తొలగించడానికి పూనుకున్నాడు. విషయం తెలిసి ఫ్యాక్టరీ సిబ్బంది వచ్చి వారించినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు రైతు తన 5 ఎకరాల పొలాన్ని అంతా ట్రాక్టర్‌తో దున్ని చదును చేశాడు. -
చెరకు పంట అధ్యయంపై ప్రతినిధి బృందం
నిజామాబాద్: మహారాష్ట్రలోని చెరుకు పంటపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, రైతు సంఘాల నాయకులను ఈ బృందంలో చేర్చారు. -
ఒంటికన్ను కణుపులు వాడండి!
పాడి-పంట: అనకాపల్లి (విశాఖపట్నం): ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెరకు సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోతోంది. ఓ వైపు పెట్టుబడి వ్యయం పెరగడం, కూలీల కొరత... మరోవైపు దిగుబడులు పెరగకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం... దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు 40-50 వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. సాగు ఖర్చును తగ్గించుకోగలిగినప్పుడే రైతులు లాభాల బాట పడతారు. ముచ్చెలకు బదులు బడ్‌చిప్/ఒంటికన్ను కణుపులను వినియోగించడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ ఎం.భరతలక్ష్మి. ఆ వివరాలు... చెరకు తోటలో రైతులు మూడు లేదా రెండు కళ్ల ముచ్చెలు నాటుతుంటారు. ఇందుకోసం ఎకరానికి 4-6 టన్నుల ముచ్చెలు అవసరమవుతాయి. ముచ్చెలకు బదులు మొగ్గతో ఉన్న ఒంటికన్ను కణుపులను గడల నుంచి వేరు చేసి, వాటిని ట్రేలల్లో పెంచి, నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే విత్తన మోతాదు బాగా తగ్గుతుంది. రైతుకు నికరాదాయం పెరుగుతుంది. ఈ విధానంపై రెండు రాష్ట్రాలలోని చెరకు పరిశోధనా స్థానాలలో గత నాలుగైదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కో నారు మొక్క నుంచి 10-15 కిలోల దిగుబడి పొందవచ్చునని తేలింది. ఎన్నో ప్రయోజనాలు సంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతిలో పైరు ఎక్కువ పిలకలు తొడుగుతుంది. పిలకలన్నీ ఒకే విధంగా పెరుగుతాయి కాబట్టి గడల సంఖ్య, వాటి బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఎకరానికి సుమారు 10 టన్నులు, కోస్తాలో 5 టన్నుల మేర దిగుబడి పెరిగిందని పరిశోధనల్లో తేలింది. కణుపులను తేలికగా శుద్ధి చేసి, తద్వారా ఆరోగ్యవంతమైన నారును పెంచి చీడపీడల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. నారు మొక్కలను ట్రేలల్లో పెంచడం వల్ల నెల రోజుల పంటకాలం కలిసొస్తుంది. ముందుగానే చెరకు క్రషింగ్ మొదలు పెట్టవచ్చు. నీరు, ఇతర వనరులు కూడా ఆదా అవుతాయి. ట్రేలల్లో ఒంటికన్ను కణుపులను నాటిన తర్వాత గడలో మిగిలిన భాగాన్ని పంచదార లేదా బెల్లం తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతి యాంత్రీకరణకు బాగా అనువుగా ఉంటుంది. ఎలా తీయాలి? రైతులు ముందుగా అధిక దిగుబడినిచ్చే అనువైన రకాన్ని ఎంచుకోవాలి. 6-7 నెలల వయసున్న ఆరోగ్యవంతమైన తోట నుంచి గడలను సేకరించాలి. వీటి నుంచి ఒంటికన్ను కణుపులను వేరు చేయాలి. ఇందుకోసం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతిలో చెరకు సాగుకు ఎకరానికి కేవలం 70-80 కిలోల విత్తన కణుపులు సరిపోతాయి. సేకరణ సమయంలో విత్తన కణుపులు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మొలక శాతం తగ్గుతుంది. కణుపులను గ్రేడింగ్ చేసి, మేలైన వాటిని తీసుకోవడం మంచిది. లీటరు నీటిలో 0.5 గ్రాముల కార్బండజిమ్+ఒక మిల్లీలీటరు మలాథియాన్ చొప్పున కలిపి, ఆ మందు ద్రావణంలో విత్తన కణుపులను 15 నిమిషాల పాటు ముంచి శుద్ధి చేయాలి. దీనివల్ల అనాసకుళ్లు తెగులు, పొలుసు పురుగు బారి నుంచి తోటను కాపాడుకోవచ్చు. ట్రేలో అమర్చి... విత్తన కణుపులను నాటడానికి ప్లాస్టిక్ ట్రేలను ఉపయోగించాలి. ఒక్కో ట్రేలో 50 నారు మొక్కలను పెంచవచ్చు. కొబ్బరి పీచుతో చేసిన ఎరువు (కోకో ఫీడ్)/బాగా చివికిన పశువుల ఎరువు/వర్మి కంపోస్ట్‌కు తగినంత మట్టిని కలిపి ట్రే గుంతను సగానికి పైగా నింపాలి. విత్తన కణుపును 60-70 డిగ్రీల వాలుగా నాటాలి. దానిపై మళ్లీ ఎరువు వేసి, కణుపు కనబడకుండా అదమాలి. ఆ ట్రేలను షేడ్‌నెట్ కింద లేదా నీడలో వరుసకు 10 చొప్పున ఉంచాలి. వాటిపై నల్లని పాలిథిన్ షీటును కప్పి గాలి చొరబడకుండా బిగించాలి. దీనివల్ల మొక్కలు 3-4 రోజుల్లో మొలుస్తాయి. కణుపు నుంచి మొక్క బయటికి వచ్చిన వెంటనే పాలిథిన్ షీటును తీసేయాలి. రోజు విడిచి రోజు రోజ్క్యాన్ లేదా స్ప్రింక్లర్లతో నీటిని చల్లాలి. నాటిన వారం రోజులకు మొక్కలన్నీ మొలిచి, ఆకులు తొడగడం మొదలవుతుంది. నాటిన 4 వారాలకు మొక్క 3-4 ఆకులు తొడుగుతుంది. వేర్లు కూడా వృద్ధి చెందుతాయి. నాటిన రెండు వారాల తర్వాత కూడా కణుపుల నుంచి మొలక రాకపోతే వాటిని తీసేసి కొత్త కణుపులు నాటాలి. ఎకరం తోటలో నాటేం దుకు 7,500-8,000 నారు మొక్కలు (150-175 ప్లాస్టిక్ ట్రేలలో పెంచిన) అవసరమవుతాయి. నారు మొక్కలు బలహీనంగా ఉన్నట్లయితే 19:19:19 ఎరువు 0.1% లేదా వర్మివాష్ 1% ద్రావణాన్ని వాటిపై పిచికారీ చేయాలి. (మిగతా వివరాలు రేపటి పాడి-పంటలో) -
విద్యుత్ తీగ తెగిపడి చెరకు తోట దగ్ధం
మురమండ (కడియం), న్యూస్‌లైన్ : చెరకు తోటపై విద్యుత్ తీగ తెగిపడ్డ సంఘటనలో సుమారు రూ.మూడు లక్షల నష్టం వాటిల్లింది. స్థానిక కల్యాణ మండపం సమీపంలోని పుంత రోడ్డులో మంగళవారం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో గారపాటి సత్తిబాబుకు చెందిన సుమారు ఐదెకరాల చెరకు తోట పూర్తిగా కాలిపోయింది. తెగిపడిన తీగ మిగిలిన వాటిని తాకుతూ కిందపడింది. దీంతో రెండు స్తంభాల మధ్యనున్న తీగల వెంబడి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో తోటంతా మంటలు వ్యాపించాయి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తీగలు తెగిపడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో సమీపంలోనే చెరకు తోటలు కొట్టే కూలీలు ఉన్నారు. వారు కొంతమేర చెరకును నరికివేయడంతో మంటలు పక్కనున్న తోటలకు వ్యాపించలేదు. చేతికొచ్చిన తోట ఇలా కాలిపోవడంతో రైతు సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని, ప్రమాదం కారణంగా కనీసం పెట్టుబడి కూడా రాదని చెప్పాడు. మండపేటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేశారు. -
రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించండి: ప్రభుత్వం
కొల్హాపూర్: రూ. 2.25 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఎంపీ రాజుశెట్టి నేతృత్వంలోని స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చెరకు పంటకు గిట్టుబాటు ధర కోసం పార్టీ గత ఏడాది ఆందోళన చేసిన సంగతి విదితమే. ఈ ఆందోళన కారణంగా ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆ పార్టీకి పంపిన నోటీసులో హోం శాఖ పేర్కొంది. కాగా ప్రస్తుతం స్వాభిమాన్ పార్టీ ఇదే అంశంపై కరాడ్ తాలూకాలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి విదితమే. క్వింటాల్ చెరకుకు గిట్టుబాటు ధర కింద రూ. 3,000 చెల్లించాలంటూ శుక్రవారం ఆ పార్టీ ఆందోళనకు దిగాల్సి ఉన్నప్పటికీ సదరు డిమాండ్‌ను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్‌ద్వారా గురువారం తెలియజేయడంతో వాయిదా వేసుకుంది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు సదాఖోట్ మీడియాతో మాట్లాడుతూ 2012 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరకు కొనుగోలు ధరల విషయమై తమతో చర్చలు జరపాల్సిందిగా ఆయా చక్కెర పరిశ్రమల యాజమాన్యాలను కోరామని, అయితే అందుకు వారు నిరాకరించారని అన్నారు. అందువల్లనే చెరకు రైతులు వీధుల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రైతులు చనిపోయారన్నారు. అయినప్పటికీ బాధిత కుటుంబాలకు ఇప్పటిదాకా పరిహారం అందనే లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తమ పార్టీకి రూ. 2.25 కోట్ల జరిమానా విధించిందన్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు రైతుల గురించి ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా రైతాంగం విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదిలాఉంచితే చెరకు పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన సాంగ్లి, కొల్హాపూర్, సాతారా జిల్లాలలో స్వాభిమాన్ పార్టీ గత ఏడాది అనేక పర్యాయాలు ఆందోళనలు చేసింది. రహదారులను దిగ్బంధించడమే కాకుండా వాహనాలతోపాటు చెరకు పంటను తరలిస్తున్న ఎడ్ల బండ్లను ముందుకు కదలనీయకుండా అడ్డుకుంది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో సాతారా, సాంగ్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. సాంగ్లి జిల్లాలో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. అప్పుడే అంచనా వేశాం గత ఏడాది రైతాంగం ఆందోళనల వల్ల కలిగిన నష్టాన్ని అప్పట్లోనే అంచనా వేశామని సాంగ్లి జిల్లా కలెక్టర్ ఉత్తమ్ పాటిల్ తె లిపారు. కేవలం సాంగ్లి జిల్లాలోనే రూ. 50,41,400 మేర నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.