sundeep
-
‘సందీప్ 26/11 బాధితుడు కాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చాడు’
ముంబై: మహానగరం ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తోపాటు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 10న రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది. ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ హోటల్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయి. ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా భారత్‌కు రానున్నాడనే సంగతి తెలుసుకున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్, ఎన్డీటీవీతో మాట్లాడుతూ ‘సందీప్ 26/11 బాధితుడు కాదు, అతను తన కర్తవ్యం నిర్వర్తించాడు’ అని అన్నారు. రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణమని, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలని, న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులందరికీ ఇది ఒక ఆశాకిరణం’ అని ఆయన పేర్కొన్నారు. తహవ్వుర్ రాణా భారత్‌కు అప్పగించిన కారణంగా 26/11 దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో అతనికి గల సంబంధాలు బయటపడే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: 26/11 టార్గెట్‌లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర? -
నంబర్స్‌కే మర్యాద: సందీప్ కిషన్
‘‘నేను చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘మజాకా’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను, నాన్న (రావు రమేశ్) ఒకే ఇంట్లో ఉండే బ్యాచిలర్స్‌లా బతుకుతుంటాము. మమ్మల్ని ఎవరూ పండగలకు, వేడుకలకు పిలవరు. మా ఇంట్లో మహిళలు పని చేయాలనుకోరు. ఇలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్(Sandeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka movie). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సందీప్ కిషన్ పంచుకున్న విశేషాలు.⇒ నాకు నచ్చిన కథతో సినిమా చేశాను. నిర్మాతకు డబ్బులొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోయారు... ఇలాంటి ఉద్దేశ్యంతోనే నేను సినిమాలు చేసుకుంటూ నా కెరీర్లో పరిగెత్తాను. నా తర్వాతి సినిమాల నంబర్స్ (వసూళ్లను ఉద్దేశించి..) ఇంత ఉండాలనే నాలెడ్జ్ నాకు అప్పట్లో లేదు. ఈ నాలెడ్జ్ వచ్చే సమయానికి అంటే... 2019లో నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. ‘మైఖేల్’ నుంచి మళ్లీ పుంజుకున్నాను. నంబర్స్ గురించి ఆలోచించాను. ‘మైఖేల్’కు పెద్ద నంబర్స్ రాలేదు.కానీ నాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు పెరిగింది. ‘భైరవ కోన’ మూవీ పెద్ద నంబర్స్ రాగలవనే నమ్మకాన్ని నాకు ఇచ్చింది. రాయన్ (ఇందులో సందీప్ ఓ లీడ్ రోల్ చేశారు) హిట్‌గా నిలిచింది. కానీ ఇది ధనుష్ అన్న చిత్రం. ఇప్పుడు ‘మజాకా’కు పెద్ద నంబర్స్ వస్తాయి. చెప్పాలంటే... నంబర్స్ గురించి నాకు పెద్ద ఆసక్తి లేదు. కానీ నంబర్స్ వస్తేనే మర్యాద. కళకో, కృషికో దక్కని మర్యాద నంబర్స్‌కు లభిస్తోంది. గత ఐదేళ్లలో నా మార్కెట్ పది రెట్లు పెరిగింది.⇒ ‘మజాకా’లో ఇప్పటివరకు ఎవరూ చెప్పని మంచి పాయింట్‌ను టచ్ చేశాం. రావు రమేశ్‌గారికి, నాకు మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఆడియన్స్‌కు నచ్చేలా సినిమాలు తీస్తారు త్రినాథరావుగారు. ప్రసన్నగారు మంచి కథ రాశారు. అనిల్, రాజేశ్గార్లంటే నాకు హోమ్ ప్రోడక్షన్. ఒకరు నాకు అన్నలాంటివారు. రాజేశ్ మంచి ఫ్రెండ్. ⇒ నా పదిహనేళ్ల కెరీర్లో ముప్పై సినిమాలు చేశాను. నా జర్నీలో కొత్త కథలను, దర్శకులను, ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశాననే ఆనందం ఉంది. రాబిన్‌హుడ్ లాంటి క్యారెక్టర్‌తో పీరియాడికల్ ఫిల్మ్ చేయాలని ఉంది. అయితే ఖాళీగా అయినా ఉంటాను కానీ, కమర్షియల్ సినిమాల్లో విలన్‌గా చేయను. ఇక తమిళంలో నాకు మంచి ఆదరణ లభిస్తుండటం హ్యాపీ. ప్రస్తుతం సంజయ్ (ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు) డైరెక్షన్లో మూవీ చేస్తున్నాను. ‘ఫ్యామిలీ మేన్’ థర్డ్ సీజన్లో నటించాను. నెట్‌ఫ్లిక్స్‌కి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. -
చెలరేగిన సందీప్
జింఖానా, న్యూస్‌లైన్: డెక్కన్ క్రానికల్ జట్టు బ్యాట్స్‌మన్ సందీప్ (68 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. దీంతో ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో రోజు మ్యాచ్‌లో ఎన్స్‌కాన్స్ జట్టుపై డెక్కన్ క్రానికల్ జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఎన్స్‌కాన్స్ జట్టు 278 పరుగులు చేయగా... డెక్కన్ క్రానికల్ జట్టు 345 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఎన్స్‌కాన్స్ జట్టు 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. తన్మయ్ అగర్వాల్ (85) అర్ధ సెంచరీతో రాణించాడు. డెక్కన్ క్రానికల్ బౌలర్ ఆకాష్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన డెక్కన్ క్రానికల్ రెండు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి నెగ్గింది. డెక్కన్ క్రానికల్ 13, ఎన్స్‌కాన్స్ 5 పాయింట్లు దక్కించుకున్నాయి. మరో మ్యాచ్ బీడీఎల్ జట్టుపై, ఆంధ్రాబ్యాంక్ జట్టు గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్‌లో బీడీఎల్ జట్టు 129, ఆంధ్రాబ్యాంక్ జట్టు 216 పరుగులు చే శాయి. తదనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బీడీఎల్ 185 పరుగులు చేసింది. విశాల్ జూడ్ ఫిలిప్స్ 41 పరుగులు చేశాడు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్స్ లలిత్ మోహన్ 5, కనిష్క్ నాయుడు 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆంధ్రాబ్యాంక్ రెండే వికెట్లకు 99 పరుగులు చేసి గెలిచింది. బీడీఎల్ 4, ఆంధ్రాబ్యాంక్ 10 పాయింట్లు పొందాయి.