vanajeevi Ramayya
-
వనజీవి కన్నుమూత
ఖమ్మం రూరల్/ ఖమ్మం మయూరి సెంటర్: వన ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి (వనజీవి) రామయ్య (88) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. రోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి తన దినచర్య ప్రారంభించే ఆయన ఉదయం 6 గంటలైనా మేల్కొనకపోవడంతో భార్య జానకమ్మ తట్టి లేపే ప్రయత్నం చేశారు.చలనం లేకపోవడంతో కుటుంబసభ్యుల సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు కనకయ్య, కుమార్తె సైదమ్మ ఉన్నారు. మరో ఇద్దరు కొడుకులు సైదులు, సత్యనారాయణ గతంలోనే చనిపోయారు. కాగా రామయ్య అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10–30 గంటలకు పల్లెగూడెం శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.తుది శ్వాస వరకు మొక్కలు నాటుతూ..ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1937 జూలై 1న రామయ్య జన్మించారు. ఆ తర్వాత వారు రెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. 5వ తరగతి వరకు చదువుకున్న రామయ్యకు చిన్నతనం నుంచే మొక్కల పెంపకంపై మక్కువ ఉండేది. ఉపాధ్యాయుడు జి.మల్లేశం మొక్కల పెంపకంతో కలిగే లాభాలపై బోధించిన పాఠం మనసులో నాటుకుపోయింది. అప్పటినుంచి మొక్కల ప్రేమికుడిగా మారి తుదిశ్వాస వరకు మొక్కలు నాటుతూనే ఉన్నారు.వృత్తి రీత్యా కుండలు చేస్తూ, ప్రవృత్తిగా మొక్కలు పెంచేవారు. ఇంట్లో సగ భాగంలో మొక్కల పెంపకాన్ని చేపట్టిన ఆయన.. పిల్లలతో సమానంగా వాటిని చూసుకునేవారు. రోడ్లు, గుట్టల వెంట తిరుగుతూ వివిధ రకాల మొక్కల విత్తనాలను సేకరించి వాటిని వివిధ ప్రదేశాల్లో నాటడం నిత్య కార్యక్రమంగా మార్చుకున్నారు. ఇలా ఇప్పటి వరకు కోటిన్నరకు పైగా మొక్కలను నాటారు.పాఠ్యపుస్తకాల్లో జీవిత విశేషాలుమహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్ధుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చి బోధిస్తుండటం ఆయనకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి విశేషాలతో పాఠం పొందుపరిచింది. రామయ్యకు ప్రముఖుల నివాళులురాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో పాటు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ.. రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా రామయ్య మృతిపై పలువురు ప్రముఖులు, మంత్రులు, నేతలు సంతాపం ప్రకటించారు.ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని, కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించిన దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సంతాపాన్ని ప్రకటించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీలు సంతోష్‌కుమార్, మధుయాష్కీ, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.పద్మశ్రీ.. పలు అవార్డులుమొక్కల పెంపకంలో చేసిన కృషికి గాను వనజీవి రామయ్య 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు అందుకున్నారు. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అవార్డు ప్రదానం చేసింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అంతర్జాతీయ సంస్థ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 2017లో కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది.సుస్థిరత కోసం గళం వినిపించారుదరిపల్లి రామయ్య సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లు నాటడమే కాకుండా వాటి రక్షణకు ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి.. భవిష్యత్ తరాలపై బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.– ఎక్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీసమాజంపై తనదైన ముద్రపర్యావరణ పరిరక్షణకు, అడవుల పెంపకానికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన రామయ్య సమాజంపై తనదైన ముద్ర వేశారు. పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత స్థాయిలో తీసుకునే చర్యలు ఎంత శక్తివంతమైనవో తెలపడానికి రామయ్య జీవితం ఒక ఉదాహరణ. – రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మప్రకృతి కోసం జీవితాన్ని అంకితం చేశారుప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి, తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామయ్య. ఒక సామాన్య వ్యక్తిగా ఉండి, మొక్కలు నాటడం ద్వారా సమాజాన్ని స్ఫూర్తివంతం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.– సీఎం రేవంత్‌రెడ్డి పచ్చదనానికే తీరని లోటు‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనది. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసమాన్యమైనది. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికే తీరని లోటు. – మాజీ సీఎం కేసీఆర్ రామయ్య సేవలు స్ఫూర్తిదాయకంప్రకృతి ప్రేమికుడు, సామాజిక కార్యకర్త వనజీవి రామయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరువలేనిది. కోటి మొక్కలకు పైగా నాటి పుడమి తల్లికి ఆయన అందించిన సేవలు రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
వనజీవి రామయ్య మృతిపై PM మోదీ సంతాపం
-
రామయ్య నిష్క్రమించే ... వనమల్లా విలపించే
నాడు శ్రీరాముడు అయోధ్యను వీడి సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళినపుడు అయోధ్యాపురం కంటికిమింటికి రోధించిందట.. నేడు.. ఆ వనమాలి .. వనజీవి రామయ్య భూలోకాన్ని వీడి దివికేగిన తరుణంలో వనాలు విలపించావా.. తమను ఇన్నాళ్లూ సాదుకుని ఆదుకుని నిలబెట్టిన రామయ్య తానే కాలం ఒడిలో ఒదిగిపోతే మొక్కలు.. మానులు.. తీగలు లతలు అల్లాడిపోవా.. తలవంచి విలపించవా..ఎక్కడెక్కడో.. ఏ రోడ్డుమీద ఏ లారీకింద పది నలిగిపోవాల్సిన గింజలను ఏరుకొచ్చి ఒడిలో వేసుకుని భద్రంగా తీసుకెళ్లి అడవిలో ఓ చిన్న గొయ్యి తీసి.. వాటిని నాటి.. పెరిగేవరకూ కంటికి రెప్పలా చూసుకునేవారు. అవి పెరిగిపెద్దవవుతుంటే తన బిడ్డలే ఎదుగుతున్న భావన. గాలికి ఒరిగిపోకుండా వాటికి తన చిటికెనవేలు మాదిరి ఓ కట్టెపుల్లను దాన్నుగా ఉంచి పెంచాడు. అవి పెద్దవై పూలు.. పళ్ళు.. కాయలు ఇస్తుంటే పసిపిల్లాడి లెక్క కేరింతలు కొట్టేవాడు. ఎక్కడైనా మొక్కలు చెట్లు చనిపోయేలా ఉంటే తన చేత్తో తీసుకెళ్లి నీళ్ళుపోసి వాటి ప్రాణం నిలబెట్టేవారు. ఒకటా రెండా.. దశాబ్దాలుగా లక్షలాది మొక్కలపాలిట దేవుడాయన .. దేవుడంటారో.. బిడ్డల్ని పెంచిన తండ్రి అంటారోగానీ వనజీవి రామయ్య కన్నుమూత సమాచారం వనానికి అందింది.. .. మొక్కలను చేరింది.. తీగలకు తెలిసింది ... మానులకు చెవినపడింది..క్షణాల్లో వార్త అడవంతా వ్యాపించింది.. మొక్కలు చెట్లు తీగలు లతలు అంతా ఏకమై తమ ప్రాణాలను ఎవరో తీసుకుపోయారన్నంతగా రోదించాయి.. వేపమాను విలవిల్లాడింది ..రేపట్నుంచి తమ విత్తనాలు ఎవరు సేకరిస్తారు..ఎవరు ఏరుకెళ్ళి వేరే ప్రాంతంలో తమ శాఖను జాతిని విస్తరిస్తారు అంటూ కుమిలిపోయింది. జామచెట్టు జవగారింది.. తన పెద్దవేరును ఎవరో గొడ్డలితో నరికినంత పనైందని కుమిలిపోయింది. మల్లెతీగ మ్రాన్పడిపోయింది .. మందారం బాధతో ముడుచుకుపోయింది. చింత మాను చిన్నబోగా మద్ది చెట్టు మూలకుచేరి వెక్కివెక్కి ఏడ్చింది. బంతిమొక్క బావురుమనగా సన్నజాజి చిన్నబోయింది.ఒకటా రెండా.. వేలాది ముక్కలు తమకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన రామయ్యకు సద్గతులు కలగాలని మొక్కాయి..మొక్కుకున్నాయి.. మున్ముందు కూడా ఇలాంటి రామయ్యలు భూమ్మీద జన్మించాలని.. వారి ద్వారానే వనాలు..తద్వారా జనాలు సైతం సుభిక్షంగా జీవిస్తారని ఆశించాయి. వనాల మారిన బతికే జీవాలు.. కూడా రామయ్య వంటి వాళ్ళు యుగానికొక్కరైనా పుట్టి దేశాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకున్నాయి..(వనజీవి రామయ్యకు సంతాపం తెలిపేందుకు ఈ కథనం)-సిమ్మాదిరప్పన్న -
రామయ్య హరిత యజ్ఞం, ఎంత మేలు చేసిందో తెలుసా?
వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే వనజీవి రామయ్య జీవిత సారాంశం. చెట్ల ఆవశ్యకత చెప్పిన నిజమైన పర్యావరణ యోధుడాయన. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ కూడా. ఇంతకీ ఆయన ఏళ్ల తరబడి కొనసాగించిన హరిత యజ్ఞతం భవిష్యత్తు తరాలకు ఎంత మేలు అందించిందో తెలుసా?చిన్నప్పుడు బడిలో సర్ చెప్పిన పాఠాలే దరిపల్లి రామయ్య ఆకుపచ్చ కలకు స్ఫూర్తినిచ్చాయి. దశాబ్దాల పాటు శ్రమించి కోటికి పైగా మొక్కలు నాటేలా చేశాయి. ఇన్నేళ్లలో ఆయన నాటిన ఎన్నో వేల, లక్షల మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. స్వయంగా ఆయన నాటివే కాకుండా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరెందరో మొక్కలు నాటి ఈ మహా యజ్ఞంలో భాగం అయ్యారు.చెట్లు కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని తెలిసిందే. గాల్లోని హానికారక సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లనూ ఫిల్టర్ చేస్తుంటాయి. కడదాకా ఆయన కొనసాగించిన హరిత యజ్ఞంతో.. కాలుష్యం తగ్గి గాలి స్వచ్ఛత పెరిగింది.ఏడాదిలో ఒక చెట్టు సగటున 48 పౌండ్ల(22 కేజీలు) కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ఏడాదికి ఇద్దరికి సరిపడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. రామయ్య నాటింది కోటి మొక్కలకు పైనే. అంటే.. 218 మిలియన్ కేజీల Co2ను పీల్చుకునే అవకాశం ఉంది. ఏడాదికి 47 వేల కార్లు రోడ్డు మీద తిరిగితే వెలువడే కాలుష్యానికి ఇది సమానం. పోనీ కోటికి పైగా మొక్కల్లో లక్షల, వేల మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఉన్నా.. ఆ మహానుభావుడి కృషి భావితరాల్లో ఎంత మందికి ప్రాణవాయువు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు. -
వనజీవి రామయ్య మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ, సాక్షి: సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య(85) మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన సేవలను కొనియాడారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తెలుగులో ఓ పోస్ట్ ఉంచారాయన.‘‘దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ.. నలుగురితో మొక్కలు నాటిస్తూ.. వైవిధ్యమైన రీతిలో ప్రచారంతో హరిత ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో కోటి మొక్కలకు పైనే నాటి అరుదైన ఘనత సాధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…— Narendra Modi (@narendramodi) April 12, 2025 -
హరిత యాత్రలో అలసిన వనజీవి.. రామయ్య అరుదైన చిత్రాలు
-
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన. మనవళ్లకు మొక్కల పేర్లు!వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.అలసిపోని వనజీవిఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్ఎస్ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపంపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రచార సాధనాలుప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.అవార్డులు, పాఠంగా రామయ్య జీవితంకోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది. ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. 2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ.. -
వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ‘కేసు వద్దు.. మొక్కలు నాటించండి’
ఖమ్మం వైద్యవిభాగం: తన వాహనాన్ని ఢీకొట్టిన వాహనదారుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఆయనతో 100 మొక్కలు నాటించాలని బుధవారం రెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘పద్మశ్రీ’ గ్రహీత వనజీవి రామయ్య రాష్ట్ర మంత్రులను కోరారు. మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామయ్యను మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రామయ్య పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లును ఆదేశించారు. రామయ్యను పరామర్శించిన వారిలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ గౌతమ్ తదితరులు ఉన్నారు. -
పద్మశ్రీ వనజీవి రామయ్యకు యాక్సిడెంట్..
సాక్షి, ఖమ్మం: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రామయ్యను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యా కాలు, చేతి, తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వనజీవి రామయ్యను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో రామయ్యకి జరిగిన రెండో రోడ్డు ప్రమాదం ఇది. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ నేపథ్యంలో రామయ్యకు కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. వనజీవి రామయ్యను ఆదుకుంటాం: మంత్రి హరీష్ రావు వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వనజీవి రామయ్య ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని తక్షణమే మంత్రి స్పందించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. రామయ్యకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. చదవండి: Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే! -
వనజీవి రామయ్యకు ప్రమాదం, ఎడమ కాలుకి గాయం
సాక్షి, ఖమ్మం: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రామయ్య ఏడమ కాలుకు తీవ్ర గాయమైంది. ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లిలోని బైపాస్ సమీపంలో మొక్కలను నీళ్లు పోయడానికి బైక్ పై వెళ్లుతు ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. రామయ్యను పరీక్షించిన వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ వైద్యుల మాటలు కూడా వినకుండా ఇబ్బందిపడుతునే మొక్కలను నీళ్లు పోయడానికి వెళుతున్నారు. అయితే తాను నాటిన మొక్కలకు నీళ్లు పోయకపోతే అవి చనిపోతాయని రామయ్య చెబుతున్నారు. చదవండి: జీవో 111ను రద్దు వినాశనానికి దారితీస్తుంది: రాజేంద్రసింగ్ -
వనజీవి రామయ్యకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
-
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వనజీవి రామయ్య
సాక్షి, ఖమ్మం: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి వైద్యులు ప్రత్యేక వైద్య సేవలందించారు. ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో రామయ్య ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని రామయ్యకు సూచించారు. విశ్రాంతి తీసుకోవడం అవసరం కాగా ఇటీవల వనజీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గడిచిన మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు అస్వస్థతకు గురయ్యారు రామయ్య. ప్రస్తుతం ఆయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. హరితహరంలో భాగంగా రామయ్య గ్రామాల్లో తిరుగుతు చెట్లు నాటుతు ఉండటం వల్ల శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామయ్య బయట తిరగకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరమన్నారు. వయసు భారం దృష్ట్య రామయ్య కోన్ని ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుతున్నారన్నారు. కాగా గత కొంతకాలంగా వనజీవి రామయ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు. అయితే నిరంతరం మొక్కల గురించి ఆలోచించే ఆయన.. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకొచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. -
కోలుకున్న వనజీవి రామయ్య
-
కోలుకున్న వనజీవి రామయ్య
సాక్షి, హైదరాబాద్ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రి లో చేరిన ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య కోలుకున్నారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు బంధువులు చెప్పుతున్నారు. రేపు కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఆసుపత్రి ప్రాంగణంలో రామయ్య మొక్కలు నాటుతారని తెలుస్తోంది. ఈనెల 13న రెడ్డిపల్లిలోని తన నివాసంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గురైన రామయ్యను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ రెండు గంటల పాటు చికిత్స జరిగినప్పటకీ.. మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రామయ్య అస్వస్థతకు గురయ్యారని తెలుసుకోని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందారు. ఆయన తోందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. నిరంతరం మొక్కల గురించి ఆలోచించే రామయ్య.. గత కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు వస్తున్నారు. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని ఇటివలే సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకోచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. రామయ్య కోలుకున్నారన్న విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పద్మశ్రీ వనజీవి రామయ్యకు అస్వస్థత
సాక్షి, ఖమ్మం : వృక్ష ప్రేమికులు, పద్మశ్రీ వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ని శనివారం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వనజీవి రామయ్యకు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను వైద్యులను ఆదేశించారు. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్య.. వనజీవిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
పచ్చదనమంటే ప్రాణం: వనజీవి రామయ్య
‘భవిష్యత్ తరాలు బాగుండాలనేదే నా తపన.. తాపత్రయం. పల్లెలు, పట్టణాలు, రహదారులు పచ్చదనంతో నిత్యం నిండుగా కనిపించాలి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి.. సంరక్షిస్తే అవి మహా వృక్షాలవుతాయి. గాలి, నీడతోపాటు ఒక్కో మొక్కలో ఒక్కో ప్రత్యేకమైన ఔషధ గుణాలుంటాయి. అలాగే పూలు, పండ్లు మానవ జాతి అవçసరాలను తీరుస్తాయి. ఖాళీ ప్రదేశాలు, ఇంటి పరిసరాలు, నిరుపయోగమైన ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటండి.. వాటిని సంరక్షించండి. తల్లిదండ్రులు.. పిల్లలకు మొక్కల ఆవశ్యకత, వాటి ఉపయోగాలపై వివరించండి’ అంటూ మంగళవారం తనికెళ్లలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తన అనుభవాలను పంచుకున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షి, ఖమ్మం: ప్రశ్న: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంపై మీ అభిప్రాయం? రామయ్య: హరితహారం మంచి కార్యక్రమం. మొక్కల పెంపకం చేయడం అభినందించదగిన అంశం. అయితే నాటిన మొక్కలను పూర్తిగా సంరక్షించినప్పుడే ఫలితం ఉంటుంది. అప్పుడే అవి భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రశ్న: అసలు మొక్కలు నాటాలనే ఆలోచన మీకెలా వచ్చింది? రామయ్య: నా చిన్నతనంలో 5వ తరగతి చదువుతున్న సమయంలో ఉపాధ్యాయుడు మల్లేశం బోధించిన మొక్కల పెంపకంతో లాభాలు అనే పాఠం నాలో ఒక మహత్తర కార్యానికి అంకురార్పణ చేసింది. ఈ ఆలోచనను నా ఇంటి నుంచే ప్రారంభించాను. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాను. ప్రశ్న: ఎన్నేళ్ల నుంచి మొక్కలు నాటుతున్నారు? రామయ్య: గత 48 ఏళ్ల నుంచి మొక్కలు నాటుతూనే ఉన్నా. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా.. అక్కడ తప్పనిసరిగా మొక్కలు, చెట్లు ఉండాల్సిందే. ఎందుకంటే చెట్లు లేనిదే మానవ మనుగడ లేదు. భూమిపై నివసించే జీవకోటి రాశులకు పుట్టింది మొదలు చనిపోయేంత వరకు చెట్లతోనే పని. ప్రశ్న: మొక్కల పెంపకానికి మీరు చేస్తున్న ప్రచారమేంటి? రామయ్య: వనాల పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా. ఏ శుభ కార్యానికి వెళ్లినా బహుమతిగా మొక్కలనే అందించి.. నాటమని చెబుతుంటా. నా మనుమరాళ్లకు హరిత లావణ్య, చందనపుష్ప అంటూ మొక్కల పేర్లు పెట్టాను. వన రక్షణపై వెయ్యి వరకు వన సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర తెలుపుతూ చెక్కాను. ఏ మొక్కను చూపించినా ఆ మొక్క ఉపయోగాన్ని చెప్పగలను. ముందు తరాల ప్రాణవాయువు కోసం మొక్కల పెంపకమే అవసరమని ఊరూరా ప్రచారం చేస్తున్నా. ప్రశ్న: ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు? రామయ్య: చిన్నతనం నుంచి ఇప్పటివరకు కోటిన్నర మొక్కలు నాటా. ప్రభుత్వ స్థలాలు, ఆలయాలు, పాఠశాలలు, రోడ్ల వెంబడి స్థలంలో మొక్కలు నాటా. నాయుడుపేట నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి రెడ్డిపల్లి గ్రామం వరకు నాటిన మొక్కలు ఇప్పుడు ఎంతో నీడనిస్తున్నాయి. ఇవే కాకుండా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వం తరఫున మొక్కలు నాటా. ప్రశ్న: ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారంలో ఏ రకం మొక్కలు నాటితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది? రామయ్య: ప్రస్తుతం ప్రభుత్వం హరితహారంలో నాటుతున్న మొక్కలు నీడనిచ్చేవిగానే ఉన్నా యి. వీటితోపాటు ఇంకా పండ్ల మొక్కలు నాటి తే అవి నీడతోపాటు ఫలాలు కూడా ఇస్తాయి. 20చెట్ల చొప్పున కొంతమంది కూలీలకు అంది స్తే.. అవి వారు పెంచి పెద్దచేసి వాటి ఫలాలను అనుభవిస్తూ ఉపాధి కూడా పొందుతారు. అదే విధంగా రోడ్ల వెంబడి నాటిన మొక్కలను రోడ్డు వెడల్పు చేసే పేరుతో తొలగిస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరదు. ప్రశ్న: చివరగా మొక్కల పెంపకంపై మీరిచ్చే సందేశం? రామయ్య: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. నాటిన ఆ మొక్కలను సంరక్షించాలి. ఇళ్లు, చేలల్లో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ మొక్క నాటాలి. అప్పడే భావితరాల భవిష్యత్‌ను కాపాడిన వారమవుతాం. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మొక్కల ప్రా«ధాన్యం తెలిపేందుకు కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ పక్కనే చెట్లు ముద్రిస్తే మొక్కల పెంపకంపై ప్రపంచమంతా నయా పైసా ఖర్చు లేకుండా మొక్కల పెంపకం గురించి ప్రచారం లభిస్తుంది. మనందరం చాలెంజ్‌గా తీసుకుని మొక్కలు ఎక్కువ మొత్తంలో నాటాలి. -
వనజీవి రామయ్యకు సన్మానం
సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు ప్రచారం నిర్వహిస్తూ ఇప్పటికే కోటికిపైగా మొక్కలు నాటి వనజీవిగా పేరుపొందిన రామయ్యను ఆదివారం జిల్లా కేంద్రంలోని జెజెనగర్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ సన్మానించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు పేటలో పలువురు ఘనస్వాగతం పలికి ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వనజీవి రామయ్య స్ఫూర్తితో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలోరైతు సమన్వయ సమితి రాష్ట్ర డైరెక్టర్ గుడిపూడి వెంకటేశ్వర్రావు, సందీప్ పాల్గొన్నారు. -
ప్రధాని మోదీని కలసిన వనజీవి రామయ్య
ఖమ్మంరూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన ఎట్‌హోం, రిపబ్లిక్ వేడుకల్లో ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన రామయ్య ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను కలుసుకున్నారు. -
‘స్వచ్ఛతే సేవ’ లో వనజీవి
సాక్షి, ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వనజీవి రామయ్య 'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 23 నుండి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పర్యావరణం, స్వచ్ఛ భారత్ కోసం ఆయన ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించడానికి శనివారం ఉదయం స్వగ్రామం ముత్తుగూడెం నుంచి బయలుదేరి వెళ్లారు. కాగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వనజీవి రామయ్యకు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. ఈ సందర్భంగా కోటి మొక్కల రామయ్య సేవలను మోదీ ప్రశంసించారు. ‘స్వచ్ఛతే సేవ’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
వనజీవి రామయ్యకు చంద్రబాబు పరామర్శ
ఖమ్మం రూరల్: పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్యను ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్లో సోమవారం పరామర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలసి ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు.. రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రామయ్యకు ఓ మొక్కను అందించారు. కాగా.. చంద్రబాబు తనకు రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించినట్లు రామయ్య తెలిపారు.