
నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
ఆదిలాబాద్‌రూరల్:వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కన్స్‌స్ట్రక్షన్ సీఈ, జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఈ జేఆర్ చౌహాన్ అన్నారు. మావల మండలంలో ఏర్పాటు చేసిన వాక్యూం కరెంట్ బ్రేకర్ (వీసీబీ)ను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో భాగంగా వీసీబీ ఏర్పాటు చేశామన్నా రు. కార్యక్రమంలో డీఈలు హరికృష్ణ, ప్రభాకర్, ఈదన్న, ఏడీఈ లక్ష్మణ్, ఏఈ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.