Adilabad District News
-
మహనీయుడు అంబేడ్కర్
ఆదిలాబాద్‌రూరల్/అదిలాబాద్టౌన్: అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను జి ల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాల య ఆవరణలో సోమవారం నిర్వహించా రు. కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సమాజంలో అన్నివర్గాల ప్రజ లకు న్యాయం అందించాలనే విధంగా రాజ్యాంగ కల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. యువత మహనీయులు చూపిన బాటలో న డుస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ జయంతిల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో రాణించిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు.ఇందులో అద నపు కలెక్టర్ శ్యామలా దేవి, జిల్లా దళితాభివృద్ధి శాఖ అధికారిని సునిత కుమారి, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ రా జ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషిని కొనియాడారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాజ్యాంగం కల్పించిన అవకాశాలను బడుగు, బలహీన వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థి కంగా ఎదగాలని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పా యల్ శంకర్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు ప్రవీణ్, సుభాష్, ధరంపాల్, సతీష్, మహేందర్, రవి, వేద వ్యాస్, కృష్ణయాదవ్, సూర్యకిరణ్, ముకుందరావు, తదితరులున్నారు. అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం నేరడిగొండ: అంబేడ్కర్ జీవితం అందరికీ స్ఫూ ర్తిదాయకమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. అంబేడ్కర్ జయంతి వేడుకలను మండల కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయంకై లాస్‌నగర్: రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ జైబాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ అన్నారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. పట్టణంలోని ప్రజా సేవా భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధానవీధులు గుండా అంబేడ్కర్‌చౌక్ వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి ఆయనతో పాటు పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శేఖర్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
డీటీఎఫ్ జిల్లా కార్యవర్గం
ఆదిలాబాద్‌టౌన్: డీటీఎఫ్ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం రాత్రి ఎన్నుకున్నారు. ఎన్ని కల అధికారిగా రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, పరిశీలకులుగా శ్యామ్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సాయికాంత్, సంతోష్, ప్రధాన కార్యదర్శిగా కె.దిలీప్, జిల్లా కార్యదర్శులుగా నాగేందర్, అరవింద్, కృష్ణ, అరక నాగేష్, రాష్ట్ర కౌన్సిలర్లుగా శ్యామ్యుల్, వృకోధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా బానోత్ ప్రకాశ్, సభ్యులుగా కిశోర్, శుద్దోధన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించారు. -
ప్రజాపాలన తీసుకొచ్చాం
మంచిర్యాలటౌన్: అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ప్రజాపాలన తీసుకొచ్చామని, ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐబీ ఆవరణలో మాతా శిశు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను పరిశీలించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాను మార్చి 16, 2023లో పీపుల్స్ మార్చ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించానని, అదే ఏడాది ఏప్రిల్ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను పిలిపించామని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏంటో తెలిసిందని, మొ దటి నుంచి పార్టీకి అండగా ప్రేమ్‌సాగర్‌రావు ని లిచారని, ఆయనకు కార్యకర్తలు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. పాదయాత్ర సమయంలో మంచిర్యాలలోని మాతాశిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున కట్టవద్దని చెప్పినా వినకపోవడంతో అక్క డే నిర్మించడం వల్ల వరదల్లో మునిగి పోయిందని తెలిపారు. నాడే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎంసీహెచ్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్ర కారం ఐబీ ఆవరణలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరి నది వరదతో రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోతుందని, కరకట్ట నిర్మించాల ని నాడు ప్రజలు కోరారని, వారి కోరిక మేరకు కరకట్టను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగునీరు అంది స్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపి వేసిన ప్రాజెక్టును ప్రారంభించి పూ ర్తి చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సభలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జైబాపు, జైభీం, జైసంవిధాన్ కోఆర్డినేటర్ రుద్ర సంతోశ్ పాల్గొన్నారు. ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
కాంగ్రెస్‌తోనే భారత రాజ్యాంగ రక్షణ
ఇచ్చోడ: భారత రాజ్యాంగ రక్షణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఆదివారం నర్సాపూర్, కేశవపట్నం, గుండాల, సిరిచెల్మ గ్రామాల్లో జై బాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని పెంచి పోషిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, నాయకులు కుంర కోటేశ్వర్, నారాయణరెడ్డి, ముస్తాఫా, కొత్తురి లక్ష్మణ్, బత్తుల అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఎన్నుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా పురాణం సతీశ్, ఉపాధ్యక్షుడిగా వసంత్‌రావు, ప్రధాన కార్యదర్శిగా అభయ్‌రాజ్, కార్యదర్శిగా గట్టయ్య, సంయుక్త కార్యదర్శిగా అన్వేష్రావు, కోశాధికారులుగా సరోజ, ఉమా శంకర్, సభ్యులుగా శ్రీనివాస్, దేవిదాస్, దశరథ్, సతీశ్‌రెడ్డి, విక్రమ్, హరీశ్, బాబు, రంజిత్, సల్ల విజయ్‌బాబు, సలహాదారులుగా రఘునందన్, వీవీఎన్‌ఎస్ రామ్, రమేశ్‌ను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం
ఆదిలాబాద్‌టౌన్: కార్మికుల సమస్యల పరి ష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామ ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నా రు. సామాజిక న్యాయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికులను విడదీసే కుల, మత, రాజకీయాలకు వ్యతిరేకంగా కులవిక్ష సామాజిక అంతరాలను నిర్మూలించాలన్నారు. సమానత్వం సాధించాలనే ఉద్దేశంతో సీఐటీయూ ఆధ్వర్యంలో న్యాయసాధన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆశన్న, చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, పోతన్న, రమేశ్, సాయికిరణ్, నరేష్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
● డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్యఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తేనే ఉపాధ్యాయులకు పాయింట్లు ఇస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తేనే సర్వీస్ బుక్‌లో ఉపాధ్యాయుల పాయింట్లను నమోదు చేస్తామని, బదిలీ, పదోన్నతుల్లో ప్రాధాన్యత ఇస్తామని తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని, కేవలం ఉపాధ్యాయులే కారణమని పేర్కొనడం భావ్యం కాదన్నారు. పెరుగుతున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ప్రభుత్వం నిలువరించాలని, పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శామ్యుల్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వృకోధర్, సంఘ బాధ్యులు సుధాకర్, దిలీప్, ప్రేమ్‌సింగ్, కొండయ్య, వీరయ్య, అరవింద్, కృష్ణ, సాయికాంత్, సంతోష్, ప్రహ్లాద్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా గుర్తింపునకు కృషి
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇంద్రవెల్లి: భూమికోసం, భుక్తికోసం తమ ప్రాణా లు అర్పించిన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. ఏప్రిల్ 20న అమరుల సంస్మరణ దినోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరై అమరుల కుటుంబాలకు ట్రైకార్ పథకం ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణం అందించనున్నట్లు తెలిపారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. పాత రగల్ జెండా కమిటీ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, రాయిసెంటర్ సార్మెడిలు మెస్రం చిన్ను పటేల్, మెస్రం వెంకట్రావ్ పటేల్, రగల్ జెండా కమిటీ అధ్యక్షుడు తొడసం నాగోరావ్, కాంగ్రెస్ నాయకులు కోరెంగా సుంకట్రావ్, ఎండీ జహీర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత
నార్నూర్: ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత కలుగుతుందని విష్ణు మహరాజ్ అన్నా రు. మండలంలోని గుంజాలలో 14 రోజు లుగా కొనసాగుతున్న హరినామ సప్తాహ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో మెలగాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు పెందూర్ రాంషావ్ మహరాజ్, కుమ్రా లక్ష్మణ్ పటేల్, రాయి సెంటర్ సార్మేడి కొట్నాక్ కృష్ణ, కుమ్రా జ్ఞానేశ్వర్, పెందూర్ డిగంబర్, తదితరులు పాల్గొన్నారు. -
డెడ్ స్టోరేజ్
జిల్లాలోని నీటి ప్రధాయినిలు డెడ్ స్టోరేజ్‌కు చేరుకున్నాయి. సాత్నాల, మత్తడి వాగు మధ్యతరహా ప్రాజెక్టులు బోసిపోయి కనిపిస్తున్నాయి. నీటి ఊటలు కూడా లేని పరిస్థితిలో ప్రాజెక్టులో పూర్తిగా పగుళ్లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జిల్లాలో 392 చెరువులు ఉన్నాయి. వీటికింద ఆయకట్టుకు యాసంగిలో నీరు అందించడంతో కేవలం 20 శాతం నీటిని మాత్రమే కలిగి ఉన్నాయి. దీంతో సమస్య తీవ్రమవుతోంది. – సాక్షి, ఆదిలాబాద్ప్రాజెక్టు మత్తడివాగు మండలం తాంసి పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 271.200 మీటర్లు నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలు ప్రస్తుతం 0.071 టీఎంసీలు డెడ్ స్టోరేజీ 0.065 టీఎంసీలుప్రాజెక్టు సాత్నాల మండలం జైనథ్ పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 279.50 మీటర్లు నీటి సామర్ధ్యం 1.24 టీఎంసీలు ప్రస్తుతం 0.167 టీఎంసీలు డెడ్ స్టోరేజీ 0.126 ఆర్మీ ఆఫీసర్ కావడమే లక్ష్యం.. ఇచ్చోడ మండలం జాల్ద్ గ్రామానికి చెందిన ఏ.నితిన్ ఇంటర్ పూర్తి చేశాడు. నిరంతరం క్రీడల్లో సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో పలుమార్లు ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు ఆత్మారాం–దేవశాల వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో సైనికుడిగా ఎంపికయ్యాడు. తన గురువు వీజీఎస్ ప్రోత్సాహం కారణంగానే ఆర్మీలో చేరగలిగానని, భవిష్యత్‌లో ఆర్మీ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు. సైనికులుగా అన్నదమ్ములు.. ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్ గ్రామానికి చెందిన సౌధాగర్–లక్ష్మి దంపతుల కుమారులు జీ.రామేశ్వర్, జీ.సిద్దేశ్వర్ ఒకే సమయంలో ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. సిద్దేశ్వర్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూనే అగ్నివీర్ ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యాడు. గతంలోనే ఎన్సీసీ (సీ)సర్టిఫికెట్ సాధించాడు. సైన్యంలో చేరడమే లక్ష్యంగా ఏడేళ్లుగా సాధనచేసి అగ్నివీర్ ఫలితాల్లో ఎంపికయ్యాడు. భవిష్యత్‌లో కమాండో కావడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు. సిద్దేశ్వర్ తమ్ముడు రామేశ్వర్ సైతం ఆరేళ్లుగా క్రీడల్లో రాణిస్తూ అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటడం విశేషం. ఒకే ఇంట్లో ఒకే సమయంలో ఇద్దరు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు తల్లిని అభినందిస్తున్నారు. ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో నాలుగువేల మత్స్యకార కుటుంబాలు చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. ఈయేడాది ప్రతికూల వాతావరణంతో చేపల ఎదుగుదల లోపించింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఆగస్టులో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలు నవంబర్, డిసెంబర్ మాసాల్లో పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీంతో చెరువుల్లో నీరు అడుగంటిపోయి చేపలు చనిపోతున్నాయి. చేపలు ఎదగడానికి కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. అయితే భూగర్భజలాలు అడుగంటిపోయి చెరువుల్లో నీరు లేకపోవడంతో చేప పిల్లల ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో ఈఏడాది చేపల బరువు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అసలే 50 శాతం కూడా చేపలు పంపిణీ చేయలేదు. చేసిన వాటిలో 30 శాతం వరకు చనిపోవడంతో పరిస్థితి దయనీయంగా ఉంది. ఎదగని చేప.. జిల్లాలోని 101 మత్స్యకార సంఘాల్లో 4,800 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 35 మహిళా సంఘాలు సైతం ఉన్నాయి. జిల్లాలో 240 చెరువులు ఉన్నాయి. వీటిలో సాత్నాల, మత్తడివాగు రిజర్వాయర్లు ఉండగా ఆరు పెర్నియర్ ట్యాంకులు, 232 కుంటలు, చిన్నచిన్న చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. రిజర్వాయర్, పెర్నియర్ ట్యాంకుల్లో 80 నుంచి 100 మిల్లీ మీటర్ల కట్ల, రవ్, మిరిగెల చేపలను వదిలారు. వీటిలో 35 నుంచి 45 మిల్లీ మీటర్ల కట్ల, రవ్, బంగారుతీగ చేపలను వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చేపల్లో ఎదుగుదల కనిపించడం లేదు. అంతేకాకుండా పంపిణీ చేసిన చేపల్లో 30 శాతం వరకు చనిపోవడం, పెద్ద చేపలు వీటిని తినేయడంతో 70 శాతం మిగిలాయి. అయితే జూలై, ఆగస్టు మాసాల్లో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపలు వదలాల్సి ఉండగా టెండర్లు సకాలంలో కాకపోవడంతో నవంబర్, డిసెంబర్లో వదిలారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి మాసం నుంచే ఎండ ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 43 డిగ్రీలు దా టింది. దీంతో 126 చెరువులకు 70 చెరువులు ఇప్పటికే ఎండిపోయాయి. మిగిలిన చెరువుల్లో సైతం నీరు అడుగుంటిపోతోంది. ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందకపోవడంతో చనిపోతాయని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కట్ల, రవ్, మిరిగెల చేపలకు టెండర్లో రూ.1.76 చెల్లించగా, చిన్న చేప పిల్లల కోసం 0.68 పైసలు చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. టెండర్‌దారులు రూ.40 లక్షలకు టెండర్లు వేయగా ఇంతవరకు వాటి డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాదికి సంబంధించిన డబ్బులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదని పేర్కొంటున్నారు. దీంతో మత్స్యకారులు ఉన్న చేపలను పడుతుండగా అవి అరకిలో మించి ఉండటం లేదని వాపోతున్నారు. కిలో నుంచి 2 కిలోల వరకు ఉండాల్సిన చేప కిలోలోపే ఉండడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. 5 వేల టన్నుల చేపల దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి 2 నుంచి 3వేల టన్నుల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిలో ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉండగా చేపలు అరకిలో మాత్రమే ఉండడంతో రూ.100లోపే ధర పలుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ముందుకురాని టెండర్‌దారులు వచ్చే సీజన్‌కు సంబంధించి ఏటా ఏప్రిల్‌లో ప్రభుత్వం నుంచి టెండర్ విడుదల అవుతుంది. అయితే ఈ ఏడాది ఇంకా ప్రభుత్వం టెండర్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గతేడాదికి సంబంధించిన టెండర్ డబ్బులు విడుదల చేయకపోవడంతో ఈసారి ఎవరూ ముందుకు వచ్చే అవకాశాలు కానరావడంలేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి టెండర్ ప్రక్రియ విడుదల చేయాలని కోరుతున్నారు. నిరంతర సాధనతోనే సాధ్యం.. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన మల్కన్ సింగ్–గీతాబాయి దంపతుల కుమారుడు ఎస్.అభి. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండగా, వారి ప్రోత్సాహంతో ఆర్మీలో ఉద్యోగమే లక్ష్యంగా నిరంతరం సాధన చేస్తూ అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. తమది వ్యవసాయ నేపథ్య కుటుంబమైనప్పటికీ ఎప్పటినుంచో దేశసేవ చేయాలనే ఆలోచనతో ఆర్మీలో చేరడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానన్నాడు. పట్టు వదలకుండా నిరంతరం సాధన చేస్తేనే ఉద్యోగాలు వస్తాయంటున్నాడు. చేపలు పడుతున్న మత్స్యకారులు (ఫైల్)● సైనికులుగా ఎంపికై న ఏడుగురు జిల్లా యువకులు ● సామాన్య కుటుంబాల నుంచి దేశ సరిహద్దులకు వారిదంతా సామాన్య కుటుంబ నేపథ్యం. కొంతమంది వ్యవసాయ కుటుంబం నుంచి రాగా, ఓ యువకుని తల్లిదండ్రులు రోజువారీగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. తల్లిదండ్రుల కష్టం.. వారి ప్రోత్సాహం.. ఆ యువకులను దేశ సరిహద్దుల వైపు నడిపించింది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. నిరంతరం శ్రమించి సైనికులుగా ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికై న జిల్లాకు చెందిన యువకులపై కథనం.. – ఆదిలాబాద్ అందరి ప్రోత్సాహంతోనే... బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన ప్రేమ్–గోదావరి దంపతుల కుమారుడు కే.క్రాంతి ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా ఆర్మీలో ఉద్యోగమే ధ్యేయంగా మూడేళ్లుగా సాధన చేస్తున్నాడు. ఎంతగానో శ్రమించి ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో సైనికుడిగా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, శిక్షకుల ప్రోత్సాహం మరువలేనిదని, వారందరి తోడ్పాటుతోనే ఉద్యోగాన్ని సాధించగలిగానని పేర్కొంటున్నాడు. తల్లిదండ్రుల కష్టమే నడిపింది.. ఇంద్రవెల్లి మండలం ధర్మనగర్ గ్రామానికి చెందిన భావన్సింగ్–నరత్తి బాయి దంపతుల కుమారుడు బీ.ప్రవీణ్. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూనే డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు పొలంలో పడుతున్న కష్టాల్ని దగ్గరుండి చూసిన ప్రవీణ్.. తాను మంచి స్థానంలో ఉండడమే ఇందుకు పరిష్కారమని భావించాడు. మూడు సంవత్సరాలుగా ఉద్యోగ సాధనే లక్ష్యంగా జిల్లా కేంద్రంలోని వీజీఎస్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. అగ్నివీర్ ఫలితాల్లో సైనికునిగా ఎంపిక అయ్యాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే.. జిల్లా కేంద్రానికి చెందిన ప్రవీణ్–గీత దంపతుల కుమారుడు డి.చంద్ర సిద్దార్థ ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే సైనికునిగా ఎంపికయ్యాడు. తండ్రి ప్రవీణ్ అంబులెన్స్ డ్రైవర్‌గా, తల్లి పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరుస్తూనే అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఉద్యోగాలు సాధించవచ్చని తెలుపుతున్నాడు. క్రీడలతో సైతం ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఫిట్నెస్తో పాటు మానసికంగా దృఢంగా తయారై రక్షణ, పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొంటున్నాడు.. వందో పుట్టిన రోజురుక్మిణీబాయితో కుటుంబసభ్యులు అరకిలో దాటని మీనం ప్రతికూల వాతావరణంతో దిగుబడిపై ప్రభావం ఈయేడు 87 లక్షలకుగానూ వదిలింది 43 లక్షలే 126 చెరువుల్లోనే చేపల పెంపకం ఇప్పటికే ఎండిన 70 చెరువులు ఆందోళనలో మత్స్యకారులుజిల్లా వివరాలు మత్స్యకారుల సంఘాలు : 101 మొత్తం చెరువులు : 240 ఎండిన చెరువులు : 70 చేప పిల్లలు వదిలిన చెరువులు : 126 చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 87 లక్షలు చెరువుల్లో వదిలింది : 43 లక్షల 42వేలు దిగుబడి లక్ష్యం : 5వేల టన్నులు ఈసారి దిగుబడి అంచనా : 2వేల నుంచి 3వేల టన్నులుకిలోలోపే ఉన్నాయి ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో చేప పిల్లలు వేయడంతో అవి పూర్తిగా ఎదగలేదు. ప్రస్తుతం కిలోలోపున్న చేప పిల్లలు మాత్రమే దొరుకుతున్నాయి. ప్రతీరోజు చేపలు పట్టడానికి వెళ్తున్నా. 5 నుంచి 10 కిలోలు మాత్రమే దొరుకుతున్నాయి. చేపలు ఎదగకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. – టి.గంగన్న, మత్స్యకారుడు, వడ్డాడి చేపలు పట్టాలని సూచించాం జిల్లాలో ఈఏడాది 125 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. అందులో పెద్దవి 26 లక్షలు, చిన్నవి 17 లక్షలు ఉన్నాయి. రూ.40 లక్షల వరకు టెండర్‌దారులకు చెల్లించాల్సి ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెరువులు ఎండిపోతున్నాయి. మత్స్యకారులకు చేపలు పట్టాలని సూచించాం. – భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
ఎంప్యానోల్‌మెంట్!
● ఆ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలంటేనే మమకారం ● దూరం చేసుకునేందుకు ఇష్టపడని ఆఫీసర్లు ● గతనెలతో ముగిసిన ఎంప్యానల్మెంట్ గడువు ● కొత్తది ఏర్పాటులో తాత్సారంసాక్షి,ఆదిలాబాద్: సాధారణంగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి ఎంప్యానల్మెంట్ గడువు ఏడాది ఉంటుంది. లేనిపక్షంలో రెండేళ్ల పాటు కొనసాగిస్తారు. అయితే జిల్లాలో మాత్రం చిత్రమైన పరిస్థితి ఉంది. ఐదేళ్లుగా ఒకే ఎంప్యానల్మెంట్ కొనసాగుతుంది. అందులోని ఏజెన్సీలను వివిధ శాఖల అధికారులు ‘నిను వీడను’ అన్నట్లుగా వాటిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. తాజాగా గత నెలతో గడువు ముగిసినా కొత్త ఎంప్యానల్మెంట్ విధివిధానాలు రూపొందించే విషయంలో జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఫైలు రాసేందుకు చెయ్యే ముందుకు కదలడం లేదు. దీన్ని బట్టే ఆఫీసర్లకు ఈ ఏజెన్సీలంటే ఎంత మక్కువో తెలిసిపోతుంది. ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సర్వీసులను ఏజెన్సీలు చేపడతాయి. ఆ ఏజెన్సీలకు వీటి నియామక ప్రక్రియ అప్పగించేందుకు ముందుగా అవి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలి. దాన్నే ఎంప్యానల్మెంట్ అంటారు. ఈ ఎంప్యానల్మెంట్ గడువు ఏడాది, లేనిపక్షంలో రెండేళ్లలో పూర్తవుతుంది. మళ్లీ కొత్తది రూపొందించి వివిధ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ లకు అవకాశం కల్పించాలి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీలను వివిధ శాఖల అధికారులు ఏళ్లకేళ్లుగా విడిచిపెట్టేందుకు ఇష్టపడటం లేదు. దీని కి కారణం లేకపోలేదు. సాధారణంగా ఔట్సోర్సింగ్ అంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే వర్క్ ఆర్డర్లను ఏ జెన్సీలకు పంచడం, కొత్త పోస్టులు మంజూరైతే వా టి నియామకాలు చేపట్టడం వంటి వ్యవహారాల్లో ఇటు నిర్వాహకులు, అటు ఆఫీసర్లు మిలాఖతై వ్యవహారాన్ని నడుపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారాన్ని నిరోధించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సమయం దొరకడం లేదా..! ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహా రాలన్నీ జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయం నుంచి సాగుతాయి. వర్క్ ఆర్డర్ కూడా ఇక్కడినుంచే కేటాయిస్తారు. ఆ తర్వాత ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో ఆయా శాఖల అధికారులు, జిల్లా ఉపాధికల్పన అధికారి, ఏజెన్సీల పర్యవేక్షణ లో సాగుతాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 2019–20 లో ఎంప్యానల్మెంట్ ఏర్పాటుకు సంబంధించి టెండర్లు నిర్వహించారు. ఆ తర్వాత ఒకటిరెండేళ్లకు మళ్లీ నిర్వహించాల్సి ఉండగా, ఆఫీసర్లు ఆ ప్రక్రియ నే పూర్తిగా మర్చిపోయారు. ఐదేళ్లు దాటినా పాత ఏజెన్సీలతో కూడిన ఎంప్యానల్మెంటే కొనసాగుతుంది. అప్పట్లో 17 ఏజెన్సీలను గుర్తించగా, ప్రస్తు తం 9 ఏజెన్సీలు యాక్టీవ్‌గా ఉన్నాయి. వాటినే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గతనెల ‘సాక్షి’ వివరణ కోరినప్పుడు జిల్లా ఉపాధికల్ప న అధికారి మిల్కా సమాధానం ఇచ్చారు. ఆ గడు వు ముగిసినా విధివిధానాల రూపకల్పన చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ల్యాబ్ టెక్నీషియన్ల డిప్యూటేషన్ రద్దు
ఆదిలాబాద్‌టౌన్: వైద్యశాఖ లో అక్రమ డిప్యూటేషన్లు శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి డీ ఎంహెచ్వో నరేందర్ రాథో డ్ స్పందించారు. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సొంత పీహెచ్‌సీలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. వారి డిప్యూటేషన్ రద్దు చేయాలని కార్యాలయ సూపరింటెండెంట్‌కు సూచించా రు. జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్లో పనిచేస్తున్న ల్యాబ్టెక్నీషియన్లు, మలేరి యా విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరు, టీ హబ్‌లో పనిచేస్తున్న ఒకరి డిప్యూటేషన్ రద్దు చేసి శనివారం రిలీవ్ చేశారు. మిగతా వారిని పరిశీలించి త్వరలోనే వారి డిప్యూటేషన్ కూడా రద్దు చేస్తామని డీఎంహెచ్‌వో వివరించారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలు
● నాందేడ్ డీఆర్ఎం ప్రదీప్ కామ్లే ● ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సందర్శన ఆదిలాబాద్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని నాందేడ్ డీఆర్ఎం ప్రదీప్ కామ్లే అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అమృతభారత్ స్టేషన్, పిట్‌లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ రఘుపతి స్థానిక రైల్వే సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ, స్థానిక సమస్యలను పరిశీలించి డివిజనల్ స్థాయిలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న అండర్, ఓవర్ బ్రిడ్జి పనులు, పిట్‌లైన్, అమృత్ భారత్ స్టేషన్ పనులు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వేకి సంబంధించిన పలు అంశాలను డీఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని రైల్వే వంతెనల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యం అవుతుందన్నారు. నిధుల కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించేలా రైల్వే మంత్రి దృష్టికి సైతం తీసుకువెళ్లామన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా తోడ్పాటు అందించాలని కోరామన్నారు. ఇందులో రైల్వే అధి కారులు, పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. -
‘గడ్డి మందు’పై పోరాటం
● పారాక్వాట్ నిషేధానికి డాక్టర్ల సంఘం ఏర్పాటుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశంలో ఎంతోమంది నిండు ప్రాణాలను బలితీసుకుంటున్న గడ్డి మందు(పారా క్వాట్) నిషేధమే లక్ష్యంగా పోరాటానికి ఓ సంఘం ఏర్పాటైంది. రాష్ట్రంలో పలువురు ప్రైవేటు వైద్యులు కలిసి ‘డాక్టర్స్ అసోసియేషన్ అగెనెస్ట్ పారాక్వాట్ పాయిజనింగ్’ పేరుతో ఓ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించారు. మంచిర్యాల కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఖమ్మంకు చెందిన డాక్టర్ సతీశ్ నారాయణచౌదరి, ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన డాక్ట రాకేశ్ చెన్న, ప్రధాన కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన డాక్టర్ మానస మామిడాలతో సహా మరో ఆరుగురి వైద్యులతో కార్యవర్గం ఏర్పడింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ క్షణికావేశంలో గడ్డి మందు తాగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అనేక దేశాల్లో నిషేధించినా ఇక్కడ విరివిరిగా వాడకంతో అనర్థాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విష రసాయన అమ్మకాలు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు, పౌరులు తమతో కలసి రావాలని కోరారు. -
● అంగన్వాడీలకు కందిపప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్ ఎంపికలో.. ● జిల్లాలో టెండర్ లేకుండానే అప్పగింత ● పలు జిల్లాల్లో నిబంధనలకు పాతర ● ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం ● సంక్షేమ అధికారుల రివ్యూ మీటింగ్‌లో మంత్రి సీతక్క ఆగ్రహం
ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో..– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారిరాష్ట్ర అధికారుల నుంచి టెండర్ల విషయంలో సరైన నిర్ణయం రాకపోవడంతో రెండు నెలల కోసం పాత కాంట్రాక్టర్‌కే కిలోకు రూ.162 చొప్పున సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంటున్నాం. ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ నిర్వహించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా ముందుకెళ్తాం. అసలేం జరిగిందంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జిల్లాల పరిధిలో అంగన్వాడీలకు కంది పప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. అయితే పలు జిల్లాల్లో టెండర్ నిబంధనలను ఉల్లంఘించారు. ఆదిలాబాద్ జిల్లాలో అసలు టెండరే నిర్వహించకుండా కంది పప్పు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్‌ను నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేశారు. అదికూడా గతం నుంచి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌కే వత్తాసు పలుకుతూ అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. దీంతో ప్రస్తుతం ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారిగా వ్యవహరిస్తున్న మిల్కా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన కాంట్రాక్ట్‌లను ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. కలెక్టర్ నేతృత్వంలోనే కొనుగోలు కమిటీ ద్వారా మాత్రమే టెండర్లు పిలిచి కాంట్రాక్ట్‌లు ఖరారు చేయాలని ఆదేశించింది. జిల్లాలో అక్రమాలు ఇలా.. నిబంధనల ప్రకారం టెండర్లను ఆహ్వానించి తక్కు వ ధరకు కోట్ చేసే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలి. అయితే కంది పప్పు కొనుగోలుకు రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయించిన గరిష్ట ధర రూ.164. దీన్ని జిల్లా సంక్షేమ అధికారి తనకు అనువుగా మలుచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎలాంటి టెండర్ లేకుండా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. మార్కెట్లో ప్రస్తుతం కంది పప్పు నాణ్యతను బట్టి ధర రూ.90 నుంచి రూ.130 కిలో చొప్పున ధర పలుకుతుంది. అయితే ఇటీవల జిల్లాలో నామినేషన్ పద్ధతిపై వరంగల్‌కు చెందిన శివసాయి ట్రేడర్స్‌కు కిలోకు రూ.162 చొప్పున కాంట్రాక్ట్ అప్పగించారు. దీనిపైనే ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వందల టన్నుల కంది పప్పు సరఫరా అంగన్వాడీలకు జరుగుతుండగా, ఇలా నామినేషన్ పద్ధతిపై అప్పగించడంలో సంక్షేమ అధికారి లోపాయికారితనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొనుగోలు కమిటీ నిస్తేజం.. సాధారణంగా అంగన్వాడీలకు సరఫరా చేసే సరుకుల టెండర్లకు సంబంధించి కొనుగోలు కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఈ కమిటీలో జిల్లా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే కొంత కాలంగా అంగన్వాడీలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల ఎంపికలో ఈ కమిటీ పాత్ర నిస్తేజంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా జిల్లా యంత్రాంగానికి అవినీతి మచ్చ అంటగట్టినట్టు అయ్యింది. ఇలా అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడమే ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నాయి. స్వయంగా ఇన్చార్జి మంత్రి సీతక్క పర్యవేక్షణ చేస్తున్న శాఖకు సంబంధించి జిల్లాలో అడ్డగోలుగా వ్యవహారాలు సాగుతుండడంతో అందరు ముక్కున వేలేసుకునే పరిస్థితి తలెత్తింది. కంది పప్పు సరఫరా ఇలా..జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐదు ప్రాజెక్టులు ఆదిలాబాద్, జైనథ్, బోథ్, నార్నూర్, ఉట్నూర్‌లో ఉన్నాయి. వీటి పరిధిలో 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలు 10వేల మంది ఉండగా, చిన్నారులు 22వేలు ఉన్నారు. వీరికి పాలు, గుడ్లు, ముర్కుల్, బాలామృతం అందజేస్తారు. ఒకపూట భోజనం అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తుంది. ఇక కంది పప్పు, నూనె, ఇతరత్రా సామగ్రిని కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తారు. జిల్లాలో ప్రతి రెండు నెలలకోసారి 20 టన్నుల చొప్పున ఏడాదికి సుమారు 120 టన్నుల కంది పప్పు సరఫరా అవుతుంది. -
మాట ఇచ్చా.. నిలబెట్టుకున్నా
● ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్: మండలంలోని ధన్నూర్(బి) రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో జొన్న కొ నుగోలు కేంద్రం ఏర్పాటు చేశానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల గ్రామస్తులు విన్నవించిన మేరకు తాను కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. రైతులు తమ పంట దిగుబడిని దళా రులకు అమ్మి మోసపోవద్దని సూచించా రు. కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సంధ్యారాణి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
వైద్యశాఖలో అక్రమ డిప్యూటేషన్లు
● నచ్చిన చోటే ల్యాబ్టెక్నీషియన్ల విధులు ● ఏజెన్సీ అలవెన్సు తీసుకుంటూ మైదాన ప్రాంతంలో డ్యూటీఆదిలాబాద్టౌన్: వైద్యశాఖలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిప్యూటేషన్‌లో కొంత మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తమకు నచ్చిన చోటనే డ్యూటీలు చేస్తున్నారు. మరికొంత మంది ఏజెన్సీ అలవెన్సు పొందుతూ మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొందరు ల్యాబ్ టెక్నీషియన్ల తీరు మాత్రం మారడం లేదు. ఇటీవలే బదిలీలు జరిగినా పలువురు ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉన్నచోట విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండి రోగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన ల్యాబ్టెక్నీషియన్లు రోగుల ఆరోగ్యం పట్టనట్టుగా ఉంటున్నారు. వారికి అనుకూలంగా డ్యూటీ ఉంటే సరిపోతుందనే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. గర్భిణులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆయా పీహెచ్‌సీలకు వైద్య పరీక్షల కోసం వచ్చినప్పుడు ల్యాబ్టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌లో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టింపులేనితనంగా వ్యవహరించడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతుంది. ఏజెన్సీ అలవెన్సులు పొందుతూ మైదాన ప్రాంతాల్లో.. కొంత మంది ల్యాబ్టెక్నీషియన్లు ఏజెన్సీ అలవెన్సు పొందుతూ జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తించడం విమర్శలకు దారితీస్తోంది. తోటి ఉద్యోగులకంటే అదనంగా ఏజెన్సీ అలవెన్సు పొందుతూ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. సైద్పూర్లో ఏజెన్సీ అలవెన్సు పొందుతున్న ఉద్యోగి జిల్లా కేంద్రంలోని మలేరియా కార్యాలయంలో, అలాగే గాదిగూడలో పనిచేస్తున్న ఉద్యోగి జిల్లా కేంద్రంలోని టీబీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. గిరిజనుల ఆరోగ్యంపై వీరికి శ్రద్ధ లేనట్టుగా తెలుస్తోంది. డిప్యూటేషన్లు బ్యాన్ ఉన్నప్పటికీ వీరు అక్రమంగా వారికి నచ్చినచోట పనిచేస్తుండడం గమనార్హం. రాజకీయ నాయకులు, ఇతర అధికారుల అండదండలతో వీరి ఆగడాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.నిబంధనలకు పాతర..వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు నిబంధనలకు పాతర వేశారు. తమకు కేటాయించిన పీహెచ్సీలో కాకుండా వారికి అనుకూలంగా ఉన్న చోట విధులు నిర్వహిస్తున్నారు. తాంసిలో పనిచేయాల్సిన ల్యాబ్‌టెక్నీషియన్ రిమ్స్‌లోని మలేరియా విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. జైనథ్‌లో పనిచేయాల్సిన ల్యా బ్ టెక్నీషియన్ మలేరియా ల్యాబ్‌లో, సొనా లలో పనిచేయాల్సిన మరో ఉద్యోగి జైనథ్‌లో, జైనథ్‌లో పనిచేయాల్సిన ఎల్టీ మలేరియా విభాగంలో, బజార్హత్నూర్ పనిచేయాల్సిన ఉద్యోగి సొనాలలో, బేలలో పని చేయాల్సిన ఉద్యోగి రిమ్స్‌లోని టీహబ్‌లో, సైద్పూర్లో పనిచేయాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ మలేరియా విభాగంలో, గాది గూడలో పనిచేయాల్సిన ఉద్యోగి టీబీ కార్యాలయంలో.. ఇలా అనేక మంది వారికి అనుకూలంగా ఉన్నచోట విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్లు రద్దు చేస్తాం..నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తాం. వంద రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా పలువురికి డిప్యూటేషన్లు ఇచ్చాం. ఇటీవలే కార్యక్రమం పూర్తయింది. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో -
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్‌టౌన్: గర్భస్థ లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరమని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నా రు. పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లను శుక్రవారం తనిఖీ చేశారు. రి కార్డులతో పాటు అగ్నిమాపక పరికరాల పని తీరును పరశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ఆస్పత్రుల నిర్వాహకులు ని బంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు క్రాంతి, మిషన్ కోఆర్డినేటర్ యశోద, పోలీసు అధి కారి వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యవృత్తి పవిత్రమైంది
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● రిమ్స్‌లో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డేఆదిలాబాద్టౌన్: వైద్యవృత్తి ఎంతో పవిత్రమైంద ని, గ్రాడ్యుయేట్ పట్టాలు పొందిన మెడికోలు రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం రాత్రి రిమ్స్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన మెడికోలకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వృత్తిని దైవంగా భావించాలన్నారు. ప్రజలు వైద్యులను దేవునితో సమానంగా పోల్చుతారని పేర్కొన్నారు. తనది కూడా వైద్య కుటుంబమని, సేవాభావంతో వైద్య వృత్తిని నిర్వర్తించాలని సూచించారు. ర్యాగింగ్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ముందుగా గుస్సాడీ, సాంస్కృతిక నృత్యాలతో మెడికోలు ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, సత్యనారాయణ, వంజారి, మెడికోలు తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి అనవసరంగా తిరగొద్దు
● డీఎస్పీ జీవన్‌రెడ్డి ● జిల్లాలో ఆపరేషన్ చబుత్ర షురూ ● 150 మంది యువకులకు కౌన్సెలింగ్ఆదిలాబాద్టౌన్: పట్టణంలో అర్ధరాత్రి అనవసరంగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాను నేర రహితంగా మార్చేందుకు ఆపరేషన్ చబుత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినుట్ల తెలిపారు. అకారణంగా సంచరిస్తున్న 150 మందిని వన్‌టౌన్‌కు తరలించి కౌన్సెలింగ్ చేసినట్లు పేర్కొన్నారు. పదేపదే సంచరిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణంలో రాత్రి 10.30 గంటల తర్వాత అత్యవసర దుకాణాలు మినహా మిగిలిన వ్యాపార సమూహాలన్నీ మూసి వేయాలన్నారు. యువత ఎలాంటి గొడవలకు దారి తీయకుండా ఉండేందుకు, ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐలు బి.సునిల్ కుమార్, కరుణాకర్, రూరల్ సీఐ ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, బి.శ్రీపాల్, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు ముజాహిద్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయుడు జ్యోతిబాపూలే
● కలెక్టర్ రాజర్షిషాఆదిలాబాద్టౌన్: మహాత్మా జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శ ప్రాయుడని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా ని ర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్లో పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూక్తాపూర్ పూలే చౌక్‌లో జ్యోతిబాపూలే చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వా త జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు విద్య అందించేందుకు జ్యోతి బాపూలే సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పూలే అడుగుజాడల్లో నడవాలని పిలుపనిచ్చారు. ఇదిలా ఉండగా కలెక్టర్ ఇటీవల స్కోచ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే, బీసీ సంఘాల నాయకులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీసీ సంఘ అధ్యక్షుడు దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్, విజయ్ కుమార్, బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్ ధర పెంపుపై సీపీఎం నిరసన
ఆదిలాబాద్‌టౌన్: వంట గ్యాస్ ధర పెంపు ను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువా రం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ మాట్లాడుతూ వంట గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తామని చెప్పి ధరలను పెంచడం సరికాదన్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ఇబ్బందులకు గురవుతున్న ప్రజ లు పెట్రో ధరల పెంపుతో మరింతగా ఇ బ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నగేశ్, సునిత, మయూరి, ఆశన్న, ప్రభు, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌రిజిస్ట్రార్‌కు మెమో
కై లాస్‌నగర్: సబ్‌రిజిస్ట్రార్‌పై ఆ శాఖ ఉన్నతాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఈ నెల 5న ‘రిజిస్ట్రేషన్ల దందా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ ఎం.రవీందర్రావు స్పందించారు. ఆది లాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్‌రిజిస్ట్రార్–2కు మెమో జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించా రు. దీంతో సదరు అధికారి సెలవులో వెళ్లినట్లు సమాచారం. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఆర్ఎస్ సాకుతో ఓ లేఅవుట్లోని ప్లాట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ శివారులో గల సర్వే నం.77, 78లో 45 ప్లాట్లతో ఏర్పాటు చేసిన పాత లేఅవుట్‌ను సర్వేనం.77/ఆర్, 78/3/ఆ బైనంబర్లతో మరో 51 ప్లాట్లతో కొత్త లేఅవుట్ ఏర్పాటు చేసి పాత దానికి జతచేసి ఒకే లేఅవుట్‌గా రూపొందించారు.ఈక్రమంలో కొత్తలేఅవుట్లోని ప్లాట్ల కు రిజిస్ట్రేషన్ చేసిన తీరును వివరిస్తూ ‘సాక్షి’ లో కథనం ప్రచురితమైంది. ఆయ న ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎల్ఐసీకి జాతీయ స్థాయిలో గుర్తింపుఆదిలాబాద్టౌన్: భారతీయ జీవిత బీమా సంస్థ ఆదిలాబాద్ శాఖకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారపరంగా జాతీయ స్థాయిలో 25వ ర్యాంక్, సౌత్ సెంట్రల్ జోన్లో నాలుగో ర్యాంక్ లభించింది. గడిచిన ఆర్థిక సంవత్సరా నికి గాను 8వేల పాలసీల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ శాఖ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఏవీఎస్ సుధాకర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకొని 4వ బ్రాంచ్‌గా, కరీంనగర్ డివిజన్లో ఏకై క బ్రాంచ్‌గా ఆదిలాబాద్ చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఎల్ఐసీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ‘బిల్లులు చెల్లించకుంటే జీపీ భవనాన్ని వేలం వేస్తా..’నేరడిగొండ: మండలంలోని సావర్గం గ్రామ పంచాయతీ భవనం నిర్మించి రెండున్నరేళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కళ్యాణి మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. భవనాన్ని నిర్మించి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు వాపోయారు. వడ్డీలు కట్టలేక జీవితం భారంగా మారిందని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి, గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.20 లక్షలు రావాల్సి ఉందని, వాటిని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు. లేనిపక్షంలో గ్రామపంచాయతీ భవనాన్ని వేలం వేస్తానని పేర్కొన్నారు. -
పీఎంఏవై దరఖాస్తులు @ 3,526
● బల్దియాకు చేరిన దరఖాస్తుదారుల జాబితా ● మొరాయించిన పోర్టల్.. ● వివరాల నమోదులో జాప్యం కై లాస్‌నగర్: పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్ర భుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధికోసం ఆదిలాబాద్ మున్సిపల్ పరి ధిలో 3,526 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలతో కూడిన జాబితా ప్రభుత్వం నుంచి గురువారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ కి అందింది. అందులోని దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శిస్తూ వారికి అవసరమైన ఇంటిస్థలంఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే వివరాలతో పాటు ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు సేకరించి పీఎంఏవై పోర్టల్‌లో మొబైల్ ద్వారా నమో దు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పట్టణంలోని పలు దరఖాస్తుదారుల ఇళ్లను బల్దియా వార్డు అధి కారులు గురువారం సందర్శించారు. వారి వివరా లను మోబైల్ ద్వారా నమోదు చేసే ప్రయత్నం చే శారు. కొంత సమాచారం నమోదు చేశాక ఆ పోర్టల్ పనిచేయకపోవడంతో చేసేది లేక వారు వెనుదిరి గారు. ఇదిలా ఉంటే కేంద్రం తెచ్చిన మరో నిబంధ న వివరాల నమోదుకు అడ్డంకిగా మారుతోంది. దరఖాస్తుదారులు తమ వివరాలతో పాటు తల్లిదండ్రుల ఆధార్ కూడా జత చేయాలనే నిబంధన వారి కి ఇబ్బందిగా మారుతోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసిన వారిలో 50 ఏళ్లపైబడిన వారే ఉన్నారని అలాంటి వారు తమ తల్లిదండ్రుల ఆధార్‌కార్డులను ఎలా తీసుకురాగలుగుతారనే సందేహాలు తలెత్తతున్నాయి. దీనిపై బల్దియా అధికారులను సంప్రదించగా.. విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పినట్లుగా పేర్కొన్నారు. -
● పది రోజుల్లోనే 83.13 శాతం పంపిణీ ● వండుకునేందుకే లబ్ధిదారుల ఆసక్తి ● మెజార్టీ కార్డుదారుల్లో హర్షం ● ఆర్థిక భారం తప్పిందంటున్న వైనం ● నాణ్యతపై అక్కడక్కడా పెదవివిరుపు
బియ్యం బాగున్నాయి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం బాగున్నాయి. అందులో ఎలాంటి నూకలు, తవుడు కూడా లేదు. మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి బియ్యం కొనుగోలు చేయలేని మా లాంటి వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ బియ్యంతో వండిన బువ్వ కూడా రుచిగా ఉంది. ఎప్పటికీ ఇలాగే పంపిణీ చేయాలి. – శశిరేఖ, సంజయ్‌నగర్ కొనాల్సిన అవసరం లేకుండా పోయింది మాకు నెలకు 18 కిలోల బియ్యం వస్తాయి. దొడ్డుబియ్యంను సైతం వండుకుని తినేవాళ్లం. ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు, ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం మార్కెట్లో రూ.50, రూ.60కి కిలో చొప్పున సన్న బియ్యం తెచ్చుకునేవాళ్లం. దీనికి నెలకు రూ.వెయ్యి వరకు అయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వమే సన్నబియ్యం అందిస్తుండటంతో మాలాంటి వారికి ఎంతో మేలు జరిగినట్లయింది. బయట కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. – గోలి అంజలి, గాంధీనగర్, ఆదిలాబాద్ పది రోజుల్లోనే 83శాతం పైగా తీసుకెళ్లారు.. జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన కోటాబియ్యం వందశాతం చౌక ధరల దుకాణాలకు చేరాయి. గతంలో బియ్యం పంపిణీ ప్రారంభించిన పది రోజుల్లో సగం బియ్యం కూడా కార్డుదారులు తీసుకెళ్లేవారు కాదు. ప్రస్తుతం 83శాతం పంపిణీ పూర్తయింది. ప్రతీ కార్డుదారు బియ్యంను తీసుకెళుతున్నారు. వాటిని వండుకుని తింటున్నారు. మేము ప్రత్యక్షంగా కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వద్దకు వెళ్లి పరిశీలించగా బువ్వ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – సుధారాణి, డీఎం సివిల్సప్లై, ఇన్చార్జి డీఎస్వో విద్యానగర్‌లోని చౌకధరల దుకాణంలో బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులుకైలాస్నగర్: రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీపై పేదల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఉగాది కానుకగా ఈనెల 1నుంచి చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించగా, కార్డుదారులు దుకాణాల ఎదుట బారులు తీరి మరీ తీసుకెళ్లారు. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో నెలాఖరు దాకా కూడా తీసుకునేందుకు ఆసక్తి చూప ని కార్డుదారులు ఈ నెల మొదటి వారంలో నే దాదాపు 83 శాతం మంది బియ్యం తీసుకెళ్లడం గమనార్హం. అయితే బియ్యం వండుకుని తిన్నవారు నాణ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం కొనుగోలు చేయనటువంటి తమకు ఈ బియ్యంతో రుచికరమైన భోజనం అందుతుందని మెజార్టీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేయగా, మెత్తగా అవుతున్న బువ్వను తినలేకపోతున్నామని, నా ణ్యమైన బియ్యం సరఫరా చేయాలని మరికొందరు పేర్కొంటున్నారు. 83.13 శాతం బియ్యం పంపిణీ.. చౌకధరల దుకాణాల ద్వారా ప్రతినెలా 1వ తేదీ నుంచి 20వ తేదీ వర కు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో నెలాఖరు వరకు దుకాణా లు తెరిచి ఉంచితే తప్పా పూర్తిస్థాయి కోటా పంపిణీ పూర్తయ్యేది కాదు. అలాంటిది ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడమే తరువాయి ప ట్టణ, పల్లె తేడాలేకుండా జిల్లావ్యాప్తంగా అన్ని దు కాణాల ఎదుట బారులు తీరి మరీ తీసుకెళ్లా రు. కేవలం పది రోజు ల వ్యవధిలోనే 83.13 శాతం బియ్యం పంపిణీ పూర్తవడం గమనార్హం. సన్నబువ్వపై భిన్నాభిప్రాయాలు ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు ఉచితంగా అందజేసిన ఆరు కిలోల బియ్యంను మెజార్టీ కార్డుదారులు మొదటి పది రోజుల్లోనే తీసుకున్నారు. ఇందులో నూకలు కానీ, తవుడు వంటివి లేకపోవడంతో ఇంటికి తీసుకువచ్చిన బియ్యం వండుకునేందుకే ఆసక్తి చూపా రు. అయితే నాణ్యతపై క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ లబ్ధిదా రులు సన్న బువ్వపై సంతృప్తి వ్యక్తం చేయగా.. కొంతమంది మాత్రం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా, చల్లారితే గట్టిగా అవుతుందని పేర్కొంటున్నారు. ఇంకా ఆగని బియ్యం విక్రయాలు..జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ వివరాలు .. చౌక ధరల దుకాణాలు : 356మొత్తం రేషన్ కార్డులు : 1,91,755మొత్తం యూనిట్లు : 6,32,819ఇప్పటి వరకు బియ్యం పంపిణీ చేసిన కార్డులు : 1,51,988ఇంకా మిగిలి ఉన్నకార్డులు : 39,767ఇది ఆదిలాబాద్ పట్టణం ఖుర్షీద్‌నగర్‌లో గల 28 వ నంబర్ చౌకధరల దుకాణం. ఈ షాపు పరిఽ దిలో మొత్తం 525 రేషన్‌కార్డులు ఉండగా, ఇప్పటికే 480 మంది కార్డుదారులు బియ్యం తీసుకెళ్లారు. మొత్తం 112 క్వింటాళ్ల కోటాకు గాను 100 క్వింటాళ్ల బియ్యం పంపిణీ పూర్తయింది. ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసిన సమయంలో లబ్ధిదారులు వాటిని తినేందుకు ఇష్టపడక డీలర్లు, మధ్య దళారులకు విక్రయించేవారు. కిలోకు రూ.15 నుంచి రూ.22 చొప్పున అమ్మేవారు. వాటిని దళారులు మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితిని తొలగించి పేదలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే ఇందులోనూ అక్రమాలు ఆగడం లేదు. రేషన్‌కార్డులు కలిగిన కొంత మంది అనర్హులు చౌక దుకాణాల నుంచి తీసుకున్న సన్నబియ్యాన్ని సైతం ఇప్పటికీ డీలర్లు, తమ రెగ్యులర్ దళారులకు విక్రయిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇది జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో గల 21 వ నంబర్ చౌక ధరల దుకాణం. ఈ షాపు పరిధి లో 864 రేషన్‌కార్డులు ఉండగా గురువారం వ రకు 804 కార్డుదారులు బియ్యం తీసుకెళ్లారు. ప్ర తి నెలా ఇందులో సగం మంది కార్డుదారులు కూ డా 10వ తేదీ వరకు దుకాణానికే రారు. అలాంటి ది ఈ షాపునకు కేటాయించిన 175.8 క్వింటా ళ్లకు గాను 140 క్వింటాళ్ల బియ్యం పంపిణీ పూర్తవడం కార్డుదారుల ఆసక్తికి అద్దం పడుతుంది. -
‘తులం బంగారం’ హామీ ఏమైంది..?
ఇచ్చోడ: మండలంలోని ముఖరా (కే) గ్రా మంలో గురువారం నిర్వహించిన ఓ పెళ్లి వే డుక నిరసన వేదికగా మారింది. కాంబ్లే అముల్–గీతాంజలి వివాహానికి గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి, మాజీ ఎంపీటీసీ సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులతో కలిసి కల్యాణలక్ష్మి పథకం అమలు తీరుపై ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ పథకం కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిందన్నారు. అయినా ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. -
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
● కలెక్టర్ రాజర్షిషానార్నూర్: ప్రతీ ఒక్కరికి పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని నడ్డంగూడ సీఎస్సీ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. పోషణ్ పక్షం– 2025లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మినీ అంగన్వాడీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా పోషణ్ పక్షం కార్యక్రమాన్ని ఈనెల 8నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు బాలామృతం, పౌష్టికాహారంతో పాటు ఐరన్ ఫోలిక్ మాత్రలను అందించాలన్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవం అయ్యేలా చొరవచూపాలన్నారు. జిల్లాను ఎనీమియా ముక్త్‌గా తీర్చిదిద్దేలా రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం చిత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇళ్ల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, మహళా శిశు సంక్షేమ శాఖ పీడీ మిల్కా, సీడీపీవో శారద, ఎంపీడీవో జవహర్, తహసీల్దార్ రాజలింగు తదితరులున్నారు. -
‘మావల’ పూడికతీతపై దృష్టి
● చెరువును పరిశీలించిన అధికారులు కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణానికి ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా నీటిని అందించే మా వల చెరువు పూడికతీతపై యంత్రాంగం దృష్టి సారించింది. ఈ చెరువు ద్వారా పట్టణానికి నిత్యం 1.5 ఎంఎల్డీల నీరు సరఫరా అవుతోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో నీటి సరఫరా అవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేలా అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంజినీర్ పేరిరాజు, ఇరిగేషన్ శాఖ డీఈఈ కే.ప్రేంసింగ్ బుధవారం మావల అటవీ ప్రాంతంలోని చెరువును సందర్శించారు. నిల్వ ఉన్న నీటితో పాటు పేరుకుపోయిన పూడిక, చెత్తను పరిశీలించారు. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర పూడిక తొలగించాలనే దానిపై అంచనా వేశారు. వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్‌కు గురువారం అందించనున్నట్లు తెలిపారు. ఇరిగేషన్‌శాఖ సిద్ధం చేసే ప్రతిపాదనల ఆధారంగా పూడిక తొలగించనున్నట్లు ఎంఈ పేర్కొన్నారు. అలాగే లాండసాంగ్వీ వాగు ఎండిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా చెక్‌డ్యాం నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేయనున్నట్లుగా ఆయన వివరించారు. వారి వెంట మున్సిపల్ డీఈఈ కార్తీక్, ఇరిగేషన్‌శాఖ ఏఈలు కే.డి.సాగర్, బి.ప్రసాద్ తదితరులున్నారు. -
● మారనున్న రైల్వేస్టేషన్ రూపురేఖలు ● కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు ● ‘అమృత్ భారత్ స్టేషన్’ కింద ఎంపిక ● ప్రయాణికుల సౌకర్యార్థం వసతులు మెరుగు
సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఆదిలాబాద్ ఒకటి. దక్షిణమధ్య రైల్వే పరి ధిలోకి వచ్చే నాందేడ్ డివిజన్ పరిధిలో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ పెరుగుతున్న రైలు వినియోగదా రుల అవసరాలను తీర్చే ఉద్దేశంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద దీన్ని ఆధునికీకరిస్తున్నారు. 2023 ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పనులను వర్చువల్ పద్ధతిన ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ.. కొన్నేళ్లుగా ఈ స్టేషన్ ప్రయాణికుల రద్దీలో గణనీయమైన వృద్ధి సాధించినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రోజూ 4,300కు పైగా ప్రయాణికులు 16 రైళ్ల ద్వారా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇక్కడ పిట్‌లైన్ నిర్మాణం తుది దశకు వచ్చింది. రైల్వే కోచ్‌ల నిర్వహణ పిట్‌లైన్ ద్వారా జరిగేందుకు ఆస్కారం ఉంది. తద్వారా ఈ స్టేషన్ నుంచే రైలు గమ్యస్థానం ప్రారంభించేందుకు దోహద పడుతుంది. నాందేడ్ రైల్వే స్టేషన్లో రైళ్ల రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడినుంచి పలు రైళ్లను పొడగించాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఇదే డివిజన్ పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్ స్టేషన్‌కు ఆ రైళ్లను పొడగించాలని పౌరసమాజం సభ్యులు పలుమార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పిట్‌లైన్ పనులు తుది దశకు రావడం, రానున్న రోజుల్లో స్టేషన్ ఆధునికీకరణ కూడా పూర్తయ్యే పరిస్థితులు ఉండడంతో ఆదిలాబాద్ రైల్వే రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఆరు రైల్వేట్రాక్‌లు ఉండగా, వాటిని తొమ్మిదికి పెంచుతున్నారు.పనులు కొనసాగుతున్నాయి.. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. అమృత్ స్కీమ్‌లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా పలు వసతులను ఏర్పాటు చేస్తున్నాం. – ప్రదీప్ కామ్లే, డీఆర్ఎం, నాందేడ్ రైల్వే డివిజన్ -
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి
ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కుమ్ర కోటేశ్ అన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోకస్‌మన్నూర్‌లో బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల అభివృద్ధిని మరిచి కుల, మతాల మధ్య చిచ్చుపెడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కళ్లెం నారాయణ్‌రెడ్డి, కొత్తూరు లక్ష్మణ్, ముస్తాఫా, గోవర్ధన్, ప్రభాకర్, షాదుల్లా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అఖిల్.. మార్క్
● అక్రమార్కులపై ఎస్పీ కొరడా ● మట్కా, గంజాయి, బెట్టింగ్‌పై ఫోకస్ ● ‘బెల్టు’దందా, వీడీసీలకు చెక్‌పెట్టేలా కసరత్తు ● ‘మెసేజ్ యువర్ ఎస్పీ’కి శ్రీకారం ● శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సమస్యలపై సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 8712659973ఆదిలాబాద్‌టౌన్: అక్రమార్కులపై జిల్లా పోలీస్ బా స్ కొరడా ఝళిపిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులతో పాటు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ(వీడీసీ) ల ఆగడాలకు చెక్ పెడుతున్నారు. అంతేకాకుండా గంజాయి, మట్కా, బెట్టింగ్‌పై ఫోకస్ పెంచారు. అ సాంఘిక కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేశా రు. మరోవైపు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తంగా జిల్లాలో శాంతిభద్రతల ప రిరక్షణ విషయంలో తన మార్కు చూపుతున్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. మార్చి 9న జిల్లా బాస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో పాలన ను గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నారు. నిఘా క ట్టు దిట్టం చేయడంతో పాటు శాఖాపరంగా ఆకస్మిక తనిఖీలతో అధికారులు, సిబ్బందిని అలర్ట్ చేస్తున్నా రు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే నేరుగా సమాచారం అందించేందుకు ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’ అనే కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు. వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అక్రమార్కుల్లో గుబులు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరికలతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. నిషేధిత వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల మట్కాపై దృష్టి సారించారు. నెలరోజులుగా మట్కా నిర్వాహకులతో పాటు ఐపీఎల్, ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న వీడీసీలనూ వదలడం లేదు. ● ఇప్పటివరకు జిల్లాలో ఆరు బెట్టింగ్, జైనథ్, బేల మండలాల్లో వీడీసీ సభ్యులపై రెండు కేసులు నమోదయ్యాయి. ● జిల్లా కేంద్రంతో పాటు జైనథ్, ఉట్నూర్‌లో ఇటీవల గంజాయి విక్రయదారులపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ● జైనథ్, బేల, భీంపూర్ మండలాల్లో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తున్న వారిపై సుమారు 20కి పైగా కేసులు నమోదు చేశారు. ● కత్తులతో విన్యాసం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరించిన ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి.ఇందులో ఆది లాబాద్‌లో రెండు, బోథ్లోఒక కేసు నమోదైంది. ● నేరడిగొండ, జిల్లా కేంద్రంలోని దాబాల్లో మ ద్యం విక్రయిస్తున్న వారితో పాటు బెల్టుషాపుల నిర్వాహకులపై కూడా నమోదు చేశారు. దాబా లపై రెండు, బెల్టుషాపులపై మూడు కేసులు నమోదయ్యాయి. ● జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో రోడ్డు ప్ర మాదాలు జరగకుండా ఫోకస్ పెంచారు. ఇదివరకు సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా, ప్రస్తుతం జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ఉదయం నుంచే వీటిని నిర్వహిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఖాకీలపై కూడా దృష్టి.. అలాగే పోలీసు శాఖలో ఎవరైనా అక్రమాలకు పా ల్పడినా వారిపై కూడా ఎస్పీ దృష్టి సారించారు. కొంత మంది బెల్టుషాపులు, తెల్లకల్లు దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి నెలనెలా ‘మామూలు’ తీసుకుంటున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బందిలో గుబులు మొదలైంది. మెసేజ్ యువర్ ఎస్పీకి శ్రీకారం.. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు చో టు చేసుకుంటే నేరుగా సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం యువతకు అందుబాటులో ఉండడంతో సులువుగా సంప్రదించవచ్చనే ఆలోచనతో దీనిని ప్రారంభించారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి సమస్యలు, సమాచారం ఉన్నా నేరుగా వాట్సాప్ ద్వారా సంప్రదించేలా చర్యలు చేపట్టారు. సంబంధిత సమస్యలపై పూర్తి వివరాలు రాసి 8712659973 వాట్సాప్ నంబర్ ద్వారా తెలియజేసేందుకు వీలు కల్పించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నారు. సత్వర పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తిగా ఎస్పీ పర్యవేక్షణలోనే కొనసాగనుంది. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు.. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడమే లక్ష్యం. గంజాయి, మట్కా, ఆన్లైన్ బెట్టింగ్, అక్రమ ఇసుక దందాపై ప్రత్యేక దృష్టి సారించాం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. దాబాల్లో మద్యం విక్రయాలు జరగకుండా చూస్తున్నాం. పోలీసు అధికారులెవరైనా లంచం అడిగినా, అక్రమాలకు పాల్పడినే నేరుగా సమాచారం అందించవచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. –అఖిల్ మహాజన్,ఎస్పీ -
పోరాటయోధుడు రాంజీగోండు
● గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కృషి ● ఎంపీ గోడం నగేశ్ ఆదిలాబాద్: భారత స్వాతంత్రోద్యమంలో అందరినీ ఐక్యం చేసి పోరాడిన యోధుడు రాంజీ గోండు అని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం రాంజీగోండు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరాడిన ఘనత రాంజీ గోండుకు దక్కుతుందన్నారు. ఆంగ్లేయులపై ధిక్కార స్వరం వినిపించిన రాంజీతో పాటు మరో వెయ్యి మంది వీరులను ఒకే మర్రిచెట్టుకు ఉరితీసిన చారిత్రక సంఘటనకు నిర్మల్ వేదిక అయిందన్నారు. అలాంటి వీరుడి చరిత్రను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పార్టీ తరఫున సైతం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. బిర్సా ముండా జయంతిని జన జా తీయ గౌరవ దినోత్సవంగా తమ పార్టీ నిర్వహిస్తుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే ఆది వాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వారి పురోగతికి పాటుపడుతుందన్నారు. రాంజీ త్యాగాన్ని గుర్తిస్తూ ఆయన పేరు మీదుగా హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో మ్యూజియం నిర్మిస్తోందన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కనపర్తి చంద్రకాంత్, భోంస్లే దశరథ్ పటేల్, శేఖర్, బీజేపీ నాయకులు తులసీరామ్, భూమన్న, శైలేందర్ రాజన్న, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
బొట్టుపెట్టి.. ఆహ్వాన పత్రిక అందించి
బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావాల్సిందిగా కోరుతూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మండలంలోని ముఖరా(కె) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సుభాష్. గ్రామంలో బుధవారం ఇంటింటికీ తిరుగుతూ.. బొట్టు పెట్టి సారె ఇచ్చి ఆహ్వాన పత్రిక అందించారు. ముందుగా స్థానిక ఆలయంలో ఆహ్వాన పత్రికలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న సభకు తరలిరావాల్సిందిగా కోరారు. – ఇచ్చోడ -
సన్నబియ్యం పేదలకు వరం
● కలెక్టర్ రాజర్షి షాతలమడుగు: రేషన్‌షాపుల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పేదలకు వరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని ఝరి గ్రామంలో గల రేషన్ లబ్ధిదారుడైన ఉపేందర్ యాదవ్ ఇంట్లో బుధవారం ఆయన సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్, సివిల్ సప్లై మేనేజర్ సుధా, తహసీల్దార్ రాజ్‌మోహ న్, రవీందర్, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. వాటర్‌షెడ్ యాత్ర మొబైల్ వాహనం ప్రారంభం అనంతరం గ్రామంలో కృషి యోజన వాటర్ షెడ్ యాత్ర మొబైల్ వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న వాటర్ షెడ్ యాత్ర జిల్లాలో నార్నూర్, తలమడుగు మండలాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వాన నీటిని సంరక్షిస్తూ భూగర్భ జలాలను పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో చంద్రశేఖర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల పాల్గొన్నారు -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్‌రూరల్: జిల్లా కేంద్రం శివారులోని బొమ్మరిల్లు టౌన్షిప్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. కాలనీలో నివాసం ఉంటున్న బొబ్బిలి శ్రీకాంత్‌రెడ్డి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. సోమవారం రాత్రి దొంగలు ఇంటి మెయిన్ డోర్ పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బెడ్రూంలో బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌రెడ్డి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్సై లింబాద్రి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
కోటపల్లి: ప్రేమ విఫల మై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల మే రకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం రాము (23) ఇంటి వద్దే ఉంటూ తండ్రితో పాటు వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. తాను ప్రేమించిన యువతి ప్రేమకు నిరాకరించడంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. మృతుని తండ్రి బాపు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆదిలాబాద్‌లో పశువుల వ్యాపారి...ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఫిరోజ్ సిద్దిఖి (35) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. పశువుల వ్యాపారం చేస్తున్న ఫిరోజ్ సిద్దిఖికి నష్టం రావడంతో అప్పుల బాధ తాళలేక అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్‌లో చేర్పించగా మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. మనస్తాపంతో బాలిక.. ఇచ్చోడ: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు మండలంలోని ముకురా(బి)కి చెందిన రఫీక్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంట్లో గొడవలకు దిగేవాడు. దీంతో మనస్థాపానికి గురైన అతని కుమార్తె పిర్ధోసి (16) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. మృతిరాలి తల్లి జాబినాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చెక్‌బౌన్స్ కేసులో ఏడాది జైలుమంచిర్యాలక్రైం: చెక్‌బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఏడాది జైలుశిక్షతో పాటు అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించాలని స్థానిక సివిల్ కోర్టు జడ్జి కే.నిరోష మంగళవారం తీర్పునిచ్చారు. కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎస్.పారిజాత మంచిర్యాలకు చెందిన గుమ్మి జగన్నాథ్‌రెడ్డి వద్ద రూ.12లక్షలు అప్పుగా తీసుకుంది. ఒప్పందం ప్రకారం పారిజాత చెక్కులను అందజేసింది. గడువు తీరిన తర్వాత చెక్కును స్థానిక ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. దీంతో జగన్నాథ్‌రెడ్డి 2017లో కోర్టును ఆశ్రయించగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు. -
గుట్టుగా గంజాయి దందా..
ఉట్నూర్‌రూరల్: మండలంలో గంజాయి దందా గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల గంజాయి పట్టుబడింది. ఆదివారం రాత్రి రాములుగూడెంలో రైతు సాగు చేస్తున్న 20 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం ఉట్నూర్ ఇన్చార్జి ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో బీర్పాయిపేటలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మండలంలోని లక్సెట్టిపేటకు చెందిన సట్ల గంగన్న , బీర్సాయిపేటకు చెందిన జైనేని ఎల్లయ్య అనుమానస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా 4.900 గంజాయి లభించింది. గంజాయి విలువ రూ.లక్షా 22 వేలు ఉంటుందన్నారు. వారిని విచారించగా మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కరీంనగర్ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రెవెన్యూ ఉద్యోగుల జాడేది?
● మూకుమ్మడిగా విధులకు గైర్హాజరు ● అధికారికమా.. అనధికారికంగానా? ● హాజరు రిజిష్టర్‌లో వివరాలు నిల్ కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ రెవెన్యూ ఇన్చార్జి అధికారి, మేనేజర్ బాధ్యతలు నిర్వహించే అ ధికారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఆరురోజులుగా మూకుమ్మడిగా విధులకు గైర్హాజరవుతున్నారు. వీరు అధికారికంగా సెలవులో వెళ్లారా? లేదా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారా? తెలియడంలేదు. పన్నులు వసూలు చేసి బ ల్దియాకు ఆదాయం పెంచాల్సిన సమయంలో వీరు విధుల్లో లేకపోవడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులను ముందస్తుగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చే స్తోంది. పన్నులు చెల్లించే వారికి ఐదు శాతం రాయి తీ కల్పిస్తోంది. ఇంతటి కీలక సమయంలో అధికా రుల్లేక రెవెన్యూ విభాగం బోసిపోతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి సెలవుపై వెళ్లడం వారి హక్కు.. కాదనలేం.. కానీ.. అటెండెన్స్ రిజిస్టర్లో ఈ నెల 2నుంచి మంగళవారం వరకు వారికి సంబంధించి వివరాలేమీ అందులో నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మ్యు టేషన్లు, అసెస్మెంట్లు, డోర్ నంబర్ల జారీ తదితర ప్రక్రియ నిర్వహించడంలో రెవెన్యూ వ్యవస్థనే అ త్యంత కీలకం. అలాంటి విభాగంలోని అధికారులు, బిల్ కలెక్టర్లు అందుబాటులో లేకుండా పోవడమేమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు ఉద్యోగులంతా టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మున్సి పల్ కమిషనర్ సీవీఎన్ రాజును సంప్రదించగా వా రంతా అధికారిక సెలవుపైనే వెళ్లారని, మిగతా సి బ్బంది వ్యవహారాలు చూస్తున్నట్లు తెలిపారు. -
వేసవి శిక్షణశిబిరానికి ఎంపిక
బజార్హత్నూర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం మండ ల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల క్రీడా మైదానంలో ఇన్చార్జి హెచ్ఎం లింగన్న పర్యవేక్షణలో సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. 150 మంది పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 62 మంది ఈ నెల 25నుంచి నేరడిగొండలో నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరానికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగాధర్, పీడీ అఖిల్, తిరుపతి, నాగరాజ్, అఖిల, షబ్బీర్, జబ్బర్‌ఖాన్, శైలజ, కిరణ్, శ్యాం, బాపురావ్, రమేశ్ పాల్గొన్నారు. -
ఇలా.. ఇంకెన్నేళ్లు..!?
● వాళ్ల ప్రాణాలకూ విలువనివ్వరా? ● వెయ్యిమంది త్యాగాలకు లెక్కలేదా? ● అధికారికంగా నివాళులూ అర్పించలేరా? ● ‘వెయ్యి ఉరులమర్రి’ సాక్షిగా వివక్ష ● నేడు ఆ అమరవీరుల త్యాగాలదినం దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపుగా తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్ కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. అడవుల్లోకి చొచ్చుకొస్తూ.. ఆదివాసుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకున్న గోండువీరుడు మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిజాం సేనలతో కలిసి నిర్మల్ కలెక్టర్ ప్రజలను పీడిస్తున్నాడని రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు ఆయనకు తోడయ్యారు. రోహిల్లా సర్దార్ హాజీతో కలిసిన రాంజీ.. ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా దట్టమైన అడవులు, సహ్యాద్రి కొండలు, గోదావరి నదులను ఆసరాగా చేసుకుని వారిపై దాడులు చేసి దెబ్బతీశారు. ఒకే మర్రికి.. వెయ్యిమంది ఉరి.. దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన జలియన్‌వాలాబాగ్ కంటే దాదాపు 60 ఏళ్ల ముందే చోటు చేసుకోవడం గమనార్హం. ఆ దారుణం కంటే ఇక్కడ ఎక్కువమందే ప్రాణత్యాగాలు చేసినా.. చరిత్రలో సరైన గుర్తింపు దక్కకపోవడం శోచనీయమని నిర్మల్ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నిర్మల్గడ్డపై జరిగిన పోరుకు, వారి త్యాగాల తీరుకు తగిన గుర్తింపు తీసుకురావాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో రాంజీగోండు విగ్రహం‘సాక్షి’ అక్షర నివాళులు.. స్వాతంత్రం కోసం సర్వస్వం అర్పించిన సమరయోధులనూ గుర్తించాలని, రాంజీసహా వెయ్యిమంది అమరవీరుల త్యాగాలకు విలువనివ్వాలని అవకాశం దొరికినప్పుడల్లా.. ‘సాక్షి’ గొంతెత్తుతూనే ఉంది. వరుస కథనాలను ప్రచురిస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ నాటి చరితను, వారి ఘనతను ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వెయ్యిమంది వీరుల త్యాగాలదినం సందర్భంగా బుధవారం నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్‌లైన్‌లో గల డా.కావేరి లైబ్రరీలో సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బళ్లారి నుంచి దళం..రాంజీసేనల దాడుల విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో అప్పటి రెసిడెంట్ డేవిడ్సన్, నాటి పాలకుడు అఫ్టల్ఉద్దౌలా వరకు తెలిసింది. వీరి పోరును తీవ్రంగా పరిగణించిన పాలకులు అణచివేత కోసం కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న 47వ నేషనల్ ఇన్ఫ్రాంటీని నిర్మల్ రప్పించారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళానికీ ఇక్కడి ప్రాంతంపై పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో కల్నల్ రాంజీసేనను దొంగదెబ్బ తీసి, సోన్–కూచన్‌పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున పట్టుకున్నాడు. వాళ్ల పోరాటం తెలుసుకుంటే రోమాలు నిక్కబొడ్చుకుంటయ్. తమపై సాగిస్తున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు.. వారు ముందుకురికిన తీరు రక్తాన్ని ఉడికిస్తుంది. చరిత్ర సైతం గోసపెట్టుకునేలా వారు చేసిన ప్రాణత్యాగాలు కళ్లను చెమరుస్తాయి. వారి వీరగాథ గుర్తుకొచ్చినప్పుడల్లా చేతులు వాటంతటవే జోడిస్తాయి. కానీ.. అలాంటి వీరుల ప్రాణత్యాగాలను ప్రభుత్వాలు చిన్నచూపు చూడటమే కలచివేస్తోందని నిర్మల్ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గడ్డపైనే పోరాడి, తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరుల త్యాగాలకు ఇంకెప్పుడు అధికారిక నివాళులర్పిస్తారు..!? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రావడం లేదు. నేడు (ఏప్రిల్ 9) రాంజీసహా వెయ్యిమంది వీరుల త్యాగాలదినం.. – నిర్మల్మనవంతు ప్రయత్నం.. జిల్లాలో ఎన్నో చారి త్రక కట్టడాలు ఉన్నాయి. వెయ్యి ఉరులమర్రి ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. వీటిని ముందుతరాలకు అందించేందుకు మావంతు ప్రయత్నం కొనసాగుతోంది. – అభిలాష అభినవ్, కలెక్టర్ -
సకాలంలో పన్ను చెల్లించాలి
ఆదిలాబాద్‌టౌన్: సకాలంలో త్రైమాసిక ట్యాక్స్ చెల్లించాలని, లేకుంటే వాహనదారులకు నోటీసులు జారీ చేస్తామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన ర్ (డీటీసీ) రవీందర్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2024 సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ లక్ష్యం 90 శా తం పూర్తి చేసినట్లు తెలిపారు. 15 ఏళ్లు దాటిన ప్రైవేట్ బస్సులను రోడ్డుపై తింపవద్దని పేర్కొన్నారు. తిప్పకుండా ఉంచే వాహనాల వివరాల ను ఆర్టీవో కార్యాలయంలో తెలిపితే ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. మైనర్లు వా హనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఆరు నెలల్లో నిబంధనలు అతిక్రమించిన వెయ్యి ప్రైవేట్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కొత్తగా వాహన సారథి పోర్టల్‌ను ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు. గుడిహత్నూర్ సమీపంలో ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పే ర్కొన్నారు. మావలలోని చావర స్కూల్లో ఏర్పా టు చేసిన రోడ్డు నిబంధనలకు సంబంధించి చిల్డ్రన్స్ అవగాహన పార్క్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా రవా ణాశాఖ అధికారి సీపెల్లి శ్రీనివాస్, భోరజ్ చెక్‌పో స్ట్ ఇన్చార్జి అల్లి శ్రీనివాస్, ఎంవీఐ ప్రదీప్‌కుమార్, ఏఎంవీఐలు రవీందర్, హరింద్రకుమార్, అప ర్ణ, మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మొత్తం అసెస్మెంట్లు : 48,448
ఆస్తిపన్ను డిమాండ్ : రూ.13.96 కోట్లు వసూలు చేసింది : రూ.7.80 కోట్లు ఇంకా మిగిలింది : రూ.6.15 కోట్లు కేటగిరీల వారీగా ఇలా.. మిక్స్డ్ కేటగిరిలో 1,484 అసెస్మెంట్లకు రూ.1.27కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా ఉండగా రూ.కోటి వసూలైంది. ఇంకా రూ.26.32లక్షలు బకాయిలున్నాయి. నాన్రెసిడెన్సీ కేటగిరిలో 5,033 అసెస్మెంట్లకు రూ.3.73కోట్ల పన్ను వసూలు లక్ష్యం ఉండగా రూ.2.56కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.1.16కోట్లు బకాయిలున్నాయి. రెసిడెన్సీ కేటగిరిలో 41,931 అసెస్మెంట్లు ఉండగా రూ.8.96కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉంది. కానీ, రూ.4.73కోట్లు వసూలు కాగా, రూ.4.73కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పన్ను వసూలు చేస్తున్న ఉద్యోగులు (ఫైల్) ప్రయత్నించినా వెనుకబడ్డాం గత ఆర్థిక సంవత్సరంలో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాం. ఆదిశగా ప్రత్యేక బృందాలను నియమించి పట్టణంలోని అన్ని వార్డుల్లో లక్ష్యాలను నిర్దేశించాం. వివిధ కారణాలతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. కిందటేడాది సాధించిన పన్నులకు సమానంగా వసూలు చేయగలిగాం. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి బల్దియాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలి. ఎర్లీబర్డ్ పఽథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆస్తిపన్ను బకాయిల వసూళ్లలో వెనుకబడింది. 2024–25 ఆ ర్థిక సంవత్సర వసూళ్ల గడువు గత మార్చి 31తో ముగిసింది. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేదు. ప్రత్యేక బృందాలను నియమించి వసూళ్లు చేపట్టినా కిందటేడాది కంటే 15శాతం తక్కువగానే వసూలైంది. పెండింగ్ బకాయిలను రాబట్టుకునేందుకు ప్రభుత్వం వడ్డీపై 90శాతం రాయితీ కల్పించినా స్పందన అంతంత మాత్రమే వ చ్చింది. పన్నులను రాబట్టుకోవడంలో బల్దియా అధికారులు విఫలమయ్యారు. ఆస్తి పన్నే కీలకంగా మారినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదిగా బల్దియాకు ఆశించినస్థాయిలో నిధులు రా వడం లేదు. దీంతో పట్టణ పరిధిలో వసూలయ్యే ఆస్తి పన్ను కీలకంగా మారింది. కానీ, పన్నులు వసూలు చేయడంలో బల్దియా యంత్రాంగం వెనుకబడిపోయింది. ఆదిలాబాద్ పట్ట ణ పరిధిలో 48,444 అసెస్మెంట్లు ఉండగా 2024 –25 ఆర్థిక సంవత్సరానికి వాటి ద్వారా రూ.13.96 కోట్లు వసూలవుతాయని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ, అందులో రూ.7.80 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మరో రూ.6.15 కోట్లు బకాయిలుగానే మిగిలిపోయాయి. అదే వడ్డీపై ప్రభుత్వం 90శాతం రాయితీ కల్పించాక పన్ను డిమాండ్ రూ.11.99 కోట్లు కాగా, అందులో రూ.7. 50 కోట్లు వసూలు చేయగలిగారు. వసూళ్లు తగ్గినప్పటికీ డి మాండ్ తగ్గడంతో 8శాతం పన్నులు అదనంగా వ సూలైనట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు త్వరగా రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్చి నెలా ఖరు వరకు వాటిపై విధించే వడ్డీలో 90శాతం రా యితీ కల్పించింది. కానీ, పట్టణ ప్రజలు దీన్ని అంతగా వినియోగించుకోలేదు. కిందటేడాది కంటే తక్కువే.. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే పన్నుల వసూళ్లు భారీగా తగ్గాయి. కిందటేడాది పన్నుల మొత్తం డిమాండ్ రూ.11.72 కోట్లు ఉండగా రూ.8.42 కోట్లు వసూలు చేశారు. మరో రూ.3.3 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉంది. కిందటేడాది కంటే రూ.62లక్షలు తక్కువగానే వసూలయ్యాయి. గతంలో 62 శాతం పన్నులు వసూళ్లు చేయగా ఈసారి 55.90శాతానికే పరిమతమైంది. ఈ ఏడాది15శాతం పన్నులు తక్కువగా వసూలయ్యా యి. పన్నుల వసూళ్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సమగ్ర కుటుంబ సర్వే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సర్వే చేపట్టింది. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆ విధుల్లో నిమగ్నమవడంతో పన్నుల వసూళ్లపై ప్రభావం చూపిందనే అ భిప్రాయాన్ని బల్దియా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మార్చి నెలాఖరులో ప్రత్యేక బృందాలు నియమించి కాలనీల్లో విస్తృతంగా తిప్పినప్పటికీ ఆఽశించిన స్థాయిలో పన్నులు వసూలు కాలేదు. ఉన్నతాధికా రుల పర్యవేక్షణ, బల్దియా అధికారుల అజమాయిషీ లేక వసూళ్లలో వెనుకబడినట్లు చెబుతున్నారు. ఎర్లీబర్డ్‌తో 5శాతం రాయితీ ఆస్తిపన్నును ముందస్తుగా చెల్లించే ప్రజలకు ప్రభుత్వం 5శాతం రాయితీతో కూడిన ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఈ నెలాఖరులోపు చె ల్లించే ప్రజలకు పన్నులో ఐదు శాతం రాయితీ వ ర్తించనుంది. సకాలంలో పన్నులు చెల్లించినట్లయితే రాయితీ పొందడంతో పాటు వడ్డీ భారం నుంచి కూడా తప్పించుకునే అవకాశముంది. 56 శాతమే ఆస్తి పన్ను వసూలు వడ్డీపై రాయితీ కల్పించినా అంతే.. గతేడాది కన్నా 15శాతం తక్కువే బకాయిల వసూళ్లలో వెనుకంజ లక్ష్యం చేరని ఆదిలాబాద్ బల్దియా కేంద్రం నిధులపై సందిగ్ధం 85 శాతం ఆస్తి పన్ను వ సూలు చేసిన మున్సిపాలిటీలకే ఆర్థిక సంఘం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదిలా బాద్ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాలంటే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను డిమాండ్‌లో 85శాతం ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది. కానీ, వడ్డీ మినహాయింపుతో కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో చతికిలపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమిచ్చే ఆ నిధులు విడుదలవుతాయా.. లేదా.. అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థి తి రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లోనూ ఉండటంతో కేంద్రం నిధుల విడుదల నిబంధనలను సవరించే అ వకాశమందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
భానుడి భగభగ
● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● సిరికొండలో 42.7 డిగ్రీలు నమోదు ● ఇళ్లకే పరిమితమవుతున్న జనాలుఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వారంరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. మంగళవారం జిల్లాలోని సిరికొండ మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ధనోరలో 42 డిగ్రీలు, మంచిర్యాలలోని దేవులవాడలో 41.4, నిర్మల్ జిల్లాలోని తానూరులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే మే లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, తెలంగాణ, అంబేడ్కర్, గాంధీచౌక్జనం లేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో జిల్లాలోనే అత్యధికం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం 42.7 డి గ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమి తట్టుకోలేక జనాలు ఇళ్లకే పరిమితమై కూ లర్లు, ఏసీలకు పనిచెబు తున్నారు. ఎండ తీవ్రత ను తట్టుకునేందుకు వ్యాపారులు, ఇతర ప నులకు వెళ్లేవారు శీతలపానీయాలు, కొబ్బరి బోండాలు, నిమ్మకా య సోడా తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులుంటాయి. వా నాకాలంలో ఎక్కువ వర్షాలు కురిస్తే, చలి కాలంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాగే వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా లేనివి ధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అప్రమత్తత అవసరం ఎండలో పని చేసేవారు వడదెబ్బకు గురయ్యే ప్ర మాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లేవారు గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌హిట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని పేర్కొంటున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయట పడతాయని చెబుతున్నారు. శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని, శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నా రు. వృద్ధులు, చిన్నారులకు వేడిగాలి తగిలినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు. జిల్లాలో వారం రోజుల ఉష్ణోగ్రతలు తేదీ కనిష్టం గరిష్టం 1. 22.2 41.3 2. 25.2 41.0 3. 21.7 37.0 4. 24.7 39.8 5. 23.7 36.3 6. 24.2 39.8 7. 24.7 41.3 8. 24.2 42.7జాగ్రత్తలు పాటించాలి రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి. – నరేందర్ రాథోడ్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్అల్లాడుతున్న మూగజీవాలు ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో వాగులు, చెరువులు ఎండిపోయాయి. దీంతో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో నీటి తొట్టెలు ఉన్నప్పటికీ నిరుపయోగమయ్యాయి. పలు స్వచ్ఛంద సంస్థలు అక్కడక్కడా తొట్టెలను ఏర్పాటు చేసి నీటితో నింపుతున్నా పూర్తిస్థాయిలో మూగజీవాల దాహం తీరడంలేదు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జైపూర్: జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన సంధ్యారాణి (40) కుటుంబసభ్యులతో కలసి మంచిర్యాలలోని బంధువుల ఇంటికి వచ్చింది. కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఇందారం క్రాస్‌రోడ్డు వద్ద జైపూర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్టుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని మార్కెట్ యా ర్డు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి పరుగులు తీయడంతో అనుమానం వ చ్చి వారిని వెంబడించగా 210 గ్రాముల గంజా యి లభించింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనంతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. యాక్సిడెంట్ కేసులో నిందితునికి జైలు సోన్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి తొమ్మిది నెలల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నిర్మల్ కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్ మంగళవారం తీర్పునిచ్చారు. 2016లో సోన్ బ్రిడ్జి వద్ద ద్విచ క్ర వాహనం ఢీకొట్టడంతో గంగయ్య మృతి చె ందగా అతని భార్యసంగర్తనకు గాయాలయ్యా యి. ఇందుకు కారణమైన కొండ సంతోశ్గౌ డ్కు న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. 12 డొమెస్టిక్ సిలిండర్ల సీజ్ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని పలు హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, స్వీట్హౌజ్లలో మంగళవారం అధికారులు త నిఖీలు నిర్వహించి 12 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ ప్రేంని వా స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే వాడాలని సూచించారు. -
పూలే జయంతికి ఏర్పాట్లు చేయాలి
ఆదిలాబాద్‌రూరల్: ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని పూలే చౌక్, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలో గల పూలే విగ్రహాల వద్ద నిర్వహించనున్న మహాత్మా జ్యోతిబా పూలే జయంతికి ఏర్పాట్లు చేయాలని బీసీ, మాలీ సంఘాల నేతలు కోరా రు. పూలే జయంతి నిర్వహణపై మంగళవారం జిల్లాలోని బీసీ, మాలీ సంఘాల నేతలతో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తన కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పూలే చౌక్, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలో గల పూలే విగ్రహాల వద్ద ఏర్పాట్లు చే యాలని సూచించారు. జయంతి వేడుకలకు వ చ్చేవారికి రవాణా సౌకర్యం కల్పించాలని కోరా రు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే వే డుకలకు హాజరయ్యే వారికి భోజనం, నీటి వసతి కల్పించాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల కు ముందస్తు ఆహ్వాన పత్రాలు అందించాలని నాయకులు కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చి క్కాల దత్తు, కలాల శ్రీనివాస్, మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే, బీసీ సంఘాల నాయకులు మ్యాకల అశోక్, రవీందర్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
పరీక్షాకేంద్రాల పరిశీలన
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆశ్ర మ గురుకుల పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు గిరిజన శిక్షణ సహాయ పథకం కింద రెండేళ్ల ఇంటర్మీడియట్ (ఎంపీసీ)లో ప్రవేశం, ఉచిత ఐఐటీ, జేఈఈ శిక్షణ కోసం మంగళవారం నిర్వహించిన ఎంపిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ సమావేశ మందిరంలో పరీక్ష నిర్వహించారు. వేసవి కా వడంతో సెంటర్ల వద్ద ఏఎన్ఎంలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. గిరిజన శిక్షణ సహాయ ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ పరీక్షకు 586 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 538 మంది విద్యార్థులు హాజరు కాగా, 48 మంది గైర్హాజరైనట్లు పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. -
టాలెంట్ టెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: అనాధ, నిరుపేద విద్యార్థులు పీపుల్స్ ప్రోగ్రెస్ టెస్ట్‌ను సద్వినియో గం చేసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశో క్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ప్రగతినగర్ పీపుల్స్ ప్రో గ్రెస్ ట్రస్ట్‌లో అడ్మిషన్ పొందేందుకు ఈనెల 24వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులు టాలెంట్ టెస్ట్ రాయాలని తెలిపా రు. 5, 6, 7 తరగతుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వి వరాలకు 94930 01171, 94903 57438 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నాయకులు సురేఖ, సూర్యకుమార్, శ్రీనివా స్, విలాస్, శివన్న, స్వామి, గౌస్ మొయినొద్దీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు మట్కా నిర్వాహకుల అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): జైనథ్ మండలంలోని పూసాయి గ్రామ శివారులో మంగళవారం మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. మంగళవారం జైనథ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై పురుషోత్తం, ఏఎస్సై సిరాజ్ ఖాన్, కానిస్టేబుళ్లు శివాజీ, స్వామి దాడులు నిర్వహించి ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు గంగన్న, తాంసి మండలంలోని హస్నాపూర్‌కు చెందిన రాకేందర్ల నుంచి రూ.4,100 నగదుతో పాటు సెల్‌ఫోన్, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మహారాష్ట్రలోని బోరికి చెందిన గజ్జుకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. జైనథ్ మండలంలో మట్కా, పేకాట, దేశీదారు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే 8712659916, 8712659929 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. -
ప్రదర్శనకు ఎంపికై న చిత్రం
జైపూర్: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఏలూరి శేషబ్రహ్మం కాకతీయ శిల్ప సంపద గురించి తెలుసుకునేందుకు జనవరి 25, 26 తేదీల్లో నిర్వహించిన కాకతీయ టెంపుల్ స్కెచింగ్ స్టడీ టూర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 60 మంది ఆర్టిస్టులు పాల్గొని పలు చిత్రాలు గీశారు. వాటిలో నుంచి ఎంపికై న చిత్రాలతో ఈ నెల 12 నుంచి 14 వరకు మాదాపూర్‌లోని తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన చిత్రకారుడు చిప్పకుర్తి శ్రీనివాస్ కాకతీయ శిల్పసంపదపై గీసిన చిత్రం ప్రదర్శనకు ఎంపికై ంది. మట్కా నిందితుల అరెస్టుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అగ్ని బాబులాల్ అమాయక ప్రజలకు మట్కా చీటీలు అందజేస్తూ పట్టుబడినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తాంసి బస్టాండ్ వద్ద మట్కా చీటీలు రాస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.730 నగదుతో పాటు సెల్‌ఫోన్, మట్కా పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఆన్లైన్ మట్కా నిర్వాహకుడు.. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన మసూద్ ఖాన్ ఆన్లైన్లో మట్కా నిర్వహణ చేస్తున్నాడు. మహారాష్ట్రలోని గుర్లాయికి సంబంధించిన సంస్థకు డబ్బులు పంపిస్తుండగా పట్టుకున్నట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ఫోన్లతో పాటు రూ.5,800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు వివరించారు. -
జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తాం
తలమడుగు: జిల్లాలో లక్ష ఎకరాల వరకు జొ న్న సాగు చేశారని, త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపా రు. మంగళవారం మండలంలోని ఖోడద్ గ్రా మంలో నిర్వహించిన జొన్న పంట కోత ప్ర యోగాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో అమలవుతు న్న ఏఐ బోధన తీరును తెలుసుకున్నారు. వి ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భో జ నం అందించాలని సూచించారు. తహసీల్దార్ రాజ్‌మోహన్, ఈపీవో వెంకటరమణ, ఎంపీడీవో చంద్రశేఖర్, వ్యవసాయాధికారి ప్రమోద్‌రెడ్డి, ఎంఈవో వెంకట్రావు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రం పరిశీలనఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో నిర్వహిస్తున్న పదోతరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని వరంగ ల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈనెల 15 వరకు ప్రక్రియ పూ ర్తి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఇప్పటివరకు 28,726 జవాబు పత్రాల స్పాట్ జరిగిందని, 1,44, 207 పత్రా ల మూల్యాంకనం చేయాల్సి ఉందని తెలిపా రు. పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వే ణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ సో మయ్య, ఉపాధ్యాయ సంఘాల నేతలున్నారు. -
ఢిల్లీలో ఆదివాసీ కళాకారుల ప్రదర్శన
ఇచ్చోడ: ఢిల్లీలో ఆదిలాబాద్ జిల్లా సకల కళా సంక్షేమ సంఘం ఆదివాసీ కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన జయతి జయ భారత్ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ కళాకారులు తమ కళను ప్రదర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలోని విభిన్న సంస్కృతుల కళాకారులను ఆహ్వానించారు. ఈ ప్రదర్శనల్లో సకల కళా సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో కాత్లె అనంద్, గంగోత్రి, రీతులు పాల్గొన్నారు. గంజాయి పట్టివేతఉట్నూర్రూరల్: గంజాయి సాగు చేసినా, సరఫరా చేసినా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇన్చార్జి ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా కరీంనగర్‌కు వెళ్తున్న ఆటోలో ముగ్గురు వ్యక్తులతో పాటు కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదివారం మండలంలోని కుమ్మరితాండ గ్రామపంచాయితీ పరిధిలోని రాముగూడ గ్రామానికి చెందిన కుమ్ర సోనేరావు ఇంటి పెరడులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేశారు. పెరడులో 20 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మొగిలి తెలిపారు. ఇద్దరిపై కేసుబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ షంషీర్‌నగర్‌లో సర్వే నంబర్ 170లోని ప్రభుత్వ భూమిలో ఇళ్లు కడుతున్న ఇద్దరిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎన్.దేవయ్య తెలిపారు. మహబూబీ, అమానుల్లాఖాన్లు అక్రమంగా ఇంటి నిర్మాణం చేస్తుండడంతో కేసు నమోదు చేశామన్నారు. -
● కవితలు, వ్యాసాలు, కథలతో సాహిత్యసేవ ● ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు ● ఆదర్శంగా నిలుస్తున్న రెడ్ల బాలాజీ
నిరుపేద కుటుంబ నేపథ్యం.. ఇలేగాం గ్రామానికి చెందిన రెడ్ల దృపతి –పోశెట్టి దంపతులకు తొమ్మిది మంది పిల్లలు. తొమ్మిదో సంతానంగా రెడ్ల బాలాజీ జన్మించారు. పాఠశాలకు ఇచ్చే సెలవు రోజుల్లో తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు కూలీగా వెళ్లేవారు. ఇలేగాంలో ఐదవ తరగతి వరకు చదివిన బాలాజీ పక్క ఊరు దేగాంలో 6 నుంచి 10వ తరగతి వర కు చదివారు. ఈ ఐదేళ్లపాటు రోజూ ఆరు కిలో మీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లేవారు. భైంసాలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ప్రైవే టు పాఠశాలలో పనిచేస్తూ గుంటూరులో బీఈడీ పూర్తిచేశారు. ఈ క్రమంలోనే పోస్టాఫీసులో బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా ఉద్యోగం సాధించారు. సాహిత్యంపై మక్కువ.. కవితలు, వ్యాసాలు, కథలు రాస్తూ బాలాజీ అందరికి తనలో ఉన్న సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఇప్పటికే ఇలేగాం గ్రామంలో ఉన్న బాపూజీ మహరాజ్ చరిత్ర, గీత శక్తి, వసుధ వాణి, మధుర వాణి, గీతవాణి వంటి ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలకు వాణిశ్రీ పురస్కారం, నంది పురస్కారం, జాతీయ విశ్వశాంతి పురస్కారాలు లభించాయి. పలు వేదికల్లో రెడ్ల బాలాజీకి స్వర్ణ కంకణం, బంగారు పతకం అందించారు. సాహితీ రత్న, ఆదర్శరత్న, గౌతమి కవి శ్రేష్ఠ, కవి సామ్రాట్ వంటి బిరుదులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంలో రాణించిన రెడ్ల బాలాజీకి అప్పటి నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రశంసాపత్రం అందించారు. ఇటీవలే ఆయన రచనలకుగాను డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ప్రముఖ కవి రచయిత డాక్టర్ శ్రీధర్, ప్రముఖ డైరెక్టర్ వి.సముద్ర చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. బాలాజీ తనకు వీలు కలిగినప్పుడల్లా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. చిన్నప్పుడు తానుపడ్డ కష్టాలు, ఎదురైన అనుభవాలు, ఆర్థిక ఇబ్బందులు వివరించి విద్యార్థులకు ధైర్యం చెబుతున్నారు. -
కలెక్టరేట్ ఎదుట వీధి వ్యాపారుల ధర్నా
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు తగు చర్యలు చేపట్టా లని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ డిమాండ్ చేశారు. గణేశ్ థియేటర్ స్థలంలోకి తమ దుకాణాలను మార్చాలనే అధికారుల నిర్ణయాన్ని తప్పుపడుతూ సో మవారం కలెక్టరేట్ ఎదుట వీధి వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనూ వీధి వ్యాపారులను గణేశ్ ఽథియేటర్లోని స్థలా నికి మార్చిన అధికారులు ఆ స్థలాన్ని ము న్సిపల్ అధికారులు లీజుకు ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. మరోసారి తాత్కాలికంగా అదే స్థలంలో అధికారులు వారికి స్థలాలను కేటా యించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అ నంతరం కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, షాకత్ హుస్సేన్, ఖిజర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
కరెన్సీ సేకరణే హాబీగా..
● విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు లక్సెట్టిపేట: మండలంలోని లక్ష్మీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ కరెన్సీ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చినట్లు తెలిసినా, వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు విదేశీయులు కనిపించినా వెంటనే వారి వద్దకు వెళ్లి కరెన్సీని సేకరించి భద్రపరుస్తున్నాడు. ఇప్పటి వరకు తాండూర్, సీతారాంపల్లి, ఆస్నాద్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించగా అక్కడి విద్యార్థులకు వివిధ దేశాల కరెన్సీపై అవగాహన కల్పించారు. కరెన్సీతో పాటు ప్రకృతి, పక్షులు, అందమైన ఫొటోలు తీయడం అతని హాబీగా మార్చుకున్నాడు. 31 దేశాల కరెన్సీ సేకరణ 2008 నుంచి ఇప్పటి వరకు 31 దేశాల కరెన్సీ సేకరించి సేకరించాడు. వివిధ దేశాల కరెన్సీ పేర్లు, వాటి విలువలు విద్యార్థులకు తెలియపర్చేందుకు కరెన్సీని సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నాడు. విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లినా కాంపిటేటివ్ పరీక్షల్లో ఉపయోగకరంగా ఉండేందుకు భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న పాత, కొత్త కరెన్సీలను భద్రపరుస్తున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి కరెన్సీ సేకరించడం, ఫొటోలు తీయడంపై దృష్టి పెడుతున్నాడు. విద్యార్థులకు పాఠాలతో పాటు ప్రకృతి, వాటి విలువలు, కరెన్సీ, ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తున్నాడు. అవగాహన కల్పించేందుకే.. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే వివిధ దేశాల కరెన్సీ సేకరిస్తున్నా. కరెన్సీ సేకరణ, ఫొటోలు తీయడం హాబీగా ఎంచుకున్నా. విద్యార్థులకు పాఠాలతో పాటు కరెన్సీపై అవగాహన కల్పిస్తున్నా. – అనిల్, ఉపాధ్యాయుడు -
ప్రజావాణికి వినతుల వెల్లువ
సాగునీరు విడుదల చేయాలి అయ్యా.. ఈ యేడు సాగు చేసిన పత్తి పంట లో గులాబీరంగు పురుగు ఉధృతి పెరగడంతో ఆ పంటను తొలగించాం. మత్తడివాగు ప్రాజెక్ట్ నీటి ఆధారంగా యాసంగి సీజన్లో జొన్న పంటను సాగు చేశాం. ప్రస్తుతం చివరిదశలో ఉన్న పంటకు నీరు అందకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఉంది. మత్తడివాగు ప్రధాన కాలువ నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించగా ఈ నెల 1నుంచి విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. తమరు స్పందించి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుని పంటలను కాపాడాలి. – జందాపూర్ రైతులు, ఆదిలాబాద్ కైలాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధితాధికారులకు అందజేస్తూ వాటిని పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 111 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే... అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా సత్వరమే పరిష్కరించాలని ఆదేశం -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉట్నూర్‌రూరల్: గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఉట్నూర్ మండలం చాందూరి గ్రామానికి చెందిన పోసుబాయి తనకి ఏదైనా అంగన్వాడీ సెంటర్లో ఉద్యోగం కల్పించాలని, తాండూర్ మండలం గోపాల్‌నగర్ గ్రామానికి చెందిన గట్ల నర్సయ్య తనకి మేకల లోన్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని, నేరిగొండ మండలం కుంటాల గ్రామానికి చెందిన సిడాం లక్ష్మి తనకు ఏదైనా ఆశ్రమ పాఠశాలలో ఆశ వర్కర్ ఉద్యోగం కల్పించాలని కోరారు. వీరితో పాటు పలు గ్రామాల నుంచి వచ్చిన వారు పింఛన్, రెండు పడకల గదుల ఇళ్లు, స్వయం ఉపాది పథకాల మంజూరు, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పించారు. ఏవో దామదర స్వామి, పీవీటీజీ ఏపీవో మెస్రం మనోహర్, పీహెచ్‌వో సందీప్, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘టైగర్ ఫోర్స్’కు సన్నద్ధం
● రాష్ట్రంలో పులుల రక్షణకు చర్యలు ● ‘కవ్వాల్’లోనూ ముప్పులో పెద్దపులులు ● రక్షక దళం ఏర్పాటైతే వేట తగ్గే అవకాశం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పులుల సంరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ టైగర్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో ‘కవ్వాల్’ టైగర్ రిజర్వు మరింత పటిష్టం కాబోతోంది. ఏటా ఉమ్మడి జిల్లా పరిధిలోకి అనేక పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది పులుల వరకు సంచరిస్తున్నాయి. ప్రసిద్ధ బెంగాల్ టైగర్లూ ఇక్కడ సంచరించాయి. కోర్ ఏరియా వరకు వెళ్లకుండా కారిడార్ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా అంధేరి, తిప్పేశ్వర్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యం నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. పెన్‌గంగా, ప్రాణహిత నదులు దాటి ఉమ్మడి జిల్లాలో అడుగుపెడుతున్నాయి. ఈ పులులకు వేట ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ పులులను కాపాడుకోవాలంటే మరింత నిఘా అవసరం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో మొత్తం భౌగోళిక ప్రాంతంలో అటవీ 41.09శాతం విస్తరించి ఉండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 40.24, ఆదిలాబాద్‌లో 29.51, నిర్మల్‌లో 29.83శాతాల్లో విస్తరించి ఉంది. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు’ 2022 రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 115.50, నిర్మల్‌లో 45.34చ.కి.మీ.చొప్పున అటవీ విస్తీర్ణం తగ్గినట్లు తేలింది. ఈ క్రమంలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు టైగర్‌ఫోర్స్ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా అడవుల రక్షణకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా డిమాండ్లు టైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కవ్వాల్ పరిధిలో పులులు ఇతర వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇప్పుడున్న సిబ్బంది, అధికారులకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సరిపడా సిబ్బంది లేమితోపాటు పని ఒత్తిడితో ఉన్నారు. చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఇక పులి సంచారం ఉన్న చోట్ల వేటగాళ్ల నిరోధం, ముప్పు తప్పించేందుకు అటవీ అధికారులు శ్రమించాల్సి వస్తోంది. ప్రతీ ఏటా పులులు ఏదో కారణంగా ఇక్కడ మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్ కంచెలు, వేటతో ప్రమాదంలో పడుతున్నాయి. కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పులులు ప్రాణాలు కోల్పోయాయి. క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా లోపం ఏర్పడుతోంది. పులుల సంరక్షణ కోసమే దళం ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో పులుల సంతతి పెంపునకు ఉపయోగపడనుంది. కవ్వాల్ అభయారణ్యం వివరాలు(చ.కి.మీ) కోర్ 892.23, బఫర్ 1123.21 మొత్తం విస్తీర్ణం: 2015.44 -
తెరపైకి ‘సోయం’
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో బాపూరావు ● అధిష్టానం దృష్టి ఈ మాజీ ఎంపీపై.. ● సీనియర్ కావడంతోపాటు జిల్లాపై పట్టు ● సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరు సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో తాజాగా సోయం బాపురావు పేరు తెరపైకి వచ్చింది.. పార్టీ అధిష్టానం ఈ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సీనియర్ నేతపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంపై సోయం బాపురావుకు పట్టు ఉండడంతో పార్టీ ముఖ్య నేతలు సీరియస్‌గా పరిశీలన చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ వారం రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమైన పదవిలో ఎవరూ లేకపోవడంతో పార్టీకి దిక్సూచి లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలే నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. ఆదిలాబాద్‌కు కంది శ్రీనివాసరెడ్డి, బోథ్‌కు ఆడే గజేందర్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చెందిన ఆత్రం సుగుణ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. అయితే జిల్లాలో పార్టీ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ బాధ్యతలు మోసే జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో కార్యకర్తల్లో తెలియని శూన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవిని త్వరగా భర్తీ చేయాలని పలుమార్లు డిమాండ్ చేయడం, రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతలను కలిసి విన్నవించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికై నా ఎంపిక జరిగేనా.. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇప్పటివరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి వీరి నుంచే ఎవరినైనా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ప్రధానంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. ఈ దిశగా ఆయన కూడా దీనికి సుముఖంగా ఉన్నారనే ప్రచారం పార్టీ కార్యకర్తల్లో జరిగింది. ఆర్థికంగా బలంగా ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందన్న భావన కూడా వ్యక్తమైంది. ఇక మీనాక్షి నిర్ణయమే తరువాయి.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఉన్న సమయంలో ఆ నలుగురి పేర్లు ప్రచారం జరగగా మీనాక్షి నటరాజన్ రాకతో పార్టీలో పూర్తిస్థాయి పరిశీలన మొదలైంది. ఆ తర్వాతే జిల్లా అధ్యక్షుడిని ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. తాజాగా సోయం బాపురావు పేరు తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రధానంగా ప్రస్తుతం రేసులో ఉన్న ముఖ్య నేతలందరి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో చెప్పుకుంటున్నారు. సీనియర్ నేత.. సోయం బాపురావు గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు బీజేపీలో కొనసాగారు. 2019లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2004లో బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సోయం బాపురావు కాంగ్రెస్‌లో చేరడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీని వీడారు. మొత్తంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ప్రస్తుతం పార్టీ ఈ జిల్లాలో సీనియర్ నేతపై దృష్టి సారించడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
నిరంతర ప్రయత్నాలతోనే విమానాశ్రయం ఏర్పాటు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన విమానాశ్రయం ఏర్పాటు నిరంతర ప్రయత్నాలతోనే సాధ్యమైందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మాట్లాడారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారన్నారు. పౌర విమానయాన సేవలతో పాటు వైమానిక శిక్షణా కేంద్రం సైతం ఏర్పాటు కానుందన్నారు. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న 369 ఎకరాలు ఉపయోగించుకునేలా చర్యలు ప్రారంభించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో ఈ అంశం మరింత వేగవంతం కావడం శుభపరిణామమన్నారు. త్వరలోనే ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ సైతం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పలు కారణాలతో నిలిచిపోయిందన్నారు. కొందరు స్థానిక నాయకులు రాజకీయ లబ్ధి కోసం తమ వల్లే విమానాశ్రయం సాధ్యమైందని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాజు, లాలా మున్నా, మయూర్ చంద్ర, నగేశ్, జోగు రవి, వేద వ్యాస్, దినేష్ మటోలియా, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, సుభాష్, రాకేష్, భూమేష్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● కాల్టెక్స్ ఇళ్ల చోరీ కేసు చేధించిన పోలీసులు ● మరో ముగ్గురి కోసం బృందాల గాలింపు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ రవికుమార్ బెల్లంపల్లి: సంచలనం సృష్టించిన బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలోని రెండిళ్లలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి దొంగిలించిన నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఏ.రవికుమార్ వివరాలు వెల్లడించారు. గత నెల 29వ తేదీ తెల్లవారుజామున బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో సాన శ్రావణ్, అత్తె సుధాకర్ ఇళ్లలో అగంతకులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి 14.5 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.20 వేల నగదు, నాలుగు మోటారు సైకిళ్లను దొంగిలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కన్పించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను గజానంద్ పార్థి అని కాల్టెక్స్ ఏరియాలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. మరో ముగ్గురు నిందితులు లాల్జీ, రోషన్, ఘోటియా పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణా జిల్లా కనేరా గ్రామానికి చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఇళ్లలో చోరీ చేసినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. పలు రాష్ట్రాల్లో నిందితులపై కేసులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కూడా చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. నిందితులు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. వీరిపై ఆయా రాష్ట్రాల్లో దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడిని పట్టుకున్న బెల్లంపల్లి రూరల్‌సీఐ అఫ్జలుద్దీన్, టూటౌన్ ఎస్సై కె.మహేందర్, తాళ్ల గురిజాల ఎస్సై సీహెచ్ రమేశ్, నెన్నెల ఎస్సై ప్రసాద్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
సామాన్యుడిపై ఎల్పీజీ భారం
కైలాస్‌నగర్: వంటగ్యాస్ ఽసిలిండర్ ధర మళ్లీ మండింది. ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలతో లబోదిబోమంటున్న సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ ధరను పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఇది వరకు ధరల పెంపు కేవలం సాధారణ కనెక్షన్లకే పరిమితం కాగా తాజాగా ఉజ్వల లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తున్నట్లుగా ప్రకటించింది. పెరిగిన ధర మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.1.44 కోట్ల అదనపు భారం పడనుంది.ఉజ్వల లబ్ధిదారులకు సైతం వర్తింపు..ఇది వరకు వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ గ్యాస్ కనెక్షన్ దా రులకు మాత్రమే పరిమితం చేసేది. కానీ తాజాగా పెంచిన ధరను ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తోంది. ఈ కనెక్షన్లన్నీ కేంద్రం నిరుపేదలకే మంజూరు చేసింది. వాటికి రూ.300 స బ్సిడీ ఇచ్చేది. తాజాగా అలాంటి వారిపైనా భారం మోపింది. ఒకవైపు వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు వాటిపై ఇదివరకు ఇస్తున్న సబ్సిడీ కూడా పూర్తిగా ఎత్తివేసింది. నామమాత్రంగా రూ.47 చొప్పున సబ్సిడీ విడుదల చేస్తోంది. అది కూడా తక్కువగా ఉండటంతో ఆ వినియోగదారులు సైతం దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సబ్సిడీలను రద్దు చేయడం, ఒకేసారి రూ.50 ధర పెంచడంతో వినియోగదారులకు అదనపు భారంగా మారనుంది. కేంద్ర నిర్ణయంపై గ్యాస్ వినియోగదారులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.వినియోగదారులపై తీవ్ర భారంగతేడాది జూన్‌లో కేంద్ర చమురు సంస్థలు వంట గ్యాస్ ధరను రూ.50 పెంచడంతో పాటు వాటిని తక్షణమే అమల్లోకి తెచ్చాయి. అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను పలుమార్లు పెంచినప్పటికీ గృహావసరానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌పై మాత్రం ఎలాంటి అదనపు ధరను పెంచలేదు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం వినియోగదారులపై భారాన్ని మోపేలా రూ.50 అదనంగా వడ్డించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 2,88,346 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు ఒక్కో కనెక్షన్‌పై ఒక సిలిండర్ వినియోగించినా ప్రతీనెల వినియోగదారులపై రూ.1,44,17, 300 అదనపు భారం పడుతోంది. ఒకవైపు నిత్యావసర సరుకులన్నింటి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో పేద, మఽఽధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సిలిండర్ ధర రూ.50 పెంచడంతో వారికి మరింత అదనపు భారంగా మారనుంది.నిన్నటి వరకు ఎల్పీజీ గ్యాస్ ధర : రూ.882తాజాగా పెంపుతో గ్యాస్ ధర రూ.932అదనపు భారమేఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చాలీచాలని జీతాలతో నెట్టుకువస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడం సరికాదు. పెరిగిన ధరలతో మాలాంటి సామాన్యులు ఆర్థికంగా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. గ్యాస్ సబ్సిడీలను ఎత్తివేయడం సరికాదు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.– గాజరి శశికళ, గృహిణి, ఆదిలాబాద్ -
‘పది’ మూల్యాంకనం షురూ
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో స్పాట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15 వరకు ప్రక్రియ కొనసాగనుంది. మొదటి రోజు మూల్యాంకనం ఆలస్యంగా ప్రారంభంకాగా ఒక్కో ఉపాధ్యాయుడికి 20 జవాబు పత్రాలను అందజేశారు. మంగళవారం నుంచి 40 చొప్పున అందించనున్నట్లు డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సౌకర్యం కల్పించారు. అయితే స్పాట్ కోసం 479 మంది ఏఈలకు ఉత్తర్వులు జారీ చేయగా 448 మంది, 82 మంది సీఈలకు గానూ 78 మంది రిపోర్టు చేశారు. 164 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గానూ 78 మంది విధులకు హాజరైనట్లు డీఈవో పేర్కొన్నారు. సాంఘిక శాస్త్రం, స్పెషల్ అసిస్టెంట్ల కొరత కొంత ఉందని, మిగతా సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు హాజరైనట్లు పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు అనారోగ్యం, వివిధ కారణాలతో స్పాట్ విధులకు హాజరు కాలేమని డీఈవోను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఆయా సంఘాల నాయకులు స్పాట్‌కు సంబంధించి మినహాయింపు, వివిధ సమస్యలపై డీఈవోకు విన్నవించారు. స్పాట్ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జిగా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్‌అర్బన్ ఎంఈవో సోమయ్య వ్యవహరించారు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం చేపట్టనున్నట్లు తెలిపారు. మూల్యాంకనం సమయంలో సెల్‌ఫోన్ వెంట ఉంచుకోవద్దని సూచించారు. -
మరో తడిపై రైతుల ఆశలు
● రేపటి వరకు ఏడు తడులు పూర్తి ● పొట్టదశలో వరి పంట ● యాసంగి సాగు ఆలస్యంతో సమస్య ● ఆందోళనలో సదర్మట్ ఆయకట్టు రైతులు కడెం: సదర్మట్ ఆయకట్టు ద్వారా ఖానాపూర్, కడెం మండలాలకు ఏటా ఏడు తడుల నీటిని వారబందీ పద్దతిన అధికారులు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 9తో ఏడు తడులు పూర్తికావడంతో నీటి విడుదల నిలిపివేయనున్నారు. ఈనేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్టదశలో ఉందని ఈసమయంలో సాగు నీటిని అందించకుంటే పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. ఆయకట్టుకు మరోతడి సాగు నీరు అందించి పంటను కాపాడాలని వేడుకుంటున్నారు. కాగా సదర్మట్ ఆయకట్టు ద్వారా ఖానాపూర్, కడెం మండలాల్లో 13వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈఏడాది యాసంగిలో నాట్లు కాస్త ఆలస్యం కావడంతో సాగు నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఏడు తడులు.. సదర్మట్ ఆయకట్టుకు జనవరి 2 నుంచి వారబందీ పద్ధతిన (ఏడు రోజులు నీటి విడుదల, ఎనిమిది రోజులు నిలిపివేత) ఏప్రిల్ 9వరకు ఏడు తడుల నీటిని అందిస్తున్నారు. సదర్మట్ కేటాయించింది 600 క్యూసెక్కులు కాగ, పైనుంచి మాత్రం 360, 450 క్యూసెక్కుల చొప్పున నీటిని మాత్రమే విడుదల చేశారు. దీంతో కడెం మండలంలోని పాతమద్దిపడగ, కొత్తమద్దిపడగ, పెద్దూర్, వకీల్‌నగర్, చిట్యాల్ తదితర గ్రామాలకు సక్రమంగా సాగునీరందక కొన్ని చోట్ల పంటలు ఎండిపోయాయి. ఇటీవల ఆయకట్టును పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్ ఏప్రిల్ చివరి వరకు సాగు నీరందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎస్సార్ఎస్పీలో నీటిమట్టం తగ్గడంతో తాగునీటి అవసరాల దష్ట్యా మరో తడిని అందిస్తారో లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, నీటిపారుదల శాఖ సీఈ స్పందించి మరో తడిని అందించాలని రైతులు వేడుకుంటున్నారు.సదర్మట్ ఆనకట్ట -
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్: వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు బీఎస్ఎన్ఎల్ ఏరియా డివిజనల్ ఇంజనీర్ ఎస్.శివనాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సోమవారం వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఎస్డీఈ చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంఎన్‌పీ, సిగ్నల్, కనెక్టివిటీ, ఇంటర్నెట్, టెలిఫోన్ బిల్లులకు సంబంధించిన సమస్యలపై వినియోగదారులు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ‘మేము వింటాం –మేము మెరుగుపరుస్తాం’ నినాదంతో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రానికి వచ్చిన 25 ఫిర్యాదులలో 20 పరిష్కరించగా ఐదింటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈనెల 8, 16, 23 తేదీల్లో నిర్మల్, 9, 28న కాగజ్‌నగర్, 11, 25, 29 తేదీల్లో మంచిర్యాల, 12, 24 తేదీల్లో ఖానాపూర్, 15, 21న బెల్లంపల్లి, 17, 26 తేదీల్లో ఆసిఫాబాద్, 19, 30 తేదీల్లో భైంసాలలో సేవాకేంద్రాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏజీఎం ఎన్.రంజిత్, ఎస్డీఈలు, జేటీవోలు పాల్గొన్నారు. -
‘నీతి ఆయోగ్’లో నార్నూర్ ముందంజ
నార్నూర్: నీతి ఆయోగ్ ‘ఆకాంక్ష’ బ్లాక్‌లో నార్నూర్ మండలం ఎంపికై అభివృద్ధి సాధిస్తుందని, మొదటి 30 బ్లాక్లల్లో మొదటి స్థానంలో ఉందని ఆకాంక్ష డైరెక్టర్ మనోజ్సింగ్ బోరా అన్నారు. ఆయన సోమవారం తన బృందంతో కలిసి మండలంలోని జామ్డా, గుంజాల గ్రామాల్లో పర్యటించారు. జామ్డాలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన బృందం సందర్శించింది. విద్యార్థినులు వీక్షిస్తున్న డిజిటల్ తరగతులను బృందం డైరెక్టర్ మనోజ్సింగ్బోరా పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధులు అనిల్ చహ్వాణ్, కే బాషా, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డిప్యూటీ సీఈవో రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, పీడీ మిల్కా, సీడీపీవో శారద, సూపరింటెండెంట్ గంగాసింగ్ రాథోడ్, ఎంపీవో సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్రవాహనం దొంగ పట్టివేత
ముధోల్: మండల కేంద్రంలోని స్థానిక కాల్వగల్లీలో ద్విచక్రవాహనం దొంగతనం చేసిన వ్యక్తిని కాలనీవాసులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కాల్వగల్లీలో ఉన్న హనుమాన్ ఆలయంలో హుండీ దొంగతనం చేసేందుకు దొంగ విఫలయత్నం చేశాడు. అనంతరం అదే గల్లీలో ఉన్న ద్విచక్రవాహనాన్ని దొంగిలించి వెళ్తుండగా కాలనీవాసులు పట్టుకున్నారు. ఎస్సై సంజీవ్‌కుమార్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారికి కాలనీవాసులు దొంగను అప్పగించారు. దొంగను బాసర మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
ఆదిలాబాద్: హిందూ ధర్మ పరిరక్షణకు పా టుపడాలని సనాతన హిందూ ఉత్సవ సమి తి జిల్లా అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ ఖత్రి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎంప్లాయీస్ కాలనీలో ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుకుని శ్రీరామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్ర తీ ప్రాంతంలో శ్రీరాముని ఆలయాల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సనాతన హిందూ ఉత్సవ సమితి తరఫున అన్ని విధాలా సహా య, సహకారాలు అందిస్తామని చెప్పారు. రామ్ మందిర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నందకుమార్, ప్రధాన కార్యదర్శి రాథోడ్ బాబూలాల్, దశరథ పటేల్, సమితి కార్యని ర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, శర్మా జీ, షిండే, కాలనీవాసులు పాల్గొన్నారు. -
ఘనంగా సీఆర్ఆర్ జయంతి
కై లాస్‌నగర్: మాజీ మంత్రి చిల్కూరి రాంచంద్రారెడ్డి జయంతిని జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లోగల ఆయన నివాసంలో ఆది వారం నిర్వహించారు. డీసీసీ మాజీ అధ్యక్షు డు సాజీద్‌ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ అల్లూ రి సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొని సీఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఎమ్మెల్యేగా, మంత్రి గా ఆయన ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. సీఆర్ఆర్ను ఆదర్శంగా తీ సుకుని ఆయన ఆశయసాధనకు కృషి చే యాలని కోరారు. నాయకులు దిగంబర్రా వు పాటిల్, అంబకంటి అశోక్, చిల్కూరి లక్ష్మారెడ్డి, సలీమొద్దీన్ తదితరులున్నారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. ఆదిలాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. 725 మందికి విధులు కేటాయింపు లక్షా 75వేల జవాబు పత్రాలు మూల్యాంకనానికి వచ్చినట్లు డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, పరీక్షల విభా గం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలి పారు. 725 మంది ఉపాధ్యాయులకు విధులు కే టాయించినట్లు పేర్కొన్నారు. అదనంగా 30 శా తం మందికి విధులు కేటాయించినట్లు తెలిపా రు. 561 మందిని ఏఈలు, సీఈలుగా, ఏడుగురిని అసిస్టెంట్ ఏసీవోలుగా, 164 మందిని స్పెష ల్ అసిస్టెంట్లుగా నియమించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు 169 మంది సీఈలు, ఏఈలు, 49 మంది స్పెషల్ అసిస్టెంట్లకు అదనంగా విధులు కేటాయించినట్లు వివరించారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈవో, స్ట్రాంగ్ రూమ్ అధికారిగా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్‌అర్బన్ ఎంఈవో కేంద్రంలో విధులు నిర్వర్తించనున్నారు. కేంద్రంలోని సౌకర్యాలు మూల్యాంకనం కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స కోసం ఏఎన్ఎం, వైద్య సిబ్బంది, మందులు అందుబా టులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రక్రియనిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూల్యాంకనం నిర్వహించే గదుల్లో లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 40 పేపర్లు ఇవ్వనున్నారు. కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకురావద్దని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
బెట్టింగ్ నిర్వహిస్తే చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: జిల్లాలో బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపా రు. బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం నలుగురి పై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఐ పీఎల్ బెట్టింగ్ నిర్వహించే వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్లో బెట్టింగ్ నిర్వహిస్తూ ఒకరు పట్టుబడినట్లు పేర్కొన్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న మహారా ష్ట్రలోని కిన్వట్‌కు చెందిన ఆరిఫ్, లడ్డూ చౌహా న్పై కేసు నమోదు చేసి వీరి నుంచి మొబైల్ ఫో న్, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పిట్టలవాడకు చెందిన గంథాడే సోహన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా మా వల పార్క్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. అత ని నుంచి మొబైల్, రూ.5వేలు స్వాధీనం చేసుకుని మావల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భుక్తాపూర్‌లో ఖిల్లా ప్రాంతానికి చెందిన సుల్తాన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్రమత్తతే ఆయుధం అప్రమత్తతే ఆయుధమని ఎస్పీ అఖిల్ మహాజ న్ పేర్కొన్నారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల వివరాలను ఆదివా రం వెల్లడించారు. ఆన్లైన్లో థర్డ్ పార్టీ యా ప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా జాగ్రత్తపడాలని సూచించారు. సైబర్ నేరాలు, క్రిప్టో కాయిన్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డిజిటల్ అరెస్ట్, లోన్ అప్ ఫ్రైడ్, స్టాక్ మార్కెటింగ్‌లో అపరిచిత వ్య క్తులతో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్స్, నకిలీ వెబ్‌సైట్‌పై అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని వివరించారు. మావల, టూటౌన్, తాంసి, బజార్హత్నూర్ ఠాణాల పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల గురించి వివరించారు. -
● రిజిస్ట్రేషన్లు పెరిగినా తగ్గిన ఆదాయం ● గతేడాది కంటే రూ.14.61కోట్ల లోటు ● ‘రియల్’ వ్యాపారం పడిపోయినందునే.. ● ప్రభావం చూపిన ఎల్ఆర్ఎస్ నిబంధన
ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కైలాస్‌నగర్: ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీ లకమైన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రెండేళ్లుగా త గ్గుతూ వస్తోంది. ప్రధానంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు రాబడి భారీగా తగ్గింది. గతేడాదితో పోల్చితే ఈసారి రూ.14.61 కోట్ల ఆదాయం తక్కువైంది. రియల్ ఎస్టేట్ వ్యాపా రం భారీగా పడిపోవడం, ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయకూడదనే ప్రభుత్వ నిబంధన రాబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగినా.. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను 13,966 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.45,53,63,701 ఆదా యం సమకూరింది. గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 13,307 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.60,15,52,152 ఆదా యం చేకూరింది. ఈ లెక్కన గతేడాది కంటే 659 ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగినా రూ.14,61,88451 ఆదాయం తక్కువగా వచ్చింది. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్ల సందడి ఉంటుంది. బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయ పంటల ఉత్పత్తుల సీజన్లోనే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయి. మిగతా సమయాల్లో నామమాత్రంగా ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు కార్యాలయాల్లోనూ గతేడాది కంటే రిజిస్ట్రేషన్లు కాస్త పెరిగాయి. ఆదిలాబాద్‌లో 439 రిజిస్ట్రేషన్లు పెరగగా ఆదా యం మాత్రం రూ.14.61 కోట్లు తక్కువగా వచ్చింది. బోథ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 220 రిజిస్ట్రేషన్లు పెరగగా రూ.72.82లక్షల ఆదాయం అధికంగా వచ్చింది. ఇక్కడ గతేడాదితో పోల్చితే ఈసారి రిజిస్ట్రేషన్లు పెరగడంతో పాటు వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. ‘రియల్’ వ్యాపారం పడిపోవడంతోనేజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో ఆశించిన స్థాయిలో జరగలేదు. భూములు, ప్లాట్ల క్రయ, విక్రయాలు మందగించాయి. దీనికి తోడు ఎల్ఆర్ఎస్ లేని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దనే ప్రభుత్వ నిబంధనతో రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో జరగలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ప్రభుత్వం అక్రమ లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ను 25శాతం ఫీజు రాయితీతో అమలు చేయగా రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. 2020లో రూ.వెయ్యి చెల్లించి అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. దీంతో గతేడాది కంటే రిజిస్ట్రేషన్లు కాస్త పెరిగాయి. అప్పటి మార్కెట్ విలువ ప్రకారంగానే రిజిస్ట్రేషన్లు చేయగా ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. దీనికి తోడు డీటీసీపీ అనుమతి కలిగిన లేఅవుట్లలోని ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలూ రిజిస్ట్రేషన్ల శాఖపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంవత్సరాల వారీగా జరిగిన రిజిస్ట్రేషన్లు, వచ్చిన ఆదాయం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఆదాయం (రూపాయల్లో) ఆదిలాబాద్ 2022–23 10,766 72,10,07,999 ఆదిలాబాద్ 2023–24 12,294 60,15,52,152 ఆదిలాబాద్ 2024–25 12,733 45,53,63,701 బోథ్ 2022–23 1,503 7,70,63,740 బోథ్ 2023–24 1,013 2,19,67,476 బోథ్ 2024–25 1,233 2,91,49,819ఎల్ఆర్ఎస్ నిబంధనే కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పడిపోవడంతో ప్లాట్ల క్రయ, విక్రయాలు గతేడాది ఆశించిన స్థాయిలో జరగలేదు. డీటీసీపీ అనుమతి లేని ప్లాట్లు, ఎల్ఆర్ఎస్ చెల్లించని వాటికి రిజిస్ట్రేషన్లు చేయవద్దనే ప్రభుత్వ ఆదేశాలు కూడా రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపాయి. గత ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారంగానే రిజిస్ట్రేషన్లు చేయగా ఆశించిన స్థాయిలో ఆదాయం చేకూరలేదు. – విజయ్‌కాంత్‌రావు, సబ్ రిజిస్ట్రార్–1, ఆదిలాబాద్ సంవత్సరాల వారీగా జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సంవత్సరం ప్లాట్లు ఇండ్లు ఇంటిస్థలాలు ఆదిలాబాద్ 2022–23 158 3,257 7,351 ఆదిలాబాద్ 2023–24 104 3,418 8,772 ఆదిలాబాద్ 2024–25 152 5,756 6,825 బోథ్ 2022–23 1 377 1,125 బోథ్ 2023–24 0 561 452 బోథ్ 2024–25 0 786 447 -
దేశ సమగ్రతకు బీజేపీ కృషి
ఆదిలాబాద్: దేశ సమగ్రతకు బీజేపీ ఎంతగా నో కృషి చేస్తోందని ఎంపీ గోడం నగేశ్ పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినో త్సవాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరిందని, భవిష్యత్‌లో మ రిన్ని సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఎమ్మెల్యే పా యల్ శంకర్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా ఎదిగిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధి కారంలోకి వస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పా రు. ఈ దిశగా కార్యకర్తలంతా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్ర హ్మానంద్, నాయకులు తాటిపెల్లి రాజు, ఆ కుల ప్రవీణ్ వేదవ్యాస్, మహేందర్, లాలా మున్నా, ధోని జ్యోతి, సంతోష్, కృష్ణయాద వ్, భూమేశ్, చంద్రకాంత్, అశోక్‌రెడ్డి, భూ మన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
పరస్పర బదిలీలకు మోక్షం
● 28 మంది టీచర్లకు స్థానచలనం ● 24న విధుల్లో చేరాలని ఆదేశంఆదిలాబాద్టౌన్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొందరు 317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు బది లీపై వెళ్లిన విషయం తెలిసిందే. అనారోగ్యం, కు టుంబానికి దూరంగా ఉంటూ కొందరు ఇతర జి ల్లాల్లో పని చేస్తున్నారు. ఇంకొందరు కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు నిత్యం రాకపోకలు సాగిస్తూ మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివారికి గత డిసెంబర్లో పరస్పర బదిలీల కు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో 28 మంది దరఖాస్తు చేసుకోగా మార్చి 28న బదిలీల ఉత్తర్వులు విడుదల చేసింది. 28 మంది బదిలీ.. పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని 28 మంది ఉపాధ్యాయులు ఈనెల 24న వారు ఎంపిక చేసుకున్న జిల్లాలో విధుల్లో చేరాల్సి ఉంది. 14 మంది ఎస్జీటీలు, తొమ్మిది మంది స్కూల్ అసిస్టెంట్లు, ఒక ఫిజికల్ డైరెక్టర్, మరో మినిస్టీరియల్ స్టాఫ్ ఉద్యోగికి స్థానచలనం జరగనుంది. ఎస్జీటీ విభాగంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆది లాబాద్ జిల్లాకు 13 మంది రానుండగా, ఇక్కడి నుంచి అదే సంఖ్యలో ఆ జిల్లాకు వెళ్లనున్నారు. నిర్మ ల్ జిల్లాకు ఒక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు నలుగురు, నిర్మల్ జిల్లాకు నలుగురు, మంచిర్యాల జిల్లాకు ఒకరు వెళ్లనున్నా రు. అక్కడి నుంచి తొమ్మిది మంది ఇక్కడికి రానున్నారు. మంచిర్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ ఆది లాబాద్ డీఈవో కార్యాలయానికి రానుండగా, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగి మంచిర్యాల జిల్లాకు వెళ్లనున్నారు. కాగా, ఇటీవల జరిగిన స్పౌజ్ బదిలీ ల్లో జిల్లాకు 38 మంది ఉపాధ్యాయులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. కోరుకున్న జిల్లాకు వెళ్లేందుకు.. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జి ల్లాల్లో ఉండలేక, నిత్యం జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు కోరుకు న్న జిల్లాకు వెళ్లేందుకు రూ.10లక్షల నుంచి గరిష్టంగా రూ.20లక్షల వరకు వెచ్చించినట్లు సమాచారం. ఇందుకు పైరవీ కారులు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. పరస్పర బదిలీల్లో జిల్లాకు వచ్చేవారి సర్వీస్ జీవోగా పరిగణించబడుతుందని విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయ మై జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా, 28 మంది ఉపాధ్యాయులతో పాటు ఒక సీని యర్ అసిస్టెంట్‌కు పరస్పర బదిలీలు జరిగినట్లు వివరించారు. ఈ విద్యాసంవత్సరం చివరిరోజున దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు పేర్కొన్నారు. -
వ్యాపార అభివృద్ధికి దోహదం
ఆదిలాబాద్‌కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుండగా ప్రస్తుతం అనేక బహుళజాతి కంపెనీల కిరాణా, వస్త్ర సంస్థలు ఇక్కడికి రానున్నాయి. ఇప్పటికే ఇండియన్ నేషనల్ మార్ట్ ఏర్పాటు కాగా, త్వరలో డీ మార్ట్‌ను మావలలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. దస్నాపూర్‌లో జుడియో వస్త్ర, కాస్మొటిక్ సంస్థ భారీ మాల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి పనులూ మొదలయ్యాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను రవితేజ సమీపంలోని స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా కిసాన్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. -
మామిడిగూడ.. ఏదీ నీటి జాడ
● నెలరోజులుగా నిలిచిన ‘భగీరథ’ ● గ్రామాల్లో తీరని తాగునీటి వ్యథ ● వ్యవసాయ బావి నీరే ఆధారం ● నడవాల్సిందే కిలోమీటర్ల దూరంపట్టించుకుంటలేరు నీటి సమస్య గురించి ఎవరికి తెలిపినా పట్టించుకుంటలేరు. ఎండాకాలం వస్తే చాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. జిల్లా అధికా రులు వెంటనే దృష్టి సారించి గ్రామంలో నెలకొ న్న తాగునీటి సమస్య పరిష్కరించాలి. ఇకముందు సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – సెడ్మాకి భీంరావ్ చాలా కష్టమవుతోంది ప్రతీ సంవత్సరం వేసవి వస్తే చాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. గ్రామ సమీపంలో ఎక్కడా నీటి సౌకర్యం లేదు. వ్యవసాయ పనులు మాని సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావి నుంచి నీటిని తీసుకువచ్చి తాగుతున్నాం. చాలా కష్టమవుతోంది. – సెడ్మాకి సీతాబాయి ఇప్పటివరకు ‘భగీరథ’ రాలే.. మా గ్రామానికి ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రాలేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావుల నీటిని తాగుతున్నాం. భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్లలో చుక్క నీరు లేదు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావి నుంచి ఎడ్లబండ్లు, బిందెలతో నీటిని తెచ్చుకుంటున్నం. – మెస్రం నాగోరావ్ఇంద్రవెల్లి: మండలంలోని మామిడిగూడ (జి), (బి) గ్రామాల ప్రజలు తాగునీటికి తండ్లాడుతున్నా రు. ఇప్పటివరకు ఈ గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా లేదు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి గ్రామాల్లోని నీటి పథకాల ద్వారా నీటి సరఫరా నిలిచింది. తాగునీటి కోసం ఈ రెండు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు గ్రామాలకు దూరంగా ఉన్న ఓ వ్యవసాయ బోరు నుంచి పైపులైన్ వేసి ట్యాంక్‌ను నీటితో నింపుకొనేవారు. ఈ నీటిని వినియోగించుకున్న వీరికి వేసవి శాపంగా మారింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరు నుంచి చుక్క నీరు రావడం లేదు. ఈ గ్రామాల సమీపంలోని వ్యవసాయ బావుల్లోనూ నీరు అడుగంటింది. దీంతో చేసేది లేక రెండు కిలోమీటర్ల దూరంలోని పిట్టబొంగరం గ్రామానికి చెందిన ఉయిక గోవింద్ వ్యవసాయ బావినీటిని ఎడ్లబండ్లు, బిందెలతో తె చ్చుకుంటున్నారు. గ్రామంలో ఏర్పడిన నీటి సమ స్య కారణంగా వ్యవసాయ పనులు మానేయాల్సి వచ్చిందని గ్రామాలకు చెందిన ఆదివాసీలు చెబుతున్నారు. ప్రతీ వేసవిలో సమస్య ఎదుర్కొంటున్న తాము ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులకు గోడు వినిపించుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమ నీటి కష్టాలు తీర్చాలని మామిడిగూడ(జి), మామిడిగూడ (బి) ప్రజలు వేడుకుంటున్నారు. -
బాధ్యతగా వ్యవహరించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● దాబా హోటళ్ల యజమానులతో ప్రత్యేక సమావేశంగుడిహత్నూర్: జిల్లాలోని జాతీయ, అంతర్రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న దాబా హో టళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేష న్లో జిల్లాలోని దాబా యజమానులతో స మావేశమై మాట్లాడారు. దాబాల్లో మద్యం, గంజాయి, అఫీం అమ్మడంతో పాటు అక్క డే సేవించడానికి అనుమతి ఇవ్వడం నేరమని పేర్కొన్నారు. దాబాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ లేని దాబాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేవాత్ దాబా అంటూ ఒకే పేరుతో నడుస్తున్న దాబాలపై ప్రత్యేక ని ఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా దాబాల యజమానులు జాగ్రత్తగా ఉండాల ని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాల ని సూచించారు. జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఎలాంటి అసాంఘిక చర్యలు జరిగినా దాబాలోని సీసీ ఫుటేజీల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ నాగేందర్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిపన్ను @ 90.43%
● 243 పంచాయతీల్లో శతశాతం ● సమస్యల పరిష్కారానికి దోహదం కైలాస్‌నగర్: ఏడాది క్రితమే గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియగా నిధుల లేమితో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అ భివృద్ధి కుంటుపడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థికసంఘం నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరకొరగానే అందుతున్నాయి. దీంతో పంచాయతీల్లోని సమస్యలు పరిష్కరించుకోవడం కార్యదర్శులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆశించినస్థాయిలోనే వసూలు చేయగలిగారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో తీరి కలేకుండా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి 90శాతం పన్ను వసూలు చేశారు. జిల్లాలో 473 గ్రామపంచాయతీలుండగా 243 పంచాయతీల్లో శతశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిచారు. నిధుల లేమితో సతమతమవుతున్న పంచాయతీలకు ఇంటిపన్ను రూపంలో సమకూరిన ఆదాయం చిన్నపాటి సమస్యలు పరిష్కరించుకునేందుకు ఉపయోగపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదర్శంగా జైనథ్.. ఇంటిపన్ను వసూళ్లలో జైనథ్ మండలం ఆదర్శంగా నిలిచింది. ఈ మండలంలో 17 గ్రామపంచా యతీలుండగా 16 పంచాయతీలు వందశాతం పన్నులు వసూలు చేశాయి. పంచాయతీ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిన కార్యదర్శులు లక్ష్యాన్ని సాధించి మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు. చిన్న సమస్యల పరిష్కారానికి.. పంచాయతీ ఖజానా ఖాళీగా ఉండటంతో పల్లెపాలన కార్యదర్శులకు పెనుభారంగా మారుతోంది. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంది. ఏడాదిగా పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు రాకపోవడంతో కార్యదర్శులే అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటం, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీటి ఎద్దడి వారికి చాలెంజ్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిపన్ను రూపంలో సమకూరిన ఆదాయంతో ఇలాంటి చిన్నపాటి సమస్యలు పరిష్కరించుకునేందుకు తోడ్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అట్టడుగున ఉట్నూర్.. అత్యధిక గ్రామపంచాయతీలు కలిగిన ఉ ట్నూర్ మండలం ఇంటిపన్ను వసూళ్లలో వె నుకబడి అట్టడుగుస్థానంలో ఉంది. ఈ మండలంలో 38 గ్రామపంచాయతీలుండగా 12 పంచాయతీలు మాత్రమే వందశా తం పన్నులు వసూలు చేశాయి. మరో 26 పంచాయతీలు పన్నుల వసూళ్లలో వెనుకబడ్డాయి. అదే ఏజెన్సీ ప్రాంతమైన నార్నూ ర్ మండలం కూడా భేష్ అనిపించుకుంది. ఈ మండలంలో 23 పంచాయతీలుండగా ఇందులో 20 పంచాయతీలు వందశాతం పన్నులు వసూలు చేశాయి. పక్కనే ఉన్న ఏజెన్సీ మండలమైన ఉట్నూర్ పూర్తిగా వెనుకబడిపోగా నార్నూర్ ఆశించిన స్థాయి కంటే అధికంగా వసూలు చేసి జిల్లాలో లక్ష్యసాధనలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. తలమడుగు మండల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉండే ఈ మండలం పన్నుల వసూలుపై అంతగా దృష్టి సారించలేదు. 29 పంచాయతీలకు ఏడు పంచాయతీలు మాత్ర మే వందశాతం పన్నులు వసూలు చేయడం అక్కడి కార్యదర్శుల పనితీరుకు అద్దం పడుతోంది. 22 గ్రామపంచాయతీలు వెనుకబడిపోవడం గమనార్హం. మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో ఇంటి పన్ను వివరాలు మొత్తం పంచాయతీలు : 473 పన్నుల డిమాండ్ : రూ.6,73,94,906 వసూలు చేసింది : రూ.6,09,48,138 శాతం : 90.43 ఇంకా మిగిలింది : రూ.66,46,768 మండలం పంచాయతీలు వందశాతం వసూలు చేసినవి ఆదిలాబాద్ 31 15 బజార్హత్నూర్ 31 17 బేల 31 14 భీంపూర్ 26 18 బోథ్ 21 7 భోరజ్ 17 9 గుడిహత్నూర్ 26 19 ఇచ్చోడ 33 12 జైనథ్ 17 16 మావల 3 1 నేరడిగొండ 32 11 సాత్నాల 17 11 సిరికొండ 18 7 సొనాల 12 3 తలమడుగు 29 7 తాంసి 14 8 గాదిగూడ 25 20 ఇంద్రవెల్లి 29 16 నార్నూర్ 23 20 ఉట్నూర్ 38 12 -
జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలి
ఆదిలాబాద్‌రూరల్: ప్రతి ఒక్కరూ జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్ రా జర్షిషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలోని, జగ్జీవన్‌రామ్ చౌక్‌లోని ఆయన వి గ్రహం, చిత్రపటానికి కలెక్టర్‌తోపాటు ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ సేవలను కొనియడారు. అ నంతరం ఎస్టీయూ భవనంలో ఏర్పాటు చే సిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నే టితరం విద్యార్ధులు జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తి గా తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో వి నోద్‌కుమార్, దళితాభివృద్ధి, కార్పొరేషన్ అ ధికారులు సునీతాకుమారి, మనోహర్, ము న్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, డీఎస్పీ జీ వన్‌రెడ్డి, దళిత సంఘాల నాయకులు మ ల్యాల భాస్కర్, సాయి, మనోజ్, మల్లేశ్, అ ల్లూరి భూమన్న, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీరామనవమికి సర్వం సిద్ధం
ఆదిలాబాద్: శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యా యి. ఆదివారం ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు, తిరుపెల్లి కాలనీలోని శ్రీరా మాలయం, శాంతినగర్ శ్రీకోదండ రామాలయం, విద్యానగర్ శ్రీదాసాంజనేయ స్వామి ఆలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి ఆదివారం సాయంత్రం భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇస్కాన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మధుర జిన్నింగ్‌లో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. -
తుదిదశకు పిట్‌లైన్
ఆదిలాబాద్‌లో పిట్‌లైన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రూ.17.90 కోట్ల అంచనా వ్యయంతో 24 కోచ్‌లతో దీని నిర్మాణం సాగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ రైల్వే డివిజన్ పరి ధిలోకి వచ్చే ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాను న్న రోజుల్లో పలు రైళ్ల రాకపోకలకు ఈ పిట్‌లైన్ దోహదపడనుంది. ప్రధానంగా పిట్‌లైన్ ఏర్పాటుతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల కోచ్‌ల ప్రాథమిక నిర్వహణ ఇక్కడే జరగనుంది. పగలు, రాత్రి రైల్వే కోచ్‌ల తనిఖీలు, క్లీనింగ్, చార్జింగ్ చేస్తారు. దీని ఏర్పాటుతో పలు రైళ్ల గమ్యస్థానం ఆదిలాబాద్ నుంచే మొదలయ్యే ఆస్కారముంటుంది. ఇప్పటి కే నాందేడ్ స్టేషన్‌కు వచ్చే రైళ్ల రద్దీ పెరిగిపోగా వా టిని ఇతర స్టేషన్లకు పొడిగించాలనే డిమాండ్ ఉంది. ఆదిలాబాద్‌కు ఆ రైళ్లను పొడిగించాలని ఏళ్లుగా పౌరసమాజ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
మాడిఫైడ్ సైలెన్సర్లు వద్దు
ఆదిలాబాద్‌టౌన్: మాడిఫైడ్ సైలెన్సర్లు బిగిస్తే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు కూ డళ్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. 50 వాహనాల సైలెన్సర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కొందరు వాహనదారులు భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లను ఏర్పా టు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని తె లిపారు. అలాంటి వాహనాలను సీజ్ చేసి, పబ్లి క్ న్యూసెన్స్, ఎంవీ యాక్ట్, పట్టణ మిషన్స్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ సీఐ ప్రణయ్, సిబ్బంది ఉన్నారు. -
నీటి సమస్య పరిష్కరించాలని రాస్తారోకో
నార్నూర్: నీటి సమస్య పరిష్కరించాలని శుక్రవా రం మండల కేంద్రంలోని విజయ్‌నగర్ కాలనీవా సులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 20 రోజులుగా మి షన్ భగీరథ నీరు రాక ఇబ్బంది పడుతున్నా ఎవ రూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికా రులు వచ్చి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. నూతన ట్యాంక్‌కు కనెక్షన్ ఇచ్చి రెండురోజు ల్లో పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తామని, అప్పటివరకు వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చే స్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. వీరికి ప్యాక్స్ చైర్మన్ ఆడే సురేశ్ మద్దతు తెలిపారు. బాబూలాల్, గుణవంత్‌రావ్, ప్రవీణ్, దేవిదాస్, ర వీందర్, ఊర్మిళాబాయి, శారద, నిర్మల ఉన్నారు. -
సన్నబువ్వ రుచి చూసిన అధికారులు
కైలాస్‌నగర్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబి య్యంపై లబ్ధిదారుల స్పందన తెలుసుకునేందుకు శుక్రవారం జిల్లా పౌరసరఫరాల అధికారి ఎండీ వా జిద్ అలీ, ఆదిలాబాద్‌అర్బన్ తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, ఆర్ఐ యజ్వేందర్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాథోడ్ బాబుసింగ్ జిల్లా కేంద్రంలోని శ్రీరాంకాలనీలో పర్యటించారు. కాలనీకి చెందిన సరోజ ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నం రుచి చూశా రు. భోజనం ఎలా ఉందని లబ్ధిదారులను అడిగి తె లుసుకున్నారు. రుచికరమైన భోజనం అందుతుందని, బయటి మార్కెట్ నుంచి సన్నబియ్యం తెచ్చుకోవాలంటే రూ.2వేల వరకు ఖర్చయ్యేదని లబ్ధిదా రులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఖర్చు తగ్గిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. -
‘సీసీఐని ప్రారంభించేదాకా పోరాడుతాం’
కైలాస్‌నగర్: మూతపడ్డ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్రం పునఃప్రారంభించేదాకా పోరాడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఫ్యాక్టరీని తెరిపించాలనే డిమాండ్‌తో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో 17రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష ముగిసింది. దీక్షలో కూర్చున్నవారికి ఆయన శుక్రవారం నిమ్మరసమిచ్చి విరమంపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినందున దీక్ష విరమిస్తున్నట్లు తెలి పారు. సీసీఐ ప్రారంభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలుసార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించామని పేర్కొన్నారు. వందేళ్లకు సరిపడా ముడిసరుకు కలిగిన ఫ్యాక్టరీ ప్రారంభమైతే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. సీసీఐ పునఃప్రారంభించేదాకా ఎన్ని పోరాటాలైన చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు డీ మల్లేశ్, విజ్జగిరి నారాయణ, సిర్ర దేవేందర్, దాసరి రమేశ్, పోశెట్టి, నగేశ్, రమేశ్, ఈశ్వర్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్‌కార్డుంటే ‘ఆదాయం’ అవసరం లేదు
కై లాస్‌నగర్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు ఉన్నవారికి ఆదాయ ధ్రువీకరణపత్రం అవసరం లేదని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. దరఖాస్తు ప్రక్రియపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శా ఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 14వరకు పొడిగించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆయా కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డీఆర్డీవో, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు పథకం నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. బ్యాంక్ మేనేజర్లు ఈ కార్యక్రమంపై ఒరియంటేషన్ ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, బీసీ సంక్షేమాధికారి రాజలింగు, వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు పాల్గొన్నారు. -
● పాత దానికి కొత్త లేఅవుట్ లింక్ ● ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు ● ఎల్ఆర్ఎస్ మాటున చేతివాటం ● సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అక్రమాలు
విచారించి చర్యలు తీసుకుంటాం ఎల్ఆర్ఎస్ లేకుండా కొత్త లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అలాంటివి జరిగినట్లు నా దృష్టికి రాలేదు. విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగితే రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి నివేదిక పంపించి సదరు సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకుంటాం. డబ్బులకు ఆశపడి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినా.. రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు డిమాండ్ చేసినా.. కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి వాటిపై ప్రజలు నాకు ఫిర్యాదు చేయవచ్చు. – రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ కైలాస్‌నగర్: ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా యథేచ్ఛగా సా గుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల ఏర్పా టు చేసిన లేఅవుట్లోని ప్లాట్లకూ ఎల్ఆర్ఎస్–2020లో భాగంగా దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో సదరు సబ్ రిజిస్ట్రార్ ఒక్కో ప్లాట్‌కు రూ.50వేల చొప్పున దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన సదరు అధికారి విధుల్లో చేరిన నుంచి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ అక్రమ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకే ప్రాధాన్యతనిస్తున్నారని ఆశాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. శాఖాపరంగా ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని చెప్పుకొంటున్న ఆ అఽధికారి కార్యాలయంలో ఎవరినీ లెక్క చేయకుండా అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల దందాలో సద రు అధికారి డాక్యుమెంట్ రైటర్లపై పక్షపాత వైఖరి చూపుతుండగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ ఽశివారు పరిధి లోకి వచ్చే సర్వే నంబర్ 77, 78లో ఓ పట్టాదారు తన వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా మార్చాడు. అందులో 45 ప్లాట్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించాడు. పాత లేఅవుట్ కావడంతో వాటి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అయితే అదే సర్వే నంబర్‌లోగల కొంత భూమిని తాజాగా పట్టాదారు తన కుటుంబీకులకు విక్రయించాడు. ఆ భూమిలోనూ మరో లే అవుట్ ఏర్పాటు చేశారు. ఇటీవలే లేఅవుట్ ఏర్పా టు కావడం, అధికారికంగా ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అందులోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చే సుకునే అవకాశం లేదు. అయితే తాజాగా సదరు లే అవుట్ చేసిన వ్యక్తి పాత లేఅవుట్కే కొత్త లేఅవుట్ జతచేశాడు. దానికి సర్వే నంబర్ 77, 78తో పాటు 77ఆ, 78/3/ఆ గా బై నంబర్లను క్రియేట్ చేసి రిజి స్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం 2020కి ముందు లేఅవుట్ చేసి అందులో 10 శాతం ప్లాట్లు విక్రయించినట్లయితే ఎల్ఆర్ఎస్ కింద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త లేఅవుట్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. దీంతో దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. అందుబాటులోకి రాని సబ్రిజిస్ట్రార్కాగా, ఈ విషయమై సదరు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించేందుకు కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్లో పలుసార్లు సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
లక్కీడ్రా పద్ధతిపై అనాసక్తి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు ఎట్టకేలకు దృష్టి సారించా రు. పట్టణంలోని అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, శివా జీచౌక్, దేవిచంద్ చౌక్‌లోని వీధివ్యాపారులను ఇత ర స్థలాలకు తరలించేందుకు ఇటీవల రెవెన్యూ అధి కారులు ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో 201 మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించారు. వారికి ఖాళీగా ఉన్న గణేశ్ థియేటర్ స్థలాన్ని వ్యాపారాల కోసం కేటాయించేందుకు శుక్రవారం ఆర్డీవో వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని టీఎన్జీవో భవన్లో లక్కీడ్రా నిర్వహించారు. 201 షాపులకు గాను డ్రా తీసి ఎంపిక చేశారు. అయితే ఈ ప్రక్రియపై వీధివ్యాపారులు అంతగా ఆసక్తి చూ పలేదు. 201 మందికి గాను 10–15 మంది మాత్ర మే హాజరయ్యారు. వ్యాపారులు లేకుండానే అధికా రులు డ్రా ప్రక్రియ కానిచ్చారు. శ్రీరామ నవమి అనంతరం ఒక్కొక్కరికి 6/7 స్థలాన్ని కేటాయించనున్నట్లు మున్సిపల్ కమిషన్ సీవీఎన్ రాజు తెలి పారు. స్థలాల కేటాయింపు పూర్తయిన వెంటనే వా రందరినీ అక్కడికి తరలించనున్నట్లు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా డీఎస్పీ జీవన్‌రెడ్డి స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. సీఐలు సునీల్‌కుమార్, ప్రణయ్, టీపీఎస్ నవీన్‌కుమార్, సిబ్బంది వినయ్‌కుమార్, ఖుర్బాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బేస్మెంట్ దశ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తక్షణమే నగదు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. బేస్మెంట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ గాని, తక్కువ గాని ఉండకూడదని, సిమెంట్ ఇటుకలతో నే గోడలు నిర్మించుకోవాలని సూచించారు. స్థానిక ఇటుకలను నిర్మాణాలకు వాడకూడదని తెలిపారు. నిరుపేద లబ్ధిదారులు బేస్మెంట్ నిర్మించుకునేందుకు ఎస్‌హెచ్‌జీల ద్వారా ఆర్థికసాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఆదిశగా చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నెలాఖరు వరకు 20 నుంచి 30 బేస్మెంట్లు నిర్మించాలని, వాటి ఫొటోలను అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణ డబ్బులు నాలుగు విడతల్లో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రారంభం కాని చోట్ల వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని, మేసీ్త్రలను నియమించుకుని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. మోడల్ విలేజ్ నిర్మాణ పనులను జూన్ 30లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంఆదిలాబాద్టౌన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సులో వేసవిలో శిక్షణ పొందేందుకు ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 17నుంచి 29వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో మే 1నుంచి 11వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.inలో లేదా డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. బాధ్యతల స్వీకరణఆదిలాబాద్రూరల్: జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి (డీఎండబ్ల్యూవో)గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావ్ శుక్రవారం జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు నుంచి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. కార్యాలయ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
అందుబాటులోకి సీఎన్జీ యూనిట్లు
● జిల్లాలో నాలుగు చోట్ల ఏర్పాటు ● త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం ● పెరిగిన ఈ–వాహనాల వినియోగం సాక్షి, ఆదిలాబాద్: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) యూనిట్లు జిల్లాలోనూ అందుబాటులోకి వస్తున్నాయి. నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన వీటిని వా రంరోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎన్జీ వాహనాల వినియోగం కూడా బాగా పెరిగింది. అయితే ఈ ఇంధనం లభించే పాయింట్లు ఇప్పటివరకు లేక అక్రమ పద్ధతిలో ఫిల్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీని కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు రవా ణారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ లభించే యూనిట్లు ఏర్పాటవుతుండటంతో ఈ–వాహనాల వినియోగం మరింత పెరిగే ఆస్కారముంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఆధ్వర్యంలో తొలిసారిగా ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, ఖుర్షీద్‌నగర్ జైళ్లశాఖ పెట్రోల్ పంపు, గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది (కమలాపూర్) సమీపంలోని దర్వి పెట్రోల్ బంక్, జైనథ్ మండలం భోరజ్లోని కోకో పెట్రోల్ పంపులో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సీతాగొంది యూనిట్ మినహా మిగతా యూనిట్ల నిర్మాణం పూర్తయింది. డిమాండ్ నేపథ్యంలోనే.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో నడిచే వాహనాలకు తో డు ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ వాహనాల విని యోగం పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్లుగా ఇంధనం మార్కెట్లో లభించకపోవడంతో వాహనదా రులు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వి క్రయం లీటర్లలో, సీఎన్జీ విక్రయంలో కేజీల్లో ఉంటుంది. ప్రస్తుతం దీని ధర కేజీకి రూ.93 వరకు ఉ న్నట్లు పెట్రోలియం వ్యాపారులు పేర్కొంటున్నా రు. కాగా, జిల్లాలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఒ క్కోసీఎన్జీ డిస్పెన్సరీ యూనిట్ సామర్థ్యం సుమా రు 3వేల కేజీలుగా చెబుతున్నారు. ఒక్కోదానిని రూ.కోటిన్నర అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ మార్కెట్లో సీఎన్జీ విస్తృతంగా లభించే పరిస్థితి ఉండగా ఈ–వాహనాలు వినియోగించే వారికి ఊరట లభించనుంది. -
ఏఐతో నాణ్యమైన బోధన
ఆదిలాబాద్‌టౌన్: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో నాణ్యమైన బోధన అందుతుందని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రణదీవెనగర్ ప్రాథమిక పా ఠశాలలో ఏఐ విద్యాబోధన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లా డి బోధన తీరు గురించి తెలుసుకున్నారు. సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు భూపతిరెడ్డి, శ్రీహరిబాబు, రాజేశ్వర్ తదితరులున్నారు. ప్రయోజకులుగా తీర్చిదిద్దాలినాణ్యమైన బోధన అందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి సూ చించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, గెజిటెడ్ నంబర్–1, బాలక్‌మందిర్ తదితర కేంద్రాల్లో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో నాయకత్వ ల క్షణాల పెంపు, మధ్యాహ్న భోజనం, పాఠశాల ల నిర్వహణ, తరగతి గదిలో బోధన, అభ్యసన సామర్థ్యాలు, వార్షిక ప్రణాళిక తదితర అంశాల గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డైట్ ఇన్చార్జి ప్రిన్సి పల్ కిరణ్‌కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్‌గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించాలి
ఇంద్రవెల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా సూచించారు. శుక్రవారం మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న వి ద్య, వైద్యం, భోజనం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆ హారం అందించాలని, సబ్జెక్టుల వారీగా అర్థమ య్యే రీతిలో బోధించాలని సూచించారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోజూ క్రమం తప్పకుండా వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించి సబ్జెక్టుల వారీగా వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు. -
స్నేహితుడిపై హత్యాయత్నం.. కేసు నమోదు
నిర్మల్‌టౌన్: తన స్నేహితుడినే హత్య చేసేందుకు ఓ వ్యక్తి ఇతరులతో కలిసి యత్నించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా గురువారం వివరాలు వెల్లడించారు. స్థానిక బాలాజీవాడకు చెందిన రాజులదేవి ప్రమోద్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదే అమ్మాయిని దినేశ్ అనే మరో వ్యక్తి కూడా ప్రేమించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. ఈనెల 1న మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న కోట్ల రాజేశ్ వారిని అడ్డుకుని ఇద్దరిని అక్కడి నుంచి పంపించాడు. దీంతో ప్రమోద్ తన మిత్రుడైన రాజేశ్, దినేశ్‌కు మద్దతు ఇస్తున్నాడని భావించి రాజేశ్‌పై కోపం పెంచుకున్నాడు. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు అర్ధరాత్రి రాజేశ్‌ను రామ్రావు బాగ్‌లోని మైసమ్మ కుంట గుట్ట ప్రాంతానికి పిలిచి గొడవపడ్డాడు. ప్రమోద్ మరో మిత్రుడైన కార్తిక్ సింగ్‌తో కలిసి రాజేశ్‌పై దాడి చేశాడు. పగిలిన బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం చేశారు. ఇందుకు బబ్లు అలియాస్ రాజ్‌కుమార్, సచిన్ సింగ్‌లు సహకరించారు. రాజేశ్ తల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
జేసీ వాహనం డ్రైవర్ మృతి
బోథ్: ఆదిలాబాద్ జిల్లా జేసీ శ్యామలాదేవి వాహనం డ్రైవర్ నూతుల రవీందర్ రెడ్డి (కాల్వ రవి) గుండెపోటుతో మృతిచెందారు. బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామానికి చెందిన ఆయన గత 10 సంవత్సరాలుగా జేసీ వాహన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌లో నివాసముంటున్న ఆయనకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. కాగా ఈసీజీ తీసే క్రమంలో ఆయన మృతిచెందారు. గురువారం ధన్నూర్ బి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపట్ల జేసీ శ్యామలాదేవి సంతాపం తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
కారులో నిద్రిస్తున్న వారిపై దాడి
● ల్యాప్‌టాప్, బ్యాగు అపహరణ ● టేక్రియాల్‌లో రెచ్చిపోయిన దుండగులు కామారెడ్డిక్రైం: రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న వారిపై దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరరాఘవయ్య కుమారుడు నాగమణిదీప్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షలు పూర్తి కావడంతో కుమారుడిని స్వగ్రామానికి కారులో తీసుకొస్తున్నాడు. వీరరాఘవయ్య వెంట స్నేహితుడు కూడా ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో టేక్రియాల్ వద్ద పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఓ హోటల్ ఎదుట రోడ్డు పక్కన కారు నిలిపి అందులో నిద్రించారు. నలుగురు దుండగులు కారు అద్దాలు పగలగొట్టి వారిపై దాడి చేసి కారులోని బ్యాగు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. దాడిలో వీర రాఘవయ్యకు గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే రాఘవయ్య భయంతో కారును దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలోని సదాశివనగర్ వరకు తీసుకెళ్లాడు. అక్కడ కారును నిలిపి డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ రాజేశ్చంద్ర, దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒకే వాహనం.. రెండు ఫీజులు
● దేవుడి దర్శనానికి వాహనదారుల తిప్పలు ● పంచాయతీరాజ్ శాఖ పార్కింగ్ రుసుము.. ● అటవీశాఖ ఎంట్రీ ఫీజు వసూలు దండేపల్లి: మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో కొలువైన పెద్దయ్య దేవుడిని చేరుకోవాలంటే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గురువారం పెద్దయ్య దేవుడి దర్శనానికి వెళ్లిన వాహనాలకు రెండు శాఖల వారు ఫీజులు వసూలు చేయడంతో భక్తులు ఖంగుతిన్నారు. పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుండగా అటవీ శాఖ అధికారులు ఫారెస్టు ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. రెండు శాఖలకు ఫీజు చెల్లించడంపై కొంతసేపు వివాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ప్రసాద్ ఫారెస్టు చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం పార్కింగ్ రుసుం వసూలు కోసం టెండర్లు నిర్వహించారని, వారు ఫీజు వసూలు చేస్తారని అటవీశాఖ సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నామని వారు బదులిచ్చారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని అప్పటివరకు ఎవరూ కూడా ఫీజులు వసూలు చేయొద్దని ఎంపీడీవో చెప్పినా అటవీ అధికారులు వినకుండా ఎంట్రీఫీజు వసూలు చేశారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పంచాయతీ అధికారులు పార్కింగ్ ఫీజు వసూలు చేయలేదు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీడీవో ప్రసాద్ తెలుపగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఎంట్రీఫీజు వసూలు చేస్తున్నామని డీఆర్వో పోచమల్లు పేర్కొన్నారు. -
ఆగని ఇసుక దందా
● ఇటీవల ఐదు ట్రాక్టర్లు పట్టివేత ● కొనసాగుతున్న అక్రమ రవాణా ● తాజాగా మరో ఐదు ట్రాక్టర్లపై కేసు దండేపల్లి: అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. అక్రమార్కులు అధికారులకు, పోలీసులకు ఏమాత్రం భయపడకుండా తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దండేపల్లి మండలం కాసిపేట గోదావరి తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా, ఇటీవల ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇవేమి పట్టించుకోకుండా గురువారం మళ్లీ ఇసుకాసురులు 15 ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్ఐ భూమన్న, సిబ్బందితో కలిసి గోదావరి తీరానికి చేరుకున్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా కొన్ని ఇసుక ట్రాక్టర్లను ధర్మపురి వైపు మళ్లించారు. దీంతో కేవలం ఐదు ట్రాక్టర్లు మాత్రమే పట్టుపడ్డాయి. కేసు నమోదు చేశామని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ నేతలు
నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్/ఆదిలాబాద్: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ లోని పార్లమెంట్ హౌస్‌లో కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పౌర విమానయా న శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారులు, ఆది లాబాద్‌లో విమానయానం ఏర్పాటుపై చర్చించారు. బాసర నుంచి మహారాష్ట్రలోని మహోర్ వరకు హైవే అభివృద్ధి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నితిన్ గడ్కరీని కోరారు. కేంద్రమంత్రులను కలిసిన వారిలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఉన్నారు. 5న నాగోబా దర్బార్‌హాల్‌లో చర్చా వేదికఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయం సమీపంలో గుర్తు తెలియని దుండగులు హీరాసుక స్మారక జెండా తొలగించిన విషయంపై ఈనెల 5న నాగోబా దర్బార్ హాల్లో చర్చా వేదిక నిర్వహించనున్నట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ అన్నారు. గురువారం నాగోబా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ మేధావులు, ఆయా గ్రామాల పెద్దలు, నాయకులు చర్చకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్, మెస్రం బాదిరావ్ పటేల్, మెస్ర దుర్గు, మెస్రం ఆనంద్‌రావ్ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులకు ఫౌండేషన్
● సంక్షేమ గురుకులాల్లో ఫౌండేషన్ కోర్సులు ● ఎనిమిదో తరగతి నుంచి శిక్షణకు నిర్ణయం ● మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మహర్దశ రానుంది. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి అలుగు వర్షిణి ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 గురుకుల కళాశాలల్లో ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించనున్నారు. ఐఐటీ జేఈఈ, నీట్, యూపీఎస్సీ, సీయూఐటీ, సీఎల్ఏటీ వంటి తదితర అత్యంత ప్రాధాన్యత కలిగిన కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. 2025 –26 విద్యాసంవత్సరం నుంచి ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ప్రారంభించనున్నారు. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడానికి ఆసక్తి కలిగిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో 8వ తరగతిలో ప్రవేశం పొందనున్న విద్యార్థులకు సైతం పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. ప్రవేశపరీక్షలో మెరిట్ మార్కులు పొందిన విద్యార్థులను ఎంపిక చేసి ఫౌండేషన్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తద్వారా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. కళాశాలల ఎంపికపై ఆసక్తి ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడానికి ఏయే కళాశాలలను ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాబోధనలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గురుకుల విద్యాలయాలను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ ) కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఉన్న ప్రధాన క్యాంపస్ తోపాటు కరీంనగర్ (అల్గనూరు)లో ఉన్న సీవోఈ కళాశాలల్లో ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు కొత్తగా మరో 8 కళాశాలలను ఎంపిక చేయనున్నారు. అయితే రెండేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉత్తమ కళాశాలలను గుర్తించగా అందులో బెల్లంపల్లి బాలుర సీవోఈ కళాశాలకు ప్రాధాన్యత దక్కింది. గతంలో గుర్తించిన కళాశాలలను ఎంపిక చేస్తారా.. కొత్త కళాశాలలకు ప్రాధాన్యత ఇస్తారా.. అందుకు ఎలాంటి విధివిధానాలను అనుసరిస్తారనేది తేలాల్సి ఉంది. కళాశాలల ఎంపిక జరగలేదు సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గడానికి వీలుగా ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించాలని సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 కళాశాలలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఏఏ కళాశాలలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఇంకా తెలియదు. త్వరలోనే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. – అరుణకుమారి, జోనల్ అధికారి, సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ -
ఆర్జీయూకేటీలో న్యాక్ సన్నాహక సమావేశం
మాట్లాడుతున్న ఇన్చార్జి వీసీ గోవర్ధన్బాసర: ఆర్జీయూకేటీలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) మూల్యాంకనానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఇన్చార్జి వీసీ ఎ.గోవర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశానికి ఓఎస్డీ, ఏవో, అసోసియేట్ డీన్లు, అధ్యాపకులు హాజరయ్యారు. ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ న్యాక్ అక్రిడిటేషన్ ప్రక్రియ నిర్ధారించడానికి అధ్యాపకులు పూర్తివివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. యూనివర్శిటీ అకడమిక్, పరిపాలన, మౌలిక సదుపాయాల ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అధ్యాపకులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. ఆర్జీయూకేటీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు, ప్రణాళికబద్ధంగా ఈ ఎన్ఏఏసీ మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పలు నూతన కోర్సులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్శన్, ఏవో రణధీర్, అసోసియేటెడ్ డాక్టర్ విటల్, డాక్టర్ మహేశ్, డాక్టర్ చంద్రశేఖర్, హెచ్వోడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కైలాస్‌నగర్: జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగ తి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ కే శ్యామలాదేవి సూచించారు. పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అఽధికారులతో సమావేశమై మాట్లాడారు. ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది అభ్యాసకులు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతికి మూడు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యాసకులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26నుంచి మే 3వరకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై గందరగోళం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవిష్యత్‌లో ఎయిర్‌ఫోర్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చే స్తామని ప్రకటించడం ఈ ప్రాంతవాసులను సంబ రాల్లోకి నెట్టింది. గతంలో భూసేకరణకు చేపట్టిన సర్వే ప్రకారం ఆ భూముల సేకరణపై యజమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వారు అధికారులు, నేతలను కలుస్తున్నారు. భూ సేకరణ విషయమై ఫోన్లో వాకబు చేస్తున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఎయిర్‌పోర్టుకు సరిపోతుందా..ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు సంబంధించి వాయుసేన భూమి 369 ఎకరాలు ఉంది. ఇది నిజాం కాలంలో విమానాల రాకపోకలకు సంబంధించి ఇంధన స్టేషన్‌గా ఉండేదని తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో రక్షణశాఖ పరిధిలోకి ఈ భూములు వచ్చేశా యి. అయితే ఆదిలాబాద్‌లో ఇన్ని ఎకరాల భూములుండటం, హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు మధ్యలో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అనువుగా ఉంటుందనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఇందుకు అనుగుణంగా గతం నుంచే పలుసార్లు వాయుసేనకు సంబంధించిన వారు ఈ భూముల రక్షణ విషయంలో పరిశీలనకు రావడంతో పాటు భవిష్యత్‌లో ఇక్కడ వైమానిక శిక్షణ దళం ఏర్పాటు చేస్తామని సంకేతాలిస్తూ వచ్చారు. అయితే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందనే డిమాండ్ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వారు కూడా పలుసార్లు ఇక్కడికి పరిశీలనకు వచ్చారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారనే ప్రచారం ముందు నుంచే ఉంది. అయితే ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందా.. లేదా ఎయిర్‌ఫోర్స్ వస్తుందా.. అనే సందిగ్ధం అప్పట్లో వెంటాడేది. తాజాగా ఈ రెండూ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పడంతో ప్రస్తుతం భూముల విషయంలో అందరి మదిలో ఆలోచనలు మొదలయ్యాయి.గతంలో సఖ్యత లేకే..గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన స ఖ్యత లేక ఈ ప్రణాళిక ముందుకు సాగలేదు. తాజా గా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరడం, కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ముందుకు రావడంతో ముందడు గు పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలోని వందల ఎకరాల భూములే ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సరిపోతాయా.. లేదా అదనంగా భూమిని సేకరించాల్సి వస్తుందా.. అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.డీపీఆర్ కోరిన నేపథ్యంలో..ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుమతిస్తూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డిటేల్ ప్రాజెక్ట్ రిపో ర్టు (డీపీఆర్) ఇవ్వాలని కోరింది. దీంట్లో రన్‌వే, సివిల్ టర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ ఆఫ్రాన్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి దీనిని అడిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూప డం, రానున్న రోజుల్లో ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా దానికి ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టు ఉండాలని కేంద్రం ఆలోచనతో రక్షణ శాఖ భూములనే సంయుక్తంగా వినియోగించుకునేందుకు ఈ డిటేల్ ప్రా జెక్ట్ రిపోర్టు అడిగిందని పలువురు నిపుణులు చెబు తున్నారు. అయితే దీని విషయంలో పూర్తి విధివిధానాలు ప్రభుత్వం నుంచి వస్తేనే ఏదైన చెప్పగలుగుతామని అధికారులు పేర్కొంటున్నారు.ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసేటప్పుడే..ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలోని వందల ఎకరాల భూములను ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు వినియోగించుకుంటే ఇప్పటికిప్పుడే అదనంగా భూసేకరణకు ఆవశ్యకత ఉండదని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసే సమయంలో అదనంగా భూమి సేకరించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో సర్వే చేసిన 1,592 ఎకరాల ఆవశ్యకత ఇప్పటికిప్పుడే ఉండదని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసేటప్పుడే ఆ భూముల సేకరణ తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు.ప్రధాని మోదీ కృషి ఫలితమే..ఆదిలాబాద్: ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృషితోనే ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్‌లో ప్రధాని మోదీ, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృషి చేశారని, ఎంపీ గోడం నగేశ్ పార్లమెంట్‌లోనూ ప్రస్తావించారని పేర్కొ న్నారు. ప్రధాని మోదీ, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్టణాధ్యక్షుడు వేదవ్యాస్, నాయకులు మహేందర్, ప్రవీణ్, విజయ బోయర్, రాకేశ్, అర్జున్, దినేశ్, సుభాష్, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.సీఎం రేవంత్ చొరవతోనే..కైలాస్‌నగర్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు భారత వాయుసేన అనుమతులివ్వడం సీఎం రేవంత్‌రెడ్డి చొరవతోనే సాధ్యమైందని డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, కంది శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబా ద్‌కు ఎయిర్‌పోర్టు మంజూరు చేయాలని పార్లమెంట్ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. -
వ్యాయామ విద్యకు ఉజ్వల భవిష్యత్
ఆదిలాబాద్‌టౌన్: వ్యాయామ విద్యకు ఉజ్వల భవి ష్యత్ ఉంటుందని ఎస్సీఈఆర్టీ రిసోర్స్ పర్సన్ స్టాలి న్‌బాబు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వ డైట్ కళాశాలలో చేపట్టిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వ్యాయామ విద్యను తప్పనిసరిగా సబ్జెక్ట్‌గా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద ప్రభుత్వం ని ధులు కూడా విడుదల చేస్తుందని తెలిపారు. హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు గుర్తింపు రానుందని పేర్కొన్నారు. డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన వి ద్యను బోధించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, లెక్చరర్లు జయరావు, ఉమాకాంత్, రిసోర్స్ పర్సన్ భూమన్న, హరిచరణ్, పీఈటీల సంఘం జిల్లా కార్యదర్శి సాయికుమార్, మమత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఫౌండేషన్..
సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులకు మహర్దశ రానుంది. ఎనిమిదో తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 8లోu ఎయిర్‌ఫోర్స్ నిర్మించినప్పుడే.. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారనే నిర్ణయం నేపథ్యంలో భూములు కోల్పోతామా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రక్షణశాఖ అధీనంలోని భూములు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సరిపోతాయి. ఎయిర్‌ఫోర్స్ నిర్మించేటపుడే భూసేకరణ చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా మలచడం ద్వారా ఐఏఎఫ్, ఏఏఐ నిర్మాణాత్మకంగా ముందుకెళ్తాయి. – బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ హయాంలోనే.. 2016–17లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా భూములను సర్వే చేయించింది. 1,500 ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉందని అప్పట్లో గుర్తించింది. 2022–23లో ఈ భూముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడానికి టెక్నికల్ పరిశీలన చేపట్టగా అనువుగా ఉన్నట్లు తేలింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఫలితంగానే ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు మంజూరైంది. – జోగు రామన్న, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విధివిధానాలు వస్తేనే స్పష్టత ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసే విషయంలో నిర్ణయం వెలువడినప్పటికీ దీంట్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు రాలేదు. ఇందుకు భూసేకరణ చేయాల్సి వస్తుందా.. లేదా.. అనేది ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే మేము నిర్ణయం తీసుకుంటాం. – వినోద్‌కుమార్, ఆర్డీవో, ఆదిలాబాద్ -
ఉపాధి కల్పనకే ‘యువ వికాసం’
● జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి రాజలింగు ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి రాజలింగు తెలిపారు. అ ర్హుల నుంచి గత నెల 17వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 5వరకే దరఖాస్తు గడువు ఉండగా వరుస సెలవుల నేపథ్యంలో 14వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 8,960 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు వెల్లడించారు. -
‘అసాంఘిక చర్యలు అరికడతాం’
ఆదిలాబాద్‌టౌన్: అసాంఘిక చర్యలను అరికడతా మని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువా రం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యా ప్తంగా నమోదైన కేసుల వివరాలు తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజా యి స్మగ్లర్లపై నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. త్వరలో ప్రారంభించనున్న ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమాన్ని ప్రతీవారం ఒక్కో గ్రామంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులు, పోక్సో, ఇన్వెస్టిగేషన్ కేసులపై విచారణ జరిపి అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కోర్టు డ్యూటీ అధికారి విధులను పర్యవేక్షిస్తూ పెండింగ్ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. సాక్షులను కోర్టులో హాజరుపర్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలని పేర్కొన్నారు. రాత్రివేళ అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల వేలిముద్రలు సేకరించి ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. సమీక్షా స మావేశంలో డీఎస్పీలు జీవన్‌రెడ్డి, నాగేందర్, సీఐ లు సునీల్‌కుమార్, కరుణాకర్, శ్రీనివాస్, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సోదాల కలకలం
● రవాణాశాఖ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు ● రాత్రిపూట రంగంలోకి దిగిన వైనం ● వాంకిడి వద్ద రూ.45,100 నగదు లభ్యం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి జరిపిన సోదాల్లో వాంకిడి చెక్‌పోస్టులో రూ.45,100 పట్టుబడ్డాయి. రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఆదిలాబాద్, కరీంనగర్ డీఎస్పీలు విజయ్‌కుమార్, రమణమార్తి, మరో నలుగురు సీఐలు ఏకకాలంలో అక్కడి రికార్డులు పరిశీలించారు. రెండు ఫోన్లు సీజ్ చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఏఎంవీ మాత్రమే ఉండగా, ఇంకా ప్రైవేట్ వ్యక్తులూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో గతేడాది మేలో భోరజ్ చెక్‌పోస్టు వద్ద రూ.11,630, గత డిసెంబర్ 4న రూ.62,500 నగదు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. చెక్‌పోస్టుల్లో నిత్యం వాహనదారులు, డ్రైవర్లు, సహాయకుల నుంచి బండికో రేటుగా అనధికారికంగా ప్రైవేట్ సిబ్బంది వసూళ్లు చేస్తున్నది బహిరంగ రహస్యమే. ఏసీబీ సోదాలతో గురువారం వాంకిడిలో ఎలాంటి వాహన తనిఖీలు లేకుండానే రాకపోకలు సాగించాయి. మూడు చోట్ల ఇదే తంతు ఉమ్మడి జిల్లా మహారాష్ట్రకు సరిహద్దుతో, ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రోడ్డు మార్గంగా ఉంది. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్–44పై భోరజ్, ఆసిఫా బాద్ జిల్లా ఎన్‌హెచ్–363పై వాంకిడి, నిర్మల్ పరిధి ఎన్‌హెచ్–61 వద్ద తానూరు మండలం బెల్‌తరోడా వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. ఇక్కడే సమీకృత చెక్‌పోస్టులూ ఉన్నాయి. రవాణాశాఖ చెక్‌పోస్టులో నిత్యం వందల వాహనాలను చట్టప్రకారం అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? అని తనిఖీలు చే స్తూ అధికారులు అనుమతి ఇవ్వాలి. అయితే పరిశీ లన పేరిట వాహనదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నరనేది ప్రధాన ఆరోపణ. డ్యూటీకి కోసం పోటీ రవాణా శాఖలో చాలామంది అధికారులు, సిబ్బంది చెక్‌పోస్టుల్లో డ్యూటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల నుంచి సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది వరకు రాజకీయ, ఉన్నతాధికారుల పైరవీలతో అక్కడ డ్యూటీలు తెచ్చుకుని పని చేస్తున్నారు. చెక్‌పోస్టు డ్యూటీకి వెళ్తే ‘లాభదాయంకం’గా మారడంతో పోటీ పడుతున్నారు. అక్కడ పని చేస్తున్న అధికారుల సంఖ్యను బట్టి రోజువారీగా డ్యూటీల్లో ఉంటున్నారు. నగదు ముట్టుకోకుండా.. ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపైనే కేసులు నమోదు చేస్తూ విచారణ చేస్తుంటారు. ఒకవేళ ప్రైవే ట్ వ్యక్తులు ఉంటే వారు ఏ అధికారి ప్రోద్బలంతో ఉన్నారు? వారివెనుక ఎవరున్నారనే స్పష్టమైన ఆ ధారాలు తీసుకుంటారు. లేకపోతే అధికారులపై కే సులు నమోదు చేసే అవకాశం లేదు. సాధారణంగా లంచం తీసుకునేటప్పుడు నేరుగా దొరికిన ఆ అధి కారి చేతులు, నగదుతో రసాయన పరీక్ష చేసి, సాంకేతిక ఆధారాలతో కోర్టులో అందజేస్తారు. కానీ చెక్‌పోస్టుల్లో ఏ అధికారీ చేతితో డబ్బులు ముట్టుకోరు. దీంతో లెక్కచూపని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేవి మిస్టరీగా మారుతోంది. అవినీతి కేసులో ప క్కా ఆధారాలుంటే కేసు ముందుకు వెళ్తుంది. గతంలో పట్టుబడిన నగదుపైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా దొరికిన నగదుపైనా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. -
సర్వాయి పాపన్నకు ఘన నివాళి
కై లాస్‌నగర్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, వివిధ శాఖల అధికారులు, గౌడ కులస్తులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.రాజలింగు, కలెక్టరేట్ ఏవో వర్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, గౌడ సంఘం ప్రతినిధులు, కులస్తులు పాల్గొన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి దళితసంఘాల నాయకులతో బుధవారం సమీక్షించారు. ఈనెల 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. పట్టణంలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించనున్న వేడుకలకు మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, విద్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, డీఎస్సీడీవో సునీత, దళిత ససంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ంతల ఆనందం
● ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు ● ఇంటిబాట పట్టిన వసతిగృహ విద్యార్థులు ● ఈ నెల 7నుంచి మూల్యాంకనం ఆదిలాబాద్‌టౌన్: ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టి పబ్లిక్ పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తొలి పరీక్షకు గుబులు చెందిన వారు చివరి పరీక్ష ముగియడంతో కేరింతలు కొడుతూ ఇంటిముఖం పట్టారు. గతనెల 21న పరీక్షలు ప్రారంభం కాగా బుధవారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ఆయా వసతిగృహాల్లో ఉండి చదువుకున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులు వచ్చి వారిని తీసుకెళ్లారు. బస్టాండ్ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడింది. పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7 నుంచి 15 వరకు జిల్లా కేంద్రంలోని సెయిట్ జోసెఫ్ కాన్వెంట్లో స్పాట్ నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి లక్ష 74వేల జవాబు పత్రాలు మూల్యాంకనానికి వచ్చాయి. వాల్యూయేషన్ చేసేందుకు ఉపాధ్యాయులకు విధులు కేటాయించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, గురువారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. -
వార్డు ఆఫీసర్లకు ‘యువ వికాసం’ బాధ్యతలు
● ఐదు వార్డులకో ప్రత్యేకాధికారికై లాస్‌నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు గాను మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. ప ట్టణంలోని 49 వార్డులకు గాను 49 మందిని నియమిస్తూ కమిషనర్ సీవీఎన్. రాజు ఉత్తర్వులు జారీచేశారు. ఆయా వార్డుల్లోని ప్రభుత్వ పాఠశాలలు, క మ్యూనిటీ సెంటర్లు, ఆలయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల వివరాలను వార్డుల వారీగా ప్రత్యేకాధికారులకు అందజేశారు. ఈ మేరకు వారు బుధవా రం తమ పరిధిలోని వార్డుల్లో పర్యటించి దరఖాస్తుదారు ఆధార్‌కార్డు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రా లు, బ్యాంకు అకౌంట్ వంటి వివరాలను సేకరించారు. అలాగే ఐదు వార్డులకో ప్రత్యేక పర్యవేక్షణా ధికారిని కూడా నియమించారు. 1నుంచి 5 వార్డులకు డీఈ తిరుపతి, 6నుంచి 10 వార్డులకు డీఈ కార్తీక్, 11నుంచి 16వార్డులకు మెప్మా డీఎంసీ శ్రీని వాస్, 17నుంచి 21వార్డులకు మేనేజర్ స్వా మి, 23నుంచి 28 వార్డులకు శానిటరీ ఇన్స్పెక్టర్ బి.శంకర్, 29నుంచి 34వార్డులకు ఏవో రాజ్‌కుమార్ గౌ డ్, 35నుంచి 40వార్డులకు టీపీఎస్ నవీన్‌కుమార్, 41నుంచి 45 వార్డులకు సీనియర్అకౌంటెంట్ శ్రీని వాస్, 46నుంచి 49 వార్డులకు శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్‌ను ప్రత్యేకాధికారులుగా నియమించారు. -
ఎల్ఆర్ఎస్ గడువు పెంపు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ఈ నెల 30వరకు అవకాశం కై లాస్‌నగర్: ఎల్ఆర్ఎస్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 30 వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దాన కిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు విధించిన గడువు గత నెల 31తో ముగిసింది. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువు పొడిగించింది. అయితే దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే. రూ.8.80 కోట్ల ఆదాయం జిల్లాలో మార్చి 31వరకు చేపట్టిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో కలిపి రూ.8.80 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లావ్యాప్తంగా 5,085 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఇందులో మున్సిపల్ పరిధిలో రూ.6.72 కోట్ల ఆదాయం, గ్రామ పంచాయతీల్లో రూ.2.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ నవీన్‌కుమార్ తెలిపారు. ఈ సారైనా వందశాతం పూర్తయ్యేనా.. ఫీజులో 25శాతం రాయితీ కల్పించిన ప్రభుత్వం వందశాతం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. అయినప్పటికీ జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆదిలాబా ద్ మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్–2020లో ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం 22,369 దరఖాస్తులు రాగా అందులో 12,830 దరఖాస్తులకు ఫీజు చెల్లింపునకు అనుమతినిచ్చారు. అయితే అందులో కనీసం సగం మంది కూడా స్పందించలేదు. కేవలం 3,909 మంది మాత్రమే ముందుకొచ్చి ఫీజు చెల్లించారు. ఇంకా వేలల్లోనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం మొత్తం 6,057 దరఖాస్తులు రాగా అందులో 4,100 దరఖాస్తులకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ చేసేందుకు అనుమతించా రు. ఇందులో 1,176 మంది మాత్రమే ముందుకొచ్చారు. పంచాయతీల్లోనూ భారీగానే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం మరో నెల రోజులు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈ సారైనా వందశాతం ప్రక్రియ జరుగుతుందా లేదా అనేది వేచిచూడాల్సిందే. సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్–2020లో భాగంగా ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత నెల 30 వరకు గడువు ముగిసినా ఈ నెల 30వరకు పొడిగించింది. దరఖాస్తుదారులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్‌లను జారీ చేస్తున్నాం. ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. – నవీన్‌కుమార్, టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ -
కదిలించిన ‘సాక్షి’ చర్చావేదిక..
మార్చి 6న ప్రచురితమైన ‘సాక్షి చర్చావేదిక’ కథనం ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను భారత వైమానిక దళంతో సంప్రదించి పరిశీలించాం.. భవిష్యత్తులో అక్కడ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని భారత వాయుసేన (ఐఏఎఫ్) భావిస్తుంది.. దాన్ని పరిగణలోకి తీసుకొని మొదట ఆదిలాబాద్ నుంచి పౌర విమాన కార్యకలాపాల కోసం రాష్ట ప్రభుత్వ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం.. ఇది ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (ఐఏఎఫ్) సనాప్ బాజీరావు రాంనాథ్ నుంచి తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరికి అందిన ఉత్తర్వు. సివిల్ టెర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ ఆఫ్రాన్ ఇతర మౌలిక సదుపాయాల కోసం జిల్లా కేంద్రంలో నాడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సూచన మేరకు సర్వే చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటామని భారత వాయుసేన (ఐఏఎఫ్) పేర్కొంది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేయవచ్చని ఇదే ఉత్తర్వుల్లో వెల్లడించింది. మార్చి 9న ప్రచురితమైన కథనం మార్చి 16న ప్రచురితమైన కథనంసాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి. ఏఏఐతో కలిసి నిర్మాణా త్మకంగా ముందుకెళ్తామని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. తద్వారా రానున్న రోజుల్లో ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను జాయింట్ యూజర్‌గా అభివృద్ధి పరిచి భవిష్యత్‌లో వైమానిక శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు భావిస్తోంది. దశాబ్దాల కల ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు అనేది నాలుగు దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్. ఎట్టకేలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో హర్షం వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీని ఆనుకుని 362 ఎకరాలతో విస్తరించి ఉన్న విమానాశ్రయ మైదానం నిజాం కాలం నుంచే విమానాల రాకపోకలకు అనువుగా ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ ఉన్నా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో మరోసారి ఇక్కడ విమానాశ్రయం ఏర్పా టు తెరపైకి వచ్చింది. విమానాశ్రయానికి అనుకూలంగా ఉందా.. శిక్షణ కేంద్రానికి అనుకూలంగా ఉందా.. అనే దానిపై 2011–12లోనే సర్వే చేశారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలంటే అదనంగా 1500 ఎకరాలకు పైగా భూమి అవసరమనే నివేదిక అప్పట్లో కేంద్రం నుంచి వచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పట్లో కలెక్టర్‌గా ఉన్న అహ్మద్ బాబు సర్వే ల్యాండ్ శాఖతో సర్వే చేయించారు. కచ్కంటి, ఖానాపూర్, అనుకుంట, తంతోలి పరిధిలోకి వచ్చే గ్రామాల భూముల ను తీసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. ఆ తర్వా త ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశం మరుగున పడినప్పటికీ అడపదడపా ఈ అంశం ప్రస్తావనకు రావ డం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ సమయంలో కదలిక వస్తుందని ఆశించినా కల నెరవేరలేదు. ఎట్టకేలకు దీనిపై నిర్మాణాత్మక కార్యాచరణ మొదలు కావడంతో హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న గొడం నగేశ్, గతంలో బీజేపీ ఎంపీగా వ్యవహరించిన సోయం బాపురావు, అంతకుముందు ఎంపీలుగా వ్యవహరించిన నేతలు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశారు. ఎట్టకేలకు కేంద్రం నుంచి అంగీకారం రావడం, ఇటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కూడా ప్రత్యేక చొరవ చూపడంతో ముందడుగు పడినట్లయింది. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ భవిష్యత్తులో వైమానిక శిక్షణ కేంద్రంగా.. ఏఏఐతో కలిసి నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామన్న ఐఏఎఫ్ సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ ముందడుగు ‘జనం గొంతుక’కు అభినందనల వెల్లువజిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు ఆవశ్యకత.. ఈ ప్రాంతవాసుల మనోభావాలను ‘సాక్షి’ అక్షర రూపంలో ప్రతిబింబించింది. సామాజిక బాధ్యతగా ముందడుగు వేసింది. దశాబ్దాల కల సాకారం చేయాలని వారి తరఫున గొంతెత్తింది. చర్చా వేదికకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాలను ఆహ్వానించింది. ‘రెక్కలపై ఆశలు’ అంటూ మేధావులు, నిపుణులు, నాయకుల అభిప్రాయాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. రాజకీయాలకతీతంగా ఐక్యతా రాగం వినిపించేలా చొరవ చూపింది. ‘మామ.. విమానాశ్రయం వస్తే మనకేమొస్తది..’ అంటూ స్థానిక యాసలో వివరించిన కథనం అందరినీ ఆలోచింపజేసింది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. దీంతో చట్టసభల్లో వారు గొంతెత్తారు. శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఎంపీ నగేశ్ సైతం పార్లమెంట్లో గళమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ తెస్తా.. ఆ బాధ్యత నాది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో భాగమైన భారత వాయుసేన(ఐఏఎఫ్) నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. విషయాన్ని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్రువీకరించడంతో ఈ ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సాక్షి’ చొరవకు జిల్లావ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ‘జనం గొంతుక’గా సదా మీ సేవలోనే అంటూ అభయమిస్తోంది మన ‘సాక్షి’.కేంద్ర మంత్రులను కలుస్తూ..వరంగల్‌లోని మామునూర్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు విషయాన్ని ఇటీవల ప్రకటించినప్పుడు ఆదిలాబాద్ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో ఈ ప్రాంత వాసుల్లో నిరాశ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ చొరవ తీసుకొని గత మార్చి 5న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ‘ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు సాధన కోసం’ చర్చా వేదిక నిర్వహించింది. మేధావులు, ప్రముఖులు పాల్గొని ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల నెరవేర్చాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అదే వేదిక పైనుంచి ఎయిర్‌పోర్టు సాధన కోసం అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ చర్చావేదిక తర్వాత ప్రధానంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరి గింది. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉండడంతో అదే రోజు ఎంపీ నగేశ్ ఆ దిలాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని అసెంబ్లీలో ఈ ప్రాంత ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించగా.. దానికి సీఎం రేవంత్ రెడ్డి కూ డా సానుకూలంగా స్పందించారు. వరంగల్ ఎయిర్‌పోర్టును తానే తెచ్చానని, ఆ దిలాబాద్కు కూడా సాధిస్తానని స్వయంగా చెప్పడం గమనార్హం. ఈ క్ర మంలోనే ఐఏఎఫ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇలా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో ‘సాక్షి’ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చర్చావేదిక ద్వారానే కదలిక వచ్చిందని పలువురు అభినందనలు తెలిపారు. ‘సాక్షి’ చొరవ అభినందనీయం.. ‘సాక్షి’ ఆధ్వర్యంలో మార్చి 5న నిర్వహించిన చర్చావేదికలో నాతో పాటు అనేక మంది పాల్గొన్నారు. ఆ రోజు అందరం గొంతెత్తి ఈ విషయంలో ఏకతాటిపై పోరాడాలని నిర్ణయించాం. అడహక్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఆ ప్రయత్నంలో స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పార్లమెంట్, అసెంబ్లీలో ప్రస్తావనకు రావడం, ఎయిర్‌పోర్టు కు ముందడుగు పడటం శుభపరిణామం. ‘సాక్షి’ చొరవను జిల్లా ప్రజలంతా అభినందిస్తున్నారు. –ఎస్.అశోక్, ఎయిర్‌పోర్టు సాధన అడహక్ కమిటీ అధ్యక్షుడు గొప్ప అచీవ్మెంట్.. నరేంద్ర మోదీ ఆదిలాబాద్‌కు వచ్చివెళ్లిన తర్వాత ఏమి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ తో పాటు పలువురు విమర్శించారు. ఇప్పుడు విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించింది. రానున్న రోజుల్లో శిక్షణ కేంద్రం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఇక్కడ వ్యా పార, వాణిజ్య అభివృద్ధికి దోహద పడుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా వ్యవహరించడం శుభపరిణామం. ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో విస్తృతంగా ప్రయత్నాలు చేశాను. అటు కేంద్ర మంత్రులను, ఇటు రాష్ట్రాన్ని ఒప్పించడం ద్వారా మా ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే రక్షణ శాఖ మంత్రి పర్మిషన్ ఇచ్చారు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆది లాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుమతి ఇ చ్చారు. ప్రధానంగా ఇటీవల నేను రెండు సార్లు పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదన రావ డం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆదిలా బాద్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ -
సీసీఐని పునరుద్ధరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని సీసీఐ సాధన కమిటీ సభ్యులు బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కోరారు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్రలతో కలిసి సభ్యులు పార్లమెంట్‌లోని మంత్రి చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ్యాక్టరీని పునఃప్రారంభించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కమిటీ కన్వీనర్ మల్లేశ్, నారాయణ, అరుణ్‌కుమార్, నగేష్, పోశెట్టి, రమేశ్ తదితరులున్నారు. -
సన్నబియ్యం వచ్చినయ్
రీసైక్లింగ్ దందాకు ఇక అడ్డుకట్ట.. ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీతో పేదలకు న్యూట్రిషియన్ ఫుడ్ అందడంతో పాటు బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్టపడనుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని శాంతినగర్, భాగ్యనగర్ కాలనీల్లోని 32, 36వ చౌకధరల దుకా ణాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. బి య్యం తూకం వేసి స్వయంగా కార్డుదారుల కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇది పేదవారి గుండెల్లో శా శ్వతంగా నిలిచిపోయే పథకమన్నారు. ప్ర జలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలనలో రేషన్‌కార్డులకు సంబంధించి మార్పులు, చేర్పుల కోసం ప్రజల నుంచి అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతుందని త్వరలోనే కొత్త కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా పౌరసరఫ రాల సంస్థ మేనేజర్ సుధారాణి, తహసీ ల్దార్ శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ నాయబ్ తహసీల్దార్ బాబూసింగ్ పాల్గొన్నారు. కై లాస్‌నగర్: తెల్లరేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ జిల్లాలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈమేరకు జి ల్లా వ్యాప్తంగా కార్డుదారులు ఉదయమే తమ గ్రా మాలు, వార్డుల్లోని రేషన్ దుకాణాలకు చేరుకున్నా రు. ఆదిలాబాద్ పట్టణంంలోని శాంతినగర్, భాగ్యనగర్ కాలనీల్లోని చౌకధరల దుకాణాల్లో కలెక్టర్ రా జర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. బోథ్ ని యోజకవర్గ పరిధిలోని నేరడిగొండ, బోథ్ మండల కేంద్రాల్లోని రేషన్‌షాపుల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్నబియ్యం పంపిణీని షురూ చేశారు. అలాగే ఉట్నూర్‌లోని రేషన్ షాపులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ బియ్యంను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సంబంధిత తహసీల్దార్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలుచోట్ల అధికార పార్టీ నాయకులు సైతం పాల్గొన్నారు. మరోవైపు కార్డుదారులు బియ్యం పంపిణీపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. తొలిరోజున 242 షాపుల్లో .. జిల్లాలో 356 రేషన్‌షాపులుండగా తొలిరోజున 242 షాపుల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. 325 షాపులకు బియ్యం చేరినప్పటికీ పలు చోట్ల డీలర్లు దుకాణాలను తెరువలేదు. దీంతో ఆయా చోట్ల పంపిణీ ప్రారంభం కాలేదు. తొలిరోజున జిల్లా వ్యాప్తంగా 28,623 మంది రేషన్‌కార్డుదారులకు గాను 653 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లుగా పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. జిల్లాలో మొదలైన పంపిణీ ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు తొలిరోజున 242 షాపుల్లో.. లబ్ధిదారుల్లో హర్షం -
అమాత్యయోగం ఎవరికో..?
● కేబినెట్ బెర్త్‌పై వీడని ఉత్కంఠ ● ముహూర్తం ఖరారుతో నేతల్లో టెన్షన్ ● ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 3న ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్ బెర్త్ ఎవరిని వరిస్తుందనే చర్చ సామాన్యుల నుంచి రాజకీయవర్గాల వరకు జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి పెరిగిన వేళ, నాయకులు, కార్యకర్తలు తమ ఎమ్మెల్యేకు అవకాశం వస్తుందా లేదా అనే టెన్షన్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజ యం సాధించారు. వీరిలో మంచిర్యాల జిల్లాకు చెందినవారే ముగ్గురు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును కూడా పరిగణనలోకి తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోటీలో ఎవరెవరు? బెల్లంపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ తానే సీనియర్‌నని చెప్పుకుంటూ ఢిల్లీలో లాబీ యింగ్ చేస్తున్నారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు, మంచి ర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ కోసం కష్టపడిన తనకే పదవి రావాలని వాదిస్తున్నారు. ఒక దశలో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని సంకేతాలు వచ్చాయి. తాజా పరిణామాలతో సందిగ్ధత నెలకొంది. ఆయన అనుచరులు కూడా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం ఉత్సాహంలో ఉంది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి.. వివేక్‌ను మంత్రి వివేక్‌గారూ అని సంబోధించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాల సామాజిక వర్గం నుంచి ఆయనకు బెర్త్ దక్కినట్లు చర్చలు ఊపందుకున్నాయి. అయితే హైకమాండ్ నుంచి ఎవరికీ స్పష్టత రాలేదు. దీంతో తుది జాబితాలో ఎవరుంటారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. హైకమాండ్ జాగ్రత్తలు.. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవుల ఎంపిక విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తోంది. పార్టీలో వ్యతిరేకత రాకుండా అభిప్రాయాలు సేకరిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం. మొదటి విస్తరణలోనే జిల్లాకు అవకాశం దక్కుతుందని భావించారు. తర్వాత ఈ ప్రక్రియ ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వచ్చింది. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్ని కల అనంతరం ఇప్పుడు ముహూర్తం ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడుతుందన్న చర్చ జరుగుతోంది. -
కొత్త డీఈవో జిల్లాకు వచ్చేనా..?●
● విధుల్లో చేరుతారో.. లేదోనని విద్యాశాఖలో ప్రచారం ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకు కొన్నేళ్లుగా రెగ్యులర్ డీఈవో కరువయ్యారు. ఐదేళ్లుగా ఇన్‌చార్జీలతో నే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో వి ద్యా వ్యవస్థ గాడి త ప్పింది. గతంలో డైట్ కళాశాల ప్రిన్సి పాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించగా, ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో ఏడీ, డీఈవోగా విధులు నిర్వహిస్తున్న ప్రణీతను ఇక్కడికి బదిలీ చేశారు. మూడున్నరేళ్ల పాటు ఆమె జిల్లాలో ఇన్చార్జి డీఈవోగా పనిచేశారు. మార్చి 31న ఉద్యోగ విరమణ పొందిన విష యం తెలిసిందే. ప్రస్తుతం పదో తరగతి పరీ క్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మోడల్ స్కూ ల్ డిప్యూటీ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశా రు. హైదరాబాద్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న దుర్గా ప్రసాద్‌కు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించేందుకు అనాసక్తిగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయనను ఆ శాఖ ఉద్యోగులు ఫోన్ ద్వారా సంప్రదించగా, అంతగా ఆసక్తి చూపడం లేదన్నట్టుగావారు పేర్కొంటున్నారు. అయి తే ప్రస్తుతం ఆయన పదో తరగతి పరీక్షలకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లాలో అబ్జర్వర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం పది పరీక్షలు ముగియనున్నాయి. ఆ తర్వా త ఆయన విధుల్లో చేరుతారో లేదో తెలి యాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్చార్జి బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదు. ఈనెల 7 నుంచి 15 వరకు పదో తరగతి మూల్యాంకనం షురూ కానుంది. అయితే ప్రస్తుతం కేటాయించిన దుర్గాప్రసాద్ విధుల్లో చేరుతారా లేకపోతే కొత్తవారికి అదనపు బాధ్యతలు ఇస్తారా, కొత్తవారిని కేటాయించేంత వరకు విద్యా శాఖ ఏడీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారా తెలియాల్సి ఉంది. -
ఆఫ్లైన్లోనూ ‘యువ వికాసం’
● ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తుకు అవకాశం ● ఈనెల 14వరకు గడువు కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువును ఈ నెల 14వరకు పొడిగించిన సంగతి తెలి సిందే. అయితే ఇప్పటి వరకు కేవలం మీసేవ కేంద్రాల్లోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా తాజాగా ఆఫ్లైన్లోనూ అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక నమూనా దరఖాస్తు ప్రతులను జిల్లాకు పంపించింది. వాటిని అన్ని ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈబీసీ(ఈడబ్ల్యూఎస్) కులాలకు చెందిన నిరుద్యోగ యువత బుధవారం నుంచి ఆయా కేంద్రాలను సంప్రదించి మ్యానువల్‌గానూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేంద్రాల్లో అందించిన దరఖా స్తులను పంచాయతీ కార్యదర్శులు, బల్దియా సి బ్బంది ఆన్లైన్ చేయనున్నారు. ఇది వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షి షా మంగళవారం జిల్లాలోని ఎంపీడీలు, సంబంధిత సంక్షేమాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆదాయ ధ్రువపత్రం లేకున్నా అవకాశం.. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే తహసీల్దార్లు జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణపత్రం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో వాటి కోసం రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందులో కొంత మినహాయింపునిచ్చింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. రేషన్ కార్డు నంబర్‌ను దరఖాస్తుతో పొందుపరిస్తే సరిపోతుంది. అయితే తెల్ల రేషన్‌కార్డు లేనటువంటి వారు మాత్రం తప్పనిసరిగా తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి.. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఏ విధానంలోనైనా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా ఆధార్, పాన్, కుల, ఆదాయ, విద్యార్హత ధ్రు వీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులను జత చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు తమ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసిన ధ్రువీకరణపత్రాలను దానికి జత చేసి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణపత్రాలను జతచేసి అందజేస్తే సరిపోతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారి కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకం దరఖాస్తుకు అర్హులు. ఈ పత్రాలతో పాటు, బ్యాంక్ సమ్మతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. యువ వికాసం పథకం వివరాలు యూనిట్ విలువ సబ్సిడీ బ్యాంకు లోన్ రూ.50వేలు వందశాతం –– రూ.50,001–1,00,000 90శాతం 10 శాతం రూ.1,00,001– 2,00,000 80శాతం 20శాతం రూ.2,00,001–4,00,000 70శాతం 30శాతం -
● కాంట్రాక్టర్ల చేతిలోకి గాంధీ పార్కు, స్విమ్మింగ్‌పూల్ ● లీజు విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం ● ఇప్పటికే ఈత చార్జీల పెంపు ● పార్కులోనూ వడ్డనకు రెడీ
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో గల గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్వి మ్మింగ్పూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రభుత్వ అజమాయిషీలోనే కొనసాగాయి. కొన్నేళ్లుగా లీజు విధానంలో ఇతరులకు అప్పగించినప్పటికీ పర్యవేక్షణ మాత్రం సర్కారు ఆధ్వర్యంలోనే కొనసాగింది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. వీటి నిర్వహణ కోసం ఇటీవల టెండర్లు పూర్తిచేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ నెల నుంచి వారే నిర్వహించనున్నారు. టెండర్లలో పోటీపడి లక్షలు వెచ్చించిన కాంట్రాక్టర్లు ఇప్పుడు వాటిని అధిక చార్జీల రూపంలో వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను జబాడే రాష్ట్రపాల్ రూ.21లక్షలకు, గాంధీ పార్కు నిర్వహణను టి.ప్రశాంత్ రూ.37.39 లక్షలకు ఏడాది ప్రాతిపాదికన దక్కించుకున్నారు. గతంలో ఇదీ పరిస్థితి.. స్టేడియం ఆవరణలో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌ను రెండేళ్లుగా లీజు విధానంలో ఓ స్విమ్మింగ్కోచ్కు అప్పగించారు. ఏడాదికి రూ.9లక్షలకు పైగా చెల్లించేవారు. అలాగే గాంధీ పార్కు నిర్వహణలో భాగంగా రూ.18లక్షల వరకు చెల్లించేవారు. ఈ రెండు కూడా ప్రైవేట్ వ్యక్తులు లీజు తీసుకున్నా అజమాయిషీ మాత్రం ప్రభుత్వపరంగా ఉండేది. ఈ సారి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించడంతో ఇక ప్రభుత్వ పాత్ర నామమాత్రంగా మారింది. ప్రధానంగా స్విమ్మింగ్‌పూల్‌కు ఏటా వేసవిలో వేలాది మంది ఉదయం, సాయంత్రం వేళల్లో వస్తుంటారు. చిన్నారులు కోచ్‌ల ద్వారా శిక్షణ తీసుకోవడం ఏటా కనిపిస్తోంది. ఇక గాంధీ పార్కుకు నిత్యం వందలాది మంది ఆహ్లాదం కోసం వస్తుంటారు. ఇక్కడ ఫొటోషూట్లు కూడా కొనసాగుతాయి. పిల్లలకు సంబంధించి అనేక ఆట వస్తువులు ఉండటంతో ప్రతి రోజు సాయంత్రం వేళలో పార్కు వందలాది మందితో సందడిగా ఉంటుంది. తాజాగా వీటి నిర్వహణ కాంట్రాక్టర్ల చేతికి పోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాల్సిందే. భారం కానున్న చార్జీలు.. టెండర్లలో లక్షలు వెచ్చించి కై వసం చేసుకున్న కాంట్రాక్టర్లు ఇక జనం నుంచి ఆ డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్విమ్మింగ్‌పూల్‌లో ప్రతి నెల పెద్దవారికి రూ.700 వరకు చార్జీ ఉండగా ఇప్పుడు రూ.వెయ్యికి పెంచేశారు. చిన్నారులకు ప్రతి నెల రూ.350 నుంచి రూ.400 వరకు ఉండగా ఇప్పుడు రూ.500కు పెంచేశారు. మరో రెండు, మూడు రోజుల్లో గాంధీ పార్కులోనూ చార్జీలను సవరించేందుకు సదరు కాంట్రాక్టర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకే నిర్వహణ.. గాంధీ పార్కు, స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించాం. టెండర్ నిబంధనలకు అనుగుణంగా వారు నిర్వహణ చేపట్టాలి. స్విమ్మింగ్‌పూల్‌లో స్టేడియం సిబ్బందికి, గాంధీ పార్కులో పనిచేసే కూలీలకు మా నుంచే వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో, ఆదిలాబాద్ టెండర్ల వరకే మా బాధ్యత గాంధీ పార్కు, స్విమ్మింగ్‌పూల్ నిర్వహణకు సంబంధించి టెండర్లను నిర్వహించే వరకే మున్సిపాలిటీ పా త్ర. ఇక వాటికి సంబంధించిన తదుపరి వ్యవహారాలన్నీ డీవైఎస్వో నుంచే జరుగుతాయి. స్విమ్మింగ్‌పూల్ అగ్రిమెంట్ పూర్తి కాగా, గాంధీ పార్కు అగ్రిమెంట్ రెండు, మూడు రోజుల్లో పూర్తి కానుంది. – పేరిరాజు, మున్సిపల్ ఇంజినీర్ -
బెట్టింగ్‌పై ఉక్కుపాదం
● యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● వన్‌టౌన్ పరిధిలో ఇద్దరిపై కేసు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని, ఈ యాప్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో ఇద్దరిపై బెట్టింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా డైట్ కళాశాల మైదానంలో కొందరు ఆన్లైన్లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈమేరకు దాడిచేయగా రామాయి గ్రామానికి చెందిన షేక్ సాజిద్ (ఏ–1), పట్టణానికి చెందిన సాయికుమార్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. వారి నుంచి రూ.1500 నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు బానిసవుతున్నారని పేర్కొన్నారు. అప్పుల పాలై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, ప్లే కార్డ్, గేమ్స్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, బెట్టింగ్ ప్రోత్సహించినా, నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు బి.సునీల్ కుమార్, కరుణాకర్‌రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. డయల్ 100 సిబ్బంది త్వరితగతిన స్పందించాలి ఆదిలాబాద్‌టౌన్: డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలోని సమావేశ మందిరంలో బ్లూకోర్ట్, డయల్ 100 సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్, నాగేందర్, సీఐలు భీమేష్, గుణవంతరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌ను కలిసిన ఆరోగ్య పాఠశాల బృందం
కై లాస్‌నగర్: జిల్లాలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమ పకడ్బందీ అమలుకు గాను కలెక్టర్ రాజ ర్షి షా ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి స్కోచ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్య పాఠశాల బృందం ప్రతినిధులు మంగళవారం కలెక్టర్‌ను తన క్యాంపు కా ర్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవో టి.ప్రణీత, కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ అజయ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, వైద్యులు వంశీ, శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, రిసోర్సుపర్సన్లు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలోనూ జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని కలెక్టర్ వారికి సూచించారు. ఆ దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. -
‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తు గడువు పెంపు
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన దరఖా స్తుల స్వీకరణ గడువు ఈ నెల 14వరకు పొడిగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపా రు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవా రం సాయంత్రం నిర్వహించిన వీడియో కా న్ఫరెన్స్లో తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(ఈడబ్ల్యూఎస్) చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేవారు ఎలాంటి అదనపు చార్జీ చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్,బీసీ సంక్షేమాధికారి కె.రాజ లింగు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎల్ఆర్ఎస్ గడువు
కై లాస్‌నగర్: అక్రమ లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించి 25శాతం ఫీజు రాయితీతో కూడిన ఎల్ఆర్ఎస్ గడువు సోమవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో సెలవు రోజైనా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు యథావిధిగా సేవలందించారు. దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పది కౌంటర్ల ద్వారా తమ ప్లాట్లకు సంబంధించిన ఫీజు చెల్లించారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఒక్క రోజే 300 మంది వరకు ఫీజు చెల్లించినట్లుగా పట్టణ ప్రణాళికాధికారి సుమలత తెలిపారు. అయితే ఎల్ఆర్ఎస్కు సంబంధించి పట్టణ పరిధిలో 22,369 దరఖాస్తులు రాగా అందులో 3వేల దరఖాస్తులకు మాత్రమే ఫీజు చెల్లించినట్లుగా తెలుస్తోంది. రాయితీ గడువు ముగియడంతో మరోసారి అవకాశం కల్పించాలని ఫీజు చెల్లించని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ గడువు పొడిగిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో కనిపించని సందడి.. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసింది. సోమవారం చివరి రోజు కావడంతో జిల్లాలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు సెలవురోజైనా యథావి ధిగా పనిచేశాయి. ఉద్యోగులు అందుబాటులో ఉండి సే వలందించారు. అయితే ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లేమి కాలేదు. ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు జనరల్ రిజిస్ట్రేషన్లు కాగా, మరో నాలుగు ఎల్ఆర్ఎస్కు సంబంధించినవి అయ్యా యి. ఇక బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. అయితే ఆరుగురు దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఫీజు మాత్రమే చెల్లించారు. ఎలాంటి ప్రొసీడింగ్‌లు అందుకోలేదని రిజి స్ట్రేషన్ అధికారులు తెలిపారు. -
● జిల్లాలో నేటి నుంచి సన్నబియ్యం పంపిణీ ● ఇంకా పూర్తిస్థాయిలో అందని రేషన్ కోటా ● గ్రామీణ షాపులకు పది క్వింటాళ్లలోపే సరఫరా
నేటి నుంచి పంపిణీ ప్రభుత్వం పేదలకు అందించనున్న సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ మంగళవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాకు చేరిన కోటాకు అనుగుణంగా అన్ని షాపులకు సర్దుబాటు చేశాం. మరో 25 షాపులకు బియ్యం రావాల్సి ఉంది. పండుగల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. మంగళవారం బియ్యం వచ్చిన వెంటనే ఆయా షాపులకు సరఫరా చేస్తాం. – సుధారాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉగాది కానుకగా సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ పంపిణీ ప్రక్రియ జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో గల 32వ చౌక దుకాణంలో కలెక్టర్ రాజర్షి షా ఉదయం 9గంటలకు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలోని అన్ని దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. అయితే జిల్లాకు పూర్తిస్థాయిలో బియ్యం కోటా రాలేదు. మార్చి 31వరకే జిల్లాకు అవసరమైన బియ్యం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో చేరకపోవడం గమనార్హం. దీంతో జిల్లాలోని పలు షాపులకు ఇంకా బియ్యం సరఫరా కాలేదు. కాగా, సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో రేషన్ కార్డుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాకు చేరింది 3వేల మెట్రిక్ టన్నులే .. జిల్లాలో రేషన్‌కార్డులు ఏఏవై, ఆహారభద్రత, అన్నపూర్ణ కలిపి మొత్తం 1,91,755 ఉన్నాయి. వీటి పరిధిలో 6,49,521 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందించనున్నారు. ఇందుకు గాను జిల్లాకు 4,125.474 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. ఈ బియ్యంను నిజామాబాద్ జిల్లా నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి జిల్లాలోని ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లకు ఇ ప్పటి వరకు 3వేల మెట్రిక్ టన్నుల బియ్యం మార తమే చేరాయి. ఇంకా 1,125 మెట్రిక్ టన్నుల బి య్యం రావాల్సి ఉంది. ఉగాది, రంజాన్ పండుగలు వరుసగా వచ్చిన నేపథ్యంలో బియ్యం సరఫరాలో ఆలస్యమైనట్లుగా అధికారులు చెబుతున్నారు. పట్టణంలో ఒకే.. గ్రామాలకు సర్దుబాటు జిల్లా కేంద్రంలోని చౌక దుకాణాలన్నింటికీ పూర్తి స్థాయి కోటా బియ్యం అందజేసిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు మాత్రం అరకొరగా కేటాయింపులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 356 చౌక దుకాణాలుండగా అందులో ఇప్పటి వరకు 325 దుకాణాలకు సరఫరా చేశారు. మరో 25 షాపులకు చేరాల్సి ఉంది. ఆయా షాపుల్లో బియ్యం అందాకే పంపిణీ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 42 రేషన్‌షాపులుండగా వాటి పరిధిలోని కార్డుదారులకు అవసరమైన ఈ నెల కోటా బియ్యం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలకు మాత్రం సర్దుబాటు చేశారు. మండలంలో పది షాపులంటే ఐదారు షాపులకు పూర్తి కోటా బియ్యం అందజేయగా, మిగతా షాపులకు ఒక్కో షాపునకు కనీసంగా ఐదు నుంచి పది క్వింటాళ్ల వరకు సరఫరా చేశారు. ఆన్లైన్లో పేరున్నా ఓకే..జిల్లాలో.. చౌక ధరల దుకాణాలు : 356 ఏఏవై కార్డులు : 14570 అన్నపూర్ణ కార్డులు : 245 ఆహారభద్రత కార్డులు : 1,76,940 అవసరమైన బియ్యం కోటా: 4,125 మెట్రిక్ టన్నులు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూ తనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నా యి. ఉగాది రోజున సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేర కు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు మంజూరైనా గ్రామసభల్లో అర్హుల జాబి తా వెల్లడి సమయంలో తలెత్తిన సమస్యలతో ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదాపడ్డాయి. మ రోవైపు మీసేవల్లో కొత్త కార్డుల మార్పులు, చేర్పు ల కోసం ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇక సన్నబియ్యం ఇప్పటికే రేషన్ దుకాణా లకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి మొత్తం కోటా లో కనీసం 50శాతం వరకు సరఫరా చేశారు. ప్ర తినెలా బియ్యం రవాణాలో అనేక చోట్ల జాప్యం జరుగుతున్నా ఈసారి అలా జరగకుండా అధికా రులు చర్యలు తీసుకున్నారు. తొలిరోజున స్థానిక ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ నాయకులు ఆ యా రేషన్ దుకాణాల వద్ద హాజరు కానున్నారు. -
జొన్న కొనుగోళ్లెప్పుడో?
ఇక్కడ కనిపిస్తున్న రైతు గడ్డల నారాయణ. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామం. యాసంగిలో ఐదెకరాల్లో జొన్న సాగు చేశా డు. 15 రోజుల క్రితం 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దానిని విక్రయించేందుకు నాలుగు రోజుల క్రితం బోథ్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 3,371. అయితే యార్డులో ఇంకా కొనుగోళ్లు షురూ చేయలేదు. మరోవైపు ప్రైవేట్‌లో రూ.3వేల లోపే ధర ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దళారులకు అమ్మితే నష్టపోతానని వాపోతున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో జొన్న సాగు చేసిన చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. -
ఆ పనులపై నీలినీడలు!
● ‘ఎస్సీ సబ్‌ప్లాన్’ కేటాయింపుపై గందరగోళం ● బోథ్ నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు ● మంత్రి సీతక్క ద్వారా పనుల కేటాయింపు ● మొదట ఎమ్మెల్యేకు, తర్వాత కాంగ్రెస్ ఇన్‌చార్జీకి పంపకాలు ● ఆరోపణల నేపథ్యంలో రెండింటి ఉత్తర్వులు నిలిపివేత సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉండటం, జిల్లాలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కలిగి ఉండడంతో ప్రభుత్వం చేపట్టే అధికారిక పనుల కేటాయింపులో తారతమ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనుల విషయంలో బోథ్ నియోజకవర్గంలో ఇవి ముదిరాయి. బీఆర్ఎస్కు చెందిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ మధ్య ఈ పనుల పంపకాల విషయంలో రగడ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్యకర్తలకు పనుల పంపకాలు చేయాలని చూస్తుండగా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తమ పార్టీ కార్యకర్తలకు ఈ పనులు పంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే ద్వారా, అటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ద్వారా ఈ పనుల విషయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కపై ఒత్తిడి పెరగడంతో ఆమె తలపట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పటివరకు జారీ చేసిన అన్నిరకాల ఉత్తర్వులను నిలిపివేయడంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రూ.10 కోట్ల విలువైన పనులు.. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నియోజకవర్గానికి రూ.10 కో ట్ల విలువైన పనులను ప్రభుత్వం కేటాయించింది. ఈ పనుల పంపకాల విషయంలో బోథ్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా వార్ ముదిరింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వీటిని మంజూరు చేశారు. మొదట బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్‌కు ఈవర్క్ పంపకాలు చేస్తూ మంత్రి సీతక్క నుంచి నిర్ణయం వెలువడింది. దీంతో ఎమ్మెల్యే తన అనుచరులకు కేటాయించారు. సీసీ రోడ్లు, నాలాలు నిర్మించేందుకు వీటినిఉపయోగిస్తున్నారు. రూ.5లక్షల అంచనా వ్యయంతో నామి నేష న్ పద్ధతిన పనులను అప్పగించారు. అయితే అప్ప ట్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఎమ్మె ల్యే ఈ పనులను ప్రారంభిస్తున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి గజేందర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నే పథ్యంలో అప్పట్లో ప్రతిపాదించిన తీర్మానాలను మంత్రి సీతక్క ఆదేశాలతో నిలిపివేశారు. దీంతో తమ ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ పనులను ఎన్నికల తర్వాత మొదలుపెడతామని ఎమ్మెల్యే వారికి భరోసానిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలకు బోథ్ నియోజకవర్గంలో ప్రాధాన్యత లభించడం లే దని, వర్క్స్ కేటాయించడం లేదని కార్యకర్తలు ఇన్చార్జి గజేందర్ ద్వారా మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె కొత్త ప్రొసీడింగ్‌తో ఈ పనుల ను కాంగ్రెస్ కార్యకర్తలకు పంపిణీ చేశారు. వారు కూడా అక్కడక్కడా ప్రారంభించారు. మళ్లీ మొదటికి.. తాజాగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కలిసి ఈ విషయంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా తనకు ప్రాధాన్యత కల్పించి పనులు కేటాయించాలని కోరినట్టు సమాచారం. దీంతో మంత్రి సీతక్క తిరిగి కొత్తగా జారీ చేసిన తీర్మానాలను నిలిపివేయాలని జిల్లా యంత్రాంగం ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు తె లుస్తోంది. దీంతో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన రూ.10కోట్ల పనులు బోథ్ నియోజకవర్గంలో ప్రస్తు తం సందిగ్ధంలో పడ్డాయి. నా దృష్టికి రాలేదు.. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి నిధులను ఎమ్మెల్యేలకు కేటాయిస్తారు. బోథ్‌లో పనుల విషయంలో నెలకొన్న పరిస్థితులు నా దృష్టికి రాలేదు. జిల్లా దళిత అభివృద్ధి శాఖ వద్ద పూర్తి వివరాలు ఉంటాయి. – వెంకటరమణ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) -
● స్పష్టత ఇవ్వని సర్కారు ● షురూ కాని కేంద్రాలు ● ఆందోళనలో రైతులు
బోథ్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట దిగుబడిని విక్రయించేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో జొన్న పంట చేతికి వచ్చి పక్షం దాటినా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు షురూ చేయలేదు. కొంతమంది రైతులు పంట దిగుబడిని ఇప్పటికే యార్డులకు తీసుకువచ్చారు. రోజుల తరబడి నిరీక్షిస్తున్నా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. తప్పని నిరీక్షణ జిల్లాలో ఈ యాసంగిలో సాగైన జొన్న పంట ది గుబడి మార్చి నుంచే చేతికొస్తోంది. చాలా మంది రైతులు దిగుబడిని ఇప్పటికే ఇళ్లలో నిల్వ చేశారు. కొందరు యార్డులకు తరలించారు. అయితే ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను షురూ చేయకపోవడంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. గత్యంతరం లేక పలువురు దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. ప్రైవేట్‌లో రూ.3వేల లోపే.. ప్రస్తుతం ప్రైవేట్‌లో జొన్నలు క్వింటాలుకు రూ. 2,800 నుంచి రూ.3వేల లోపే ధర పలుకుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇంకా షురూ చేయకపోవడంతో దళారులు, ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధరతో పోల్చితే క్వింటాలుకు రూ.300 నుంచి రూ.500 తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు. జిల్లాలో.. జొన్న సాగు విస్తీర్ణం : 70,520 ఎకరాలు క్వింటాలుకు మద్దతు ధర (హైబ్రిడ్ రకం) : రూ. 3,371యార్డు వద్ద నిరీక్షిస్తున్నాం.. జొన్నలకు ప్రైవేట్‌లో ధర రూ.3వేల లోపే ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 క్వింటాళ్లు రావాల్సింది 15 క్వింటాళ్లకే పరిమితమైంది. 15 రోజుల క్రితం దిగుబడి చేతికి రాగా ఇటీవల యార్డుకు తీసుకువచ్చాను. అధికారులేమో కొనుగోలుకు ఆదేశాలు రాలేదంటున్నరు. ఇంకెన్ని రోజులు వేచి చూడాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నాం. నాగుల పోశెట్టి, రైతు, బోథ్ ప్రభుత్వం ఆదేశిస్తే కొనుగోలు చేస్తాం జొన్న కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఆదేశాలు వస్తే వెంటనే కొనుగోళ్లు షురూ చేస్తాం. విషయాన్ని రైతులకు వివరిస్తున్నాం. – ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ -
రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, నవీకరణను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జైనథ్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం తని ఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతీ గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించాలన్నారు. అలాగే సీఐ, ఎస్సైలు తమ పరిధిలో ని ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తూ అక్కడి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చొరవ చూపాలన్నారు. ఇందుకోసం ‘పోలీసు మీకోసం’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీలైనంత వరకు అన్ని పోలీసు కార్యాలయాల్లో సిబ్బందికి వారాంతపు సెలవు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు. సన్మానం పోలీస్ అధికారులు పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ ఎస్సై జి.చంద్రకాంత్‌ను పూ లమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ఏవో భక్త ప్ర హ్లాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటి, జిల్లా అసో సియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుల సంరక్షణే ధ్యేయం
ఆదిలాబాద్‌టౌన్: వృద్ధుల సంరక్షణే ధ్యే యంగా ముందుకు సాగుతున్నామని వయో వృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవిదాస్ దేశ్‌పాండే అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో 70 ఏళ్లు నిండిన వృద్ధులను ఆదివారం సన్మానించారు. బండారి రాజ మ్మ, వై.రాములు, వై.సరోజినిదేవి, లక్ష్మి, స మ్మక్క, విజయలక్ష్మిలకు ఔషధ మొక్కలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కా ర్యక్రమంలో సంఘం నాయకులు నర్సింలు, దేవాసింగ్, వెంకటి, ప్రకాశ్, ఈర్ల సత్యనారాయణ, పాశం రాఘవేంద్ర, కంది శ్రీని వాసరెడ్డి, నాగేశ్వర్, రాజేశ్ పాల్గొన్నారు. -
విశ్వావసును స్వాగతిస్తూ
పంచాంగ పఠనం చేస్తున్న సిద్ధాంతి వ్యవసాయ క్షేత్రంలో బసవన్నలతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ఉగాది పచ్చడి పంపిణీ చేస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్: జిల్లావాసులు ఉగాది వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలి కారు. వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకుని పూజలు చేశారు. ఈ ఏడాది శుభాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కో రుకున్నారు. ప్రతీ ఇల్లు మామిడి తోరణాలతో కళకళలాడగా.. షడ్రుచుల పచ్చడి, బూరెలు, గుడాలు వంటి వంటకాలతో ఘుమఘుమలా డింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ పంట చేలల్లో పూజలు చేసి, వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామిజీ పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని వినాయక చౌక్‌లో శ్రీ రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగా ది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కై లాస్‌నగర్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో చికిలి లక్ష్మి వెంకటేశ్వర సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. అలాగే పలువురు మహారాష్ట్రవాసులు గుడిపడ్వా వేడుకలను జరుపుకున్నారు. నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన స్వగ్రామం రాజురలో గల వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా బసవన్నలకు నైవేద్యం సమర్పించారు. వైభవంగా ఉగాది వేడుకలు ఆలయాలకు పోటెత్తిన భక్తులు పంచాంగం వినిపించిన పండితులు -
● హోటళ్లు, స్వీట్‌షాపుల్లో అపరిశుభ్ర ఆహారం ● రోజుల తరబడి ఫ్రిజ్‌లో మాంసపు నిల్వలు ● వాడిన నూనె మళ్లీ వినియోగం ● ప్రజారోగ్యంతో నిర్వాహకుల చెలగాటం ● నామమాత్రపు తనిఖీలకే అధికారులు పరిమితం
● గతేడాది నవంబర్‌లో ఆదిలాబాద్‌లోని పలు హోటళ్లు, స్వీట్ షాపులను రాష్ట్రస్థాయి ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రోజుల తరబడి ఉంచిన ఆహార పదార్థాలు, స్వీట్ షాపుల్లో రసాయనాల వాడకం, ఫ్రిజ్‌లో బూజు పట్టిన మాంసం, కిచెన్‌లో అపరిశుభ్రత దర్శనమిచ్చాయి. శాంపిళ్లను సైతం తీసుకెళ్లారు. దుర్గంధం వెదజల్లే పదార్థాలపై ఘుమ ఘుమ లాడే రసాయనాలు వేయడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ● ఆదిలాబాద్ పట్టణంలోని ఓ బిర్యానీ హౌస్‌ను మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, పలువురు అధికారులు ఇటీవల తనిఖీ చేశారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హోటల్లో కుళ్లిన మాంసం, మరో స్వీట్ షాపులో చెడిపోయిన పదార్థాలు ఉండడంతో రెండు షాపులకు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. నోటీసులు జారీ చేశారు. మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో లభ్యమైన కుళ్లిన మాంసంపై పినాయిల్ చల్లుతున్న అధికారులు (ఫైల్)ఆదిలాబాద్‌టౌన్: స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్, హోటల్‌కు వెళ్తున్నారా.. వారితో కలిసి మిఠాయిలు తింటూ ఆనందం పంచుకుంటున్నారా.. అయితే ఒక్కక్షణం ఆలోచించండి. మీరు తినే ఆహారం ఎంత నాణ్యమైనదో తెలుసుకుంటే జీవితంలో వాటి ఊసెత్తరంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని పలు హోటళ్లు, స్వీట్ షాపుల్లో కుళ్లిన పదార్థాలను వినియోగిస్తున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది వాటి తీరు. మాంసంను రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం, స్వీట్ షాపుల్లో రసాయనాలు వాడటం, వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగించడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. నిర్మల్ జిల్లాలోని ఓ హోటల్లో గతేడాది జిల్లాకు చెందిన ఓ యువతి భోజనం చేసిన అనంతరం వాంతులు చేసుకొని మృత్యువాత పడిన విషయం విదితమే. ఆమెతో పాటు భోజనం చేసిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. అయినా చాలా హోటళ్లు, స్వీట్‌షాపుల నిర్వాహకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అడపాదడపా తనిఖీలు చేసే అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు కాకుండా నామ్‌కే వాస్తే జరిమానా విధిస్తుండడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. వాసన రాకుండా.. ట్రిక్‌లు జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లోని కిచెన్లలో దుర్గంధం వెదజల్లుతోంది. కిచెన్ పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తే మరోసారి అక్కడికి వెళ్లి తినాలనే కోరిక కూడా పుట్టదు. చాలా హోటళ్లలో చేసిన బిర్యానీ ఆ రోజు మిగిలితే అందులోని ముక్కలు తీసి మరుసటి రోజు వినియోగిస్తున్నారు. వాటిపై సువాసన వెదజల్లే రసాయనాలను చల్లుతున్నారు. వండిన ఆహార పదార్థాలు ఘుమ ఘుమ లాడేందుకు టెస్టింగ్ పౌడర్ వేస్తున్నారు. ఇలాంటి భోజనం చేస్తే క్యాన్సర్ బారిన పడే ప్రమా దం లేకపోలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మిఠాయిల్లోనూ రసాయనాలే.. స్వీట్ హౌస్‌ల్లో తయారు చేసే మిఠాయిల్లోనూ ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. వాడిన నూనెనే మళ్లీ వినియోగించడం, రుచి కోసం కెమికల్స్ వేయడం, కల్తీ పాలు, నెయ్యి, ఇతర పదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాగే చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లపై తయారు చేసే ఆహార పదార్థాలకు సైతం కాగిన నూనెనే వినియోగిస్తుండడంతో జనం క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడే ప్రమా దం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. నిరంతర తనిఖీలు చేస్తే.. ఇక ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఏడాదికోసారి చుట్టపుచూపుగా తనిఖీలు చేసి మమా అనిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. జిల్లా కేంద్రంలో రెండు, మూడింటిని మాత్రమే తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. నిరంతరం తనిఖీలు చేపడితేనే ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పత్తా లేని ఆహార తనిఖీ అధికారులు.. జిల్లాలో ఆహార తనిఖీ అధికారులు ఏళ్లుగా పత్తా లేకుండా పోయారు. వైద్య శాఖలో పనిచేస్తున్న ఎన్సీడీ అధికారికి డిసిగ్నేటెడ్ అధికారి బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ కార్యాలయంలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఒక అ టెండర్ మాత్రమే ఉన్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఏళ్లుగా తనిఖీలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఇటీవల మంచిర్యాలకు చెందిన ఎఫ్ఎస్వోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ఆయన అసలు తనిఖీలకే దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారానికి రెండుసార్లు తనిఖీలు జిల్లా కేంద్రంలోని హోటళ్లు, స్వీట్ షాపుల్లో వారానికి రెండుసార్లు తనిఖీలు చేపడతాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల క్రితం ఒక హోటల్, ఒక స్వీట్ షాపును తనిఖీ చేశాం. పరిశుభ్రత పాటించకపోవడంతో నోటీసులు జారీ చేశాం. రూ.5వేల చొప్పున జరిమానా విధించాం. – నరేందర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఆదిలాబాద్ ఎఫ్ఎస్వో లేకపోవడంతో.. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేని జిల్లాల్లో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఫుడ్ ఇన్స్పెక్ట ర్ కార్యాలయంలో డాటాఎంట్రీ ఆపరేటర్, అటెండర్ మాత్రమే ఉన్నారు. కొంత కాలంగా ఎఫ్ఎస్వో లేరు. సిబ్బంది లేకపోవడంతో తనిఖీలు నిర్వహించలేకపోతున్నాం. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశాం. తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ శ్రీధర్, డిసిగ్నెటెడ్ ఫుడ్ అధికారి, ఆదిలాబాద్ -
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుల స్వీకరణ
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ (ఈడబ్ల్యూఎస్)కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.4 లక్షల వరకు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. రూ.50వేల లోపు విలువ చేసే యూనిట్‌కు వంద శాతం సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. రూ.లక్ష లోపు యూనిట్ కు 90 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల యూనిట్‌కు 80 శాతం సబ్సిడీ, రూ.4 లక్షల వరకు గల యూ నిట్‌కు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయేతర పథకాల యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలని, అలాగే వ్యవసాయ ఆధారిత పథకాలకు దరఖాస్తు చేసే వారి వయస్సు 21నుంచి 60 ఏళ్లలోపు ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వారయితే రూ.2లక్షల్లోపు ఉండాలని తెలిపారు. అలాగే బ్యాంక్ సమ్మతి తప్పనిసరి అని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, కుల, ఆదాయ, నివాస, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా జతచేయాలని సూచించారు. ఆసక్తి గల వారు tgobmmsnew.cgg.gov. in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాల ప్రతులను జత చేసి సంబంధిత ఎంపీడీవో, మున్సి పల్ కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నా రు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.రంజాన్‌ను ఆనందంగా జరుపుకోవాలిజిల్లాలోని ముస్లింలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కలెక్టర్ రా జర్షి షా కోరారు. పవిత్ర మాసంలో ప్రతీ ముస్లిం నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపడతారని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులతో అందరి కి శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. -
ఈద్గా వద్ద పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఈద్గా మై దానంతో పాటు అన్ని మసీదులు, ము ఖ్యౖ మెన ప్రదేశాల్లో పికెట్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సో మవారం రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో దాదా పు 250 మంది సిబ్బందితో పకడ్బందీ బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎ స్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సునీల్‌కుమార్, కరుణాకర్‌రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మహేందర్, సిబ్బంది ఉన్నారు. -
తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు
● మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ‘పాయల్’ ఆదేశం కై లాస్‌నగర్: గతంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భూగర్భజలాల మట్టం పడిపోవడం ఆందోళనకరమని, అయినా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణానికి తాగునీటిని అందించే లాండసాంగ్వీ పంపుహౌస్‌ను ఆది వారం పరిశీలించారు. మోటార్ల సామర్థ్యం వివరా లను కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరో 300 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీతో మాట్లాడి వాగులో చెక్‌డ్యాంలు నిర్మించేందుకు వీలుగాఅనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో భూగర్భజలాల మట్టం భారీగా తగ్గిన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నీటి ఎద్దడి తీవ్రతరం కాకముందే అందుబాటులోని వనరులను వాడుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఈలు తిరుపతి, కార్తీక్, బీజేపీ నాయకులు వేదవ్యాస్, రవి, లాలామున్నా, తదితరులున్నారు. -
పెరిగిన ‘ఉపాధి’ కూలి
● మరో రూ.7లు పెంచిన కేంద్రం ● రేపటి నుంచి అమల్లోకి.. ● కూలీలకు ఉగాది కానుక కై లాస్‌నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికిచ్చే కూలి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఈ సమయంలో పనులకు వచ్చే కూలీల కు ప్రయోజనం చేకూర్చేలా గతంలో కేంద్రం అదనపు భత్యం చెల్లించేది. అయితే రెండేళ్లుగా దీనిని నిలిపివేసింది. తాజాగా ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో దినసరి కూలి మరో రూ.7లకు పెంచింది. ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 2లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. రూ.307కు చేరిన కూలి వలసలను అరికట్టి గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు స్థానికంగానే వంద రోజుల పాటు పని కల్పించాలనే ఉద్దేశంతో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాబ్‌కార్డు కలిగిన వారికి చెరువులు, కుంటలు, బావుల్లో పూడికతీత, హరితహారం కింద నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, సంరక్షించడం, వ్యవసాయ భూముల సంరక్షణ వంటి పనులను కల్పిస్తున్నారు. పథకం ప్రారంభంలో రోజు వారీ కూలి రూ.87.50గా చెల్లించేవారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో కూలీలకు లబ్ధి చేకూర్చేలా కూలి సైతం క్రమంగా పెంచుతూ వస్తోంది. 2022లో రూ.12 పెంచగా, 2023లో రూ.15 పెంచారు. గతేడాది అత్యధికంగా రూ.28లు పెంచడంతో రోజువారీ కూలి రూ. 300కు చేరింది. తాజాగా మరో రూ.7 పెంచడంతో ఇది రూ.307కు చేరువైంది. పస్తుతం రోజు వారీ సగటు కూలి రూ.238.77గా చెల్లిస్తున్నారు. పెరుగనున్న కూలీల సంఖ్య జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నాయి. దీంతో రైతులతో పాటు వ్యవసాయ కూలీలంతా ఉపాధి పనులపైనే ఆసక్తి చూపుతారు. వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భ రోసా పథకం అమలు చేయనుండటంతో కూలీ ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. దీంతో రానున్న రెండు నెలల పాటు ఉపాధి పనులు ముమ్మరంగా సాగనున్నాయి. ప్రతీ కూలీకి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు తదనుగుణంగా బడ్జెట్ కేటా యించారు. ఈ పనులకు హాజరయ్యే కూలీలకు అవసరమైన పార, గడ్డపార, తట్టల కొనుగో లుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అదనపు భత్యం చెల్లించేది. అయితే మూడేళ్లుగా దాన్ని నిలిపివేసింది. బదులుగా కూలి పెంచుతూ వస్తోంది. జిల్లాలో.. జాబ్‌కార్డులు : 2.23 లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు : 1.36లక్షలు నమోదు చేసుకున్న కూలీలు : 3.45లక్షలు పనులకు వచ్చే కూలీలు : 2.17లక్షలు వంద రోజులు పని పూర్తిచేసిన కుటుంబాలు : 4,063 వచ్చే ఆర్థిక సంవత్సర పనిదినాల లక్ష్యం : 51.79 లక్షలు రేపటి నుంచి అమలు కేంద్ర ప్రభుత్వం పెంచిన దినసరి కూలి ఈ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో కూలీలకు ఆర్థికంగా కొంత లబ్ధి చేకూరనుంది. జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కూలీకి వంద రోజుల పాటు పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతతో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. – రవీందర్, డీఆర్డీవో, ఆదిలాబాద్ -
డీఈవో ప్రణీతకు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యాశాఖాధికారి టి.ప్రణీతను కార్యాలయ అధికారులు, ఉద్యోగులు శని వారం ఘనంగా సన్మానించారు. ఈ నెల 31న ఉ ద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో ముందస్తుగా పూలమాలలు, శాలువాలతో సత్కరించా రు. పుష్పగుచ్ఛాలు అందజేసి వీడ్కోలు పలికా రు. నిర్మల్ జిల్లాలో ఏడీగా, డీఈవోగా పనిచేసిన ఈమె 2021 నవంబర్‌లో జిల్లాలో ఇన్చార్జి డీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఏడీ వేణుగోపాల్‌గౌడ్, ఏసీ వేణుగోపాల్ రెడ్డి, సూపరింటెండెంట్ మధుసూదన్‌రెడ్డి, డైట్ కళా శాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, సెక్టోరియల్ అధికారులు ఉదయశ్రీ, సుజాత్‌ఖాన్, నారాయణ, శ్రీకాంత్ గౌడ్, డైట్ కళాశాల సూపరింటెండెంట్ మమత పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అఽధికారిగా దుర్గా ప్రసాద్ ఆదిలాబాద్‌టౌన్: జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (ఎఫ్ఏసీ)గా ఎన్వీ.దుర్గా ప్రసాద్ నియామకమయ్యారు. ప్రస్తుత డీఈవో ప్రణీత ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో హైదరాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో మోడల్ స్కూల్ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్‌ను నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ మదన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. -
శ్రీ విశ్వావసు వత్సరమా! స్వాగతం
శ్రీ విశ్వావసు వర్షమా స్వాగతం సుస్వాగతం కొత్త ఉషస్సులతో.. కొంగొత్త జీవితాలనీయ.. కులమతాల అడ్డుగోడలు కూలిపోవాలని.. పసిడి పంటల రాసులతో గాదెలు నిండాలనీ.. పేద, ధనిక లేని సమసమాజం రావాలని.. మతహింస రక్షసికి మరణశాసనం రాయాలని.. మానవత్వపు విరులు ప్రతీ ఎదలో వెల్లివిరియాలని.. ఉత్తర, దక్షిణ ప్రాంతీయ భేదాలు సమసి పోవాలని.. కుళ్లు రాజకీయాలకు చెల్లు చీటి రాయాలని.. సుఖశాంతుల నిలయమై వసుధ వర్థిల్లాలని.. ప్రేమ, మైత్రి విశ్వమంతా ఆవహించాలని.. నవ శకానికి నాంది పలుకాలని.. చైత్రమాసంలో వసంతుడు పలికే.. ఓ నవవర్ష పర్వమా స్వాగతం స్వాగతం.. తీపి, వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు షడ్రుచుల పచ్చడి.. నవజీవన సారమని అందించ యుగాది.. తొలి పర్వమై ఏతెంచె శ్రీ విశ్వావసు వర్షము.. సర్వజనహితమును చేకూర్చ.. సత్సంబంధాలు నొసగ.. ఓ విశ్వాసువత్సరమా! స్వాగతం! స్వాగతం – గంగుల చిన్నన్నా, తెలుగు ఉపాధ్యాయుడు, భోసి సేకరణ: తానూరు -
తొలి వేకువజామున వసంత కోకిల
స్వరాల సరాగాలు వినిపిస్తుంటే.. ముడుచుకున్న ఆలోచనలు స్నిగ్ధమనోహరంగా మనస్సు పొరల్లో విచ్చుకోవాలి..! కలల వాకిళ్లపై ఆశల కల్లాపి చల్లి ఆంతరంగిక లోగిళ్ల నిండా వసంత వేడుకలు ఆవిష్కృతమవ్వాలి..! ప్రతినోటా స్వచ్ఛమైన సత్యం ఉషస్సులా ఉదయించాలి..!! – పసుల ప్రతాప్, ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ సేకరణ: ఆదిలాబాద్ టౌన్ -
తెలుగుదనం ఉట్టిపడేట్టు
పంచకట్టు.. సంప్రదాయ వస్త్రధారణ. కాలంలోపాటు వస్త్రధారణ మారినా.. తెలుగుదనం ఉట్టిపడేది మాత్రం పంచకట్టులోనే. వృత్తులు, విధులు, ఉద్యోగాల రీత్యా వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అయినా ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేటికీ సంప్రదాయ పంచకట్టులో ఠీవీ చాటుకుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాన్ని భావితరాలకు అందిస్తున్నారు. వస్త్రధారణ ఆధారంగానే ‘మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా’.. మేం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులం’ అని చెప్పకనే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రైతులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలుగుదనం ఉట్టిపడేలా ఇప్పటికీ తెల్లని చొక్కా, ధోవతి, కండువా ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్తున్నారు.‘సరికొత్త ఉగాది‘అదిగదిగో.. వస్తోంది విశ్వావసు నామ సంవత్సర ఉగాది! తెలుగు కొత్త సంవత్సరంలో వెలుగులు విరజిమ్ముతూ.. కొత్త ఆశల చిగుర్లతో పాత క్యాలెండరుని పారద్రోలి.. ఓ కొత్త తెలుగు క్యాలెండర్‌గా ఉనికిని చాటడానికి!! విశ్వావసు క్రాంతితో.. తెలుగువారి లోగిళ్లలో.. వస్తున్నాడదిగో కొంగొత్త కాంతితో.. సరికొత్త ఉగాది!! షడ్రుచుల కొత్త మేళవింపు వసంతాన్ని వెంటబెట్టుకొని చైత్రంతో సరాగాలాడుతూ లేత మామిడి చిగురులు మానవాళికి ఓ తాంబూలం కొమ్మలపై కూర్చున్నా కోకిలమ్మలు మధురంగా కూస్తూ విశ్వావసును స్వాగతిస్తున్నాయి మానవాళికి కొత్త సందేశానిస్తున్నాయి.. రైతన్నల కళ్లలో పరిఢవిల్లే ఓ కొత్తకాంతి.. నిజమైన ప్రశాంతి విశ్రాంతి!! ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు పరిచి.. రతనాల రంగులు వేసి స్వాగతం పలుకుదాం!! – అంబటి నారాయణ, తెలుగు ఉపాధ్యాయుడు, చామన్‌పెల్లి పాఠశాల సేకరణ: లక్ష్మణచాంద ● ఆహార్యంలో పంచకట్టు ఠీవీ.. ● ప్రత్యేకత చాటుకుంటున్న ఉమ్మడి జిల్లా వాసులు సంప్రదాయం మరవలేదు బజార్హత్నూర్: మండల కేంద్రానికి చెందిన మల్లెపూల నర్సయ్య తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా 40 ఏళ్లుగా పంచెకట్టు (దోవతి) ధరిస్తున్నాడు. 1981లో పీహెచ్డీ పూర్తి చేశాడు. రాజకీయాలపై మక్కువతో కాంగ్రెస్‌లో చేరి 2001, 2019లో బజార్హత్నూర్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఉన్నత చదువులు చదివినా రాజకీయాల్లో రాణిస్తున్నా తెలుగు సంప్రదాయ కట్టుబాట్లను ఇప్పటికీ ఆచరిస్తున్నారు.తెలుగులోనే సంతకం బోథ్: మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భవానీ ఆనంద్ అర్లి బి గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. అతనికి చిన్నతనం నుండి తెలుగు భాష అంటే అభిమానం. అందరూ ఇంగ్లిష్‌లో సంతకం చేస్తున్నా తనుమాత్రం 40 ఏళ్లుగా తెలుగులోనే చేస్తున్నారు. తెలుగుపై తనకున్న అభిమానం చాటుకుంటున్నారపెద్దల నుంచి వస్తున్న ఆచారం తాంసి: తెలుగుదనం ఉట్టిపడేలా, నిండు గంభీరంగా కనిపిస్తున్న ఈ రైతు తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన కేమ లక్ష్మణ్. దశాబ్దాల నుంచి ప్రతీరోజు తెల్లని చొక్కా, దోవతి, కండువా ధరించి తెలుగు రైతుకు నిర్వచనంలా కనిపిస్తాడు. తమది వ్యవసాయ కుటుంబమని, తమపెద్దలు ఆచరించినట్లుగా తాను కూడా తెలుగు రైతు సంప్రదాయాన్ని కచ్చితంగా పాటిస్తూ ఉంటానని పేర్కొంటున్నాడు. ఈ ఉగాది.. కొత్త పునాదితెలతెల్లవారే కోయిల రాగాలతో పచ్చని మామిడి తోరణాలతో ముంగిట హరివిల్లు రంగులతో ఈ ఉగాది.. కొత్తజీవితానికి పలికే నాంది.. నోరూరించే బూరెలతో కోరికోరి చేసే పిండివంటలతో షడ్రుచుల సమ్మేళన పచ్చడితో ఈ ఉగాది.. జీవనపోరాటానికి పునాది.. చిన్నపెద్దల నూతన వస్త్రాలతో సంస్కృతీ సంప్రదాయాల కొత్తపండుగతో శ్రీవిశ్వావసు నామ సంవత్సరంతో ఈ ఉగాది.. విశ్వాసానికి వారధి.. – ఆయిటి సాహితి, యువకవి, నిర్మల్ సేకరణ: నిర్మల్ ‘విశ్వావసు’కు స్వాగతం పలుకుదాంఅణగారిన గుండెగూళ్ల నిండా ఆశల ఊసులు అల్లుతూ.. స్నేహ సౌరభాల తోరణాలతో ‘విశ్వావసు’కు స్వాగతం పలుకుదాం.. సమస్యలను, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళదాం.. తీపి జ్ఞాపకాల మధురిమలో గత చేదు మరచి.. మమకారాల మాధుర్యాన్ని నలుగురితో పంచుతూ ఆశగా జీవితాన్ని ప్రేమిద్దాం. – రాఘవేంద్ర దారవేణి, తాంసి, ఆదిలాబాద్ సేకరణ: తాంసి -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న చేపట్టనున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమ్మె వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులు ఏళ్ల తరబడి అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా విభజించిందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో ప్రైవేటీకరణను మరింత వేగవంతం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను దూరం చేసిందని ఆరోపించారు. కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా సమ్మెకు సిద్ధం కావాలని కోరారు. ఇందులో కూరపాటి రమేశ్, బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, మల్లేశ్, చిన్నన్న, నవీన్‌కుమార్, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా నేరాలకు పాల్పడుతున్నారని ఈ మేరకు ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అవగాహనతోనే వాటిని అడ్డుకోగలుగుతామని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా cybercrime. gov. in అనే వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మొబైల్ హ్యాకింగ్, జాబ్‌ఫ్రాడ్, స్టాక్ మార్కెటింగ్ ఫ్రాడ్, డి జిటల్ అరెస్ట్, కస్టమర్ కేర్ ఫ్లాగ్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, యూపీఐ ఫ్రాడ్, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ ఫ్రాడ్ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలన్నింటిపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వాటిని అప్రమత్తతతోనే నివారించవచ్చన్నారు. సైబర్ క్రైం జరిగిన మొదటి గంటలోపే ఫిర్యాదు చేయడం ద్వారా స్కామర్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి డబ్బులు రికవరీ చేయడం సులభతరం అవుతుందన్నారు. గడిచిన వారం వ్యవధిలో జిల్లాలో 15 సైబర్ నేరాల ఫిర్యాదులను స్వీకరించినట్లుగా ఆయన వెల్లడించారు. పట్టణంలోని వన్‌టౌన్‌లో ఏడు ఫిర్యాదులురాగా, టూటౌన్లో ఒకటి, రూరల్‌లో రెండు, నేరడిగొండ, బేల, ఇంద్రవెల్లి, సిరికొండ, నార్నూర్ స్టేషన్లలో ఒక్కో ఫిర్యాదు చొప్పున వచ్చినట్లు తెలిపారు. -
రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం
● రాష్ట్ర కనీస వేతన సలహాబోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కై లాస్‌నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు, నియంతృత్వ పోకడలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. పట్టణంలో శనివారం నిర్వహించి న జైబాపు, జైభీం జైసంవిధాన్ జిల్లా సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రా జ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా రాహుల్ గాంధీ చే పట్టిన జై బాపు, జై భీం, జై సంవిధాన్ నినాదంతో ప్రతి ఒక్కరం ముందుకు సాగుదామని పిలు పునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలనను అందిస్తుందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గం భాస్కర్, నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, ఆడె గజేందర్, గోక గణేష్‌రెడ్డి, ఫైజుల్లాఖాన్, లోక ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ పద్దు.. రూ.106.40కోట్లు
● 2025–26 సంవత్సర వార్షిక బడ్జెట్ ఖరారు ● గతేడాదితో పోల్చితే రూ.10.15 కోట్లు పెంపు ● ఆమోదం తెలిపిన బల్దియా ప్రత్యేకాధికారి కైలాస్‌నగర్: రానున్న ఆర్థిక సంవత్సరానికి (20 25–26) గాను ఆదిలాబాద్ మున్సిపల్ బడ్జెట్‌ను రూ.106.40 కోట్లతో అధికారులు రూపొందించారు. గతేడాదితో పోల్చితే పది శాతం నిధులు పెంచి వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. పాలకవర్గం ఉంటే కౌన్సిల్లో చర్చించి ఆమోదించేవారు. ప్రస్తుతం అధికారులు రూపొందించిన ఈ బడ్జెట్‌కు మున్సిపల్ ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆమోదముద్ర వేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్.రాజు తెలిపారు. ఈసారి రూ.10.15 కోట్లు పెంచి.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.79కో ట్ల 16లక్షల 47వేలతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అందులో రూ.78కోట్ల 77లక్షల 85వేలను ఖర్చు చేసినట్లుగా పేర్కొన్న అధికారులు రూ.38.64లక్షలు నిల్వ ఉన్నట్లుగా తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరా నికి గాను పది శాతం నిధులు అదనంగా పెంచు తూ 106 కోట్ల 90లక్షల 17వేలతో కూడిన బడ్జెట్‌ను రూపొందించారు. గతేడాదితో పోల్చితే రూ.101.5లక్షలు అధికం. బడ్జెట్ ఆదాయ, వ్యయ అంచనాల వివరాలు రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల ద్వారా రూ.36కోట్ల 16లక్షల 55వేలు, పన్నేతర వి భాగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల ద్వారా రూ.70కోట్ల 35లక్షలు సమకూరనున్నట్లుగా అంచనా వేశారు. అలాగే మున్సిపల్ సాధారణ నిధులు ఆస్తిపన్ను, వేకెండ్ల్యాండ్ సంబంధించిన పన్నుల ద్వారా రూ.13.80 కోట్లు, పట్టణ పరిధిలోని ప్లాట్లు, భూములు రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంప్ డ్యూటీ, సర్‌చార్జి రూపేణ రూ. 2కోట్లు రావచ్చని అంచనా వేశారు. తైబజార్, బ ల్దియా సిబ్బంది నివాస క్వార్టర్స్ అద్దెలు షాపింగ్ కాంప్లెక్స్, మ్యుటేషన్, ప్రకటనలు, సేవింగ్ బ్యాంకు నిల్వలపై వడ్డీ ద్వారా రూ.20.36 కోట్ల ఆదా యం సమకూరనున్నట్లుగా ప్రతిపాదనలు రూ పొందించారు. ఇందులో సాధారణ నిధుల నుంచి రూ.36కోట్ల 10లక్షల 29వేలు, ప్లాన్, నాన్ ప్లాన్ గ్రాంట్స్ ద్వారా రూ.70కోట్ల 30లక్షలను వ్యయం చేయనున్నట్లుగా అంచనా వేశారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధుల అంచనా ఇలా.. 15వ ఆర్థిక సంఘం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.75 కోట్లతో అంచనాలు రూపొందించగా ఈ సంవత్సరానికి గాను రూ.7.50కోట్లు వ చ్చే అవకాశమున్నట్లుగా అంచనా వేశారు. పట్టణ ప్రగతి కింద గతేడాది రూ.7.75 కోట్లతో అంచనా వేయగా ఈఏడాది రూ.7.50 కోట్లుగా అంచనా వే శారు. ఈ రెండు నిధులకు సంబంధించి రూ.25లక్షల చొప్పున రూ.50లక్షలను బడ్జెట్లో తగ్గించి అంచనాలు రూపొందించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.30కోట్లు , ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ. 15కోట్లు వచ్చే అవకాశమున్నట్లుగా అంచనా వే శారు. ఎమ్మెల్యేకు సంబంధించి ఏసీడీపీ నిధులు గతేడాది రూ.70లక్షలుగా అంచనా వేయగా ఈ సారి మరో పది లక్షలు అధికంగా వచ్చే అవకాశమున్నట్లుగా ప్రతిపాదనలు రూపొందించారు. తప్పనిసరిగా చేయాల్సిన కేటాయింపుల్లో ... పట్టణంలో కొత్తగా విలీనమైన ప్రాంతాలు, బీసీ, మైనార్టీల నివాసిత వార్డులు, మురికివాడలు, ఎ లాంటి మౌలిక సౌకర్యాలు లేని ప్రాంతాల్లో అంచనా బడ్జెట్ మిగులు నిధుల్లో 1/3 కేటాయింపులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనల మేరకు రూ. 1.30 కోట్ల నిధులను ప్రతిపాదించారు. అలాగే రోడ్ల నిర్మాణం కోసం రూ.10లక్షలు, కాలువల నిర్మాణాలకు రూ.10లక్షలు, కల్వర్టులకు రూ.5లక్షలు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం రూ.5.63 లక్షల చొప్పున అదనంగా కేటాయింపులు చేస్తు కోటి రూ.60లక్షల63 వేలను బడ్జెట్లో రూపకల్పన చేశారు. ప్రధాన కేటాయింపుల వివరాలు (నిధులు.. రూ.కోట్లలో) ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు : 14.30 పారిశుధ్య, నీటిసరఫరా నిర్వహణ : 3.08 విద్యుత్ చార్జీలు : 3.81 10శాతం గ్రీన్‌బడ్జెట్ : 4.66 వార్డుల వారీగా అభివృద్ధి పనులకు..: 3.15 వసతుల కల్పనకు ప్రాధాన్యత పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే బడ్జెట్లో కేటాయింపులు చేశాం. కార్మి కుల వేతనాలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా బల్దియాకు సమకూరే అదాయం అనుసరించి కేటాయింపులు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులతో పట్టణంలోని వార్డులను అభివృద్ధి చేసేలా అంచనాలను రూపొందించాం. ప్రధానంగా పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రాధాన్యతనిస్తూ గ్రీన్‌బడ్జెట్‌ను వందశాతం వెచ్చించేలా ప్రతిపాదనలను చేశాం. వాటికనుగుణంగానే ముందుకు సాగుతాం. – సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్ -
ప్రకృతిపై కృతజ్ఞతాభావంతో...
ప్రకృతిలో భాగమైన మనిషి.. ఆ ప్రకృతికి సదా రుణపడి ఉండాలనే ఉద్దేశంతో అన్నదాతలు పంచభూతాలను పూజించడం భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే సృష్టికి ఆరంభమైన ఉగాది రోజున వ్యవసాయ పనులు ప్రా రంభిస్తూ, ప్రకృతిపై కృతజ్ఞతాభావంతో పూజించడం హిందూ సంప్రదాయంలో కనిపిస్తుంది. ము ఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో సూర్యోదయానికి గడి య ముందు ఉండే బ్రహ్మ ముహూర్తంలో చేనుకు వెళ్లి పూజించడం ఆనవాయితీ. ఉగాది రోజున ఏ పనిని ప్రారంభించినా శుభప్రదం అవుతుంది. – ఆంజనేయులు, పండితుడు, ఆదిలాబాద్ -
ప్రజలు సుఖశాంతులతో ఉంటారు..
విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఈ సారి ఆదివారం వచ్చింది. ఈ ఏడాది రవి రాజు అవడం వలన నాయకులు, అధికారులకు పరస్పర విరోధములు ఉండే అవకాశం అధికం. ఈ సారి పంటలు సరసమైన ధరకు లభించి ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ ఏడాది రవి అర్ాగ్యధిపతి అవ్వడం వల్ల వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. రాజకీయ పరమైన ఒడిదొడుకుల వల్ల ముఖ్యమైన నాయకుల మార్పు చేర్పులు ఉండే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. – చికిలి వశిష్ఠ నారాయణశాస్త్రి, ఋగ్వేద సలక్షణ ఘనపాటి, ఆదిలాబాద్ -
‘ఉపాధి’లో అగ్రస్థానంలో నిలపాలి
కైలాస్‌నగర్: గ్రామాల్లో కూలీలకు వంద రో జుల పని కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉపాధిహామీ పథకం అమల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో జిల్లాలోని తొమ్మిది మండలాలకు చెందిన ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్‌తో నూతన ఆర్థిక సంవత్సర ఉ పాధి పనుల కార్యాచరణపై శనివారం సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్‌కార్డు ఉండి పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపే ప్రతీ కూలీకి పని కల్పించాలన్నారు. తద్వారా గ్రామాల వారీ గా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. రానున్న రెండు నెలలు కీలకమైనందున కూలీలకు పెద్ద సంఖ్యలో పనులు కల్పించాలన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో తగు వసతులు కల్పించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి నా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో ఏడీఆర్డీవో కుటుంబరావు, ఏవీవో రాజేశ్వర్, ఏవో గంగాధర్, ఏపీడీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సీసీఐ’ హామీని విస్మరించిన కేంద్రం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కై లాస్‌నగర్: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రా రంభిస్తామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం అధికా రంలోకి రాగానే విస్మరించి, ఆ భూములను వెంచర్లుగా మార్చి రియల్ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శుక్రవారం ఆయన సీసీఐ సాధ న కమిటీ నాయకులతో కలిసి మూతపడ్డ ఫ్యాక్టరీని సందర్శించారు. పోలీసులు అడ్డుకోగా మెయిన్‌గేట్ వరకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు అఖిలపక్ష నాయకులతో బైక్ ర్యాలీ చేపట్టారు. కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేంద్రమంత్రులు అమిత్‌షా, హన్స్‌రాజ్ గంగారాంలు ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని హామీలిచ్చారని గుర్తు చేశారు. అలాగే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తమను గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామని హామీలిచ్చిన విషయాన్ని ప్ర స్తావించారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫ్యాక్టరీ తెరిపించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఫ్యాక్టరీ మూతపడడంతో దాదాపు పదివేల మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున ప డ్డారని పేర్కొన్నారు. వందేళ్లకు సరిపడా ముడిసరు కున్నా ఫ్యాక్టరీని కేంద్రం ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్ర లను తిప్పికొట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాజిక, ప్రజా, కుల సంఘాలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కోకన్వీనర్లు నారా యణ, ఈశ్వర్ దాస్, దత్తాత్రి, రాఘవులు, కిరణ్, పట్టణ అధ్యక్షుడు అజయ్, రమేశ్, ప్రేమల, శివకుమార్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఎమ్మెల్సీలొస్తున్నారు
● రేపటి నుంచి పదవిలోకి.. ● ఇద్దరూ బీజేపీ సభ్యులే.. ● జిల్లా అభివృద్ధికి పాటుపడేనా? సాక్షి, ఆదిలాబాద్: కొత్త ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్యల శాసన మండలి పదవీకాలం ఆదివారం నుంచి మొదలు కానుంది. ఇద్దరూ బీజే పీ నుంచి ఎంపికై న సభ్యులే. ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్సీలకు కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి నిధుల పరంగా జిల్లాకు కూడా వెచ్చించి ఈప్రాంత అభివృద్ధికి దోహదప డాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కాషాయం పార్టీ ప్రభంజనం.. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉ మ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎన్నికల్లో కాషా యం పార్టీ ప్రభంజనం చూపించిన విషయం తెలి సిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి సి.అంజిరెడ్డి, టీచర్స్ నుంచి కొమురయ్య ఇటీవల గెలిచారు. ముగిసిన పదవీకాలం.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా వ్యవహరించిన కాంగ్రెస్‌కు చెందిన టి.జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీగా వ్యవహరించిన రఘోత్తంరెడ్డిల పదవీ కాలం శనివారంతో ముగియనుంది. 2019 నుంచి వీరు ఎమ్మెల్సీలుగా కొనసాగారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డి పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన రఘోత్తంరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినా ఈసారి ఆయనకు పీఆర్టీయూ నుంచి అభ్యర్థిత్వం దక్కలేదు. ఇతర సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ఓటమి పాలయ్యారు. -
క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
కై లాస్‌నగర్: జిల్లాను క్షయ రహితంగా మార్చేందు కు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చే యాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ క్షయ నియంత్రణ దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేక కా ర్యక్రమం నిర్వహించారు. టీబీ వైరస్‌ను కనిపె ట్టిన ప్రొఫెసర్ రాబర్ట్ కోచ్ చిత్రపటానికి పూలమాల వే సి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షయ నియంత్రణలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వంద రోజుల కార్యక్రమం విజయవంతం చే యడంపై సిబ్బందిని అభినందించారు. అనంత రం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్ ఆ విష్కరించారు. క్షయ నిర్మూలించేందుకు కృషి చేస్తానని తెలిపే బ్యానర్‌పై స్వయంగా కలెక్టర్ సంతకం చేశారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా క్షయ ని యంత్రణాధికారి సుమలత, వైద్యులుపాల్గొన్నారు. కలెక్టరేట్ ఏవోకు సన్మానం ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న కలెక్టరేట్ ఏవో బి.రాంరెడ్డి దంపతులను కలెక్టర్ రాజర్షి షా ఘనంగా సన్మానించారు. పట్టణంలోని రెవెన్యూగార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో గజమా ల, శాలువతో సత్కరించి విడ్కోలు తెలిపారు. కలెక్టర్ తీరుపై దళిత సంఘాల నిరసన కై లాస్‌నగర్: మహానీయుల జయంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమావేశం ఉందని ఆహ్వా నించి అధికా రులు రాకపోవడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద నిరసన తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ ఏ ర్పాట్లపై సమావేశం ఉంటుందని దళితాభివృద్ధి శాఖ కార్యాలయం నుంచి దళిత సంఘాలకు సమాచారం అందించారు. దీంతో వారంతా అక్కడికి చే రుకున్నారు. సాయంత్రం 4.30 గంటల వరకు వేచి చూసినా డీఎస్సీడీవో తప్పా అధికారులెవరు హా జరు కాలేదు. కలెక్టర్ తమను పిలిపించి గైర్హాజరు కాకపోవడం సరికాదని ఆయా సంఘాల నాయకులు అన్నారు. ఇందులో నాయకులు స్వామి, ప్రజ్ఞ కుమార్, మల్లన్న, విఠల్, దయవాశీల హుక్కే, రమాకాంత్, సందీప్, రాజన్న, తదితరులున్నారు. -
● ఏసీబీకి చిక్కిన మాస్‌మీడియా అధికారి ● రూ.30వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ● జిల్లాలో పెరిగిన లంచావతారులు ● ఈ ఏడాది ఇప్పటి వరకు ముగ్గురు ట్రాప్
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది ఉద్యోగులు, అధికారులు లంచావతారం ఎత్తుతున్నారు. చెయ్యి తడపనిదే ఏ పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు ముగ్గురు ఏసీబీకి చిక్కారు. సర్కారు కొలువులో ఉండి వచ్చే జీతం సరిపోదన్నట్టుగా అక్రమ మార్గంలో లంచం తీసుకుంటూ బాధితులను వేధిస్తున్నారు. కొంతమంది అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతుండగా, చాలామంది గుట్టుగా తమ పని కానిచ్చేసుకుంటున్నారు. బాధితులు పలువురు ఏసీబీని ఆశ్రయించి వారి భరతం పట్టేలా చూస్తుండగా, చాలా మంది అవగాహన లేమి తో చేసేది లేక లంచం అందించి తమ పనులు చేయించుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఉట్నూర్‌లో వెటర్నరి అధికారి రమేశ్ రాథోడ్, ఆ దిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈడబ్ల్యూఐడీసీ డీఈఈ జిన్నవార్ శంకర్ ఇటీవల పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మాస్ మీడియా అధికారి రవిశంకర్ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. అసలేమి జరిగిందంటే.. గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామంలో ఓ ఆర్ఎంపీ ఓ మహిళకు గర్భస్రావం కోసం మాత్రలు ఇవ్వడంతో ఆమెకు అబార్షన్ అయ్యింది. చనిపోయిన శిశువును సదరు మహిళ వాగు సమీపంలో పడేసింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వి చారణ జరిపిన పోలీసులు ఆర్ఎంపీపై కేసు నమో దు చేసి అరెస్టు చేశారు. అయితే ఇటీవల వైద్యారోగ్య శాఖ జిల్లా మాస్ మీడియా అధికారితో పాటు మరికొంత మంది అధికారులు ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్‌ను సీజ్ చేశారు. ఈ క్రమంలో సదరు అధికారి పక్కనే మెడికల్ షాపు నిర్వహిస్తున్న మన్నూర్ గ్రామానికి చెందిన షాపు యజమానిని భయభ్రాంతులకు గురిచేశాడు. మెడికల్ షాపు నుంచే మాత్ర ఇచ్చావని, నీ పేరు చేర్చితే కేసు నమోదవుతుందని పేర్కొన్నాడు. విచారణలో పేరు రాయకుండా ఉండాలంటే రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రెండుమూడు సార్లు ఫోన్ కూడా చేసిన ట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆయన ఏసీబీ అధికారులను గురువారం ఆశ్రయించాడు. 24 గంటల్లోపే అధికారులు అవినీతి అధికారి భరతం పట్టారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో మెడికల్ షాపు యజమాని డబ్బులు ఇస్తానని చెప్పడంతో జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి ఆవరణలోకి వచ్చాడు. చెట్టు కింద రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా సినీ ఫక్కీలో ఏసీబీ డీఎస్పీ లుంగీ కట్టుకొని గుర్తుపట్టకుండా కార్యాలయానికి వచ్చా రు. ఆయనతో పాటు మరో ఇద్దరు సీఐలు కిరణ్ రెడ్డి, స్వామిలు దాడి జరిపారు. నోట్లపై రసాయ నం చల్లిన వాటిని పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చిందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన అధికారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కాగా మాస్ మీడియా అధికారి ఏసీబీకి చిక్కడంతో కార్యాలయంలోని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయానికి ముందుగానే గదులకు తాళం వేసి ఇంటిముఖం పట్టారు. అధికారులెవరూ కనిపించలేదు. తనిఖీ చేసిన మరుసటి రోజే..బోథ్: బోథ్, సొనాల మండలాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను వైద్యారోగ్య శాఖలో మాస్ మీడియా అధికారిగా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ ఈ నెల 27న తనిఖీ చే శారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న బోథ్‌లో ఓ క్లినిక్, సొనాలలో మరో క్లినిక్‌ను సీజ్ చే శారు. ఈ క్రమంలో మరుసటి రోజే అదిలాబాద్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం గమనార్హం. లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించండి..ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు, డీఎస్పీ నంబర్ 91543 88963, సీఐలను 91543 88964, 91543 88965 నంబర్లపై సంప్రదించవచ్చు. ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అక్రమార్కుల భరతం పడతారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. సమాచారం అందించిన 24 గంటల్లోనే దాడులు నిర్వహిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నా రు. అయితే ఆ శాఖ ఉద్యోగిని పట్టిస్తే తమ పని నిలిచిపోతుంద ని భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇ న్చార్జి అధికారి ద్వారా ఏసీబీ అధికారులు త్వరగా బాధితుల పనిని దగ్గరుండి చేయిస్తారు. వేధింపులు రాకుండా చూస్తారు. అవినీతి అధికారుల ను పట్టించే సమయంలో ఇచ్చిన డబ్బులను ప్రభుత్వం రెండు నెలల్లో చెక్ రూపంలో తిరిగి అందజేస్తుంది. పట్టుబడ్డ ఉద్యోగులు 40 నుంచి 50 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు ఉద్యోగంలో చేరే అవకాశం ఉండదు. 8 నుంచి పదేళ్లలో కేసు ట్రయల్‌కు వస్తుంది. దాదాపు 90శాతం కేసులు రుజువవుతున్నాయి. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ ఎదుట బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్ష కై లాస్‌నగర్: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట రైతు సత్యాగ్రహదీక్ష చేపట్టారు. జొన్నకర్రలను పట్టుకుని ర్యాలీగా వచ్చిన రైతులు, బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ, రైతు భరో సా పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా రైతులను మోసగిస్తోందని ఆరోపించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి మంత్రిగా పనిచేసిన జోగు రామన్న కొరటా–చనాఖా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన ఆయనకు సీసీఐ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దయాకర్, పాయల్ శరత్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, కరుణాకర్‌రెడ్డి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కుర్చీకా..‘పంచాయతీ’!
● బదిలీ అయినా రిలీవ్ కాని అధికారి ● విధుల్లో చేరని కొత్త ఆఫీసర్ ● ఇప్పటికే నెల దాటిన వైనం.. ● హాట్‌టాపిక్‌గా ‘డీపీవో’ వ్యవహారంకై లాస్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ శాఖలో కుర్చీపై పేచి నెలకొంది. జిల్లా పంచాయతీ అధికారి గా పనిచేస్తున్న ఎస్.శ్రీలతను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో నిర్మల్ డీఎల్పీవోగా పనిచేస్తున్న జి. రమేశ్‌ను నియమించింది. ఈ ఉత్తర్వులు వచ్చి నెల దాటినా కొత్త అధికారి విధుల్లో చేరకపోవడం, ప్రస్తుత అధికారి విధుల నుంచి రిలీవ్ కాకపోవడంపై సొంత శాఖతో పాటు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విధుల్లో చేరేందుకు నిర్మల్‌లో రిలీవై వచ్చిన అధికారిని చేర్చుకోకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీపీవో బదిలీ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏం జరిగిందటే.. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో ప్రభుత్వం పలువురు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా ఆదిలాబాద్ డీపీవోగా పనిచేస్తున్న ఎస్.శ్రీలతను బదిలీ చేసిన ప్రభుత్వం పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించింది. ఆమె స్థానంలో నిర్మల్ డీఎల్పీవోగా పనిచేస్తున్న రమేశ్‌ను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆ ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసింది. నిర్మల్ డీఎల్పీవోగా ఉన్న రమేశ్‌ను రీడిప్లాయిమెంట్ కింద పంచాయతీ అధికారిగా నియమిస్తూ మరోసారి ఫిబ్రవరి 25న ఆ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన గత నెల 27న నిర్మల్‌లో డీఎల్పీవోగా రిలీవై జిల్లాకు వచ్చారు. విధుల్లో చేరేందుకోసం కలెక్టర్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆగాలని కలెక్టర్ సదరు అధికారికి సూచించినట్లు సమాచారం. నెల రోజులుగా ఖాళీగానే..ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ రమేశ్‌ను జిల్లాలో విధుల్లో చేర్చుకోలేదు. అటు నిర్మల్‌లో డీఎల్పీవోగా రిలీవ్ కావడం, ఇటు డీపీవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేకపోవడంతో ఆయన నెల రోజులుగా ఏ పోస్టు లేకుండా ఖాళీగానే ఉంటున్నారు. అయితే సదరు అధికారిని విధుల్లో చేర్చుకునేందుకు ఉన్నతాధికారి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో బదిలీ అయినా రిలీవ్ కాకుండా పాత డీపీవోనే ఆ శాఖ పాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఇటీవల నిర్వహించిన ‘క్షయ ముక్త్భారత్’ కార్యక్రమ శిక్షణకు సైతం సదరు అధికారే వెళ్లి వచ్చారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్న సమయంలో పంచాయతీ కార్యాలయ ఏవోగా పనిచేసిన రమేశ్‌కు జిల్లాపై పూర్తి అవగాహనతో పాటు పాలనా వ్యవహారాలపై పట్టుంది. ఈ క్రమంలో ఆ శాఖలో పనిచేసే ఓ అధికారి ఆయన విధుల్లో చేరకుండా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు డీపీవో బదిలీ అయినట్లా.. లేక ఆగినట్లా అనే దానిపై పంచాయతీ కార్యదర్శుల్లో చర్చ సాగుతోంది. ఇదే విషయమై పాత డీపీవో, నిర్మల్ నుంచి బది లీపై వచ్చిన అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్క బిజీగా ఉండటంతో ఉత్తర్వుల జారీలో ఆలస్యం అయిందని, సమావేశాలు ముగియడంతో త్వరలోనే జారీ అయ్యే అవకాశమున్నట్లుగా పేర్కొన్నారు.