
కాంగ్రెస్‌తోనే భారత రాజ్యాంగ రక్షణ
ఇచ్చోడ: భారత రాజ్యాంగ రక్షణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఆదివారం నర్సాపూర్, కేశవపట్నం, గుండాల, సిరిచెల్మ గ్రామాల్లో జై బాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని పెంచి పోషిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, నాయకులు కుంర కోటేశ్వర్, నారాయణరెడ్డి, ముస్తాఫా, కొత్తురి లక్ష్మణ్, బత్తుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.