
రేషన్‌కార్డుంటే ‘ఆదాయం’ అవసరం లేదు
కై లాస్‌నగర్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు ఉన్నవారికి ఆదాయ ధ్రువీకరణపత్రం అవసరం లేదని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. దరఖాస్తు ప్రక్రియపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శా ఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 14వరకు పొడిగించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆయా కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డీఆర్డీవో, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు పథకం నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. బ్యాంక్ మేనేజర్లు ఈ కార్యక్రమంపై ఒరియంటేషన్ ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, బీసీ సంక్షేమాధికారి రాజలింగు, వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు పాల్గొన్నారు.