
మామిడిగూడ.. ఏదీ నీటి జాడ
● నెలరోజులుగా నిలిచిన ‘భగీరథ’ ● గ్రామాల్లో తీరని తాగునీటి వ్యథ ● వ్యవసాయ బావి నీరే ఆధారం ● నడవాల్సిందే కిలోమీటర్ల దూరం
పట్టించుకుంటలేరు
నీటి సమస్య గురించి ఎవరికి తెలిపినా పట్టించుకుంటలేరు. ఎండాకాలం వస్తే చాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. జిల్లా అధికా రులు వెంటనే దృష్టి సారించి గ్రామంలో నెలకొ
న్న తాగునీటి సమస్య పరిష్కరించాలి. ఇకముందు సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – సెడ్మాకి భీంరావ్
చాలా కష్టమవుతోంది
ప్రతీ సంవత్సరం వేసవి వస్తే చాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. గ్రామ సమీపంలో ఎక్కడా నీటి సౌకర్యం లేదు. వ్యవసాయ పనులు మాని సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావి నుంచి నీటిని తీసుకువచ్చి తాగుతున్నాం. చాలా కష్టమవుతోంది.
– సెడ్మాకి సీతాబాయి
ఇప్పటివరకు ‘భగీరథ’ రాలే..
మా గ్రామానికి ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రాలేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావుల నీటిని తాగుతున్నాం. భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్లలో చుక్క నీరు లేదు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావి నుంచి ఎడ్లబండ్లు, బిందెలతో నీటిని తెచ్చుకుంటున్నం.
– మెస్రం నాగోరావ్
ఇంద్రవెల్లి: మండలంలోని మామిడిగూడ (జి), (బి) గ్రామాల ప్రజలు తాగునీటికి తండ్లాడుతున్నా రు. ఇప్పటివరకు ఈ గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా లేదు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి గ్రామాల్లోని నీటి పథకాల ద్వారా నీటి సరఫరా నిలిచింది. తాగునీటి కోసం ఈ రెండు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు గ్రామాలకు దూరంగా ఉన్న ఓ వ్యవసాయ బోరు నుంచి పైపులైన్ వేసి ట్యాంక్‌ను నీటితో నింపుకొనేవారు. ఈ నీటిని వినియోగించుకున్న వీరికి వేసవి శాపంగా మారింది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరు నుంచి చుక్క నీరు రావడం లేదు. ఈ గ్రామాల సమీపంలోని వ్యవసాయ బావుల్లోనూ నీరు అడుగంటింది. దీంతో చేసేది లేక రెండు కిలోమీటర్ల దూరంలోని పిట్టబొంగరం గ్రామానికి చెందిన ఉయిక గోవింద్ వ్యవసాయ బావినీటిని ఎడ్లబండ్లు, బిందెలతో తె చ్చుకుంటున్నారు. గ్రామంలో ఏర్పడిన నీటి సమ స్య కారణంగా వ్యవసాయ పనులు మానేయాల్సి వచ్చిందని గ్రామాలకు చెందిన ఆదివాసీలు చెబుతున్నారు. ప్రతీ వేసవిలో సమస్య ఎదుర్కొంటున్న తాము ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులకు గోడు వినిపించుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తమ నీటి కష్టాలు తీర్చాలని మామిడిగూడ(జి), మామిడిగూడ (బి) ప్రజలు వేడుకుంటున్నారు.

మామిడిగూడ.. ఏదీ నీటి జాడ

మామిడిగూడ.. ఏదీ నీటి జాడ

మామిడిగూడ.. ఏదీ నీటి జాడ

మామిడిగూడ.. ఏదీ నీటి జాడ

మామిడిగూడ.. ఏదీ నీటి జాడ