
జొన్న కొనుగోళ్లెప్పుడో?
ఇక్కడ కనిపిస్తున్న రైతు గడ్డల నారాయణ. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామం. యాసంగిలో ఐదెకరాల్లో జొన్న సాగు చేశా డు. 15 రోజుల క్రితం 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దానిని విక్రయించేందుకు నాలుగు రోజుల క్రితం బోథ్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 3,371. అయితే యార్డులో ఇంకా కొనుగోళ్లు షురూ చేయలేదు. మరోవైపు ప్రైవేట్‌లో రూ.3వేల లోపే ధర ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దళారులకు అమ్మితే నష్టపోతానని వాపోతున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో జొన్న సాగు చేసిన చాలా మంది రైతులది ఇదే పరిస్థితి.