
ఈద్గా వద్ద పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఈద్గా మై దానంతో పాటు అన్ని మసీదులు, ము ఖ్యౖ మెన ప్రదేశాల్లో పికెట్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సో మవారం రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో దాదా పు 250 మంది సిబ్బందితో పకడ్బందీ బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎ స్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సునీల్‌కుమార్, కరుణాకర్‌రావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్, సిబ్బంది ఉన్నారు.