
‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తు గడువు పెంపు
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన దరఖా స్తుల స్వీకరణ గడువు ఈ నెల 14వరకు పొడిగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపా రు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవా రం సాయంత్రం నిర్వహించిన వీడియో కా న్ఫరెన్స్‌లో తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(ఈడబ్ల్యూఎస్) చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేవారు ఎలాంటి అదనపు చార్జీ చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్,బీసీ సంక్షేమాధికారి కె.రాజ లింగు తదితరులు పాల్గొన్నారు.