
ఉపాధి కల్పనకే ‘యువ వికాసం’
● జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి రాజలింగు
ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి రాజలింగు తెలిపారు. అ ర్హుల నుంచి గత నెల 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 5వరకే దరఖాస్తు గడువు ఉండగా వరుస సెలవుల నేపథ్యంలో 14వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 8,960 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు వెల్లడించారు.

ఉపాధి కల్పనకే ‘యువ వికాసం’