
ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత
నార్నూర్: ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత కలుగుతుందని విష్ణు మహరాజ్ అన్నా రు. మండలంలోని గుంజాలలో 14 రోజు లుగా కొనసాగుతున్న హరినామ సప్తాహ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావంతో మెలగాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు పెందూర్ రాంషావ్ మహరాజ్, కుమ్రా లక్ష్మణ్ పటేల్, రాయి సెంటర్ సార్‌మేడి కొట్నాక్ కృష్ణ, కుమ్రా జ్ఞానేశ్వర్, పెందూర్ డిగంబర్, తదితరులు పాల్గొన్నారు.