
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్‌టౌన్: గర్భస్థ లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరమని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నా రు. పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లను శుక్రవారం తనిఖీ చేశారు. రి కార్డులతో పాటు అగ్నిమాపక పరికరాల పని తీరును పరశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ఆస్పత్రుల నిర్వాహకులు ని బంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు క్రాంతి, మిషన్ కోఆర్డినేటర్ యశోద, పోలీసు అధి కారి వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.