● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రా రంభిస్తామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం అధికా రంలోకి రాగానే విస్మరించి, ఆ భూములను వెంచర్లుగా మార్చి రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శుక్రవారం ఆయన సీసీఐ సాధ న కమిటీ నాయకులతో కలిసి మూతపడ్డ ఫ్యాక్టరీని సందర్శించారు. పోలీసులు అడ్డుకోగా మెయిన్‌గేట్ వరకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు అఖిలపక్ష నాయకులతో బైక్ ర్యాలీ చేపట్టారు. కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు కేంద్రమంత్రులు అమిత్‌షా, హన్స్‌రాజ్ గంగారాంలు ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని హామీలిచ్చారని గుర్తు చేశారు. అలాగే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తమను గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామని హామీలిచ్చిన విషయాన్ని ప్ర స్తావించారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫ్యాక్టరీ తెరిపించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఫ్యాక్టరీ మూతపడడంతో దాదాపు పదివేల మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున ప డ్డారని పేర్కొన్నారు. వందేళ్లకు సరిపడా ముడిసరు కున్నా ఫ్యాక్టరీని కేంద్రం ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్ర లను తిప్పికొట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాజిక, ప్రజా, కుల సంఘాలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కోకన్వీనర్లు నారా యణ, ఈశ్వర్ దాస్, దత్తాత్రి, రాఘవులు, కిరణ్, పట్టణ అధ్యక్షుడు అజయ్, రమేశ్, ప్రేమల, శివకుమార్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.