
రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, నవీకరణను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జైనథ్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం తని ఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతీ గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించాలన్నారు. అలాగే సీఐ, ఎస్సైలు తమ పరిధిలో ని ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తూ అక్కడి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చొరవ చూపాలన్నారు. ఇందుకోసం ‘పోలీసు మీకోసం’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీలైనంత వరకు అన్ని పోలీసు కార్యాలయాల్లో సిబ్బందికి వారాంతపు సెలవు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
సన్మానం
పోలీస్ అధికారులు పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ ఎస్సై జి.చంద్రకాంత్‌ను పూ లమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ఏవో భక్త ప్ర హ్లాద్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వెంకటి, జిల్లా అసో సియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.