మున్సిపల్‌ పద్దు.. రూ.106.40కోట్లు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ పద్దు.. రూ.106.40కోట్లు

Mar 30 2025 12:21 PM | Updated on Mar 30 2025 1:27 PM

మున్సిపల్‌ పద్దు.. రూ.106.40కోట్లు

మున్సిపల్‌ పద్దు.. రూ.106.40కోట్లు

● 2025–26 సంవత్సర వార్షిక బడ్జెట్‌ ఖరారు ● గతేడాదితో పోల్చితే రూ.10.15 కోట్లు పెంపు ● ఆమోదం తెలిపిన బల్దియా ప్రత్యేకాధికారి

కైలాస్‌నగర్‌: రానున్న ఆర్థిక సంవత్సరానికి (20 25–26) గాను ఆదిలాబాద్‌ మున్సిపల్‌ బడ్జెట్‌ను రూ.106.40 కోట్లతో అధికారులు రూపొందించారు. గతేడాదితో పోల్చితే పది శాతం నిధులు పెంచి వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. పాలకవర్గం ఉంటే కౌన్సిల్‌లో చర్చించి ఆమోదించేవారు. ప్రస్తుతం అధికారులు రూపొందించిన ఈ బడ్జెట్‌కు మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా ఆమోదముద్ర వేసినట్లుగా మున్సిపల్‌ కమిషనర్‌ సీవీ ఎన్‌.రాజు తెలిపారు.

ఈసారి రూ.10.15 కోట్లు పెంచి..

2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.79కో ట్ల 16లక్షల 47వేలతో బడ్జెట్‌ రూపొందించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అందులో రూ.78కోట్ల 77లక్షల 85వేలను ఖర్చు చేసినట్లుగా పేర్కొన్న అధికారులు రూ.38.64లక్షలు నిల్వ ఉన్నట్లుగా తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరా నికి గాను పది శాతం నిధులు అదనంగా పెంచు తూ 106 కోట్ల 90లక్షల 17వేలతో కూడిన బడ్జెట్‌ను రూపొందించారు. గతేడాదితో పోల్చితే రూ.101.5లక్షలు అధికం.

బడ్జెట్‌ ఆదాయ, వ్యయ అంచనాల వివరాలు

రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల ద్వారా రూ.36కోట్ల 16లక్షల 55వేలు, పన్నేతర వి భాగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల ద్వారా రూ.70కోట్ల 35లక్షలు సమకూరనున్నట్లుగా అంచనా వేశారు. అలాగే మున్సిపల్‌ సాధారణ నిధులు ఆస్తిపన్ను, వేకెండ్‌ల్యాండ్‌ సంబంధించిన పన్నుల ద్వారా రూ.13.80 కోట్లు, పట్టణ పరిధిలోని ప్లాట్లు, భూములు రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంప్‌ డ్యూటీ, సర్‌చార్జి రూపేణ రూ. 2కోట్లు రావచ్చని అంచనా వేశారు. తైబజార్‌, బ ల్దియా సిబ్బంది నివాస క్వార్టర్స్‌ అద్దెలు షాపింగ్‌ కాంప్లెక్స్‌, మ్యుటేషన్‌, ప్రకటనలు, సేవింగ్‌ బ్యాంకు నిల్వలపై వడ్డీ ద్వారా రూ.20.36 కోట్ల ఆదా యం సమకూరనున్నట్లుగా ప్రతిపాదనలు రూ పొందించారు. ఇందులో సాధారణ నిధుల నుంచి రూ.36కోట్ల 10లక్షల 29వేలు, ప్లాన్‌, నాన్‌ ప్లాన్‌ గ్రాంట్స్‌ ద్వారా రూ.70కోట్ల 30లక్షలను వ్యయం చేయనున్నట్లుగా అంచనా వేశారు.

ఎంపీ, ఎమ్మెల్యే నిధుల అంచనా ఇలా..

15వ ఆర్థిక సంఘం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.75 కోట్లతో అంచనాలు రూపొందించగా ఈ సంవత్సరానికి గాను రూ.7.50కోట్లు వ చ్చే అవకాశమున్నట్లుగా అంచనా వేశారు. పట్టణ ప్రగతి కింద గతేడాది రూ.7.75 కోట్లతో అంచనా వేయగా ఈఏడాది రూ.7.50 కోట్లుగా అంచనా వే శారు. ఈ రెండు నిధులకు సంబంధించి రూ.25లక్షల చొప్పున రూ.50లక్షలను బడ్జెట్‌లో తగ్గించి అంచనాలు రూపొందించారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.30కోట్లు , ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా రూ. 15కోట్లు వచ్చే అవకాశమున్నట్లుగా అంచనా వే శారు. ఎమ్మెల్యేకు సంబంధించి ఏసీడీపీ నిధులు గతేడాది రూ.70లక్షలుగా అంచనా వేయగా ఈ సారి మరో పది లక్షలు అధికంగా వచ్చే అవకాశమున్నట్లుగా ప్రతిపాదనలు రూపొందించారు.

తప్పనిసరిగా చేయాల్సిన కేటాయింపుల్లో ...

పట్టణంలో కొత్తగా విలీనమైన ప్రాంతాలు, బీసీ, మైనార్టీల నివాసిత వార్డులు, మురికివాడలు, ఎ లాంటి మౌలిక సౌకర్యాలు లేని ప్రాంతాల్లో అంచనా బడ్జెట్‌ మిగులు నిధుల్లో 1/3 కేటాయింపులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనల మేరకు రూ. 1.30 కోట్ల నిధులను ప్రతిపాదించారు. అలాగే రోడ్ల నిర్మాణం కోసం రూ.10లక్షలు, కాలువల నిర్మాణాలకు రూ.10లక్షలు, కల్వర్టులకు రూ.5లక్షలు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం రూ.5.63 లక్షల చొప్పున అదనంగా కేటాయింపులు చేస్తు కోటి రూ.60లక్షల63 వేలను బడ్జెట్‌లో రూపకల్పన చేశారు.

ప్రధాన కేటాయింపుల వివరాలు

(నిధులు.. రూ.కోట్లలో)

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు : 14.30

పారిశుధ్య, నీటిసరఫరా నిర్వహణ : 3.08

విద్యుత్‌ చార్జీలు : 3.81

10శాతం గ్రీన్‌బడ్జెట్‌ : 4.66

వార్డుల వారీగా అభివృద్ధి పనులకు..: 3.15

వసతుల కల్పనకు ప్రాధాన్యత

పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేశాం. కార్మి కుల వేతనాలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా బల్దియాకు సమకూరే అదాయం అనుసరించి కేటాయింపులు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నిధులతో పట్టణంలోని వార్డులను అభివృద్ధి చేసేలా అంచనాలను రూపొందించాం. ప్రధానంగా పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రాధాన్యతనిస్తూ గ్రీన్‌బడ్జెట్‌ను వందశాతం వెచ్చించేలా ప్రతిపాదనలను చేశాం. వాటికనుగుణంగానే ముందుకు సాగుతాం.

– సీవీఎన్‌.రాజు, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement