
విద్యార్థులకు ఫౌండేషన్..
సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులకు మహర్దశ రానుంది. ఎనిమిదో తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
8లోu
ఎయిర్‌ఫోర్స్ నిర్మించినప్పుడే..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారనే నిర్ణయం నేపథ్యంలో భూములు కోల్పోతామా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రక్షణశాఖ అధీనంలోని భూములు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సరిపోతాయి. ఎయిర్‌ఫోర్స్ నిర్మించేటపుడే భూసేకరణ చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా మలచడం ద్వారా ఐఏఎఫ్, ఏఏఐ నిర్మాణాత్మకంగా ముందుకెళ్తాయి.
– బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత
బీఆర్‌ఎస్ హయాంలోనే..
2016–17లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా భూములను సర్వే చేయించింది. 1,500 ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉందని అప్పట్లో గుర్తించింది. 2022–23లో ఈ భూముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడానికి టెక్నికల్ పరిశీలన చేపట్టగా అనువుగా ఉన్నట్లు తేలింది. ఆనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి ఫలితంగానే ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు మంజూరైంది.
– జోగు రామన్న, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
విధివిధానాలు వస్తేనే స్పష్టత
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసే విషయంలో నిర్ణయం వెలువడినప్పటికీ దీంట్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు రాలేదు. ఇందుకు భూసేకరణ చేయాల్సి వస్తుందా.. లేదా.. అనేది ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే మేము నిర్ణయం తీసుకుంటాం.
– వినోద్‌కుమార్, ఆర్డీవో, ఆదిలాబాద్

విద్యార్థులకు ఫౌండేషన్..

విద్యార్థులకు ఫౌండేషన్..