
పీఎంఏవై దరఖాస్తులు @ 3,526
● బల్దియాకు చేరిన దరఖాస్తుదారుల జాబితా ● మొరాయించిన పోర్టల్.. ● వివరాల నమోదులో జాప్యం
కై లాస్‌నగర్: పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్ర భుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధికోసం ఆదిలాబాద్ మున్సిపల్ పరి ధిలో 3,526 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలతో కూడిన జాబితా ప్రభుత్వం నుంచి గురువారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ కి అందింది. అందులోని దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శిస్తూ వారికి అవసరమైన ఇంటిస్థలంఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే వివరాలతో పాటు ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు సేకరించి పీఎంఏవై పోర్టల్‌లో మొబైల్ ద్వారా నమో దు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పట్టణంలోని పలు దరఖాస్తుదారుల ఇళ్లను బల్దియా వార్డు అధి కారులు గురువారం సందర్శించారు. వారి వివరా లను మోబైల్ ద్వారా నమోదు చేసే ప్రయత్నం చే శారు. కొంత సమాచారం నమోదు చేశాక ఆ పోర్టల్ పనిచేయకపోవడంతో చేసేది లేక వారు వెనుదిరి గారు. ఇదిలా ఉంటే కేంద్రం తెచ్చిన మరో నిబంధ న వివరాల నమోదుకు అడ్డంకిగా మారుతోంది. దరఖాస్తుదారులు తమ వివరాలతో పాటు తల్లిదండ్రుల ఆధార్ కూడా జత చేయాలనే నిబంధన వారి కి ఇబ్బందిగా మారుతోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసిన వారిలో 50 ఏళ్లపైబడిన వారే ఉన్నారని అలాంటి వారు తమ తల్లిదండ్రుల ఆధార్‌కార్డులను ఎలా తీసుకురాగలుగుతారనే సందేహాలు తలెత్తతున్నాయి. దీనిపై బల్దియా అధికారులను సంప్రదించగా.. విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పినట్లుగా పేర్కొన్నారు.