
తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు
● మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ‘పాయల్’ ఆదేశం
కై లాస్‌నగర్: గతంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భూగర్భజలాల మట్టం పడిపోవడం ఆందోళనకరమని, అయినా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణానికి తాగునీటిని అందించే లాండసాంగ్వీ పంపుహౌస్‌ను ఆది వారం పరిశీలించారు. మోటార్ల సామర్థ్యం వివరా లను కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరో 300 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీతో మాట్లాడి వాగులో చెక్‌డ్యాంలు నిర్మించేందుకు వీలుగాఅనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో భూగర్భజలాల మట్టం భారీగా తగ్గిన నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నీటి ఎద్దడి తీవ్రతరం కాకముందే అందుబాటులోని వనరులను వాడుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఈలు తిరుపతి, కార్తీక్, బీజేపీ నాయకులు వేదవ్యాస్, రవి, లాలామున్నా, తదితరులున్నారు.