
రెవెన్యూ ఉద్యోగుల జాడేది?
● మూకుమ్మడిగా విధులకు గైర్హాజరు ● అధికారికమా.. అనధికారికంగానా? ● హాజరు రిజిష్టర్‌లో వివరాలు నిల్
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ రెవెన్యూ ఇన్‌చార్జి అధికారి, మేనేజర్ బాధ్యతలు నిర్వహించే అ ధికారితో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఆరురోజులుగా మూకుమ్మడిగా విధులకు గైర్హాజరవుతున్నారు. వీరు అధికారికంగా సెలవులో వెళ్లారా? లేదా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారా? తెలియడంలేదు. పన్నులు వసూలు చేసి బ ల్దియాకు ఆదాయం పెంచాల్సిన సమయంలో వీరు విధుల్లో లేకపోవడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులను ముందస్తుగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చే స్తోంది. పన్నులు చెల్లించే వారికి ఐదు శాతం రాయి తీ కల్పిస్తోంది. ఇంతటి కీలక సమయంలో అధికా రుల్లేక రెవెన్యూ విభాగం బోసిపోతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి సెలవుపై వెళ్లడం వారి హక్కు.. కాదనలేం.. కానీ.. అటెండెన్స్ రిజిస్టర్‌లో ఈ నెల 2నుంచి మంగళవారం వరకు వారికి సంబంధించి వివరాలేమీ అందులో నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మ్యు టేషన్లు, అసెస్‌మెంట్లు, డోర్ నంబర్ల జారీ తదితర ప్రక్రియ నిర్వహించడంలో రెవెన్యూ వ్యవస్థనే అ త్యంత కీలకం. అలాంటి విభాగంలోని అధికారులు, బిల్ కలెక్టర్లు అందుబాటులో లేకుండా పోవడమేమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు ఉద్యోగులంతా టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మున్సి పల్ కమిషనర్ సీవీఎన్ రాజును సంప్రదించగా వా రంతా అధికారిక సెలవుపైనే వెళ్లారని, మిగతా సి బ్బంది వ్యవహారాలు చూస్తున్నట్లు తెలిపారు.

రెవెన్యూ ఉద్యోగుల జాడేది?