
పరీక్షాకేంద్రాల పరిశీలన
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆశ్ర మ గురుకుల పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు గిరిజన శిక్షణ సహాయ పథకం కింద రెండేళ్ల ఇంటర్మీడియట్ (ఎంపీసీ)లో ప్రవేశం, ఉచిత ఐఐటీ, జేఈఈ శిక్షణ కోసం మంగళవారం నిర్వహించిన ఎంపిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ సమావేశ మందిరంలో పరీక్ష నిర్వహించారు. వేసవి కా వడంతో సెంటర్ల వద్ద ఏఎన్‌ఎంలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. గిరిజన శిక్షణ సహాయ ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ పరీక్షకు 586 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 538 మంది విద్యార్థులు హాజరు కాగా, 48 మంది గైర్హాజరైనట్లు పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు.