
సబ్‌రిజిస్ట్రార్‌కు మెమో
కై లాస్‌నగర్: సబ్‌రిజిస్ట్రార్‌పై ఆ శాఖ ఉన్నతాధికారి చర్యలకు ఉపక్రమించారు. ఈ నెల 5న ‘రిజిస్ట్రేషన్ల దందా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ ఎం.రవీందర్‌రావు స్పందించారు. ఆది లాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్‌రిజిస్ట్రార్–2కు మెమో జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించా రు. దీంతో సదరు అధికారి సెలవులో వెళ్లినట్లు సమాచారం. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌ఆర్‌ఎస్ సాకుతో ఓ లేఅవుట్‌లోని ప్లాట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ శివారులో గల సర్వే నం.77, 78లో 45 ప్లాట్లతో ఏర్పాటు చేసిన పాత లేఅవుట్‌ను సర్వేనం.77/ఆర్, 78/3/ఆ బైనంబర్లతో మరో 51 ప్లాట్లతో కొత్త లేఅవుట్ ఏర్పాటు చేసి పాత దానికి జతచేసి ఒకే లేఅవుట్‌గా రూపొందించారు.ఈక్రమంలో కొత్తలేఅవుట్‌లోని ప్లాట్ల కు రిజిస్ట్రేషన్ చేసిన తీరును వివరిస్తూ ‘సాక్షి’ లో కథనం ప్రచురితమైంది. ఆయ న ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆదిలాబాద్ ఎల్‌ఐసీకి జాతీయ స్థాయిలో గుర్తింపు
ఆదిలాబాద్‌టౌన్: భారతీయ జీవిత బీమా సంస్థ ఆదిలాబాద్ శాఖకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారపరంగా జాతీయ స్థాయిలో 25వ ర్యాంక్, సౌత్ సెంట్రల్ జోన్‌లో నాలుగో ర్యాంక్ లభించింది. గడిచిన ఆర్థిక సంవత్సరా నికి గాను 8వేల పాలసీల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ శాఖ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఏవీఎస్ సుధాకర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకొని 4వ బ్రాంచ్‌గా, కరీంనగర్ డివిజన్‌లో ఏకై క బ్రాంచ్‌గా ఆదిలాబాద్ చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఎల్‌ఐసీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.
‘బిల్లులు చెల్లించకుంటే జీపీ భవనాన్ని వేలం వేస్తా..’
నేరడిగొండ: మండలంలోని సావర్గం గ్రామ పంచాయతీ భవనం నిర్మించి రెండున్నరేళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కళ్యాణి మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. భవనాన్ని నిర్మించి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు వాపోయారు. వడ్డీలు కట్టలేక జీవితం భారంగా మారిందని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి, గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.20 లక్షలు రావాల్సి ఉందని, వాటిని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు. లేనిపక్షంలో గ్రామపంచాయతీ భవనాన్ని వేలం వేస్తానని పేర్కొన్నారు.

సబ్‌రిజిస్ట్రార్‌కు మెమో