
డెడ్ స్టోరేజ్
జిల్లాలోని నీటి ప్రధాయినిలు డెడ్ స్టోరేజ్‌కు చేరుకున్నాయి. సాత్నాల, మత్తడి వాగు మధ్యతరహా ప్రాజెక్టులు బోసిపోయి కనిపిస్తున్నాయి. నీటి ఊటలు కూడా లేని పరిస్థితిలో ప్రాజెక్టులో పూర్తిగా పగుళ్లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జిల్లాలో 392 చెరువులు ఉన్నాయి. వీటికింద ఆయకట్టుకు యాసంగిలో నీరు అందించడంతో కేవలం 20 శాతం నీటిని మాత్రమే కలిగి ఉన్నాయి. దీంతో సమస్య తీవ్రమవుతోంది. – సాక్షి, ఆదిలాబాద్
ప్రాజెక్టు మత్తడివాగు
మండలం తాంసి
పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం 271.200 మీటర్లు
నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలు
ప్రస్తుతం 0.071 టీఎంసీలు
డెడ్ స్టోరేజీ 0.065 టీఎంసీలు
ప్రాజెక్టు సాత్నాల
మండలం జైనథ్
పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం 279.50 మీటర్లు
నీటి సామర్ధ్యం 1.24 టీఎంసీలు
ప్రస్తుతం 0.167 టీఎంసీలు
డెడ్ స్టోరేజీ 0.126
ఆర్మీ ఆఫీసర్ కావడమే లక్ష్యం..
ఇచ్చోడ మండలం జాల్ద్ గ్రామానికి చెందిన ఏ.నితిన్ ఇంటర్ పూర్తి చేశాడు. నిరంతరం క్రీడల్లో సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో పలుమార్లు ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు ఆత్మారాం–దేవశాల వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో సైనికుడిగా ఎంపికయ్యాడు. తన గురువు వీజీఎస్ ప్రోత్సాహం కారణంగానే ఆర్మీలో చేరగలిగానని, భవిష్యత్‌లో ఆర్మీ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు.
సైనికులుగా అన్నదమ్ములు..
ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్ గ్రామానికి చెందిన సౌధాగర్–లక్ష్మి దంపతుల కుమారులు జీ.రామేశ్వర్, జీ.సిద్దేశ్వర్ ఒకే సమయంలో ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. సిద్దేశ్వర్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూనే అగ్నివీర్ ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యాడు. గతంలోనే ఎన్‌సీసీ (సీ)సర్టిఫికెట్ సాధించాడు. సైన్యంలో చేరడమే లక్ష్యంగా ఏడేళ్లుగా సాధనచేసి అగ్నివీర్ ఫలితాల్లో ఎంపికయ్యాడు. భవిష్యత్‌లో కమాండో కావడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు. సిద్దేశ్వర్ తమ్ముడు రామేశ్వర్ సైతం ఆరేళ్లుగా క్రీడల్లో రాణిస్తూ అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటడం విశేషం. ఒకే ఇంట్లో ఒకే సమయంలో ఇద్దరు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు తల్లిని అభినందిస్తున్నారు.
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో నాలుగువేల మత్స్యకార కుటుంబాలు చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. ఈయేడాది ప్రతికూల వాతావరణంతో చేపల ఎదుగుదల లోపించింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఆగస్టులో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలు నవంబర్, డిసెంబర్ మాసాల్లో పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీంతో చెరువుల్లో నీరు అడుగంటిపోయి చేపలు చనిపోతున్నాయి. చేపలు ఎదగడానికి కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. అయితే భూగర్భజలాలు అడుగంటిపోయి చెరువుల్లో నీరు లేకపోవడంతో చేప పిల్లల ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో ఈఏడాది చేపల బరువు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అసలే 50 శాతం కూడా చేపలు పంపిణీ చేయలేదు. చేసిన వాటిలో 30 శాతం వరకు చనిపోవడంతో పరిస్థితి దయనీయంగా ఉంది.
ఎదగని చేప..
జిల్లాలోని 101 మత్స్యకార సంఘాల్లో 4,800 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 35 మహిళా సంఘాలు సైతం ఉన్నాయి. జిల్లాలో 240 చెరువులు ఉన్నాయి. వీటిలో సాత్నాల, మత్తడివాగు రిజర్వాయర్లు ఉండగా ఆరు పెర్నియర్ ట్యాంకులు, 232 కుంటలు, చిన్నచిన్న చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. రిజర్వాయర్, పెర్నియర్ ట్యాంకుల్లో 80 నుంచి 100 మిల్లీ మీటర్ల కట్ల, రవ్, మిరిగెల చేపలను వదిలారు. వీటిలో 35 నుంచి 45 మిల్లీ మీటర్ల కట్ల, రవ్, బంగారుతీగ చేపలను వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చేపల్లో ఎదుగుదల కనిపించడం లేదు. అంతేకాకుండా పంపిణీ చేసిన చేపల్లో 30 శాతం వరకు చనిపోవడం, పెద్ద చేపలు వీటిని తినేయడంతో 70 శాతం మిగిలాయి. అయితే జూలై, ఆగస్టు మాసాల్లో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపలు వదలాల్సి ఉండగా టెండర్లు సకాలంలో కాకపోవడంతో నవంబర్, డిసెంబర్‌లో వదిలారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి మాసం నుంచే ఎండ ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 43 డిగ్రీలు దా టింది. దీంతో 126 చెరువులకు 70 చెరువులు ఇప్పటికే ఎండిపోయాయి. మిగిలిన చెరువుల్లో సైతం నీరు అడుగుంటిపోతోంది. ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందకపోవడంతో చనిపోతాయని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కట్ల, రవ్, మిరిగెల చేపలకు టెండర్‌లో రూ.1.76 చెల్లించగా, చిన్న చేప పిల్లల కోసం 0.68 పైసలు చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. టెండర్‌దారులు రూ.40 లక్షలకు టెండర్లు వేయగా ఇంతవరకు వాటి డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాదికి సంబంధించిన డబ్బులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదని పేర్కొంటున్నారు. దీంతో మత్స్యకారులు ఉన్న చేపలను పడుతుండగా అవి అరకిలో మించి ఉండటం లేదని వాపోతున్నారు. కిలో నుంచి 2 కిలోల వరకు ఉండాల్సిన చేప కిలోలోపే ఉండడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. 5 వేల టన్నుల చేపల దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి 2 నుంచి 3వేల టన్నుల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిలో ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉండగా చేపలు అరకిలో మాత్రమే ఉండడంతో రూ.100లోపే ధర పలుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.
ముందుకురాని టెండర్‌దారులు
వచ్చే సీజన్‌కు సంబంధించి ఏటా ఏప్రిల్‌లో ప్రభుత్వం నుంచి టెండర్ విడుదల అవుతుంది. అయితే ఈ ఏడాది ఇంకా ప్రభుత్వం టెండర్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గతేడాదికి సంబంధించిన టెండర్ డబ్బులు విడుదల చేయకపోవడంతో ఈసారి ఎవరూ ముందుకు వచ్చే అవకాశాలు కానరావడంలేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి టెండర్ ప్రక్రియ విడుదల చేయాలని కోరుతున్నారు.
నిరంతర సాధనతోనే సాధ్యం..
బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన మల్కన్ సింగ్–గీతాబాయి దంపతుల కుమారుడు ఎస్.అభి. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండగా, వారి ప్రోత్సాహంతో ఆర్మీలో ఉద్యోగమే లక్ష్యంగా నిరంతరం సాధన చేస్తూ అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. తమది వ్యవసాయ నేపథ్య కుటుంబమైనప్పటికీ ఎప్పటినుంచో దేశసేవ చేయాలనే ఆలోచనతో ఆర్మీలో చేరడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానన్నాడు. పట్టు వదలకుండా నిరంతరం సాధన చేస్తేనే ఉద్యోగాలు వస్తాయంటున్నాడు.
చేపలు పడుతున్న మత్స్యకారులు (ఫైల్)
● సైనికులుగా ఎంపికై న ఏడుగురు జిల్లా యువకులు
● సామాన్య కుటుంబాల నుంచి దేశ సరిహద్దులకు
వారిదంతా సామాన్య కుటుంబ నేపథ్యం. కొంతమంది వ్యవసాయ కుటుంబం నుంచి రాగా, ఓ యువకుని తల్లిదండ్రులు రోజువారీగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. తల్లిదండ్రుల కష్టం.. వారి ప్రోత్సాహం.. ఆ యువకులను దేశ సరిహద్దుల వైపు నడిపించింది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. నిరంతరం శ్రమించి సైనికులుగా ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికై న జిల్లాకు చెందిన యువకులపై కథనం..
– ఆదిలాబాద్
అందరి ప్రోత్సాహంతోనే...
బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన ప్రేమ్–గోదావరి దంపతుల కుమారుడు కే.క్రాంతి ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా ఆర్మీలో ఉద్యోగమే ధ్యేయంగా మూడేళ్లుగా సాధన చేస్తున్నాడు. ఎంతగానో శ్రమించి ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో సైనికుడిగా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, శిక్షకుల ప్రోత్సాహం మరువలేనిదని, వారందరి తోడ్పాటుతోనే ఉద్యోగాన్ని సాధించగలిగానని పేర్కొంటున్నాడు.
తల్లిదండ్రుల కష్టమే నడిపింది..
ఇంద్రవెల్లి మండలం ధర్మనగర్ గ్రామానికి చెందిన భావన్‌సింగ్–నరత్తి బాయి దంపతుల కుమారుడు బీ.ప్రవీణ్. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూనే డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు పొలంలో పడుతున్న కష్టాల్ని దగ్గరుండి చూసిన ప్రవీణ్.. తాను మంచి స్థానంలో ఉండడమే ఇందుకు పరిష్కారమని భావించాడు. మూడు సంవత్సరాలుగా ఉద్యోగ సాధనే లక్ష్యంగా జిల్లా కేంద్రంలోని వీజీఎస్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందాడు. అగ్నివీర్ ఫలితాల్లో సైనికునిగా ఎంపిక అయ్యాడు.
పట్టుదలతో ప్రయత్నిస్తే..
జిల్లా కేంద్రానికి చెందిన ప్రవీణ్–గీత దంపతుల కుమారుడు డి.చంద్ర సిద్దార్థ ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే సైనికునిగా ఎంపికయ్యాడు. తండ్రి ప్రవీణ్ అంబులెన్స్ డ్రైవర్‌గా, తల్లి పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరుస్తూనే అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఉద్యోగాలు సాధించవచ్చని తెలుపుతున్నాడు. క్రీడలతో సైతం ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఫిట్నెస్‌తో పాటు మానసికంగా దృఢంగా తయారై రక్షణ, పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొంటున్నాడు..
వందో పుట్టిన రోజు
రుక్మిణీబాయితో కుటుంబసభ్యులు
అరకిలో దాటని మీనం ప్రతికూల వాతావరణంతో దిగుబడిపై ప్రభావం ఈయేడు 87 లక్షలకుగానూ వదిలింది 43 లక్షలే 126 చెరువుల్లోనే చేపల పెంపకం ఇప్పటికే ఎండిన 70 చెరువులు ఆందోళనలో మత్స్యకారులు
జిల్లా వివరాలు
మత్స్యకారుల సంఘాలు : 101
మొత్తం చెరువులు : 240
ఎండిన చెరువులు : 70
చేప పిల్లలు వదిలిన చెరువులు : 126
చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 87 లక్షలు
చెరువుల్లో వదిలింది : 43 లక్షల 42వేలు
దిగుబడి లక్ష్యం : 5వేల టన్నులు
ఈసారి దిగుబడి అంచనా : 2వేల నుంచి 3వేల టన్నులు
కిలోలోపే ఉన్నాయి
ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో చేప పిల్లలు వేయడంతో అవి పూర్తిగా ఎదగలేదు. ప్రస్తుతం కిలోలోపున్న చేప పిల్లలు మాత్రమే దొరుకుతున్నాయి. ప్రతీరోజు చేపలు పట్టడానికి వెళ్తున్నా. 5 నుంచి 10 కిలోలు మాత్రమే దొరుకుతున్నాయి. చేపలు ఎదగకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు.
– టి.గంగన్న, మత్స్యకారుడు, వడ్డాడి
చేపలు పట్టాలని సూచించాం
జిల్లాలో ఈఏడాది 125 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. అందులో పెద్దవి 26 లక్షలు, చిన్నవి 17 లక్షలు ఉన్నాయి. రూ.40 లక్షల వరకు టెండర్‌దారులకు చెల్లించాల్సి ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెరువులు ఎండిపోతున్నాయి. మత్స్యకారులకు చేపలు పట్టాలని సూచించాం.
– భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్

డెడ్ స్టోరేజ్