
సీసీఐని పునరుద్ధరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని సీసీఐ సాధన కమిటీ సభ్యులు బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్‌ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్రలతో కలిసి సభ్యులు పార్లమెంట్‌లోని మంత్రి చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ్యాక్టరీని పునఃప్రారంభించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కమిటీ కన్వీనర్ మల్లేశ్, నారాయణ, అరుణ్‌కుమార్, నగేష్, పోశెట్టి, రమేశ్ తదితరులున్నారు.