
సన్నబువ్వ రుచి చూసిన అధికారులు
కైలాస్‌నగర్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబి య్యంపై లబ్ధిదారుల స్పందన తెలుసుకునేందుకు శుక్రవారం జిల్లా పౌరసరఫరాల అధికారి ఎండీ వా జిద్ అలీ, ఆదిలాబాద్‌అర్బన్ తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, ఆర్‌ఐ యజ్వేందర్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రాథోడ్ బాబుసింగ్ జిల్లా కేంద్రంలోని శ్రీరాంకాలనీలో పర్యటించారు. కాలనీకి చెందిన సరోజ ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నం రుచి చూశా రు. భోజనం ఎలా ఉందని లబ్ధిదారులను అడిగి తె లుసుకున్నారు. రుచికరమైన భోజనం అందుతుందని, బయటి మార్కెట్ నుంచి సన్నబియ్యం తెచ్చుకోవాలంటే రూ.2వేల వరకు ఖర్చయ్యేదని లబ్ధిదా రులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఖర్చు తగ్గిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.