
శ్రీరామనవమికి సర్వం సిద్ధం
ఆదిలాబాద్: శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యా యి. ఆదివారం ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు, తిరుపెల్లి కాలనీలోని శ్రీరా మాలయం, శాంతినగర్ శ్రీకోదండ రామాలయం, విద్యానగర్ శ్రీదాసాంజనేయ స్వామి ఆలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి ఆదివారం సాయంత్రం భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇస్కాన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మధుర జిన్నింగ్‌లో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.