
బాధ్యతగా వ్యవహరించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● దాబా హోటళ్ల యజమానులతో ప్రత్యేక సమావేశం
గుడిహత్నూర్: జిల్లాలోని జాతీయ, అంతర్రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న దాబా హో టళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేష న్‌లో జిల్లాలోని దాబా యజమానులతో స మావేశమై మాట్లాడారు. దాబాల్లో మద్యం, గంజాయి, అఫీం అమ్మడంతో పాటు అక్క డే సేవించడానికి అనుమతి ఇవ్వడం నేరమని పేర్కొన్నారు. దాబాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ లేని దాబాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేవాత్ దాబా అంటూ ఒకే పేరుతో నడుస్తున్న దాబాలపై ప్రత్యేక ని ఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా దాబాల యజమానులు జాగ్రత్తగా ఉండాల ని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాల ని సూచించారు. జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఎలాంటి అసాంఘిక చర్యలు జరిగినా దాబాలోని సీసీ ఫుటేజీల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ నాగేందర్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.