
ఏఐతో నాణ్యమైన బోధన
ఆదిలాబాద్‌టౌన్: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో నాణ్యమైన బోధన అందుతుందని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రణదీవెనగర్ ప్రాథమిక పా ఠశాలలో ఏఐ విద్యాబోధన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లా డి బోధన తీరు గురించి తెలుసుకున్నారు. సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు భూపతిరెడ్డి, శ్రీహరిబాబు, రాజేశ్వర్ తదితరులున్నారు.
ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి
నాణ్యమైన బోధన అందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి సూ చించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, గెజిటెడ్ నంబర్–1, బాలక్‌మందిర్ తదితర కేంద్రాల్లో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో నాయకత్వ ల క్షణాల పెంపు, మధ్యాహ్న భోజనం, పాఠశాల ల నిర్వహణ, తరగతి గదిలో బోధన, అభ్యసన సామర్థ్యాలు, వార్షిక ప్రణాళిక తదితర అంశాల గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జి ప్రిన్సి పల్ కిరణ్‌కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్‌గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.